ఆ హీరో పెళ్లికి అడ్డుపడిన త్రిష.. ఇంతకీ ఏమైందంటే? Trisha Stops Actor Srikanth Wedding With Vandana Full Details Inside. Sakshi
Sakshi News home page

Trisha: హీరో పెళ్లికి అడ్డుపడిన త్రిష.. అసలు నిజం ఇది

Published Tue, Jun 18 2024 7:12 AM | Last Updated on Tue, Jun 18 2024 9:02 AM

Trisha Stops Actor Srikanth Wedding With Vandana Full Details Inside

హీరోయిన్ త్రిష వయసు 41 ఏళ్లు. దాదాపు రెండు దశాబ్దాల నుంచి స్టార్ హీరోయిన్‌గా తన హవా చూపిస్తోంది. రీసెంట్ టైంలో పాన్ ఇండియా మూవీస్ చేస్తూ బిజీగా ఉంది. 40 దాటిపోయినా సరే ఇప్పటికీ పెళ్లి చేసుకోకుండానే ఉండిపోయింది. త్రిషపై వదంతులు చాలానే ఉన్నాయి. అలానే గతంలో ఓసారి నిశ్చితార్థం వరకు వెళ్లి పెళ్లి ఆగిపోయింది. ఇదంతా పక్కనబెడితే ఓ హీరో పెళ్లికి.. త్రిష అడ్డుపడిందని మీకు తెలుసా?

(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో 20 సినిమాలు రిలీజ్.. ఆ రెండు స్పెషల్!)

'ఒకరికి ఒకరు' సినిమాతో తెలుగులోనూ గుర్తింపు తెచ్చుకున్న శ్రీకాంత్ అలియా శ్రీరామ్.. త్రిషతో 'మనసెల్లామ్' అనే మూవీ చేశాడు. అలా వీరిద్దరి మధ్య స్నేహం ఏర్పడింది. 2007లో శ్రీకాంత్, వందన అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. అయితే వందనకు త్రిష అంతకు ముందే తెలుసు. దీంతో పెళ్లికి ముందు వందనతో నువ్వు శ్రీకాంత్‌ని పెళ్లి చేసుకోవద్దని, అతడు మంచివాడు కాదని, ఇంగ్లీష్ మాట్లాడటం రాదని త్రిష చెప్పింది. ఇదే విషయాన్ని వందన, శ్రీకాంత్ దగ్గర చెప్పింది.

ఎందుకలా చెప్పావ్ అని త్రిషని శ్రీకాంత్ అడగ్గా.. నువ్వు నా ఫ్రెండ్‌ని పెళ్లి చేసుకోబోతున్నావ్ కదా, అందుకే ప్రాంక్ చేశానని త్రిష చెప్పుకొచ్చింది. తాజాగా ఈ విషయాన్ని బయటపెట్టింది. ఇదిలా ఉండగా 1999లో 'జోడీ' మూవీతో ఇండస్ట్రీలోకి వచ్చిన త్రిష.. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో మూవీస్ చేసింది. మధ్యలో కొన్నాళ్లు గ్యాప్ వచ్చింది. కానీ '96'తో మళ్లీ బౌన్స్ బ్యాక్ అయింది. 'పొన్నియన్ సెల్వన్' లాంటి పాన్ ఇండియా మూవీతో ప్రేక్షకుల మనసులు గెలుచుకుంది. ప్రస్తుతం తెలుగులో చిరంజీవి 'విశ్వంభర'లో నటిస్తోంది.

(ఇదీ చదవండి: పండంటి బిడ్డకు జన్మనిచ్చిన హీరోయిన్‌ అమలాపాల్.. వీడియో వైరల్!)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement