
తిరువనంతపురం: లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ సొంతగా మ్యాజిక్‌ఫిగర్ దాటదని ప్రముఖ సెఫాలజిస్ట్ యోగేంద్రయాదవ్ చేసిన వ్యాఖ్యలపై ఎంపీ శశిథరూర్ స్పందించారు. మ్యాజిక్ ఫిగర్‌కు కావల్సిన 272 సీట్లు బీజేపీకి ఈసారి సొంతగా రావని యోగేంద్ర ఇటీవల చెప్పారు.
ఎన్డీఏ కూటమి మొత్తం కలిసి మాత్రం మెజారిటీ సీట్లు సాధిస్తుందని తెలిపారు. అయితే కాంగ్రెస్ పార్టీ ఈసారి మెరుగైన సీట్లు సాధిస్తుందని జోస్యం చెప్పారు. దీనిపై శశిథరూర్ ఎక్స్(ట్విటర్)లో స్పందించారు.
ప్రభుత్వ వ్యతిరేకత ఫ్యాక్టర్ వల్ల బీజేపీ 230 సీట్లకు కూడా పడిపోవచ్చన్నారు. ముందు ముందు ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకేనే అవకాశం ఉందని థరూర్ పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment