ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా భారత్, న్యూజిలాండ్ మధ్య ఇవాళ (నవంబర్ 1) మూడో టెస్ట్ ప్రారంభమైంది. ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్ టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. తొలి సెషన్‌లో టీమిండియా ఆఫ్ స్పిన్నర్ వాషింగ్టన్ సుందర్ రెచ్చిపోయాడు. కివీస్ స్టార్ బ్యాటర్లు టామ్ లాథమ్ (28), రచిన్ రవీంద్రను (5) క్లీన్ బౌల్డ్ చేశాడు. డెవాన్ కాన్వేను (4) ఆకాశ్‌దీప్ ఎల్బీడబ్ల్యూ చేశాడు. లంచ్ విరామం సమయానికి న్యూజిలాండ్ 3 వికెట్లు కోల్పోయి 92 పరుగులు చేసింది. విల్ యంగ్ (38), డారిల్ మిచెల్ (11) క్రీజ్‌లో ఉన్నారు.
WASHINGTON SUNDAR WITH TWO ABSOLUTE JAFFAS..!!!
- First Latham, now Rachin. 🤯👌pic.twitter.com/JBz5P04YwP— Mufaddal Vohra (@mufaddal_vohra) November 1, 2024
రెండో టెస్ట్‌లో 11 వికెట్లు పడగొట్టి సత్తా చాటిన సుందర్ ఈ మ్యాచ్‌లోనూ ఇరగదీస్తున్నాడు. కాగా, ఈ మ్యాచ్ కోసం న్యూజిలాండ్ రెండు మార్పులు చేసింది. మిచెల్ సాంట్నర్ గాయపడటంతో అతని స్థానంలో ఐష్ సోధి.. టిమ్ సౌథీ స్థానంలో మ్యాట్ హెన్రీ తుది జట్టులోకి వచ్చారు. మరోవైపు భారత్ సైతం ఓ మార్పు చేసింది. బుమ్రా స్థానంలో సిరాజ్ తుది జట్టులోకి వచ్చాడు. బుమ్రా అస్వస్థతకు గురైనట్లు తెలుస్తుంది.
Akash Deep traps Conway. 🔥 pic.twitter.com/tuTjqKupDf
— Mufaddal Vohra (@mufaddal_vohra) November 1, 2024
తుది జట్లు..
భారత్: రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లి, రిషబ్ పంత్, సర్ఫరాజ్ ఖాన్, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, రవిచంద్రన్ అశ్విన్, ఆకాశ్‌దీప్, మొహమ్మద్ సిరాజ్
న్యూజిలాండ్: టామ్ లాథమ్, డెవాన్ కాన్వే, విల్ యంగ్, రచిన్ రవీంద్ర, డారిల్ మిచెల్, టామ్ బ్లండెల్, గ్లెన్ ఫిలిప్స్, ఐష్ సోధి, మ్యాట్ హెన్రీ, అజాజ్ పటేల్, విలియమ్ ఓరూర్కీ
ఇదిలా ఉంటే, మూడు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ కోసం న్యూజిలాండ్ జట్టు భారత్‌లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సిరీస్‌లోని తొలి రెండు మ్యాచ్‌లు గెలిచిన న్యూజిలాండ్ ఇదివరకే సిరీస్‌ను కైవసం చేసుకుంది.
Comments
Please login to add a commentAdd a comment