భారతదేశంలోని ఉత్తరాదిన పలు ప్రాంతాల్లో ప్రస్తుతం విపరీతంగా మంచుకురుస్తోంది. దీంతో పర్యాటకులు ఆ మంచుతో కూడిన ప్రాంతాలను చూసేందుకు క్యూ కడుతున్నారు. ఆ మంచులో చాలాసేపు ఆడుకోవాలని తహతహలాడుతున్నారు. మరి ప్రపంచంలో అత్యధికంగా మంచుకురిసే ప్రాంతాలు ఎక్కడున్నాయో తెలుసా?
నూతన సంవత్సరం ప్రారంభంలో ప్రపంచంలోని పలు దేశాల్లో మంచు కురుస్తుంటుంది. అయితే కొన్ని ప్రాంతాలు భారీ హిమపాతం కారణంగా ఎంతో ప్రసిద్ధి చెందాయి. ఈ సమయంలో టూరిస్టులు ఆయా ప్రాంతాలకు తరలివచ్చి, తనివితీరా ఎంజాయ్ చేస్తుంటారు. ఆ ప్రాంతాలేవో, ఎక్కడున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.
మౌంట్ డెనాలి, అలాస్కా
ఉత్తర ధ్రువానికి సమీపంలోని అందమైన ప్రాంతం అలస్కా(Alaska). ఇది అమెరికాలో ఉంది. హిమపాతానికి ఈ ప్రాంతం ఎంతో ప్రసిద్ధి చెందింది. అలాస్కాలో ఏడాది పొడవునా మంచు కురుస్తుంటుంది. అయితే శీతాకాలంలో డెనాలి పర్వతంపై హిమపాత దృశ్యం ఎంతో ఆకర్షణీయంగా కనిపిస్తుంది.
వెర్ఖోయాన్స్క్ అండ్ ఐమ్యాకాన్, రష్యా
రష్యాలోని వెర్కోయాన్స్క్, ఐమ్యాకాన్‌లు ప్రపంచంలోనే అత్యంత శీతల ప్రదేశాలలో ఒకటిగా గుర్తింపు పొందాయి. శీతాకాలంలో వెర్ఖోయాన్స్క్‌లో ఉష్ణోగ్రత -48 డిగ్రీల సెల్సియస్ వరకుచేరుకుంటుంది. ఐమ్యాకాన్(iMacon)లో ఉష్ణోగ్రత -71 డిగ్రీల సెల్సియస్‌కు చేరుకుంటుంది. అందుకే ప్రతీయేటా నూతన సంవత్సరంలో హిమపాతాన్ని చూసేందుకు పర్యాటకులు రష్యాకు తరలివస్తుంటారు.
ఫ్రేజర్, కొలరాడో
కొలరాడో అమెరికాలోని రెండవ అత్యంత శీతల ప్రదేశంగా గుర్తింపు పొందింది. ముఖ్యంగా శీతాకాలంలో కొలరాడోలో భారీ హిమపాతంతో పాటు, తెల్లటి మంచు పలకలు కనిపిస్తాయి. కొలరాడోలోని ఫ్రేజర్‌లో మంచు కురుస్తున్న దృశ్యం టూరిస్టులను సంబ్రమాశ్చర్యాలకు లోనయ్యేలా చేస్తుంది.
మిన్నెసోటా అండ్ యుకాన్, అమెరికా
అమెరికాలోని మిన్నెసోటాలో గల అంతర్జాతీయ జలపాతం(International Falls) ప్రపంచంలోని అత్యంత శీతల ప్రదేశాలలో ఒకటిగా గుర్తిస్తారు. ఈ జలపాతాన్ని ‘ఐస్ బాక్స్ ఆఫ్ ది నేషన్’ అని కూడా పిలుస్తారు. అమెరికాలోని యుకాన్‌లో గల స్నాగ్ అనే చిన్ని గ్రామం కూడా భారీ హిమపాతానికి ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది.
ఉలాన్‌బాతర్, మంగోలియా
మంగోలియా రాజధాని ఉలాన్‌బాతర్ ప్రపంచంలోని అత్యంత శీతల ప్రదేశాలలో ప్రత్యేక స్థానం దక్కించుకుంది. శీతాకాలంలో ఇక్కడి ఉష్ణోగ్రత -16 డిగ్రీల సెల్సియస్‌కి పడిపోతుంది. ఫలితంగా
భారీగా హిమపాతం కురుస్తుంది.
ఇది కూడా చదవండి: భారత్‌పై ‘బంగ్లా’ విషం.. ఈ అంశాలతో స్పష్టం
Comments
Please login to add a commentAdd a comment