48 గంటల్లో మూడో ప్రపంచ యుద్ధం? | World War 3 Will Start in 48 Hours | Sakshi
Sakshi News home page

48 గంటల్లో మూడో ప్రపంచ యుద్ధం?

Published Sun, Jun 16 2024 8:06 AM

World War 3 Will Start in 48 Hours

మరో రెండు రోజుల్లో అంటే రాబోయే 48 గంటల్లో మూడో ప్రపంచ యుద్ధం ముంచుకొస్తోంది. న్యూ  నోస్ట్రాడమస్‌గా పేరొందిన భారతీయ ​జ్యోతిష్య నిపుణులు కుశాల్ కుమార్ ఈ అంచనా వేశారు. జూన్ 18న మూడో ప్రపంచ యుద్ధం ప్రారంభం కాబోతోందని కుశాల్‌ తెలిపారు.

ఆయన వెల్లడించిన వివరాల ప్రకారం భారత్‌-పాక్‌ సరిహద్దుల్లో ఉగ్రదాడులు, ఉత్తర కొరియా సైన్యం దక్షిణ కొరియా సరిహద్దు ప్రాంతంలోకి ప్రవేశించడం, ఇజ్రాయెల్- లెబనాన్ మధ్య పెరుగుతున్న ఘర్షణలు ఇవన్నీ మూడవ ప్రపంచ యుద్ధం ప్రారంభానికి సంకేతాలు.

జూన్ 18న సంభవించే అత్యంత బలమైన గ్రహాల సంఘర్షణ ఫలితంగా మూడవ ప్రపంచ యుద్ధం  మొదలవుతుందని కుశాల్‌​ తెలిపారు. మేలో ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ హెలికాప్టర్ ప్రమాదంలో మృతి చెందిన తర్వాత కుశాల్‌ ఈ అంచనా అందించారు. జూన్ 9న యాత్రికుల బస్సుపై  ఉగ్రదాడి దీనికి ముందస్తు సూచనగా ఆయన పేర్కొన్నారు. కాగా ఈ దాడికి పాల్పడిన ఉగ్రవాదులను మట్టుబెట్టే పనిలో మన సైనికులు నిమగ్నమై ఉన్నారు. జూన్ 10, 12 తేదీల్లో కూడా ఉగ్రదాడులు జరిగాయి.

కుశాల్ కుమార్ అంచనా ప్రకారం రాబోయే 48 గంటలు క్లిష్టమైనవి. ఈ సమయంలో యుద్ధం చెలరేగే అవకాశం ఉంది. మూడో ప్రపంచ యుద్ధం పెను విధ్వంసాన్ని నృష్టించనుంది. ఆకాశం నుంచి ఉపగ్రహాలు కిందికి దూసుకువస్తాయని, అడవులు బూడిదగా మారుతాయని ఆయన తెలిపారు. అన్ని దేశాలు ఒకదానితో మరొకటి పోరాటానికి దిగుతాయని, ఈ యుద్ధం మొత్తం ప్రపంచాన్నంతటినీ సర్వనాశనం చేస్తుందని కుశాల్‌ వివరించారు. 

Advertisement
 
Advertisement
 
Advertisement