Predicted Team India For First T20 Vs New Zealand - Sakshi
Sakshi News home page

న్యూజిలాండ్‌తో తొలి టీ20.. టీమిండియా ఎలా ఉండబోతుందంటే..?

Published Thu, Nov 17 2022 1:30 PM | Last Updated on Thu, Nov 17 2022 2:20 PM

Predicted Team India For First T20 Vs New Zealand - Sakshi

IND VS NZ 1st T20: టీ20 వరల్డ్‌కప్‌-2022 అనంతరం సీనియర్లు రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లి, కేఎల్‌ రాహుల్‌ రెస్ట్‌ తీసుకోవడంతో యువ జట్లతో (టీ20, వన్డే సిరీస్‌లకు వేర్వేరు జట్లు) న్యూజిలాండ్‌ పర్యటనకు బయల్దేరిన టీమిండియా.. రేపు (నవంబర్‌ 18) వెల్లింగ్టన్‌లోని స్కై స్టేడియంలో 3 మ్యాచ్‌ల సిరీస్‌లతో భాగంగా తొలి టీ20 ఆడనుంది. ఈ పర్యటనలో టీ20 సిరీస్‌కు హార్ధిక్‌ పాండ్యా, వన్డే సిరీస్‌కు శిఖర్‌ ధవన్‌ టీమిండియాకు నాయకత్వం వహించనుండగా.. వీరి సారధ్యంలో యువ ఆటగాళ్లతో కూడిన భారత జట్టు ఆతిధ్య జట్టుతో అమీతుమీకి సై అంటుంది.  

భారతకాలమానం ప్రకారం​ రేపు మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభమయ్యే తొలి టీ20లో భారత తుది జట్టు ఎలా ఉండే అవకాశం ఉందంటే.. బ్యాటింగ్‌, బౌలింగ్‌ విభాగాల్లో సీనియర్ల గైర్హాజరీలో యువ ఆటగాళ్లు ఇషాన్‌ కిషన్‌, శుబ్‌మన్‌ గిల్‌, దీపక్‌ హుడా, ఉమ్రాన్‌ మాలిక్‌లకు తుది జట్టులో చోటు లభించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. రిషబ్‌ పంత్‌, ఇషాన్‌ కిషన్‌ ఇద్దరినీ జట్టులోకి తీసుకుంటే, సంజూ శాంసన్‌ బెంచ్‌కే పరిమితం కాక తప్పదు.

వరల్డ్‌కప్‌లో అవకాశాలు దక్కని దీపక్‌ హుడా తుది జట్టులో తప్పక ఉండే ఛాన్స్‌ ఉంది. స్పిన్‌ ఆల్‌రౌండర్‌ వాషింగ్టన్‌ సుం‍దర్‌, హర్షల్‌ పటేల్‌ ఛాన్స్‌ కోసం ఎదురు చూడాల్సి రావచ్చు. స్పెషలిస్ట్‌ స్పిన్నర్‌ కోటాలో యుజ్వేంద్ర చహల్‌, కుల్దీప్‌ యాదవ్‌ మధ్య తీవ్ర పోటీ నెలకొన్నప్పటికీ.. స్కై స్టేడియంలో పిచ్‌ పరిస్థితుల దృష్ట్యా కుల్దీప్‌కే అవకాశం దొరకవచ్చు. పేసర్ల కోటాలో స్వింగ్‌ సుల్తాన్‌ భువనేశ్వర్‌ కుమార్‌, అర్షదీప్‌ స్థానాలు పక్కా కాగా.. ఉమ్రాన్‌ మాలిక్‌, మహ్మద్‌ సిరాజ్‌ల మధ్య పోటీ ఉంటుంది. అయితే పేస్‌కు అనుకూలించే వెల్లింగ్టన్‌ పిచ్‌పై మేనేజ్‌మెంట్‌.. ఉమ్రాన్‌ మాలిక్‌ను ఫస్ట్‌ చాయిస్‌గా తీసుకునే అవకాశం ఉంది.   

తుది జట్టు (అంచనా)..
శుబ్‌మన్‌ గిల్‌, ఇషాన్‌ కిషన్‌, శ్రేయస్‌ అయ్యర్‌, సూర్యకుమార్‌ యాదవ్‌, దీపక్‌ హుడా, రిషబ్‌ పంత్‌ (వికెట్‌కీపర్‌), హార్ధిక్‌ పాండ్యా (కెప్టెన్‌), భువనేశ్వర్‌ కుమార్‌, కుల్దీప్‌ యాదవ్‌, అర్షదీప్‌ సింగ్‌, ఉమ్రాన్‌ మాలిక్‌ 

టీ20 సిరీస్‌కు భారత జట్టు..
హార్ధిక్‌ పాండ్యా (కెప్టెన్‌), రిషబ్‌ పంత్‌ (వైస్‌ కెప్టెన్‌), ఇషాన్‌ కిషన్‌, శుబ్‌మన్‌ గిల్‌, దీపక్‌ హుడా, సూర్యకుమార్‌ యాదవ్‌, శ్రేయస్‌ అయ్యర్‌, సంజూ శాంసన్‌, వాషింగ్టన్‌ సుందర్‌, యుజ్వేంద్ర చహల్‌, కుల్దీప్‌ యాదవ్‌, హర్షల్‌ పటేల్‌, మహ్మద్‌ సిరాజ్‌, భువనేశ్వర్‌ కుమార్‌, అర్షదీప్‌ సింగ్‌, ఉమ్రాన్‌ మాలిక్‌.
చదవండి: Viral Video: సిక్స్‌ ప్యాక్‌ బాడీలతో టీమిండియా క్రికెటర్లు..! video
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement