
కోలారు(బెంగళూరు): ఒడిశాలో ఘోర రైలు ప్రమాదం జరిగిన తరువాత దేశానికి మరో ప్రమాదం పొంచి ఉందని కోడిమఠం శివానంద శివయోగి స్వామి తెలిపారు. ఆయన తరచూ జోస్యాలు చెబుతూ ఉండడం తెలిసిందే. గురువారం తాలూకాలోని సుగటూరు గ్రామంలోని యోగి నారాయణస్వామి మఠాన్ని ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడారు. తాను గతంలో చెప్పినట్లుగా ఈసారి రాష్ట్రంలో పూర్తి మెజారిటీ కలిగిన ప్రభుత్వం వచ్చింది.
అదే విధంగా ఈ సంవత్సరం పెద్ద ప్రమాదం సంభవిస్తుందని తెలిపిన విధంగానే ఘోర రైలు ప్రమాదం జరిగింది. ఆపై దేశానికి మరో పెను ప్రమాదం పొంచి ఉందని అన్నారు. కై వార తాతయ్య మళ్లీ పుట్టి వచ్చే సంకేతాలు కనిపిస్తున్నాయన్నారు. అలాంటి సూచనలు ఇప్పటికే కొండ ప్రాంతంలో కనిపించిందన్నారు. రాష్ట్రంలో ఆధ్యాత్మికత దారి తప్పితే ప్రభుత్వానికి ప్రమాదమని తెలిపారు.
చదవండి: పట్టాలు తప్పిన ఊటీ టాయ్ ట్రైన్
Comments
Please login to add a commentAdd a comment