2025.. ప్రపంచం అంతానికి ఆరంభం: బాబా వంగా కాలజ్ఞానం | Baba Vanga Predictions For 2025, Here Are Some List Of Baba Vanga Predictions Which Came True | Sakshi
Sakshi News home page

Baba Vanga Predictions: 2025.. ప్రపంచం అంతానికి ఆరంభం

Published Mon, Nov 4 2024 7:11 AM | Last Updated on Mon, Nov 4 2024 10:33 AM

Baba Vanga Prediction for 2025

బాబా వంగా.. దివ్యదృష్టి కలిగిన బల్గేరియన్‌ కాలజ్ఞాని. ఈమెను ‘నోస్ట్రాడమస్ ఆఫ్ ది బాల్కన్స్’ అని కూడా పిలుస్తారు. రెండవ ప్రపంచ యుద్ధం లాంటి ‍ప్రధాన సంఘటనలను ఈమె ముందుగానే ఊహించారని చెబుతారు. రాబోయే సంవత్సరం అంటే 2025లో జరగబోయే ఒక ఘటన గురించి బాబా వంగా ముందుగానే చెప్పారు.

2025లో ఐరోపాలో జరిగే ఒక భారీ యుద్ధం గురించి వంగా ముందుగానే హెచ్చరించారు. ఇది ప్రపంచ జనాభాకు భారీ చేటు తీసుకురానున్నదని ఆమె పేర్కొన్నారు. 5079 నాటికి మానవజాతి పూర్తిగా నాశనమవుతుంది.. అందుకు 2025లో ప్రపంచం అంతమయ్యేందుకు బీజం పడుతుందని బాబా వంగా తీవ్రంగా హెచ్చరించారు. 2043 నాటికి యూరప్ ముస్లిం పాలనలోకి వస్తుందని, 2076 నాటికి కమ్యూనిజం ప్రపంచవ్యాప్తంగా తిరిగి విస్తరిస్తుందని ఆమె అంచనా వేశారు.

2025 నాటికి భూమిపై గ్రహాంతర జీవులు కనిపిస్తాయని, ఈ జీవులు భూమిపై తమ ఉనికిని చాటుకుంటాయని ఆమె పేర్కొన్నారు. కాగా 16వ శతాబ్దపు ఫ్రెంచ్ జ్యోతిష్కుడు నోస్ట్రాడమస్ కూడా ఇదే విధమైన అంచనాలు అందించారు. ఆయన 2025లో జరగబోయే యూరోపియన్  యుద్ధం గురించి ప్రస్తావించారు. బాబా వంగా భవిష్యత్‌లో జరగబోయే వాతావరణ మార్పుల కారణంగా ఏర్పడే కరువు, అడవులలో కార్చిచ్చు తదితర పర్యావరణ విపత్తులను ముందుగానే అంచనా వేశారు.  1911 అక్టోబర్‌ 3న జన్మించిన బాబా వంగా తన 84వ ఏట 1996 ఆగస్టు 11న కన్నుమూశారు. 

నిజమైన బాబా వంగా అంచనాలు

  • రెండవ ప్రపంచ యుద్ధం: విధ్వంసం, భారీ మరణాల అంచనా

  • సోవియట్ యూనియన్ విచ్ఛిన్నం: యూఎస్‌ఎస్‌ఆర్‌ పతనాన్ని 1991కి ముందే ఊహించారు.

  • చెర్నోబిల్ విపత్తు: 1986లోనే బాబా వంగా అంచనా వేశారు.

  • స్టాలిన్ మరణం: బాబా వంగా ముందుగానే చెప్పారు.

  • కుర్స్క్ జలాంతర్గామి విపత్తు: 2000కి ముందుగానే వంగా   ఊహించారు. 

  • సెప్టెంబర్ 11 దాడులు: ‘ఉక్కు పక్షులు’ అమెరికాపై దాడి చేస్తాయని బాబా వంగా ముందుగానే అంచనా వేశారు. 

  • 2004 సునామీ: హిందూ మహాసముద్రంలో విధ్వంసకర సునామీ ప్రమాదం.

  • 1985 భూకంపం: ఉత్తర బల్గేరియాలో భూకంపం.

  • 9/11 దాడులతో సహా పలు ముఖ్యమైన సంఘటనలలో బాబా వంగా భవిష్య అంచనాలు 85శాతం వరకూ నిజమయ్యాయని కొందరు నిపుణులు చెబుతుంటారు.

    ఇది కూడా చదవండి: బ్యాటరీలు, బ్లేడ్లు సహా పొట్టలో 56 వస్తువులు 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement