Sir Isaac Newton
-
ప్రపంచం అంతమయ్యేది అప్పుడే..! వెలుగులోకి న్యూటన్ లేఖ..
ఇంతవరకు ప్రపంచం అంతం ఫలానా టైంలో అంటూ ఏవేవో పుకార్లు హల్చల్ చేశాయి. వాటిపై సినిమాలు కూడా వచ్చాయి. కానీ అది నిజంగా ఎప్పుడని చెప్పేందుకు కచ్చితమైన ఆధారాలు కానరాలేదు. తాజాగా సరిగ్గా ఆ ఏడాదిలోనే ప్రపంచం అంతం అని చెప్పేందుకు ఆధారాలు వెలుగులోకి వచ్చాయి. అది కూడా సర్ హైజాక్ న్యూటన్ పరిశోధనలో బహిర్గతమవ్వడం విశేషం. నిజానికి దాన్ని ఆ శాస్త్రవేత్త ఎలా నిర్థారించారనేది కూడా పరిశోధనలో వివరించారు.చలనం, గురుత్వాకర్షణ నియమాలను రూపొందించడంలో ప్రసిద్ధి చెందిన సర్ ఐజాక్ న్యూటన్ 1704లో రాసిన ఓ లేఖలో ఈ విషయాన్ని వెల్లడించారు. ఇలా ప్రపంచం అంతం అవ్వడాన్ని ముందుగా అంచనా వేయడాన్ని డూమ్స్‌డే సిద్ధాంతం లేదా ప్రవచనం అని అంటారు. ఇక న్యూటన్ తన డూమ్స్‌డే ప్రవచనాన్ని బైబిల్ పొటెస్టంట్ వివరణ, బైబిల్ చరిత్ర తర్వాత జరిగిన సంఘటనలు, ఆర్మగెడానా యుద్ధం ఆధారంగా ఆ విషయాన్ని నిర్థారించినట్లు లేఖలో పేర్కొన్నారు. తాను చెప్పిన ఏడాది కంటే ముందే ప్రపంచం ముగిసిపోతుంది అనడానికి ఎలాంటి కారణాలు కనిపించడం లేదని ఆ లేఖలో తెలిపారు. ఇది కేవలం అంత్య సమయం అంచనా వేయడానికే గాక ఊహజనిత వ్యక్తుల తొందపాటు ఊహలను ఆపడం, వారి అంచనాలు సరైన కావని తేల్చి చెప్పేందుకే ఇలా దీనిపై పరిశోధన చేసి మరి గణించినట్లు లేఖలో వివరించారుఅదంతా 150 నవల నిడివి గల పుస్తకాల్లో పొందుపరిచినట్లు తెలిపారు. దానిలోని 1260, 1290, 2300 రోజుల సంఖ్యను ఉపయోగించి ఏ ఏడాది అంతమవుతుందనేది నిర్ణయించాడు న్యూటన్. దీనిలోని కొన్ని ముఖ్యమైన క్షణాల ముగింపు, ప్రారంభాన్ని సూచిస్తాయి. ఆ రోజులను సంవత్సరాలుగా నిర్ణయించాడు. తత్ఫలితంగా 800 ADని చర్చిని వదిలివేయడం అధికారికంగా ప్రారంభమైన తేదీగా నిర్ణయించారు. అదే పవిత్ర రోమన్ సామ్రాజ్యం స్థాపించబడిన సంవత్సరం. అంటే ప్రపంచం ఆరంభమైన 1,260 సంవత్సరాలకు మళ్లీ రీసెట్ అవుతుందని లేఖలో తెలిపారు. ఆదిమ సంవత్సర క్యాలెండర్ ప్రకారం పన్నెండు నుంచి ఒక సంవత్సరం ముప్పే రోజుల నుంచి ఒక నెల వరకు లెక్కడించడం జరుగుతుందని లేఖలో పేర్కొన్నారు.స్వల్పకాలిక జంతువుల రోజులను జీవించిన రాజ్యాల సంవత్సరాలకు గుర్తుగా ఉంచారు. 1260 రోజుల కాలం, ముగ్గురు రాజులు AC 800 పూర్తి విజయం సాధించిన తేదీలుగా నిర్ణయిస్తే ముగింపు కాలం ఏసీ 2060తో ముగుస్తుందట.ఇలాంటే డూమ్స్ డే అంచనాలను వేసిన ఏకైక వ్యక్తి న్యూటన్ మాత్రమే కాదు 1500 లలో నివసించిన ఫ్రెంచ్ జ్యోతిష్కుడు నోస్ట్రాడమస్, 2025 లో ఒక పెద్ద గ్రహశకలం భూమిని ఢీకొట్టవచ్చని లేదా గ్రహానికి ప్రమాదకరమైన సామీప్యతలోకి రావచ్చని అంచనా వేశారు.(చదవండి: కొత్త.. రుచుల కోకా కట్టుకున్నదీ పేట..) -
పారిశ్రామిక విప్లవానికి పునాది
నిజానికి శాస్త్రవేత్త అంటే న్యూటన్ మాత్రమే అనేంత ప్రచారం ఉంది! చెట్టు మీద నుంచి ఆపిల్ పడటం అనే కథకుండే ఆకర్షణ కారణంగా న్యూటన్‌కు అంత గ్లామర్ నడుస్తోంది. కేంబ్రిడ్జిలో జరిగిందని చెప్పే ఈ వృత్తాంతం గురించి న్యూటన్ మహాశయుడు ఎక్కడా పేర్కొనక పోవడం గమనార్హం. అయితే ఆయన కేంబ్రిడ్జిలో చదువుతున్నప్పుడే జోహన్నెస్ కెప్లర్ వివరించిన సూర్యుడు, భూమి గమనాల గురించి లోతయిన విషయాలు అవగతం చేసుకున్నారు. అంటే గురుత్వాకర్షణ భావనను పూర్తిగా పట్టుకున్నది కేంబ్రిడ్జిలోనే. కనుక ఈ ‘ఊహాత్మక యాపిల్’ వ్యవహారం దీనితో ముడిపడిందేమో! 1642 క్రిస్మస్ రోజున అర్ధరాత్రి తర్వాత ఐజాక్ న్యూటన్ ఇంగ్లాండులో జన్మించారు. అదే సంవత్సరంలో నెలల క్రితమే ప్రాయోగిక విజ్ఞానానికి శ్రీకారం చుట్టిన శాస్త్రవేత్త గెలీ లియో గెలీలి చనిపోవడం ఒక చారిత్రక విశేషం. గెలీలియో, న్యూటన్ కృషి అవిభాజ్యమైనదిగా పరిగణించారు అల్బర్ట్ ఐన్‌స్టీన్. ఎవరు ఎలా పరిగణించినా తను మాత్రం విజ్ఞాన సముద్రం చెంత ఇసుకలో బుల్లిగవ్వలు, ముచ్చటైన శంఖాలు ఏరుకొనే పిల్లవాడినని న్యూటన్ మరో సందర్భంలో చెప్పడం గమనించాలి. గెలీలియో వంటి వారు ప్రతిపాదించిన భావనలను ఎంతో ప్రతిభావంతంగా ‘మెకా నిక్స్’ అనే ఫిజిక్స్ చట్రంలో తన సూత్రీకరణతో అమర్చిన సూక్ష్మమేధావి, ఆలోచనాశీలి న్యూటన్. కాంతి, ఉష్ణం, దృశా శాస్త్రం, కలనగణితం, గురుత్వాకర్షణ సిద్ధాంతం ఇలా విస్తృత మైన కృషి చేసినవారు న్యూటన్. బాలుడిగా చాలా పరికరాలతో ఆడుకుంటూ, కొత్తవి తయారు చేస్తూ ఉండేవాడు. చదువులో పెద్దగా ప్రతిభా వంతుడిగా చిన్నతనంలో కనిపించకపోయినా తర్వాత దశలో ఆశ్చర్యకరంగా ఎదిగి 26 సంవత్సరాలకే గణితశాస్త్ర ఆచార్యు డయ్యాడు. ధనాగారం అధిపతిగా సేవలందించి, శాస్త్ర పరి జ్ఞానంతో దొంగలను పట్టారు. 1703లో రాయల్ సంస్థకు అధ్యక్షుడుగా ఎన్నికయి, చివరివరకు ఆ పదవిలో కొన సాగారు. 1668లో మెర్కర్ రాసిన సంగతులన్నీ తను అంతకు ముందే కనుగొన్నట్టు న్యూటన్‌కు అనిపించింది. గ్రంథకర్త అయిన తన పేరు లేకుండా తన గణితశాస్త్ర పరిశీలనలను రాసి లండన్, యూరప్ ప్రముఖులకు పంపారు. వారి ఆమోదం పొందాక ఆ పరిశీలనలు పుస్తకంగా వెలువడి, మంచి పేరు తెచ్చాయి. కటకాల గురించి ఆయన చేసిన పరిశోధనలు కళ్ళ జోళ్ళు, దూరదర్శినులు మెరుగు కావడానికి తోడ్పడ్డాయి. రాయల్ సొసైటీలో చేరిన తర్వాత మరో శాస్త్రవేత్త రాబర్ట్ హుక్ బెడద ఎక్కువయ్యింది. అతని నోరు మూయిం చడానికి 1686 ఏప్రిల్ 28న ప్రఖ్యాతమైన పుస్తకం ‘ప్రిన్సిపియా మేథమెటికా’ వెలువడింది. తన కాంతి కణ సిద్ధాంతాన్ని విభేదించి హెగెన్స్ ‘తరంగ సిద్ధాంతం’ వచ్చినా అది ప్రాచుర్యంలోకి రాలేదు. 1727 మార్చి 20న కనుమూసిన న్యూటన్ కృషి కారణంగానే ఓడల ప్రయాణం, వంతెనల నిర్మాణం సులువు కావడమే కాదు; పారిశ్రామిక విప్లవానికి తెరలేచింది. న్యూటన్ వల్లనే వంద సంవత్సరాల లోపు జేమ్స్ వాట్ ఆవిరి యంత్రం ఆవిష్కరించగలిగారు! - డా. నాగసూరి వేణుగోపాల్ వ్యాసకర్త ఆకాశవాణి పూర్వ సంచాలకులు -
రెండో గమన సూత్రాన్ని న్యూటన్ కనుక్కోలేదు!
షిమ్లా: ప్రఖ్యాత శాస్త్రవేత్త సర్ ఐజాక్ న్యూటన్ ప్రతిపాదించిన గమన సూత్రాలలో లోపాలున్నాయని భారతీయ పరిశోధకుడు అజయ్ శర్మ వెల్లడించారు. ద్రవ్యరాశి, వేగానికి సంబంధించిన న్యూటన్ రెండో గమనసూత్రం(ఎఫ్ఎంఏ)ను వాస్తవానికి ఆయన కనుక్కోనే లేదని శర్మ స్పష్టం చేశారు. న్యూటన్ 1686లో రచించిన ‘ప్రిన్సిపా’ పుస్తకాన్ని నిశితంగా అధ్యయనం చేయగా ఎఫ్ఎంఏను కనుగొన్నవారు ఎవరో తెలియదన్న విషయం స్పష్టమైందని శర్మ ఈ మేరకు తాను రాసిన ‘బియాండ్ న్యూటన్ అండ్ ఆర్కిమెడిస్’ గ్రంథంలో పేర్కొన్నారు. ఎఫ్ఎంఏ సూత్రాన్ని ఇచ్చినవారెవరో ఇప్పటిదాకా తెలియదని, భవిష్యత్తు తరాలకు వాస్తవం చెప్పాల్సిన అవసరం ఉన్నందున ఆ మేరకు ప్రపంచంలోని 220 దేశాల పాఠ్యపుస్తకాలన్నింటిలోనూ మార్పులు చేయాలన్నారు. న్యూటన్ రెండో గమనసూత్రంలో లోపాలున్నాయంటూ ఆయన తన పుస్తకంలో ఉదహరణనిచ్చారు. ఒక కుర్రాడు రబ్బరు బంతిని, గుడ్డ బంతిని 2ఎన్(న్యూటన్)ల బలంతో గోడకు కొట్టినప్పుడు రబ్బరు బంతి 10 మీటర్లు వెనక్కి వస్తే, గుడ్డ బంతి 5 మీటర్లు మాత్రమే వెనక్కి వస్తుందని పేర్కొన్నారు. అందువల్ల చర్యకు ప్రతిచర్య ఉన్నా, అన్నిసార్లూ అవి రెండూ సమానమే కావల్సిన అవసరంలేదని వివరించారు. హిమాచల్ ప్రదేశ్ విద్యాశాఖలో అసిస్టెంట్ డెరైక్టర్ అయిన అజయ్ శర్మ(50) 31 ఏళ్లుగా ప్రాథమిక సూత్రాలపై పరిశోధనలు సాగిస్తున్నారు. శర్మ రాసిన ‘బియాండ్ న్యూటన్ అండ్ ఆర్కిమెడిస్’ పుస్తకాన్ని నిపుణులు ఏడు నెలలపాటు పరిశీలించి నిపుణులు పచ్చజెండా ఊపాకే ‘కేంబ్రిడ్జి ఇంటర్నేషనల్ సైన్స్ పబ్లిషింగ్’ సంస్థ దానిని అక్టోబరు 28న ప్రచురించింది.