ఐపీఎల్-2023 సీజన్‌లో ఇవాళ (ఏప్రిల్ 12) మరో రసవత్తర సమరం జరుగునుంది. చెన్నైలోని చిదంబరం స్టేడియం వేదికగా రాజస్థాన్ రాయల్స్- చెన్నై సూపర్ కింగ్స్ హోరాహోరీగా తలపడనున్నాయి. రాత్రి 7: 30 గంటలకు ప్రారంభమయ్యే ఈ మ్యాచ్‌లో ఇరు జట్లు గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగనున్నాయి. ప్రస్తుత సీజన్‌లో ఇరు జట్లు ఇప్పటివరకు ఆడిన 3 మ్యాచ్‌ల్లో చెరి రెండిటిలో గెలుపొంది, పాయింట్ల పట్టికలో 2 (ఆర్‌ఆర్), 5 (సీఎస్‌కే) స్థానాల్లో నిలిచాయి.
ఈ మ్యాచ్‌లో గెలుపెవరిది అన్న విషయాన్ని విశ్లేషిస్తే.. ప్రస్తుత సమీకరణల దృష్ట్యా రాజస్థాన్‌కే విజయావకాశాలు అధికంగా ఉన్నాయి. ఆ జట్టు ఇప్పటివరకు ఆడిన 3 మ్యాచ్‌ల్లో భారీ స్కోర్లు సాధించింది. బ్యాటింగ్‌లో యశస్వి, బట్లర్, కెప్టెన్ శాంసన్, హెట్‌మైర్.. బౌలింగ్‌లో బౌల్ట్, చహల్, అశ్విన్ భీకర ఫామ్‌లో ఉన్నారు. పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్‌లోనూ వీరు రాణించినప్పటికీ.. ప్రభ్‌సిమ్రన్, శిఖర్ ధవన్ అద్భుతంగా బ్యాటింగ్ చేసి ఆర్‌ఆర్ హ్యాట్రిక్ విజయావకాశాలపై దెబ్బకొట్టారు.
సీఎస్‌కే విషయానికొస్తే.. ఈ జట్టు కూడా ఇప్పటివరకు ఆడిన 3 మ్యాచ్‌ల్లో 2 విజయాలు సాధించి, పర్వాలేదనిపిస్తుంది. రెండు మ్యాచ్‌ల్లో నామమాత్రపు స్కోర్లు సాధించినా.. లక్నోపై మాత్రం భారీ స్కోర్ చేసింది. సీఎస్‌కే బ్యాటింగ్ విభాగం మొత్తం రుతురాజ్ గైక్వాడ్‌పైనే ఆధారపడి ఉంది. ఈ జట్టు గెలిచిన రెండు మ్యాచ్‌ల్లో తలో చేయి వేస్తే గట్టెక్కింది.
కోట్లు పోసి కొన్న ఆటగాళ్లు (చాహర్, స్టోక్స్) గాయాల బారిన పడటం ఆ జట్టుకు మైనస్ పాయింట్‌గా చెప్పవచ్చు. అనారోగ్యం కారణంగా గత మ్యాచ్ ఆడని మొయిన్ అలీ ఈ మ్యాచ్‌కు కూడా అందుబాటులోకి రాకపోతే జట్టు విజయావకాశాలు భారీగా దెబ్బతింటాయి. కాన్వే, రాయుడు, దూబే పర్వాలేదనిపిస్తున్నా వారి స్థాయికి తగ్గ ఆటతీరును కనబర్చాల్సి ఉంది.
జడేజా, ధోని లోయర్ ఆర్డర్‌లో వస్తుండటంతో వారికి పెద్దగా అవకాశాలు రావడం లేదు. వారి నుంచి కూడా మ్యాచ్ విన్నింగ్స్ నాక్ బాకీ ఉంది. ముంబైతో మ్యాచ్‌లో వెటరన్ రహానే సుడిగాలి హాఫ్‌సెంచరీ చేయడం సీఎస్‌కేకు శుభపరిణామం. బౌలింగ్‌లో జడేజా, సాంట్నర్, తుషార్ దేశ్‌పాండే, హంగార్గేకర్ పర్వాలేదనిపిస్తున్నారు. ఓవరాల్‌గా చూస్తే ఇరు జట్లు సమవుజ్జీలుగా కనిపిస్తున్నప్పటికీ.. సీఎస్‌కేపై రాజస్థాన్‌కే విజయాకాశాలు అధికంగా ఉన్నాయి.
తుది జట్ల విషయానికొస్తే.. సీఎస్‌కే రెండు మార్పులు చేయవచ్చు. మొయిన్ అలీ రీఎంట్రీ ఖాయం కాగా.. స్టోక్స్, దీపక్ చాహర్ ఈ మ్యాచ్‌లో ఆడటం అనుమానమే. ఆర్‌ఆర్ జట్టు డీసీపై గెలుపొందిన జట్టునే యధాతథంగా కొనసాగించవచ్చు.
తుది జట్లు (అంచనా)..
సీఎస్‌కే: డెవాన్ కాన్వే, రుతురాజ్, రహానే, జడేజా, ధోని, శివమ్ దూబే, ప్రిటోరియస్, సాంట్నర్, మొయిన్ అలీ, రాయుడు, మగాలా, తుషార్ దేశ్‌పాండే
ఆర్‌ఆర్: యశస్వి జైస్వాల్, బట్లర్, శాంసన్, రియాన్ పరాగ్, హెట్‌మైర్, దృవ్ జురెల్, అశ్విన్, హోల్డర్, బౌల్ట్, సందీప్ శర్మ, చహల్, మురుగన్ అశ్విన్
Comments
Please login to add a commentAdd a comment