Sahara desert
-
సహారాకు కొత్త అందం!
ఆఫ్రికా ఖండంలోని సహారా ఎడారిలో వర్షం కురిసింది. అదీ భారీగా. రెండు రోజులపాటు కురిసిన వానకు అక్కడి ఇసుక తిన్నెల స్వరూపమే మారిపోయింది. హఠాత్తుగా ఆ ప్రాంతంలో పెద్దపెద్ద సరస్సులు వెలిశాయి. ఒయాసిస్‌ల వద్ద ఉండే చెట్ల ప్రతిబింబాలు వాన నీటిలో చూపరులకు కనువిందు చేస్తున్నాయి. దశాబ్దాల కాలంలో కురిసిన అతి భారీ వర్షం ఇదేనని అక్కడి వారు సంబరపడుతున్నారు. సాధారణంగా సహారాలో ఏడాదిలో అదీ వేసవిలో కొద్దిపాటి వాన కురుస్తుంది. కానీ, మొరాకో ఆగ్నేయాన ఉన్న సహారాలో అల్ప పీడనం కారణంగా రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురిశాయి. ఈ ప్రాంతంలో కొన్ని చోట్ల అతిభారీగా కూడా వానలు కురిశాయని నాసా ఉపగ్రహ చిత్రాలు వెల్లడిస్తున్నాయి. మొరాకాలో వాయవ్య నగరం ఇర్రాచిడియాలో ఏడు సెంటీమీటర్లకు పైగా వర్షపాతం నమోదైందని అధికారులు తెలిపారు. సెపె్టంబర్లో సాధారణంగా కురిసే వర్షపాతానికి ఇది ఏకంగా నాలుగు రెట్లు. అంతేకాదు, ఆ ప్రాంతంలో ఆరు నెలల్లో కురిసే వర్షపాతానికి ఇది సమానం. ఇంత తక్కువ సమయంలో ఈ స్థాయిలో వర్షాలు కురియడం 30–50 సంవత్సరాల కాలంలో ఇదే మొదటిసారని మొరాకో వాతావరణ అధికారి హొస్సేన్ చెప్పారు. దీంతో, ఎడారి ఇసుక తిన్నెలు, అక్కడక్కడ పెరిగే మొక్కలు, ఖర్జూర చెట్లు కొత్త ప్రకృతి అందాలను సంతరించుకున్నాయి. మెర్జౌగా ఎడారి పట్టణంలో అరుదైన ఇసుక తిన్నెల్లోకి భారీగా చేరిన వరద కొత్త సరస్సులను సృష్టించింది. మొరాకోలోని అతిపెద్ద నేషనల్ పార్క్‌గా ఉన్న ఇరిఖి నేషనల్ పార్క్‌లో ఇంకిపోయిన చెరవులు మళ్లీ నిండాయి. కొన్ని చోట్ల పచి్చక బయళ్లు అవతరించాయి. అంతగా జనం ఉండని ప్రాంతాల్లోనే ఎక్కువగా వానలు కురిశాయి. ఇక్కడ ఎలాంటి నష్టం జరగలేదు. అయితే, ఒక్కసారిగా కురిసిన భారీ వర్షాలతో పట్టణాలు, గ్రామాల్లో పదుల సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. వాతావరణ విపరీత మార్పులే ఈ పర్యవసానాలకు కారణమని నిపుణులు అంటున్నారు. వాతావరణం మరింతగా వేడెక్కితే మున్ముందు ఇక్కడ మరింతగా వర్షాలకు కురిసే అవకాశాలున్నాయని చెబుతున్నారు. దాదాపు 36 లక్షల చదరపు మైళ్ల విస్తీర్ణంలో విస్తరించిన ఉన్న సహారా ప్రపంచంలోనే అతి పెద్ద ఎడారి. –నేషనల్ డెస్క్, సాక్షి -
50 ఏళ్లలో తొలిసారి సహారా ఎడారిలో వరదలు.. ఫోటోలు వైరల్
ప్రపంచంలోనే అతిపెద్ద ఎడారి సహారాలో అత్యంత అరుదైన దృశ్యం కనిపించింది. ఉత్తర ఆఫ్రికాలోని మొరాకోలో రెండు రోజులపాటు కురిసిన భారీ వర్షాలకు సహారా ఎడారిలోని కొన్ని ప్రాంతాల్లో వరద నీరు ప్రవహించింది. ఆగ్నేయ మొరాకోలోని ఎడారి ప్రాంతంలో వర్షం పడడమంటే చాలా అరుదైన ఘటన. మొరాకో ప్రభుత్వ సమాచారం మేరకు సెప్టెంబరులో రెండురోజుల పాటు కురిసిన వర్షం.. చాలా ప్రాంతాల్లో ఏడాది సగటును మించిపోయింది.ఇక్కడ ఏటా 250 మి.మీ. కంటే తక్కువగా సగటు వర్షపాతం నమోదవుతుంటుందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. రాజధాని రబత్కు 450 కి.మీ. దూరంలోని టాగౌనైట్ గ్రామంలో 24 గంటల్లోనే 100 మి.మీ. కంటే ఎక్కువ వర్షం కురిసిందని.. ఇది అత్యంత అరుదైన పరిణామమని పేర్కొన్నాయి. జాగోరా, టాటా మధ్య 50 ఏళ్లుగా పాటు పొడిగా ఉన్న ఇరికీ సరస్సు వరద కారణంగా తిరిగి నిండినట్లు నాసా తీసిన ఉపగ్రహ చిత్రాల్లో వెల్లడవుతోంది. గత 30 నుంచి 50 సంవత్సరాల నుంచి ఇంత తక్కువ సమయంలో ఇంత ఎక్కువ వర్షాలు కురవడం ఇదే తొలిసారి అనిి మొరాకో వాతావరణ సంస్థ అధికారి హౌసీన్ యూబెబ్ పేర్కొన్నారు. కాగా గత నెలలో మొకరాలో సంభవించిన వరదలు 18 మందిని బలిగొన్నాయి.ఇక సహారా ఎడారి, ఉత్తర, మధ్య మరియు పశ్చిమ ఆఫ్రికా అంతటా 9 మిలియన్ చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో విస్తరించి ఉంది. గ్లోబల్ వార్మింగ్ కారణంగా తీవ్రమైన వాతావరణ వేడిని ఎదుర్కొంటోంది. భవిష్యత్తులో ఈ ప్రాంతంలో ఈ తరహా తుఫానులు మరింత తరచుగా వచ్చే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. -
సహారాలో పచ్చందనం
సహారా. ప్రపంచంలోనే అతి పెద్ద ఎడారి. కనుచూపుమేర సుదూరాల దాకా పరుచుకున్న ఇసుక మేటలు. ఏళ్ల తరబడి వాన ఆనవాలు కూడా కనిపించని ప్రదేశాలకు ఆలవాలం. అలాంటి సహారా పచ్చబడుతోంది. నీళ్లు నిండిన మడుగులు, పచ్చని గడ్డితో, అప్పుడప్పుడే ప్రాణం పోసుకుంటున్న పలు జాతుల మొక్కలతో కనువిందు చేస్తోంది...! వాతావరణ మార్పులు సహారాను కూడా వదలడం లేదు. పశి్చమ ఆఫ్రికాలోని ఈ ఎడారిలో అరుదైన దృశ్యాలు కనిపిస్తున్నాయి. భారీ వర్షాలు ఈ ప్రాంతాన్ని కొద్ది రోజులుగా ముంచెత్తుతున్నాయి. అసలు వాన చినుకే పడని ప్రాంతాలు కూడా కుండపోతతో తడిసి ముద్దగా మారుతున్నాయి. దాంతో సహారాలో విస్తారంగా గడ్డి మొలుస్తోంది. పలు రకాల మొక్కలు పుట్టుకొస్తున్నాయి. ఏకంగా అంతరిక్షం నుంచి నాసా తీసిన తాజా చిత్రాల్లో ఎడారిలోని విస్తారమైన ప్రాంతం ఆకుపచ్చగా కనిపిస్తోందంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు! చాద్ రిపబ్లిక్, సూడాన్, ఎరిత్రియా, మాలి, నైగర్ వంటి పలు దేశాల్లో సహారాలోని విస్తారమైన ప్రాంతం పచ్చని కళ సంతరించుకుని కనిపిస్తోంది. భారీ వర్షాలు సహారాలోని పలు ప్రాంతాలను భారీ వర్షాలు ముంచెత్తాయి. ముఖ్యంగా సెపె్టంబర్ 7, 8 తేదీల్లో కుండపోత కురిసింది. ఆ ప్రాంతాల్లో సాధారణంగా కొన్నేళ్లలో పడాల్సిన వాన కేవలం ఆ రెండు రోజుల్లోనే నమోదైంది. దాంతో ఎన్నడూ నీటి ఆనవాళ్లకు కూడా నోచుకోని విస్తారమైన ఇసుక మేటలు కాస్తా కొలనులుగా మారి ఆశ్చర్య పరుస్తున్నాయి. ఇంటర్ ట్రాపికల్ కన్వర్జెన్స్ జోన్ (ఐటీసీజెడ్)లో మార్పులే దీనికి కారణమని పర్యావరణ నిపుణులు చెబుతున్నారు. వర్షాకాలంలో ఆఫ్రికాలోని ఉష్ణమండల గాలులు ఉత్తర దిశ నుంచి వచ్చే పొడి గాలితో భూమధ్యరేఖ సమీపంలో కలుస్తుంటాయి. ఫలితంగా తుపాన్లు, భారీ వానలు ఏర్పడే ప్రాంతాన్నే ఐటీసీజెడ్గా పిలుస్తారు. ఈ సీజన్లో ఇది సహారా ఎడారికి సమీపంగా జరిగింది. వానలు, వరదలకు కారణమయ్యే లా నినా పరిస్థితులు ఇందుకు తోడయ్యాయి. ఈ విపరీతమైన వాతావరణ పరిస్థితుల కారణంగా సహారా పరిధిలోని పలు ప్రాంతాల్లో రెండు నుంచి ఆరు రెట్లు ఎక్కువ వర్షపాతం నమోదైంది. దాంతో పలు దేశాల్లో 40 లక్షల మందికి పైగా తీవ్రంగా ప్రభావితులయ్యారు. వెయ్యికి పైగా మరణాలు సంభవించాయి. 21 వేల ఏళ్లకోసారి... సహారా ఎడారి ప్రతి 21 వేల ఏళ్లకోసారి పూర్తిగా పచ్చదనం సంతరించుకుంటుందట. విస్తారమైన అడవులు, నదులు, సెలయేళ్లు, గుట్టలతో కళకళలాడుతూ ఉంటుందట. కొన్ని వేల ఏళ్లపాటు ఇలా సాగాక తీవ్ర వాతావరణ మార్పుల కారణంగా మళ్లీ విస్తారమైన ఇసుక మేటలతో ఎడారిగా మారిపోతుంది. ఒక్క చివరి మంచు యుగాన్ని మినహాయిస్తే గత 8 లక్షల ఏళ్లుగా ఇది క్రమం తప్పకుండా జరుగుతూ వస్తోందని సైంటిస్టులు తేల్చారు. భూ అక్షంలో 21 వేల ఏళ్లకు ఒకసారి కలిగే స్వల్ప మార్పులే ఇందుకు కారణమని గతేడాది జరిగిన ఒక అధ్యయనం తేలి్చంది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
ఈ ఫోటోలో కనిపిస్తున్నది రాయి మాత్రం కాదు! అది ఏంటంటే..
ఈ ఫొటోలో కనిపిస్తున్న రాయి ఒక గ్రహశకలం. ఇటీవల ఇది సహారా ఎడారిలో దొరికింది. అప్పుడప్పుడు పలుచోట్ల గ్రహశకలాలు నేల మీదకు రాలిపడటం మామూలే! ఇందులో విశేషమేమిటంటారా? ఇది మొట్టమొదటి బూమరాంగ్ గ్రహశకలమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. గ్రహశకల ప్రభావం కారణంగా దాదాపు పదివేల ఏళ్ల కిందట ఇది భూమి నుంచి విడివడి అంతరిక్షానికి తుళ్లిపోయిందని, మళ్లీ అక్కడి నుంచి నేల మీదకు రాలిపడిందని వారు చెబుతున్నారు. ఈ గ్రహశకలానికి శాస్త్రవేత్తలు ‘ఎన్డబ్ల్యూఏ 13188’ అని పేరుపెట్టారు. దీనిపై ఫ్రాన్స్‌లోని మార్సిలే యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్తలు పరిశోధనలు జరుపుతున్నారు. ఈ శిలలో భూఉపరితలానికి చెందిన పదార్థాలే ఉన్నాయని, ఇది అగ్నిపర్వతానికి చెందిన శిల అని వారు వెల్లడించారు. గ్రహశకలాల అన్వేషకులు కొందరు దీనిని 2018లో మొరాకోలోని సహారా ఎడారి ప్రాంతంలో కనుగొన్నారు. ఇది శాస్త్రవేత్తలకు చేరడంతో, వారు దీనిపై సుదీర్ఘ పరిశోధనలు జరిపి, ఇది భూమ్మీద దొరికిన మొట్టమొదటి ‘బూమరాంగ్ గ్రహశకలం’ అని ప్రకటించారు. (చదవండి: నీటిలోని కాలుష్యాన్ని క్లీన్ చేసే.." మైక్రో రోబోలు") -
Mahasweta Ghosh: ఎడారి చిరుత
ప్రపంచంలో అత్యంత కష్టమైన మారథాన్ ‘సహారా మారథాన్’. ఆరు రోజుల పాటు సహారా ఎడారిలో 250 కిలోమీటర్లు నడవాలి. ఒక్క ఒయాసిస్సు కూడా తగలని ఈ దారిలో ప్రాణం కూడా పోవచ్చు. ఇంతటి ప్రమాదకరమైన పోటీలో భారతీయ మహిళ మహాశ్వేతా ఘోష్ మొదటిసారి పాల్గొని మారథాన్ పూర్తి చేసింది. ఆమె పరిచయం. ‘మారథాన్ దెస్ సేబుల్స్’ లేదా ‘మారథాన్ ఆఫ్ ది శాండ్స్’ లేదా ‘సహారా మారథాన్’లో పాల్గొనేవారి ధైర్యం ఏమిటో? మామూలుగా ఎండలో నడవడమే కష్టం. అలాంటిది ఎడారి ఎండలో నడవడం సామాన్యమా? మామూలు నేల మీద ఎక్కువసేపు నడవడం కష్టం. ఇక ఎడారి ఇసుకలో ఎక్కువ సేపు నడవడం సాధ్యమా? 44 ఏళ్ల మహాశ్వేతా ఈ అసాధ్యమైన మారథాన్‌ను పూర్తి చేయగలిగింది. అలా చేసిన తొలి భారతీయ మహిళగా రికార్డు స్థాపించింది. ఏప్రిల్ చివరి వారంలో మొదలయ్యి మే 1న ఈ మారథాన్ పూర్తయ్యింది. ఎడారిలో సాహసవంతులు ‘మారథాన్ ఆఫ్ ది శాండ్స్’ 1986 నుంచి మొదలయ్యింది. 1984లో పాట్రిక్ బ్యూయెర్ అనే ఫ్రెంచ్ వ్యక్తి మొరాకోలోని సహారా ఎడారిలో 12 రోజుల పాటు ఒక్కడే 250 కిలోమీటర్లు ప్రయాణించాడు. అతడు ప్రయాణించిన దారిలో ఒక్క ఒయాసిస్సు కూడా లేదు. ఎడారి తండాలు కూడా కనిపించలేదు. అంటే ఈ దారి అల్ట్రా మారథాన్‌కు అనువైనదని భావించి రెండేళ్ల తర్వాత ఈ మారథాన్‌ను మొదలెట్టాడు. అయితే 2009 నాటికిగాని ఇది ఊపందుకోలేదు. ఆ సంవత్సరం వెయ్యి మంది సహారా మారథాన్‌లో పాల్గొన్నారు. అడుగడుగునా సవాళ్లు 2023లో మారథాన్ ఆఫ్ ది శాండ్స్ ఏప్రిల్ చివరి వారంలో మొదలయ్యింది. భారతదేశం నుంచి మహాశ్వేతా ఘోష్ మాత్రమే హాజరయ్యింది. అనేక దేశాల నుంచి మొత్తం 1200 మంది పోటీదారులు వచ్చారు. ‘మా అందరికీ 11 కిలోల బరువున్న బ్యాక్ ప్యాక్ మాత్రమే అనుమతించారు. రోజుకు 12 లీటర్ల నీళ్లు నిర్వాహకులు సప్లై చేశారు. అంతకుమించిన నీరు దొరకవు. ఎవరి ఆహారం వారు తినాలి. మారథాన్‌లో పెద్దగా స్నేహాలు ఏర్పడవు. పోటీ కాబట్టి ఎవరి లక్ష్యంలో వారు నడుస్తుంటారు. ఎడారి దారిలో 40 డిగ్రీల నుంచి 50 డిగ్రీల వరకూ ఉండే ఎండలో నడవడం అంటే మాటలు కాదు. మాకు ప్రతిరోజూ లక్ష్యం ఇస్తారు. అంటే రోజుకు 70 నుంచి 90 కిలోమీటర్ల లక్ష్యానికి చేరుకోవాలి. ఇచ్చిన సమయంలో నిర్దేశిత దూరానికి చేరుకోలేకపోతే అక్కడితో వారు పోటీ నుంచి డిస్క్వాలిఫై అయిపోతారు. నేను ఎలాగైనా ఈ మారథాన్ పూర్తి చేయదలిచాను. అందుకే ఏ రోజు కూడా నిర్దేశిత గమ్యాన్ని తప్పలేదు. చాలామంది మధ్యలోనే ఆగిపోయారు’ అని తెలిపింది మహాశ్వేతా. పోహా, ఓట్స్ ‘నేను మారథాన్ సాగిన ఆరు రోజులు హల్దీరామ్ డిహైడ్రేటెడ్ దాల్ చావల్, రెడీ టు ఈట్ పోహా, న్యూట్రిబార్స్, చాక్లెట్లు, డ్రై ఓట్స్ తిన్నాను. తల మీద సోలార్ హ్యాట్, కూలింగ్ గ్లాసెస్, స్ట్రోలింగ్ స్టిక్స్, భుజాన బ్యాగ్‌తో మన నడక కొనసాగాలి. చివరిరోజు చివరి దశలో పరుగు తీయాలి. ఎండ మన సహనాన్ని పరీక్షిస్తుంది. డీ–హైడ్రేట్ కాకుండా చూసుకో వాలి. చాలామంది తల మీద నీళ్లు పోసుకుంటారు. అలా పోసుకోవడం వల్ల వేడి ఇంకా పెరుగుతుంది. కేవలం మెడ, ముఖం తడుపుకుంటూ ముందుకు సాగాలి. గుడారంలో రాత్రిపూట విశ్రాంతిలో భాగ్ మిల్కా భాగ్‌లోని స్ఫూర్తిగీతం వినేదాన్ని’ అని చెప్పిందామె. భ్రాంతుల నుంచి ‘ఎడారిలో భ్రాంతులు ఎక్కువ. వాటి మాయలో పడ్డామంటే చిక్కుల్లో పడతాం. ఈ ఎడారిలో నీకు ఎప్పటికీ నీళ్లు కనిపించవు. కనిపించే నీళ్లను నమ్మకు అని నా మనసుకు చెప్పుకున్నాను. ఏమంటే చాలాసార్లు ఎండమావులు కనిపిస్తాయి. షూస్‌లో ఇసుక దూరకుండా నడవడం పెద్ద విద్య. ఇన్ని కష్టాలు పడ్డా అంతిమంగా యాత్ర ముగిస్తే కలిగే ఆనందం నిజంగా జీవితంలో ఒయాసిస్సులా ఉంటుంది’ అందామె నవ్వుతూ. లూజర్స్ స్ఫూర్తి ‘మాది పశ్చిమ బెంగాల్. నేను కాలేజీలో చదివేప్పుడు సన్నబడటానికి నడకను, జాగింగ్‌ను సాధనంగా చేసుకున్నాను. అదే కొనసాగిస్తున్నాను. 2019లో నెట్‌ఫ్లిక్స్‌లోని లూజర్స్ సిరీస్ నాకు మారథాన్ ఆఫ్ శాండ్స్ గురించి తెలియజేసింది. అందులోని ఒక ఎపిసోడ్లో ఒలింపిక్ విజేత మౌరో ప్రాస్పెరీ మారథాన్ ఆఫ్ శాండ్స్ను ఎలా ముగించాడో వివరంగా చూపించారు. నాకు ఛాలెంజింగ్‌గా అనిపించింది. అయితే ఎడారిలో మారథాన్ చాలా కష్టం. అందుకే రాజస్థాన్‌లోని పోఖ్రాన్లో నాకై నేను 75 కిలోమీటర్ల మారథాన్ సాధన చేసి ఈ అతికష్టమైన ఎడారి మారథాన్‌కు సిద్ధమయ్యాను’ అని చెప్పింది మహాశ్వేతా ఘోష్. -
మండే సూర్యుడి నేలను.. మంచు ముద్దాడితే!
ప్రపంచంలోనే అతిపెద్ద ఎడారి. చీకటి ఖండం ఆఫ్రికాలో సుమారు పదకొండు దేశాలతో సరిహద్దును పంచుకుంటూ.. నిప్పు కణికల్లాంటి సూర్య తాపాన్ని ముద్దాడుతున్న నేల. అలాంటి ఇసుక తిన్నెలపై అరుదైన దృశ్యం(అలాగని కొత్తేం కాదు) చోటు చేసుకుంది. మహా ఎడారిని ఆనుకుని ఉన్న అయిన్ సెఫ్రా(అల్జీరియా)లో మంచు కురిసింది. దీంతో ఎర్రటి నేల మీద తెల్ల మంచు దుప్పటి పర్చుకుంది. సహారాలో వేడిమి అధికం. ప్రస్తుతం 58 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదు అవుతోంది. అయితే అల్జీరియా నామా ప్రావిన్స్‌కి ఉత్తరం వైపున ఉన్న అయిన్ సెఫ్రాలో మాత్రం మైనస్ రెండు డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతకు పడిపోవడంతో ఇలా జరిగింది. ఇదిలా ఉంటే అయిన్ సెఫ్రాను సహరా గేట్వేగా అభివర్ణిస్తుంటారు. అట్లాస్ పర్వతశ్రేణుల్లో, సముద్ర మట్టానికి వెయ్యి మీటర్ల ఎత్తులో ఉంటుంది ఈ ప్రాంతం. గత 42 ఏళ్లలో ఇలా జరగడం ఇది ఐదవసారి. 1979, 2016, 2018, 2021లోనూ ఇలా జరిగింది. అయిన్ సెఫ్రాలో వేసవిలో గరిష్ఠంగా 37 డిగ్రీలు, శీతాకాలంలో కనిష్టంగా మైనస్ పది డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదు అవుతుంటుంది. చల్ల గాలులపై ఒత్తిడి ప్రభావంతో ఇలా శీతల పరిస్థితి నెలకొంటుందని వాతావరణ నిపుణులు చెప్తున్నారు. 2018లో ఏకంగా 40సెం.మీ. హిమపాతం నమోదు అయ్యింది ఇక్కడ. -
సహారా ఎడారిలో సౌర విద్యుత్ ఉత్పత్తి .. ఇదంతా అయ్యే పనేనా?
గత కొంతకాలంగా ప్రపంచవ్యాప్తంగా గ్లోబల్ వార్మింగ్ పేరు మార్మోగుతోంది. బొగ్గు, పెట్రోల్, డీజిల్ లాంటి శిలాజ ఇంధనాల వాడకాన్ని తగ్గించాలని శాస్త్రవేత్తలు పదే పదే చెబుతున్నారు. సౌర, పవన, అలల శక్తి లాంటి పునరుత్పాదక ఇంధనాల వాడకం పెంచాలంటున్నారు. మరి ఆ ప్రకారమే విపరీతమైన ఉష్ణోగ్రతలు నమోదయ్యే సహారా ఎడారిని సౌర విద్యుత్ ఉత్పత్తికి వాడుకుంటే? ఎడారంతా సోలార్ ప్యానళ్లు పెట్టేసి కరెంటు ఉత్పత్తి చేస్తే? కనీసం కొంతభాగంలోనైనా ప్యానళ్లు పెడితే? ఇసుకలో ఇదంతా అయ్యే పనేనా? ఒకవేళ అయితే ఎంత విద్యుత్ ఉత్పత్తి చేయగలం? ఎన్ని దేశాలకు సరిపోతుంది? లాంటి ఆసక్తికరమైన విషయాలన్నీ మీ కోసం.. ఇంతకీ ఎడారి విస్తీర్ణమెంత? ప్రపంచంలోని అతి పెద్ద ఎడారి సహారా. ఆఫ్రికాలోని 11 దేశాల్లో విస్తరించి ఉంది. ఒకవేళ సహారా కనుక దేశమైతే ప్రపంచంలోనే ఐదో పెద్ద దేశమయ్యేది. ఈ ఏడారి విస్తీర్ణం 90 లక్షల చదరపు కిలోమీటర్లు. అంటే మన ఇండియాకు మూడింతలు పెద్దది. బ్రెజిల్ కన్నా పెద్దది. చైనాతో పోలిస్తే కాస్త చిన్నది. చదవండి: గంటల్లో దిగిపోయినా మళ్లీ స్వీడన్ పీఠంపై ఆండర్సన్ ప్రపంచానికంతా 254 చ.కి.మీ.లు చాలు సహారా ఎడారి ప్రతి సంవత్సరం 22 బిలియన్ గిగావాట్స్ అవర్ సూర్యశక్తిని గ్రహిస్తుంది. అంటే ప్రతి చదరపు మీటర్‌కు 2 వేల నుంచి 3 వేల కిలోవాట్ అవర్ శక్తి అన్నమాట. సులభంగా అర్థమయ్యేలా చెప్పాలంటే జర్మనీ దేశం పూర్తి విద్యుత్ అవసరాలు తీర్చడానికి సహారాలోని కేవలం 45 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలోని సూర్యశక్తిని వాడుకుంటే చాలు. యూరప్‌లోని 25 దేశాల విద్యుత్ అవసరాలకు 110 చదరపు కిలోమీటర్లు చాలు. ఇక ప్రపంచమంతా కావాల్సిన విద్యుత్ కోసం 254 చదరపు కిలోమీటర్ల ప్రాంతం సరిపోతుంది. 2005 నాటి నడిన్ రీసెర్చ్‌లో ఇవన్నీ వివరించారు. 350 వాట్ల సోలార్ ప్యానళ్లను సహారాలోని 1.2 శాతం ప్రాంతంలో ఏర్పాటు చేయాలంటే 5,100 కోట్ల ప్యానళ్లు కావాలి. ఈ 1.2 శాతం న్యూ మెక్సికో ప్రాంతం విస్తీర్ణంతో సమానం. మొత్తం సహారానే ప్యానళ్లతో కప్పేస్తే? సహారాలో ఏర్పాటు చేసిన ప్యానళ్లన్నీ 20 శాతం సామర్థ్యం వరకే పని చేసినా ఏడాదికి 2,760 ట్రిలియన్ కిలోవాట్ అవర్ విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. ప్రపంచ అవసరాలకు మాత్రం ఏడాదికి 23 ట్రిలియన్ల కిలోవాట్ అవర్ విద్యుత్ సరిపోతుంది. సహారాతో చాలా పెద్ద మొత్తంలో విద్యుత్ ఉత్పత్తి చేయొచ్చు కదా. నిపుణులు కూడా సహారా విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని అంచనా వేశారు. ప్రస్తుత ప్రపంచ అవసరాలకు 4 రెట్లు ఎక్కువగా ఎడారి ఉత్పత్తి చేయగలదని అంటున్నారు. చదవండి: Parag Agrawal: సీఈవోగా చిన్నవయస్సే! కానీ.. మరి ప్యానళ్లు పెట్టడానికి ఇబ్బందేంటి? ఇంతలా సహారాను వాడుకోవచ్చు కదా? మరి విద్యుత్‌ను ఉత్పత్తి చేసేందుకు ఎందుకు ప్రయత్నం చేయట్లేదు? అంటే తొలి కారణం రాజకీయపరమైన చిక్కులు. రెండోది భారీ విస్తీర్ణంలో ఏర్పాటు చేసే సోలార్ ప్యానళ్ల నిర్వహణ కష్టంతో కూడున్నపని. ఇక ఎడారిలో రోడ్లు వేయడమంటే సాహసమే. అయితే ప్రయత్నాలు మాత్రం మొదలయ్యాయి. సహారా వ్యాప్తంగా సోలార్ జనరేటర్ల నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేయాలని డిసర్టిక్ ఫౌండేషన్ ప్రతిపాదించింది. కానీ అందుకు ముందడుగు పడలేదు. అయితే సహారాలో రోడ్లు వేయడం మాత్రం ఆ ఫౌండేషన్ మొదలుపెట్టింది. మనతో పాటు సహారాకూ ప్లస్సే.. సహారాలో భారీ స్థాయిలో సోలార్ ప్యానళ్లు, గాలి ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేసే టర్బైన్లు ఏర్పాటు చేస్తే ఇంకో ఉపయోగం కూడా ఉందండోయ్! మనం గనక ఈ పని చేస్తే ఆ ప్రాంతంలో వర్షపాతం ఎక్కువవుతుందంట. వృక్ష సంపద కూడా 20 శాతం పెరుగుతుందట. – సాక్షి, సెంట్రల్ డెస్క్ -
అమ్మకానికి మూన్‌రాక్.. ధర ఎంతంటే..
లండన్: దాదాపు 13.5 కిలోల బరువు ఉన్న చంద్ర ఉల్క గురువారం అమ్మకానికి వచ్చింది. క్రిస్టీస్‌లో అమ్మకానికి పెట్టిన ఈ మూన్‌రాక్ 2 మిలియన్ పౌండ్లు(2.49 మిలియన్ డాలర్ల) విలువ చేస్తుందని(ప్రాథమిక ధర) అంచనా. భూమి మీద పడిన అతి పెద్ద చంద్ర ఉల్కల పరిమాణంలో ఇది ఐదో స్థానంలో నిలిచింది. ఎన్డబ్ల్యూఏ 12691గా పేరొందిన ఈ ఉల్క.. ఆస్టరాయిడ్ లేదా తోకచుక్కను ఢీకొట్టి సహారా ఎడారి ప్రాంతంలో పడినట్లుగా భావిస్తున్నారు. దీనిని సేకరించిన క్రిస్టీ సంస్థ ప్రైవేటు ప్లాట్‌ఫాంలో అమ్మకానికి పెట్టింది. ఈ విషయం గురించి క్రిస్టీస్ సైన్స్ అండ్ నేచురల్ హిస్టరీ విభాగాధిపతి మాట్లాడుతూ.. ‘‘బాహ్య ప్రపంచానికి చెందిన ఓ వస్తువును చేతుల్లోకి తీసుకున్న అనుభవాన్ని ఎవరూ ఎన్నటికీ మరచిపోలేరు. ఇది చంద్రుడికి సంబంధించినది. ఫుట్‌బాల్ లేదా ఓ మనిషి తల కంటే పెద్ద పరిమాణంలో ఉంటుంది’’ అని పేర్కొన్నారు. అదే విధంగా ఈ ఉల్క 2,40,000 మైళ్ల ప్రయాణం చేసిన తర్వాత భూమిని చేరినట్లు వెల్లడించారు. చంద్రుడిపై పరిశోధనలు జరిపిన సమయంలో అమెరికా అపోలో స్సేస్ మిషన్ సేకరించిన నమూనాలతో ఈ ఉల్కను పోల్చి చూసి.. అది చంద్రుడి ఏ భాగం నుంచి ఊడిపడిందో తెలుసుకునే ప్రయత్నాలు చేయనున్నట్లు పేర్కొన్నారు. ‘‘1960, 70ల్లో అపోలో ప్రోగ్రామ్ ద్వారా 400 కిలోల మూన్రాక్ను తీసుకువచ్చారు. తద్వారా దానిలోని రసాయన, ఐసోటోపిక్ మిశ్రమాలను విశ్లేషించి.. ప్రస్తుత ఉల్కను పోల్చి చూస్తారు’’అని హైస్లోప్ పేర్కొన్నారు. -
సహారాలో మంచు కురిసింది..
-
ఆమె రాకుండానే మంచు కురిసింది...
ఆమె వచ్చింది.. ఎడారిలో మంచు కురిసింది... ఇలాంటి వర్ణనలు కవులకు కామనే.. అయితే...ఇక్కడ ఆమె రాకుండానే మంచు కురిసింది. అదీ ప్రపంచంలోనే అతి పెద్ద ఎడారిగా పేరొందిన సహారాలో.. గత 40 ఏళ్లలో ఇలా జరగడం ఇది మూడోసారట. అల్జీరియాలోని ఇన్సెఫ్రా పట్టణానికి సమీపంలో ఉన్న ఎడారిలో ఆదివారం మంచు కురిసింది. కొన్ని ప్రాంతాల్లో 16 అంగుళాల మందం మేర మంచు పేరుకుందని స్థానికులు తెలిపారు. అయితే వాతావరణంలో నెలకొన్న అసమానతల వల్లే మంచు కురిసినట్లు వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. -
మానవుడి వల్లే ఎడారిగా సహారా!
సియోల్: ఒకప్పుడు పచ్చగా కళకళలాడిన సహారా ప్రాంతం.. ఎడారిగా మారడానికి కారణం మానవుడి చర్యలేనని పరిశోధకులు తెలిపారు. సహారా ఎడారిగా రూపాంత రం చెందడానికి కారణాలను తెలుసు కునేం దుకు గతంలో అనేక పరిశోధనలు జరిగాయి. భూమి కక్ష్యలో మార్పు వల్ల సహారా ఎడారిగా మారి ఉండవచ్చని గతంలో అనేక అధ్యయనాల్లో పేర్కొన్నారు. కానీ అవన్నీ అవాస్తవాలు అని దక్షిణ కొరియాలోని సియోల్ యూనివర్సి టీకి చెందిన పురాతత్వవేత్త డేవిడ్ రైట్ పేర్కొన్నారు. దాదాపు 8 వేల సంవత్స రాల క్రితం నవీన శిలా యుగం సమయంలో ఆదిమ మానవుడు తీసుకొచ్చిన వ్యవసాయ ఆవిష్కరణలు అక్కడి వాతావరణంపై ప్రభావం చూపాయని పేర్కొన్నారు. అక్కడి భూభాగంపై ఉన్న గడ్డి జాతులను పశుగణాల ఆహారం కోసం, తన ఆహారం కోసం అప్పటి ఆదిమ మానవుడు వినియోగించుకున్నా డని తెలిపారు. తద్వారా అక్కడ పచ్చదనం తగ్గిపోయి, వాతావరణం వేడిగా మారి, రుతుపవనాలు లేకపోవడంతో వర్షపాతం తగ్గిపోయిందని తెలిపారు. రుతుపవనాలు బలహీనపడటంతో క్రమక్రమంగా సహారాలో పచ్చదనం అంతరించి, ఎడారిగా రూపాంతరం చెందిందని ఆయన వివరించారు. -
అబ్బురపరిచే అందాన్నిసంతరించుకున్న సహారా
-
ఎడారిపై ఉషోదయ సమయాన...
ఆఫ్రికాలోని సహారా ఎడారి వద్ద ఓ వైపు పట్టపగలు.. మరోవైపు అప్పుడే చీకట్లు తొలగుతున్న సుందర దృశ్యమిది. సహారా ఎడారిలో భాగంగా, దాని మధ్యలో ఉన్న ముర్జక్ ఎడారిపై ఉదయ భానుడి లేత కిరణాలు ప్రసరిస్తున్నప్పుడు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ఐఎస్ఎస్) నుంచి నాసా వ్యోమగామి ఇటీవల ఈ ఫొటో తీశారు. చిత్రంలో కుడివైపు పైన తెల్లగా కనిపిస్తున్న చోట పూర్తిగా తెల్లవారిపోగా.. ముర్జక్ ఎడారి(కిందివైపు మధ్యలో)పై అప్పుడప్పుడే చీకట్లు తొలగుతున్నాయి. సహారా ఎడారిపై చాలాసార్లు మేఘాలు ఎక్కువగా ఆవరించి ఉండకపోవడం వల్ల అంతరిక్షం నుంచి తరచూ ఇలాంటి అందమైన దృశ్యాలు కనువిందు చేస్తాయట. అన్నట్టూ.. ఫొటోలో ముర్జక్ ఎడారి చిన్నగానే కనిపిస్తున్నా.. 300 కి.మీ. విస్తీర్ణంలో వ్యాపించి ఉందట.