
ఆమె వచ్చింది.. ఎడారిలో మంచు కురిసింది... ఇలాంటి వర్ణనలు కవులకు కామనే.. అయితే...ఇక్కడ ఆమె రాకుండానే మంచు కురిసింది. అదీ ప్రపంచంలోనే అతి పెద్ద ఎడారిగా పేరొందిన సహారాలో.. గత 40 ఏళ్లలో ఇలా జరగడం ఇది మూడోసారట. అల్జీరియాలోని ఇన్‌సెఫ్రా పట్టణానికి సమీపంలో ఉన్న ఎడారిలో ఆదివారం మంచు కురిసింది. కొన్ని ప్రాంతాల్లో 16 అంగుళాల మందం మేర మంచు పేరుకుందని స్థానికులు తెలిపారు. అయితే వాతావరణంలో నెలకొన్న అసమానతల వల్లే మంచు కురిసినట్లు వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు.


