hours
-
48 గంటల్లో మూడో ప్రపంచ యుద్ధం?
మరో రెండు రోజుల్లో అంటే రాబోయే 48 గంటల్లో మూడో ప్రపంచ యుద్ధం ముంచుకొస్తోంది. న్యూ నోస్ట్రాడమస్‌గా పేరొందిన భారతీయ జ్యోతిష్య నిపుణులు కుశాల్ కుమార్ ఈ అంచనా వేశారు. జూన్ 18న మూడో ప్రపంచ యుద్ధం ప్రారంభం కాబోతోందని కుశాల్ తెలిపారు.ఆయన వెల్లడించిన వివరాల ప్రకారం భారత్-పాక్ సరిహద్దుల్లో ఉగ్రదాడులు, ఉత్తర కొరియా సైన్యం దక్షిణ కొరియా సరిహద్దు ప్రాంతంలోకి ప్రవేశించడం, ఇజ్రాయెల్- లెబనాన్ మధ్య పెరుగుతున్న ఘర్షణలు ఇవన్నీ మూడవ ప్రపంచ యుద్ధం ప్రారంభానికి సంకేతాలు.జూన్ 18న సంభవించే అత్యంత బలమైన గ్రహాల సంఘర్షణ ఫలితంగా మూడవ ప్రపంచ యుద్ధం మొదలవుతుందని కుశాల్ తెలిపారు. మేలో ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ హెలికాప్టర్ ప్రమాదంలో మృతి చెందిన తర్వాత కుశాల్ ఈ అంచనా అందించారు. జూన్ 9న యాత్రికుల బస్సుపై ఉగ్రదాడి దీనికి ముందస్తు సూచనగా ఆయన పేర్కొన్నారు. కాగా ఈ దాడికి పాల్పడిన ఉగ్రవాదులను మట్టుబెట్టే పనిలో మన సైనికులు నిమగ్నమై ఉన్నారు. జూన్ 10, 12 తేదీల్లో కూడా ఉగ్రదాడులు జరిగాయి.కుశాల్ కుమార్ అంచనా ప్రకారం రాబోయే 48 గంటలు క్లిష్టమైనవి. ఈ సమయంలో యుద్ధం చెలరేగే అవకాశం ఉంది. మూడో ప్రపంచ యుద్ధం పెను విధ్వంసాన్ని నృష్టించనుంది. ఆకాశం నుంచి ఉపగ్రహాలు కిందికి దూసుకువస్తాయని, అడవులు బూడిదగా మారుతాయని ఆయన తెలిపారు. అన్ని దేశాలు ఒకదానితో మరొకటి పోరాటానికి దిగుతాయని, ఈ యుద్ధం మొత్తం ప్రపంచాన్నంతటినీ సర్వనాశనం చేస్తుందని కుశాల్ వివరించారు. -
ఏ రాష్ట్రంలో ఎక్కువ పనిగంటలు? తెలంగాణ సంగతేంటి?
ఇన్ఫోసిస్ వ్యవస్థాపకులు ఎన్ఆర్ నారాయణ మూర్తి వారానికి 70 గంటలు పని చేయాలని చెప్పినప్పటి నుండి, జనం ఈ విషయంలో రెండు వర్గాలుగా విడిపోయినట్లు కనిపిస్తోంది. కార్మికవర్గం దీనిని సరైనదిగా భావించడం లేదు. అయితే యాజమాన్యం దీనిని సమర్థించుకునేందుకు భిన్నమైన వాదనలు వినిపిస్తోంది. అయితే ఈ రోజు మనం.. దేశంలోని ఏ రాష్ట్రంలోని ప్రజలు అధిక గంటలు పని చేస్తున్నారు? అత్యధిక వేతనం పొందుతున్నవారెవరు? అనే విషయాలను తెలుసుకుందాం. మీడియా దగ్గరున్న సమాచారం ప్రకారం ఉత్తరాఖండ్ ప్రజలు గరిష్టంగా 9.6 గంటలు పని చేస్తున్నారు. ఈ విషయంలో తెలంగాణ రెండో స్థానంలో ఉంది. తెలంగాణలో సగటు ఉద్యోగి రోజుకు 9.2 గంటలు పనిచేస్తున్నాడు. గుజరాత్, మహారాష్ట్ర మూడు, నాలుగు స్థానాల్లో ఉన్నాయి. ఈ రాష్ట్రాల్లో ప్రతి ఉద్యోగి రోజూ సగటున 9 గంటలు పని చేస్తున్నాడు. అయితే తక్కువ పనిగంటల విషయానికొస్తే దేశంలోని మణిపూర్ మొదటి స్థానంలో ఉంది. సగటున ఇక్కడి ప్రజలు ప్రతిరోజూ 6 గంటలు పని చేస్తారు. ఏ రాష్ట్రంలోని ప్రజలు ఎన్ని గంటలు పనిచేస్తున్నారో తెలుసుకున్నాం. ఇప్పుడు ఏ రాష్ట్ర ప్రజలు అత్యధిక జీతం పొందుతున్నారో తెలుసుకుందాం. 2022వ సంవత్సరంలో ఆర్బీఐ దీనికి సంబంధించిన గణాంకాలను విడుదల చేసింది. వీటి ప్రకారం కేరళ ప్రజలు దేశంలోనే అత్యధిక జీతం పొందుతున్నారు. ఇక్కడ తలసరి వార్షిక ఆదాయం రూ.1,94,767. వేతనాల గురించి చెప్పాలంటే ఇక్కడి కార్మికులకు రోజువారీ వేతనం రూ.838. కాగా హర్యానా, పంజాబ్‌లు ఈ విషయంలో చాలా వెనుకబడి ఉన్నాయి. ఇది కూడా చదవండి: యురేనస్ మీద ఐదు సెకెన్లు ఉండగలిగితే? -
ప్రైవేట్ కంపెనీలకు పనిగంటలు తగ్గింపు!
దుబాయ్ః రంజాన్ నెలలో ప్రైవేట్ కంపెనీల పనిగంటలపై యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. రంజాన్ పవిత్ర మాసంలో కార్మికులకు ఎటువంటి జీతం తగ్గింపు లేకుండా రెండు గంటల పని సమయాన్ని తగ్గిస్తూ ప్రకటన చేసింది. కార్మిక సంబంధాలు, సవరణల నియంత్రణకు సంబంధించిన 1980 ఫెడరల్ చట్టం 08, ఆర్టికల్ 65 నిబంధన ప్రకారం కార్మికుల పనిగంటలకు సంబంధించిన నిబంధన అమల్లోకి తెచ్చినట్లు యూఏఈ మానవ వనరుల మంత్రిత్వ శాఖ నివేదించింది. ప్రభుత్వ మానవ వనరుల శాఖ ఫెడరల్ అథారిటీ ప్రకటన ప్రకారం రంజాన్ నెలలో ఉదయం 9 గంటలనుంచి 2గంటల వరకూ పని గంటలను సవరించినట్లు ప్రభుత్వం ప్రకటన జారీ చేసింది. తాజా ప్రకటన ప్రకారం అటు ప్రైవేట్ తో పాటు అన్ని ప్రభుత్వ రంగ సంస్థల్లోనూ రంజాన్ నెలంతా రెండు గంటల పని సమయం తగ్గిస్తూ తెచ్చిన నిబంధన అమల్లోకి వస్తుంది. తాజా నిబంధననను సోమవారం అమల్లోకి తెచ్చిన సందర్భంలో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ప్రభుత్వ అధ్యక్షుడు షేక్ ఖలీఫా బిన్ జాయెద్ అల్ నహ్యాన్, యుఏఈ వైస్ ప్రెసిడెంట్, దుబాయ్ ప్రధానమంత్రి హెచ్ హెచ్ షేక్ మహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్టౌమ్, ప్రజలకు రంజాన్ పండుగ సందర్భంగా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. -
డేంజర్ అవర్స్!
-
గంటల్లోనే పట్టుబడ్డారు
నెల్లూరు(కావలి): బంగారు వ్యాపారుల వద్ద నుంచి రూ.82 లక్షలు దోపిడీ చేసి వెళ్లిన నలుగురు నిందితుల్లో ముగ్గురిని పోలీసులు గంటల తేడాలోనే పట్టుకున్నారు. వారు ముగ్గురు ప్రకాశం జిల్లాలో పోలీస్ కానిస్టేబుళ్లగా పనిచేస్తున్నట్లు సమాచారం. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలికి చెందిన బంగారు వ్యాపారులు వేమూరి రాము, సునీల్ రూ.82 లక్షల నగదుతో కావలి రైల్వే స్టేషన్ నుంచి నవజీవన్ ఎక్స్‌ప్రెస్‌లో నెల్లూరు వెళ్తున్నారు. ఆ సమయంలో నలుగురు వ్యక్తులు వారి వద్దకు వచ్చి తాము పోలీసులమని తుపాకిని చూపి బెదిరించారు. మీపై అనుమానంగా ఉందని చెప్పి పడుగుపాడు స్టేషన్ సమీపంలో రైలు నెమ్మదిగా వెళుతున్న సమయంలో ఇద్దరు వ్యాపారులను కిందకు దించారు. వారిని నెల్లూరు ఆత్మకూరు బస్టాండు వద్దకు తీసుకెళ్లారు. అక్కడ నుంచి అంబాసిడర్ కారును బాడుగకు తీసుకుని, దగదర్తి మండలం దామవరం వద్ద వ్యాపారులను వదిలేశారు. అక్కడ నుంచి నలుగురు వ్యక్తులు వెళ్లిపోయారు. బంగారు వ్యాపారులు కావలి ఒకటో పట్టణ పోలీసులను ఆశ్రయించారు. దీంతో వారు విచారణ చేపట్టి వారు ప్రయాణించిన అంబాసిడర్ కారును స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ప్రకాశం జిల్లా కనిగిరి వద్ద ఓ కారులో వెళ్తుండగా వారిని వెంబడించి ముగ్గురు నిందితులను పట్టుకున్నారు. స్టువర్టుపురానికి చెందిన మరో నిందితుడు పరారయ్యాడు. పోలీసుల అదుపులో ఉన్న ముగ్గురు ప్రకాశం జిల్లా ఒంగోలు, చీరాలకు చెందిన ఏఆర్‌కానిస్టేబుళ్లుగా అనుమానిస్తున్నారు. కేసు దర్యాప్తులో ఉంది.