destinations list
-
Snowfall Destinations: అత్యధిక మంచు కురిసే ప్రాంతాలివే..
భారతదేశంలోని ఉత్తరాదిన పలు ప్రాంతాల్లో ప్రస్తుతం విపరీతంగా మంచుకురుస్తోంది. దీంతో పర్యాటకులు ఆ మంచుతో కూడిన ప్రాంతాలను చూసేందుకు క్యూ కడుతున్నారు. ఆ మంచులో చాలాసేపు ఆడుకోవాలని తహతహలాడుతున్నారు. మరి ప్రపంచంలో అత్యధికంగా మంచుకురిసే ప్రాంతాలు ఎక్కడున్నాయో తెలుసా?నూతన సంవత్సరం ప్రారంభంలో ప్రపంచంలోని పలు దేశాల్లో మంచు కురుస్తుంటుంది. అయితే కొన్ని ప్రాంతాలు భారీ హిమపాతం కారణంగా ఎంతో ప్రసిద్ధి చెందాయి. ఈ సమయంలో టూరిస్టులు ఆయా ప్రాంతాలకు తరలివచ్చి, తనివితీరా ఎంజాయ్ చేస్తుంటారు. ఆ ప్రాంతాలేవో, ఎక్కడున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.మౌంట్ డెనాలి, అలాస్కా ఉత్తర ధ్రువానికి సమీపంలోని అందమైన ప్రాంతం అలస్కా(Alaska). ఇది అమెరికాలో ఉంది. హిమపాతానికి ఈ ప్రాంతం ఎంతో ప్రసిద్ధి చెందింది. అలాస్కాలో ఏడాది పొడవునా మంచు కురుస్తుంటుంది. అయితే శీతాకాలంలో డెనాలి పర్వతంపై హిమపాత దృశ్యం ఎంతో ఆకర్షణీయంగా కనిపిస్తుంది.వెర్ఖోయాన్స్క్ అండ్ ఐమ్యాకాన్, రష్యారష్యాలోని వెర్కోయాన్స్క్, ఐమ్యాకాన్లు ప్రపంచంలోనే అత్యంత శీతల ప్రదేశాలలో ఒకటిగా గుర్తింపు పొందాయి. శీతాకాలంలో వెర్ఖోయాన్స్క్లో ఉష్ణోగ్రత -48 డిగ్రీల సెల్సియస్ వరకుచేరుకుంటుంది. ఐమ్యాకాన్(iMacon)లో ఉష్ణోగ్రత -71 డిగ్రీల సెల్సియస్‌కు చేరుకుంటుంది. అందుకే ప్రతీయేటా నూతన సంవత్సరంలో హిమపాతాన్ని చూసేందుకు పర్యాటకులు రష్యాకు తరలివస్తుంటారు.ఫ్రేజర్, కొలరాడోకొలరాడో అమెరికాలోని రెండవ అత్యంత శీతల ప్రదేశంగా గుర్తింపు పొందింది. ముఖ్యంగా శీతాకాలంలో కొలరాడోలో భారీ హిమపాతంతో పాటు, తెల్లటి మంచు పలకలు కనిపిస్తాయి. కొలరాడోలోని ఫ్రేజర్లో మంచు కురుస్తున్న దృశ్యం టూరిస్టులను సంబ్రమాశ్చర్యాలకు లోనయ్యేలా చేస్తుంది.మిన్నెసోటా అండ్ యుకాన్, అమెరికాఅమెరికాలోని మిన్నెసోటాలో గల అంతర్జాతీయ జలపాతం(International Falls) ప్రపంచంలోని అత్యంత శీతల ప్రదేశాలలో ఒకటిగా గుర్తిస్తారు. ఈ జలపాతాన్ని ‘ఐస్ బాక్స్ ఆఫ్ ది నేషన్’ అని కూడా పిలుస్తారు. అమెరికాలోని యుకాన్లో గల స్నాగ్ అనే చిన్ని గ్రామం కూడా భారీ హిమపాతానికి ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది.ఉలాన్బాతర్, మంగోలియామంగోలియా రాజధాని ఉలాన్బాతర్ ప్రపంచంలోని అత్యంత శీతల ప్రదేశాలలో ప్రత్యేక స్థానం దక్కించుకుంది. శీతాకాలంలో ఇక్కడి ఉష్ణోగ్రత -16 డిగ్రీల సెల్సియస్‌కి పడిపోతుంది. ఫలితంగా భారీగా హిమపాతం కురుస్తుంది.ఇది కూడా చదవండి: భారత్‌పై ‘బంగ్లా’ విషం.. ఈ అంశాలతో స్పష్టం -
Year Ender 2024: అత్యంత ప్రజాదరణపొందిన వెడ్డింగ్ డెస్టినేషన్స్
గత కొన్నేళ్లుగా డెస్టినేషన్ వెడ్డింగ్ ట్రెండ్ పెరిగింది. సెలబ్రిటీలే కాదు సామాన్యులు కూడా వెడ్డింగ్ డెస్టినేషన్ల వైపు మొగ్గు చూపుతున్నారు. ఇందుకోసం మనదేశంలోని అందమైన ప్రదేశాలను ఎంచుకుంటున్నారు. 2024లో పలు వెడ్డింగ్ డెస్టినేషన్లు అమితమైన ప్రజాదరణపొందాయి. 2024లో ప్రముఖులతో పాటు జనం మెచ్చిన వెడ్డింగ్ డెస్టినేషన్ల జాబితా ఇదే..1. ఉదయపూర్వెడ్డింగ్ డెస్టినేషన్ల జాబితాలో రాజస్థాన్‌లోని ఉదయపూర్ అగ్రస్థానంలో ఉంది. రాచరిక వివాహాలకు ప్రసిద్ధి చెందిన ఈ నగరంలోని వాస్తుశిల్పం ఎవరినైనా ఇట్టే ఆకట్టుకుంటుంది. ప్రశాంతమైన సరస్సులు ఉదయపూర్‌కు ఎంతో అందాన్ని తీసుకువచ్చాయి. ఇక్కడ వివాహం చేసుకున్న జంటలకు జీవితాంతం ఈ మధురానుభూతులు వారిలో నిలిచివుంటాయనడంలో సందేహం లేదు.2. పుష్కర్రాజస్థాన్లోని మరొక అమూల్య రత్నం పుష్కర్. రాయల్ వెడ్డింగ్ దిశగా ఆలోచించేవారికి ఇదొక వరం. పుష్కర్‌కు ఘటనమైన చరిత్ర ఉంది. అలాగే అద్భుతమైన వారసత్వ భవనాలు ఇక్కడ ఉన్నాయి. ప్రశాంత వాతావరణం కలిగిన ఈ పట్టణం వివాహలకు అనువైనదిగా పలువురు భావిస్తున్నారు. ఇక్కడి రోజ్ గార్డెన్, పుష్కర్ బాగ్ ప్యాలెస్, వెస్టిన్ రిసార్ట్లు వివాహాలను అత్యంత అనువైనవని చెబుతారు.3. జైసల్మేర్అందమైన ఎడారులలో పెళ్లి చేసుకోవాలనుకునేవారిని రాజస్థాన్‌లోని జైసల్మేర్ ఎంతో అనువైనది. బంగారు వర్ణంలోని ఇసుక దిబ్బలతో కూడిన ఐకానిక్ సూర్యగఢ్ జైసల్మేర్‌కు ఆణిముత్యంలా నిలిచింది. ఈ ప్రదేశం రాచరిక వాతావరణం కోసం వెతుకుతున్న వారికి తగిన డెస్టినేషన్. బాలీవుడ్ తారలు కియారా అద్వానీ-సిద్ధార్థ్ మల్హోత్రా తమ వివాహాన్ని ఇక్కడే చేసుకున్నారు.4. కేరళచుట్టూ పచ్చదనం, బ్యాక్ వాటర్స్, ప్రశాంతమైన బీచ్‌లు కలిగిన కేరళ వివాహాలకు అనువైన ఒక అద్భుత ప్రదేశం. ప్రశాంత వాతావరణంలో పెళ్లి చేసుకోవాలనుకునేవారికి సరైన డెస్టినేషన్‌గా కేరళ నిలుస్తుంది. కేరళలోని కుమరకోమ్ బీచ్, చెరాయ్ బీచ్‌లు అద్భుతమైన వివాహాలకు గమ్యస్థానాలుగా నిలిచాయి. డెస్టినేషన్ వెడ్డింగ్‌లకు నిలయంగా కేరళ మారుతోంది.5. గోవాబీచ్ వెడ్డింగ్ కోసం ఎదురు చూస్తున్నవారికి గోవా అత్యంత ఉత్తమమైన ప్రదేశం. అద్భుతమైన సూర్యాస్తమయం, సముద్రపు వ్యూ మధ్య వివాహం చేసుకోవాలనుకునేవారికి గోవా తగిన ప్రాంతం. విలాసవంతమైన రిసార్ట్‌ల నుండి సాధారణ బీచ్‌సైడ్ వేడుకల వరకు గోవాలో పలు వేదికలు అందుబాటులో ఉన్నాయి. నటులు రకుల్‌ప్రీత్- జాకీ భగ్నానీ ఇక్కడే వివాహం చేసుకున్నారు.6. సిమ్లాహనీమూన్కే కాదు పెళ్లికి కూడా సిమ్లా అత్యంత అనువైన ప్రదేశం. సిమ్లాలోని అందమైన కట్టడాలు, వాస్తుశిల్పం, మంచు దుప్పటి పరుచుకున్న పర్వతాలు అడుగడుగునా కనిపిస్తాయి. ఇవి హిల్ స్టేషన్లో వివాహం చేసుకోవాలకునేవారి కలలను నెరవేరుస్తాయి. సిమ్లాలో విలాసవంతమైన రిసార్ట్‌ల నుండి అన్ని బడ్జెట్లకు సరిపోయేలాంటి వివాహ వేదికలు అందుబాటులో ఉన్నాయి.7. మాండూమధ్యప్రదేశ్లోని మాండూ వివాహాల డెస్టినేషన్‌గా మారుతోంది. మాండూకు ఘనమైన చరిత్ర ఉంది. అందమైన కట్టడాలు ఇక్కడ అనేకం ఉన్నాయి. పురాతన స్మారక కట్టడాలు, హిల్ స్టేషన్ వైబ్‌లు కలిగిన ఈ ప్రాంతం ఎప్పుడూ సందడిగా ఉంటుంది. విభిన్నరీతిలో వివాహం చేసుకోవాలనుకునేవారికి మాండూ తగిన ప్రాంతమని చెప్పుకోవచ్చు.8. జైపూర్రాజస్థాన్లోని పింక్ సిటీగా పేరొందిన జైపూర్.. గ్రాండ్ వెడ్డింగ్‌లకు పర్యాయపదంగా మారింది. ఇక్కడి అద్భుతమైన కోటలు, రాజభవనాలు, విలక్షణ సంస్కృతి సెలబ్రిటీ జంటలను ఇట్టే కట్టిపడేస్తోంది. సామాన్యులు కూడా ఇక్కడ తమ బడ్జెట్‌కు అనువైనరీతిలో వివాహం చేసుకోవచ్చు. జైపూర్‌లో వివాహం చేసుకుంటే ఆ మధురానుభూతులు జీవితాంతం మదిలో నిలిచివుంటాయని అంటుంటారు.ఇది కూడా చదవండి: రానున్నది తాతల కాలం.. 2050 నాటికి వృద్ధ జనాభా మూడింతలు -
ఈ ఏడాది అక్కడికి వెళ్లేందుకు తెగ ఎగబడ్డారు,అంత స్పెషల్ ఏముందంటే..
2023 మరికొన్ని రోజుల్లోనే పూర్తికానుంది. మరి ఈ ఏడాదిలో ఎక్కువ మంది పర్యాటకులు సందర్శించిన టూరిస్ట్ ప్లేస్ ఏంటి? గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది లిస్ట్‌లో ఏమైనా మార్పులు ఉన్నాయా? 2023లో ప్రపంచ వ్యాప్తంగా పర్యాటకులు ఎక్కువగా సందర్శించిన టూరిస్ట్ ప్రాంతమేంటి?అన్నదానిపై స్పెషల్ స్టోరీ. ప్రతి ఏడాది ప్రజలు ఎక్కువగా సందర్శించే టూరిస్ట్ ప్రాంతాలను ట్రావెల్ ఏజెన్సీలు రిలీజ్ చేస్తుంటాయి. అలా ఈ ఏడాది కూడా లిస్ట్‌ను విడుదల చేశాయి. గ్లోబల్ డెస్టినేషన్ సిటీ ఇండెక్స్ విడుదల చేసిన జాబితా ప్రకారం 2023లో ఎక్కువ మంది ప్రజలు హాంకాంగ్ వెళ్లేందుకు తెగ ఇంట్రెస్ట్ చూపించారు. అలా టాప్ టూరిస్ట్ ప్లేస్‌లో హాంకాంగ్ మొదటి స్థానంలో నిలిచింది. గతేడాది బ్యాంకాక్ నెంబర్ వన్ స్థానంలో ఉండగా, 2023లో మాత్రం హాంకాంగ్ ఫస్ట్ ప్లేస్‌లో నిలిచింది. హాంకాంగ్ నివేదిక ప్రకారం.. ఈ ఏడాది సుమారు 29.2మిలియన్ల మంది అంటే 2 కోట్ల 92లక్షల మంది హాంకాంగ్‌ను సందర్శించారు. ఆగ్గేయ చైనాను ఆనుకొని ఉన్న ఈ నగరంలో ప్రతి ఏడాది సుమారు 5మిలియన్లకు తగ్గకుండా ప్రజలు విజిట్ చేస్తుంటారట. అంతలా ఎక్కడ ఏముందబ్బా అని పరిశీలిస్తే.. హాంకాంగ్‌లో అనేక టూరిస్టు ప్రాంతాలు ఉన్నాయి. అందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది డిస్నీల్యాండ్, విక్టోరియాస్ పీక్, మేడమ్ టుస్సాడ్స్ మైనపు మ్యూజియం, ఓషియన్ పార్క్,రిపల్స్ బే,లాంటూ ఐస్‌ల్యాండ్, స్టార్ ఫెర్రీ సహా ఎన్నో అద్భుతమైన ప్రదేశాలు పర్యాటకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. 2025 నాటికి సుమారు 44 మిలియన్లకు పైగా ప్రజలు హాంకాంగ్‌ను సందర్శిస్తారని సమాచారం. బ్యాంకాక్ హాంకాంగ్ తర్వాత ఎక్కువమంది పర్యాటకులు సందర్శించిన ప్రదేశం బ్యాంకాక్. ప్రపంచంలో అత్యధికంగా సందర్శించే నగరాల్లో బ్యాంకాక్ నగరం రెండోదిగా నిలిచింది. 2023 నాటికి 24 మిలియన్ల మంది అంటే సుమారు 2 కోట్ల 44 లక్షల మంది ప్రజలు బ్యాంకాక్‌ను సందర్శించారు. ఇక్కడి ప్రసిద్ధ బౌద్ధ దేవాలయాలు, షాపింగ్ కాంప్లెక్స్‌లు, ఆహ్లాదకరమైన వాతావరణం, వెరైటీ వంటలతో బ్యాంకాక్ పర్యాటకులను విపరీతంగా అట్రాక్ట్ చేస్తుంది. లండన్ బెస్ట్ టూరిస్ట్ ప్లేస్ జాబితాలో లండన్ మూడవ స్థానంలో ఉంది. ఈ ఏడాది 19.2 మిలియన్లు(కోటి 2 లక్షల మంది) ప్రజలు లండన్‌ను సందర్శించారు. టూరిస్టులే కాకుండా పారిశ్రామిక వేత్తలు, సెలబ్రిటీలు కూడా 2023లో ఎక్కువగా లండన్‌ను విజిట్ చేశారు. ఆ తర్వాత ఈ ఏడాది ఎక్కువగా సింగపూర్,చైనా,దుబాయ్, ప్యారిస్, న్యూయార్క్ ప్రాంతాలను పర్యాటకులు ఎక్కువగా సందర్శించారు. -
కేరళలోని ద్వీపానికి అరుదైన గౌరవం
తిరువనంతపురం: ప్రకృతి అందాలకు మారుపేరుగా ఉన్న కేరళకు అరుదైన గౌరవం దక్కింది. కాక్కత్తూరుత్తులోని ‘కాకుల దీవి(ఐలాండ్ ఆఫ్ క్రోస్)’గా పేరొందిన ద్వీపం ఉత్తమ పర్యాటక స్థలిగా ఎంపికైంది. నేషనల్ జియోగ్రఫిక్ పత్రిక ఎంపిక చేసిన అందమైన పర్యాటక స్థలాల జాబితాలో దీనికి చోటు దక్కింది. నేషనల్ జియోగ్రఫీ వారు ఫొటోగ్రాఫిక్ టూర్ పేరిట ఒక రోజులో ప్రపంచవ్యాప్తంగా ఉన్న పర్యాటక స్థలాలను కెమెరాల్లో బంధించారు. ఐలాండ్ ఆఫ్ క్రోస్ కు ఈ గౌరవం దక్కడం పట్ల కేరళ పర్యాటక మంత్రి ఏసీ మొయిదీన్ సంతోషం వ్యక్తం చేశారు. సహజ అందాలకు నిలయమైన తమ రాష్ట్రానికి అరుదైన గౌరవడం దక్కడం గర్వంగా ఉందని పేర్కొన్నారు.