
త్రిష
సాధారణంగా అందరికీ కలలు ఉంటాయి. ఆ కలల గురించి ఓ లిస్ట్ రాసి పెట్టుకుంటారు. చిట్టీ మీద కాకపోయినా మనసులో అయినా రాసుకుంటారు. హీరోయిన్ త్రిషకి కూడా పెళ్లి విషయంలో ఓ డ్రీమ్ ఉందట. ఈ మధ్య త్రిష తన అభిమానులతో సోషల్ మీడియాలో సరదాగా కాసేపు చాట్ చేశారు. వాళ్లు అడిగిన ప్రశ్నలకు సమాధానాలిచ్చారు. ‘మీ డ్రీమ్ లిస్ట్‌లో ఉన్న ఓ క్రేజీ డ్రీమ్ ఏంటి?’ అని ఓ అభిమాని అడగ్గా – ‘‘వేగాస్‌లో వివాహం చేసుకోవాలని అనుకుంటున్నా’’ అని చెప్పారు త్రిష.
అయితే ‘వివాహ వ్యవస్థను నమ్ముతారా?’ అంటే ‘‘లేదనుకుంటున్నాను’’ అన్నారు. ఇక సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం మణిరత్నం దర్శకత్వం వహిస్తున్న ‘పొన్నియిన్ సెల్వన్’, చిరంజీవి 152వ చిత్రం, మోహన్‌లాల్‌తో ‘రామ్’ సినిమాలు చేస్తున్నారు త్రిష. ‘పొన్నియిన్ సెల్వన్’లో కుందవై మహారాణి పాత్రను చేయనున్నారు. కల్కీ కృష్ణమూర్తి రచించిన నవల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోంది. సినిమాలో తన పాత్రను పూర్తిగా అవగాహన చేసుకోవడానికి ‘పొన్నియిన్ సెల్వన్’ నవలను త్రిష చదువుతున్నారు. త్వరలో ఆమె పాత్ర చిత్రీకరణ ప్రారంభం కానుంది.
Comments
Please login to add a commentAdd a comment