Vanga
-
అన్నం పెట్టే రైతులతో జైల్లో బాత్రూమ్లు కడిగించారు
-
2025.. ప్రపంచం అంతానికి ఆరంభం: బాబా వంగా కాలజ్ఞానం
బాబా వంగా.. దివ్యదృష్టి కలిగిన బల్గేరియన్ కాలజ్ఞాని. ఈమెను ‘నోస్ట్రాడమస్ ఆఫ్ ది బాల్కన్స్’ అని కూడా పిలుస్తారు. రెండవ ప్రపంచ యుద్ధం లాంటి ప్రధాన సంఘటనలను ఈమె ముందుగానే ఊహించారని చెబుతారు. రాబోయే సంవత్సరం అంటే 2025లో జరగబోయే ఒక ఘటన గురించి బాబా వంగా ముందుగానే చెప్పారు.2025లో ఐరోపాలో జరిగే ఒక భారీ యుద్ధం గురించి వంగా ముందుగానే హెచ్చరించారు. ఇది ప్రపంచ జనాభాకు భారీ చేటు తీసుకురానున్నదని ఆమె పేర్కొన్నారు. 5079 నాటికి మానవజాతి పూర్తిగా నాశనమవుతుంది.. అందుకు 2025లో ప్రపంచం అంతమయ్యేందుకు బీజం పడుతుందని బాబా వంగా తీవ్రంగా హెచ్చరించారు. 2043 నాటికి యూరప్ ముస్లిం పాలనలోకి వస్తుందని, 2076 నాటికి కమ్యూనిజం ప్రపంచవ్యాప్తంగా తిరిగి విస్తరిస్తుందని ఆమె అంచనా వేశారు.2025 నాటికి భూమిపై గ్రహాంతర జీవులు కనిపిస్తాయని, ఈ జీవులు భూమిపై తమ ఉనికిని చాటుకుంటాయని ఆమె పేర్కొన్నారు. కాగా 16వ శతాబ్దపు ఫ్రెంచ్ జ్యోతిష్కుడు నోస్ట్రాడమస్ కూడా ఇదే విధమైన అంచనాలు అందించారు. ఆయన 2025లో జరగబోయే యూరోపియన్ యుద్ధం గురించి ప్రస్తావించారు. బాబా వంగా భవిష్యత్‌లో జరగబోయే వాతావరణ మార్పుల కారణంగా ఏర్పడే కరువు, అడవులలో కార్చిచ్చు తదితర పర్యావరణ విపత్తులను ముందుగానే అంచనా వేశారు. 1911 అక్టోబర్ 3న జన్మించిన బాబా వంగా తన 84వ ఏట 1996 ఆగస్టు 11న కన్నుమూశారు. నిజమైన బాబా వంగా అంచనాలురెండవ ప్రపంచ యుద్ధం: విధ్వంసం, భారీ మరణాల అంచనాసోవియట్ యూనియన్ విచ్ఛిన్నం: యూఎస్ఎస్ఆర్ పతనాన్ని 1991కి ముందే ఊహించారు.చెర్నోబిల్ విపత్తు: 1986లోనే బాబా వంగా అంచనా వేశారు.స్టాలిన్ మరణం: బాబా వంగా ముందుగానే చెప్పారు.కుర్స్క్ జలాంతర్గామి విపత్తు: 2000కి ముందుగానే వంగా ఊహించారు. సెప్టెంబర్ 11 దాడులు: ‘ఉక్కు పక్షులు’ అమెరికాపై దాడి చేస్తాయని బాబా వంగా ముందుగానే అంచనా వేశారు. 2004 సునామీ: హిందూ మహాసముద్రంలో విధ్వంసకర సునామీ ప్రమాదం.1985 భూకంపం: ఉత్తర బల్గేరియాలో భూకంపం.9/11 దాడులతో సహా పలు ముఖ్యమైన సంఘటనలలో బాబా వంగా భవిష్య అంచనాలు 85శాతం వరకూ నిజమయ్యాయని కొందరు నిపుణులు చెబుతుంటారు.ఇది కూడా చదవండి: బ్యాటరీలు, బ్లేడ్లు సహా పొట్టలో 56 వస్తువులు -
పిఠాపురం మైనర్ బాలిక ఘటనపై పవన్ కళ్యాణ్ పై వంగగీత షాకింగ్ వ్యాఖ్యలు
-
పిఠాపురానికి అండగా నేనున్నా..
-
చెప్పే మాటలు వేరు.. చేసే పనులు వేరు
-
కూటమి సర్కార్ చేసి చూపించాలి: వంగా గీత
-
పిఠాపురంలో వంగా గీత ప్రచార జోరు
-
'పేదలపై చంద్రబాబుది కపట ప్రేమ'
-
పెన్షన్లు ఆపేస్తారా.. మీకు ఓటు అడిగే హక్కు లేదు
-
జన్యుమార్పిడి వంగ అక్రమ సాగుతో కలకలం
నిషేధం ఉన్నప్పటికీ జన్యుమార్పిడి వంగ పంట హర్యానాలో సాగులో ఉన్న విషయం కలకలం రేపింది. అనుమతి లేని కలుపు మందును తట్టుకునే బీటీ పత్తి కొన్ని లక్షల ఎకరాల్లో సాగులోకి వచ్చినట్టుగానే నిషిద్ధ జన్యుమార్పిడి వంగ పంట కూడా పొలాల్లోకి వచ్చిందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పదేళ్ల క్రితం బీటీ వంగ రకాన్ని ప్రైవేటు కంపెనీ తయారు చేసినప్పుడు దేశవ్యాప్తంగా అప్పటి పర్యావరణ మంత్రి జయరామ్ రమేశ్ ఆధ్వర్యంలో ప్రజాభిప్రాయ సేకరణ జరిపితే.. వ్యతిరేకత వెల్లువెత్తింది. అంతటితో బీటీ వంగపై కేంద్రం నిషేధం విధించింది. పదేళ్ల తర్వాత ఈ వంగడం రైతు పొలంలో కనిపించడం ఏమాత్రం సమర్థనీయంగా లేదు. కాయతొలిచే పురుగును తట్టుకుంటుందని చెబుతున్న బీటీ వంగను ఫతేబాద్‌లో ఒక రైతు సాగు చేస్తున్నట్టు వెల్లడైంది. బస్టాండ్ల దగ్గరల్లో విత్తనాల దుకాణాల్లో విత్తనం కొన్నట్లు ఆ రైతు చెబుతున్నారు. మన దేశంలో నిషేధించిన మూడేళ్ల తర్వాత 2013లో బంగ్లాదేశ్ ప్రభుత్వం బీటీ వంగ సాగును అనుమతించింది. మొదట్లో కొన్నాళ్లు కాయతొలిచే పురుగును తట్టుకున్న బీటీ వంగ, ఆ తర్వాత తట్టుకోలేకపోతున్నదని సమాచారం. అక్రమ పద్ధతుల్లో బీటీ వంగ వంగడాన్ని రైతులకు అందిస్తుండడంపై జన్యుమార్పిడి వ్యతిరేక వర్గాలు మండిపడుతున్నాయి. ‘మనకు 3,000కు పైగా వంగ రకాలు ఉన్నాయి. బీటీ వంగ పండించడం మొదలు పెడితే ఈ సంప్రదాయ వంగడాలన్నీ జన్యుకాలుష్యానికి గురవుతాయి. వంగ పంటలో జీవవైవిధ్యం అడుగంటిపోతుంది. పత్తిలో జరిగింది ఇదే..’ అని కోలిషన్ ఫర్ ఎ జీఎం ఫ్రీ సంస్థ ప్రతినిధి శ్రీధర్ రాధాకృష్ణన్ అన్నారు. అధికారులు బీటీ వంగ సాగవుతున్న పొలాల నుంచి నమూనాలు సేకరించి పరీక్షలు నిర్వహించాలి. నిషిద్ధ విత్తనాలు ఎక్కడి నుంచి వస్తున్నాయో కనిపెట్టాలి. జన్యుమార్పిడి బీటీ పత్తి మొక్కలను ధ్వంసం చెయ్యాలి. నష్టపోయిన రైతులకు పరిహారం ఇప్పించడంతోపాటు నిషిద్ధ విత్తనాలు రైతులకు అంటగడుతున్న కంపెనీలపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు కోరుతున్నారు. రైతులు కూడా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. ‘ఎందరు రైతులు సాగు చేస్తున్నారో..’ ఫతేబాద్‌లో రైతు సాగు చేస్తున్న వంగ తోట నుంచి నమూనాలను సేకరించి న్యూఢిల్లీలోని జాతీయ మొక్కల జన్యువనరుల బ్యూరో(ఎన్.బి.పి.జి.ఆర్.)కు పరీక్షల నిమిత్తం పంపామని, పది రోజుల్లో ఫలితం వెలువడుతుందని హర్యానా ఉద్యాన శాఖ డైరెక్టర్ జనరల్ అర్జున్ సింగ్ శైని తెలిపారు. ‘ఇది బీటీ వంగే అని తేలితే దాన్ని అరికట్టడానికి చాలా చర్యలు తీసుకోవాల్సి వస్తుంది. ఆ పొలంలో పంటను ధ్వంసం చేయాలి. ఆ విత్తనాలు రైతు చేతికి ఎవరెవరి చేతులు మారి వచ్చాయన్నది నిగ్గుతేల్చాల్సి ఉంటుంది. బీటీ వంగ అక్రమంగా సాగవుతుండడమే నిజమైతే దేశంలో ఇంకా ఎంత మంది రైతుల దగ్గరకు ఈ విత్తనాలు చేరాయో కనిపెట్టాల్సి ఉంటుంది’ అని శైని అన్నారు. బీటీ వంగ, నాన్ బీటీ వంగ -
కేరళ వంగ భలే రుచి..!
ఇది ఎంతో రుచికరమైన వంగ రకం. దీని పేరు వెంగెరి వంగ. కాయ సన్నగా పొడుగ్గా ఉంటుంది కాబట్టి ‘అమితాబ్ బచ్చన్’ వంగ రకం అని చమత్కరిస్తుంటారు. హైదరాబాద్ మెహదీపట్నానికి చెందిన ఇంటిపంటల సాగుదారు వి.ఎం. నళిని తన మేడపై ఐదారు రకాల వంకాయలను సాగు చేసుకుంటున్నారు. 15“15 అంగుళాల సైజులోని మూడు కంటెయినర్లలో వెంగెరి రకం వంగ మొక్కలను ఆమె పెంచుతున్నారు. ఆరోగ్యంగా, పొడవుగా పెరిగిన ఈ వంకాయలు ఆమె ఇంటిపంటలో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. ఇది కేరళకు చెందిన దేశీ వంగ రకమని, కొన్నాళ్ల క్రితం బెంగళూరులో ఇంటిపంటల సాగుదారుల విత్తన మార్పిడి సమావేశంలో పాల్గొన్నప్పుడు ఎవరో తనకు ఈ విత్తనాలు ఇచ్చారని నళిని తెలిపారు. కొన్ని కాయలను విత్తనాలకు ఉంచి, బంధుమిత్రులకు పంపిణీ చేస్తానని ఆమె అన్నారు. -
శివాజి ఒళ్లో కూర్చుని పెరిగాను
దివంగత మహా నటుడు శివాజీగణేశన్ ఒళ్లో కూర్చుని పెరిగిన వాడిని నేను అని విశ్వనటుడు కమలహాసన్ అన్నారు. శివాజీగణేశన్ మనవడు, ప్రభు వారసుడు విక్రమ్‌ప్రభు హీరోగా నటిస్తున్న తాజా చిత్రం వాగా. 2013లో హరిదాసు వంటి విమర్శకుల నుంచి సైతం ప్రశంసలు పొందిన చిత్రాన్ని తెరకెక్కించిన జీఎన్ఆర్.కుమరవేలన్ కథ, కథనం, దర్శకత్వం బాధ్యతలు నిర్వహిస్తున్న తాజా చిత్రం ఇది. నవ నిర్మాత ఎం.బాలవిశ్వనాథన్ తన విజయ భార్గవి ఎంటర్టెయిన్మెంట్ పతాకంపై నిర్మిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం వాగా. విక్రమ్‌ప్రభుకు జంటగా నవ నటి రణ్య హీరోయిన్గా పరిచయం అవుతున్న ఈ చిత్రంలో విలన్‌గా షాజీచౌదరి నటిస్తున్నారు. ఇతర ముఖ్యపాత్రల్లో కరుణాస్, సత్యన్, నాన్‌కడవుల్ రాజేంద్రన్, తులసి, విద్యులేఖ, రాజ్‌కపూర్ నటిస్తున్నారు. డి.ఇమాన్ సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రం ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం సోమవారం ఉదయం చెన్నైలోని సత్యం థియేటర్లో జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న నటుడు కమలహాసన్ చిత్ర ఆడియోను ఆవిష్కరించి తోలి ప్రతిని సీనియర్ దర్శకుడు మహేంద్రన్‌కు అందించారు. కమల్ మాట్లాడుతూ ఇది తన కుటుంబ కార్యక్రమం అని అన్నారు. తాను శివాజీగణేశన్ ఒళ్లో కూర్చొని పెరిగిన వాడినన్నారు. మూడున్నర, నాలుగేళ్ల వయసున్న తనకు అప్పుడు ఆయన ఎంత గొప్ప నటుడో తెలియదని, ఏడేళ్ల వయసులో స్థానిక నార్త్ బోగ్ రోడ్డులో గల ఆయన ఇంటికి వచ్చే అభిమానులను చూసిన తరువాత అంత మహా నటుడి ఒడిలోనా తాను కూర్చుంది అని ఆశ్చర్యపోయానన్నారు. అయితే శివాజీగణేశన్ ఇంటి గేటులు తన కోసం ఎప్పుడు తెరిచే ఉండేవన్నారు. తాను ఆ ఇంటిలో ఒకడినేనని అలాంటిది ఆ కుటుంబానికి చెందిన వారసుడి చిత్ర కార్యక్రమం జరుగుతుంటే తాను రాకుండా ఉండగలనా? అని అన్నారు. విక్రమ్‌ప్రభు నటించిన ఈ వాగా చిత్రం మంచి విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు. చిత్ర దర్శకుడు జీఎన్ఆర్.కుమారవేలన్ మాట్లాడుతూ బార్డర్ సెక్కూరిటీ ఫోర్స్ ఇతివృత్తంతో రూపొందిస్తున్న చిత్రం వాగా అని వివరించారు. అక్కడ పని చేసే సైనికులు ఎదుర్కొనే సమస్యలు, వారి అనుభవాలే చిత్ర కథ అన్నారు. చిత్ర షూటింగ్‌ను కాశ్మీర్ సరిహద్దుల్లో మైనస్ డిగ్రీల చలిలో నిర్విహంచామని తెలిపారు. ఈ చిత్రం తనకెంత ముఖ్యమో హీరో విక్రమ్‌ప్రభు కెరీర్లోను అంత ముఖ్యమైన చిత్రంగా నిలిచిపోతుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. చిత్ర యూనిట్ కఠిన శ్రమలో చేసిన చిత్రం వాగా అని మంచి ఫలితం ఇస్తుందనే నమ్మకంతో విడుదల కోసం ఎదురు చూస్తున్నట్లు హీరో విక్రమ్‌ప్రభు అన్నారు. రామ్‌కుమార్, ప్రభు, హీరోయిన్ రణ్య, సంగీత దర్శకుడు డి.ఇమాన్ కార్యక్రమంలో పాల్గొన్నారు.