అమ్మకానికి మూన్‌రాక్‌.. ధర ఎంతం‍టే.. | A Piece Of Moon Goes For Sale Now Fifth Largest One | Sakshi
Sakshi News home page

అమ్మకానికి మూన్‌రాక్‌.. మరచిపోలేని అనుభవం!

Published Thu, Apr 30 2020 1:34 PM | Last Updated on Thu, Apr 30 2020 1:37 PM

A Piece Of Moon Goes For Sale Now Fifth Largest One - Sakshi

లండన్‌: దాదాపు 13.5 కిలోల బరువు ఉన్న చంద్ర ఉల్క గురువారం అమ్మకానికి వచ్చింది. క్రిస్టీస్‌లో అమ్మకానికి పెట్టిన ఈ మూన్‌రాక్‌ 2 మిలియన్‌ పౌండ్లు(2.49 మిలియన్‌ డాలర్ల) విలువ చేస్తుందని(ప్రాథమిక ధర) అంచనా. భూమి మీద పడిన అతి పెద్ద చంద్ర ఉల్కల పరిమాణంలో ఇది ఐదో స్థానంలో నిలిచింది. ఎన్‌డబ్ల్యూఏ 12691గా పేరొందిన ఈ ఉల్క.. ఆస్టరాయిడ్‌ లేదా తోకచుక్కను ఢీకొట్టి సహారా ఎడారి ప్రాంతంలో పడినట్లుగా భావిస్తున్నారు. దీనిని సేకరించిన క్రిస్టీ సంస్థ ప్రైవేటు ప్లాట్‌ఫాంలో అమ్మకానికి పెట్టింది. ఈ విషయం గురించి క్రిస్టీస్‌ సైన్స్‌ అండ్‌ నేచురల్‌ హిస్టరీ విభాగాధిపతి మాట్లాడుతూ.. ‘‘బాహ్య ప్రపంచానికి చెందిన ఓ వస్తువును చేతుల్లోకి తీసుకున్న అనుభవాన్ని ఎవరూ ఎన్నటికీ మరచిపోలేరు. ఇది చంద్రుడికి సంబంధించినది. ఫుట్‌బాల్‌ లేదా ఓ మనిషి తల కంటే పెద్ద పరిమాణంలో ఉంటుంది’’ అని పేర్కొన్నారు. 

అదే విధంగా ఈ ఉల్క 2,40,000 మైళ్ల ప్రయాణం చేసిన తర్వాత భూమిని చేరినట్లు వెల్లడించారు. చంద్రుడిపై పరిశోధనలు జరిపిన సమయంలో అమెరికా అపోలో స్సేస్‌ మిషన్‌ సేకరించిన నమూనాలతో ఈ ఉల్కను పోల్చి చూసి.. అది చంద్రుడి ఏ భాగం నుంచి ఊడిపడిందో తెలుసుకునే ప్రయత్నాలు చేయనున్నట్లు పేర్కొన్నారు. ‘‘1960, 70ల్లో అపోలో ప్రోగ్రామ్‌ ద్వారా 400 కిలోల మూన్‌రాక్‌ను తీసుకువచ్చారు. తద్వారా దానిలోని రసాయన, ఐసోటోపిక్‌ మిశ్రమాలను విశ్లేషించి.. ప్రస్తుత ఉల్కను పోల్చి చూస్తారు’’అని హైస్లోప్‌ పేర్కొన్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement