సాక్షి, న్యూఢిల్లీ : దేశంలో కరోనా మహమ్మారి విలయం కొనసాగుతోంది. కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య లక్ష మార్క్‌ను దాటేయడంతో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ శుక్రవారం కీలక హెచ్చరిక చేశారు. వైరస్ వ్యాప్తి నివారణలో ప్రభుత్వం పటిష్ట చర్యలు తీసుకోకపోతే రానున్న రోజుల్లో కరోనా మరింత వేగంగా విస్తరిస్తుందంటూ ఆందోళన వ్యక్తం చేశారు. కరోనా కట్టడికి కేంద్ర ప్రభుత్వం ప్రణాళికాబద్ధ చర్యలు తీసుకోవాలన్నారు. (పది లక్షలు దాటిన కేసులు)
దేశంలో కరోనా కేసుల సంఖ్య 10 లక్షలను దాటేసింది. ఇదే వేగంతో కరోనా విస్తరిస్తూ ఉంటే..ఆగస్టు 10వ తేదీ నాటికి దేశంలో 20 లక్షల కేసులను కూడా దాటేస్తుందని అంచనా వేశారు. ఈ మహమ్మారిని కట్టడికి కేంద్ర ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా, నిర్దిష్టమైన చర్యలు తీసుకోవాంటూ రాహుల్ ట్వీట్ చేశారు. అంతేకాదు దేశంలో మొత్తం కేసులు ఈ వారంలో 10 లక్షలను దాటుతాయంటూ గతంలో హెచ్చరించిన విషయాన్ని కూడా ఆయన ప్రస్తావించారు. (కరోనాతో మాజీ సీనియర్ అధికారి, రచయిత్రి మృతి)
కాగా ప్రస్తుతం ప్రపంచంలో కోటికి పైగా కేసులు నమోదయ్యాయి. అమెరికాలో అత్యధికంగా 35 లక్షల కేసులతో అమెరికా మొదటి స్థానంలో ఉండగా, 20.1 లక్షల పాజిటివ్ కేసులతో బ్రెజిల్ రెండో స్థానంలోనూ, 10 లక్షలకు పైగా కేసులతో ఇండియా మూడవ స్థానంలో నిలిచింది. అయితే కేసుల ఉధృతి ఇలాగే కొనసాగితే, ఆగస్టు రెండో వారంలోపే కేసుల విషయంలో బ్రెజిల్‌ను అధిగమించనుందనే అంచనాలు నెలకొన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment