‘వర్షాలే కాదు ప్రళయం కూడా రావచ్చు’ | Kodimatha Swamiji Predictions Possibility Of Flood With Heavy Rains | Sakshi
Sakshi News home page

‘వర్షాలే కాదు ప్రళయం కూడా రావచ్చు’

Published Sun, Jul 2 2023 2:20 PM | Last Updated on Sun, Jul 2 2023 2:25 PM

Kodimatha Swamiji Predictions Possibility Of Flood With Heavy Rains - Sakshi

హుబ్లీ(బెంగళూరు): రాష్ట్రంలో భారీ వర్షాలతో పాటు జలప్రళయం సంభవించే అవకాశం ఉందని కోడిమఠం స్వామి జోస్యం చెప్పారు. నగరంలో ఓ ప్రైవేట్‌ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో భారీ వర్షాల కారణంగా ప్రళయం వచ్చే ప్రమాదం ఉందని కోడిమఠం శివానంద శివయోగి చెప్పారు.

గతంలో రాష్ట్రంలో సుస్థిర ప్రభుత్వ ఏర్పడుతుందని చెప్పిన జోస్యం నిజమైందన్నారు. అదే విధంగా రాబోయే కాలంలో విశ్వంలో దురంతం సంభవిస్తుందన్నారు. మూడు గండాలు వచ్చే అవకాశం ఉందన్నారు. ఒకటి రెండు దేశాలు మునిగి పోతాయన్నారు. ప్రజల ఆకాల మృత్యువుకు బలవుతారని, విజయదశమి నుంచి సంక్రాంతి వరకు ఈ దుస్సంఘటనలు చోటు చేసుకోనున్నామని తెలిపారు. పాలకులు జాగ్రత్తలు తీసుకుంటే ముప్పు నుంచి తప్పించుకోవచ్చన్నారు.

చదవండి: శృంగారానికి 18 ఏళ్ల వయసొద్దు.. ‘సమ్మతి’ వయసు 16కు తగ్గించండి: కేంద్రానికి హైకోర్టు కీలక వినతి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement