గత కొన్నేళ్లుగా డెస్టినేషన్ వెడ్డింగ్ ట్రెండ్ పెరిగింది. సెలబ్రిటీలే కాదు సామాన్యులు కూడా వెడ్డింగ్ డెస్టినేషన్‌ల వైపు మొగ్గు చూపుతున్నారు. ఇందుకోసం మనదేశంలోని అందమైన ప్రదేశాలను ఎంచుకుంటున్నారు. 2024లో పలు వెడ్డింగ్ డెస్టినేషన్‌లు అమితమైన ప్రజాదరణపొందాయి. 2024లో ప్రముఖులతో పాటు జనం మెచ్చిన వెడ్డింగ్ డెస్టినేషన్‌ల జాబితా ఇదే..
1. ఉదయపూర్
వెడ్డింగ్ డెస్టినేషన్‌ల జాబితాలో రాజస్థాన్‌లోని ఉదయపూర్ అగ్రస్థానంలో ఉంది. రాచరిక వివాహాలకు ప్రసిద్ధి చెందిన ఈ నగరంలోని వాస్తుశిల్పం ఎవరినైనా ఇట్టే ఆకట్టుకుంటుంది. ప్రశాంతమైన సరస్సులు ఉదయపూర్‌కు ఎంతో అందాన్ని తీసుకువచ్చాయి. ఇక్కడ వివాహం చేసుకున్న జంటలకు జీవితాంతం ఈ మధురానుభూతులు వారిలో నిలిచివుంటాయనడంలో సందేహం లేదు.
2. పుష్కర్
రాజస్థాన్‌లోని మరొక అమూల్య రత్నం పుష్కర్. రాయల్ వెడ్డింగ్ దిశగా ఆలోచించేవారికి ఇదొక వరం. పుష్కర్‌కు ఘటనమైన చరిత్ర ఉంది. అలాగే అద్భుతమైన వారసత్వ భవనాలు ఇక్కడ ఉన్నాయి. ప్రశాంత వాతావరణం కలిగిన ఈ పట్టణం వివాహలకు అనువైనదిగా పలువురు భావిస్తున్నారు. ఇక్కడి రోజ్ గార్డెన్, పుష్కర్ బాగ్ ప్యాలెస్, వెస్టిన్ రిసార్ట్‌లు వివాహాలను అత్యంత అనువైనవని చెబుతారు.
3. జైసల్మేర్
అందమైన ఎడారులలో పెళ్లి చేసుకోవాలనుకునేవారిని రాజస్థాన్‌లోని జైసల్మేర్ ఎంతో అనువైనది. బంగారు వర్ణంలోని ఇసుక దిబ్బలతో కూడిన ఐకానిక్ సూర్యగఢ్ జైసల్మేర్‌కు ఆణిముత్యంలా నిలిచింది. ఈ ప్రదేశం రాచరిక వాతావరణం కోసం వెతుకుతున్న వారికి తగిన డెస్టినేషన్. బాలీవుడ్ తారలు కియారా అద్వానీ-సిద్ధార్థ్ మల్హోత్రా తమ వివాహాన్ని ఇక్కడే చేసుకున్నారు.
4. కేరళ
చుట్టూ పచ్చదనం, బ్యాక్ వాటర్స్, ప్రశాంతమైన బీచ్‌లు కలిగిన కేరళ వివాహాలకు అనువైన ఒక అద్భుత ప్రదేశం. ప్రశాంత వాతావరణంలో పెళ్లి చేసుకోవాలనుకునేవారికి సరైన డెస్టినేషన్‌గా కేరళ నిలుస్తుంది. కేరళలోని కుమరకోమ్ బీచ్, చెరాయ్ బీచ్‌లు అద్భుతమైన వివాహాలకు గమ్యస్థానాలుగా నిలిచాయి. డెస్టినేషన్ వెడ్డింగ్‌లకు నిలయంగా కేరళ మారుతోంది.
5. గోవా
బీచ్ వెడ్డింగ్ కోసం ఎదురు చూస్తున్నవారికి గోవా అత్యంత ఉత్తమమైన ప్రదేశం. అద్భుతమైన సూర్యాస్తమయం, సముద్రపు వ్యూ మధ్య వివాహం చేసుకోవాలనుకునేవారికి గోవా తగిన ప్రాంతం. విలాసవంతమైన రిసార్ట్‌ల నుండి సాధారణ బీచ్‌సైడ్ వేడుకల వరకు గోవాలో పలు వేదికలు అందుబాటులో ఉన్నాయి. నటులు రకుల్‌ప్రీత్- జాకీ భగ్నానీ ఇక్కడే వివాహం చేసుకున్నారు.
6. సిమ్లా
హనీమూన్‌కే కాదు పెళ్లికి కూడా సిమ్లా అత్యంత అనువైన ప్రదేశం. సిమ్లాలోని అందమైన కట్టడాలు, వాస్తుశిల్పం, మంచు దుప్పటి పరుచుకున్న పర్వతాలు అడుగడుగునా కనిపిస్తాయి. ఇవి హిల్ స్టేషన్‌లో వివాహం చేసుకోవాలకునేవారి కలలను నెరవేరుస్తాయి. సిమ్లాలో విలాసవంతమైన రిసార్ట్‌ల నుండి అన్ని బడ్జెట్‌లకు సరిపోయేలాంటి వివాహ వేదికలు అందుబాటులో ఉన్నాయి.
7. మాండూ
మధ్యప్రదేశ్‌లోని మాండూ వివాహాల డెస్టినేషన్‌గా మారుతోంది. మాండూకు ఘనమైన చరిత్ర ఉంది. అందమైన కట్టడాలు ఇక్కడ అనేకం ఉన్నాయి. పురాతన స్మారక కట్టడాలు, హిల్ స్టేషన్ వైబ్‌లు కలిగిన ఈ ప్రాంతం ఎప్పుడూ సందడిగా ఉంటుంది. విభిన్నరీతిలో వివాహం చేసుకోవాలనుకునేవారికి మాండూ తగిన ప్రాంతమని చెప్పుకోవచ్చు.
8. జైపూర్
రాజస్థాన్‌లోని పింక్ సిటీగా పేరొందిన జైపూర్.. గ్రాండ్ వెడ్డింగ్‌లకు పర్యాయపదంగా మారింది. ఇక్కడి అద్భుతమైన కోటలు, రాజభవనాలు, విలక్షణ సంస్కృతి సెలబ్రిటీ జంటలను ఇట్టే కట్టిపడేస్తోంది. సామాన్యులు కూడా ఇక్కడ తమ బడ్జెట్‌కు అనువైనరీతిలో వివాహం చేసుకోవచ్చు. జైపూర్‌లో వివాహం చేసుకుంటే ఆ మధురానుభూతులు జీవితాంతం మదిలో నిలిచివుంటాయని అంటుంటారు.
ఇది కూడా చదవండి: రానున్నది తాతల కాలం.. 2050 నాటికి వృద్ధ జనాభా మూడింతలు
Comments
Please login to add a commentAdd a comment