ఇన్ఫోసిస్ వ్యవస్థాపకులు ఎన్ఆర్ నారాయణ మూర్తి వారానికి 70 గంటలు పని చేయాలని చెప్పినప్పటి నుండి, జనం ఈ విషయంలో రెండు వర్గాలుగా విడిపోయినట్లు కనిపిస్తోంది. కార్మికవర్గం దీనిని సరైనదిగా భావించడం లేదు. అయితే యాజమాన్యం దీనిని సమర్థించుకునేందుకు భిన్నమైన వాదనలు వినిపిస్తోంది. అయితే ఈ రోజు మనం.. దేశంలోని ఏ రాష్ట్రంలోని ప్రజలు అధిక గంటలు పని చేస్తున్నారు? అత్యధిక వేతనం పొందుతున్నవారెవరు? అనే విషయాలను తెలుసుకుందాం.
మీడియా దగ్గరున్న సమాచారం ప్రకారం ఉత్తరాఖండ్ ప్రజలు గరిష్టంగా 9.6 గంటలు పని చేస్తున్నారు. ఈ విషయంలో తెలంగాణ రెండో స్థానంలో ఉంది. తెలంగాణలో సగటు ఉద్యోగి రోజుకు 9.2 గంటలు పనిచేస్తున్నాడు. గుజరాత్, మహారాష్ట్ర మూడు, నాలుగు స్థానాల్లో ఉన్నాయి. ఈ రాష్ట్రాల్లో ప్రతి ఉద్యోగి రోజూ సగటున 9 గంటలు పని చేస్తున్నాడు. అయితే తక్కువ పనిగంటల విషయానికొస్తే దేశంలోని మణిపూర్ మొదటి స్థానంలో ఉంది. సగటున ఇక్కడి ప్రజలు ప్రతిరోజూ 6 గంటలు పని చేస్తారు.
ఏ రాష్ట్రంలోని ప్రజలు ఎన్ని గంటలు పనిచేస్తున్నారో తెలుసుకున్నాం. ఇప్పుడు ఏ రాష్ట్ర ప్రజలు అత్యధిక జీతం పొందుతున్నారో తెలుసుకుందాం. 2022వ సంవత్సరంలో ఆర్‌బీఐ దీనికి సంబంధించిన గణాంకాలను విడుదల చేసింది. వీటి ప్రకారం కేరళ ప్రజలు దేశంలోనే అత్యధిక జీతం పొందుతున్నారు. ఇక్కడ తలసరి వార్షిక ఆదాయం రూ.1,94,767. వేతనాల గురించి చెప్పాలంటే ఇక్కడి కార్మికులకు రోజువారీ వేతనం రూ.838. కాగా హర్యానా, పంజాబ్‌లు ఈ విషయంలో చాలా వెనుకబడి ఉన్నాయి.
ఇది కూడా చదవండి: యురేనస్ మీద ఐదు సెకెన్లు ఉండగలిగితే?
Comments
Please login to add a commentAdd a comment