popular
-
Year Ender 2024: అత్యంత ప్రజాదరణపొందిన వెడ్డింగ్ డెస్టినేషన్స్
గత కొన్నేళ్లుగా డెస్టినేషన్ వెడ్డింగ్ ట్రెండ్ పెరిగింది. సెలబ్రిటీలే కాదు సామాన్యులు కూడా వెడ్డింగ్ డెస్టినేషన్ల వైపు మొగ్గు చూపుతున్నారు. ఇందుకోసం మనదేశంలోని అందమైన ప్రదేశాలను ఎంచుకుంటున్నారు. 2024లో పలు వెడ్డింగ్ డెస్టినేషన్లు అమితమైన ప్రజాదరణపొందాయి. 2024లో ప్రముఖులతో పాటు జనం మెచ్చిన వెడ్డింగ్ డెస్టినేషన్ల జాబితా ఇదే..1. ఉదయపూర్వెడ్డింగ్ డెస్టినేషన్ల జాబితాలో రాజస్థాన్‌లోని ఉదయపూర్ అగ్రస్థానంలో ఉంది. రాచరిక వివాహాలకు ప్రసిద్ధి చెందిన ఈ నగరంలోని వాస్తుశిల్పం ఎవరినైనా ఇట్టే ఆకట్టుకుంటుంది. ప్రశాంతమైన సరస్సులు ఉదయపూర్‌కు ఎంతో అందాన్ని తీసుకువచ్చాయి. ఇక్కడ వివాహం చేసుకున్న జంటలకు జీవితాంతం ఈ మధురానుభూతులు వారిలో నిలిచివుంటాయనడంలో సందేహం లేదు.2. పుష్కర్రాజస్థాన్లోని మరొక అమూల్య రత్నం పుష్కర్. రాయల్ వెడ్డింగ్ దిశగా ఆలోచించేవారికి ఇదొక వరం. పుష్కర్‌కు ఘటనమైన చరిత్ర ఉంది. అలాగే అద్భుతమైన వారసత్వ భవనాలు ఇక్కడ ఉన్నాయి. ప్రశాంత వాతావరణం కలిగిన ఈ పట్టణం వివాహలకు అనువైనదిగా పలువురు భావిస్తున్నారు. ఇక్కడి రోజ్ గార్డెన్, పుష్కర్ బాగ్ ప్యాలెస్, వెస్టిన్ రిసార్ట్లు వివాహాలను అత్యంత అనువైనవని చెబుతారు.3. జైసల్మేర్అందమైన ఎడారులలో పెళ్లి చేసుకోవాలనుకునేవారిని రాజస్థాన్‌లోని జైసల్మేర్ ఎంతో అనువైనది. బంగారు వర్ణంలోని ఇసుక దిబ్బలతో కూడిన ఐకానిక్ సూర్యగఢ్ జైసల్మేర్‌కు ఆణిముత్యంలా నిలిచింది. ఈ ప్రదేశం రాచరిక వాతావరణం కోసం వెతుకుతున్న వారికి తగిన డెస్టినేషన్. బాలీవుడ్ తారలు కియారా అద్వానీ-సిద్ధార్థ్ మల్హోత్రా తమ వివాహాన్ని ఇక్కడే చేసుకున్నారు.4. కేరళచుట్టూ పచ్చదనం, బ్యాక్ వాటర్స్, ప్రశాంతమైన బీచ్‌లు కలిగిన కేరళ వివాహాలకు అనువైన ఒక అద్భుత ప్రదేశం. ప్రశాంత వాతావరణంలో పెళ్లి చేసుకోవాలనుకునేవారికి సరైన డెస్టినేషన్‌గా కేరళ నిలుస్తుంది. కేరళలోని కుమరకోమ్ బీచ్, చెరాయ్ బీచ్‌లు అద్భుతమైన వివాహాలకు గమ్యస్థానాలుగా నిలిచాయి. డెస్టినేషన్ వెడ్డింగ్‌లకు నిలయంగా కేరళ మారుతోంది.5. గోవాబీచ్ వెడ్డింగ్ కోసం ఎదురు చూస్తున్నవారికి గోవా అత్యంత ఉత్తమమైన ప్రదేశం. అద్భుతమైన సూర్యాస్తమయం, సముద్రపు వ్యూ మధ్య వివాహం చేసుకోవాలనుకునేవారికి గోవా తగిన ప్రాంతం. విలాసవంతమైన రిసార్ట్‌ల నుండి సాధారణ బీచ్‌సైడ్ వేడుకల వరకు గోవాలో పలు వేదికలు అందుబాటులో ఉన్నాయి. నటులు రకుల్‌ప్రీత్- జాకీ భగ్నానీ ఇక్కడే వివాహం చేసుకున్నారు.6. సిమ్లాహనీమూన్కే కాదు పెళ్లికి కూడా సిమ్లా అత్యంత అనువైన ప్రదేశం. సిమ్లాలోని అందమైన కట్టడాలు, వాస్తుశిల్పం, మంచు దుప్పటి పరుచుకున్న పర్వతాలు అడుగడుగునా కనిపిస్తాయి. ఇవి హిల్ స్టేషన్లో వివాహం చేసుకోవాలకునేవారి కలలను నెరవేరుస్తాయి. సిమ్లాలో విలాసవంతమైన రిసార్ట్‌ల నుండి అన్ని బడ్జెట్లకు సరిపోయేలాంటి వివాహ వేదికలు అందుబాటులో ఉన్నాయి.7. మాండూమధ్యప్రదేశ్లోని మాండూ వివాహాల డెస్టినేషన్‌గా మారుతోంది. మాండూకు ఘనమైన చరిత్ర ఉంది. అందమైన కట్టడాలు ఇక్కడ అనేకం ఉన్నాయి. పురాతన స్మారక కట్టడాలు, హిల్ స్టేషన్ వైబ్‌లు కలిగిన ఈ ప్రాంతం ఎప్పుడూ సందడిగా ఉంటుంది. విభిన్నరీతిలో వివాహం చేసుకోవాలనుకునేవారికి మాండూ తగిన ప్రాంతమని చెప్పుకోవచ్చు.8. జైపూర్రాజస్థాన్లోని పింక్ సిటీగా పేరొందిన జైపూర్.. గ్రాండ్ వెడ్డింగ్‌లకు పర్యాయపదంగా మారింది. ఇక్కడి అద్భుతమైన కోటలు, రాజభవనాలు, విలక్షణ సంస్కృతి సెలబ్రిటీ జంటలను ఇట్టే కట్టిపడేస్తోంది. సామాన్యులు కూడా ఇక్కడ తమ బడ్జెట్‌కు అనువైనరీతిలో వివాహం చేసుకోవచ్చు. జైపూర్‌లో వివాహం చేసుకుంటే ఆ మధురానుభూతులు జీవితాంతం మదిలో నిలిచివుంటాయని అంటుంటారు.ఇది కూడా చదవండి: రానున్నది తాతల కాలం.. 2050 నాటికి వృద్ధ జనాభా మూడింతలు -
జనరల్ నాలెడ్జ్‌కు కేరాఫ్ అడ్రస్
ఫ్రెండ్స్, ఈరోజు మనం మయాంక్ గురించి తెలుసుకుందాం. పన్నెండేళ్ల వయసులో పాపులర్ క్విజ్ షో ‘కౌన్ బనేగా కరోడ్ పతి’లో కోటి రూపాయలు గెలుచుకున్న అతి పిన్న వయస్కుడిగా చరిత్ర సృష్టించాడు. అమితాబ్ బచ్చన్ నుంచి బహుమతిని అందుకున్నాడు. ప్రైజ్ మనీతో పాటు ఒక కారును కూడా తీసుకున్నాడు. ‘కోటి రూపాయల ప్రశ్నకు సమాధానం చెప్పినందుకు సంతోషంగా ఉంది. కేబీసిలో ΄ాల్గొనే అవకాశం రావడం, అమితాబ్ సర్‌తో షోలో పాల్గొనడం అదృష్టంగా భావిస్తున్నాను’ అంటూ బహుమతి గెలుచుకున్న రోజు తన సంతోషాన్ని ప్రకటించాడు మయాంక్.మయాంక్‌ను మెచ్చుకోవడమే కాదు అతడి తండ్రిని....‘ఈ అబ్బాయి ఇంత చిన్న వయసులో ఇంత నాలెడ్జ్ ఎలా సంపాదించాడు?’ అని అడిగాడు అమితాబ్. హరియాణాలోని మహేంద్రగఢ్‌కు చెందిన మయాంక్‌కు పాఠ్య విషయాలే కాదు ప్రపంచంలో జరిగే పరిణామాలు, చరిత్రకు సంబంధించిన విషయాలు తెలుసుకోవడం అంటే ఇష్టం. వాటి గురించి టీచర్లను అడుగుతుంటాడు. జనరల్ నాలెడ్జ్‌కు సంబంధించిన పుస్తకాలను చదువుతుంటాడు.అలా చదివిన జ్ఞానం వృథా పోలేదు.దేశవ్యాప్తంగా ఎంతోమంది దృష్టిలో పడేలా చేసింది. ఫ్రెండ్స్, మరి మీరు కూడా మయాంక్ ను స్ఫూర్తిగా తీసుకోవాలి. క్విజ్ పోటీలు ఉన్నప్పుడే జనరల్ నాలెడ్జ్‌పై దృష్టి పెట్టడం కాకుండా ప్రపంచ వ్యాప్తంగా జరిగే సంఘటనల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకోవాలి. దాంతోబాటు చరిత్రలో ఏం జరిగిందో కూడా పుస్తకాలు చదువుతూ తెలుసుకోవాలి.న్యూస్‌పేపర్ రోజూ చదవడం మరచిపోవద్దు.‘జననరల్ నాలెడ్జ్‌కు ఆకాశమే హద్దు’ అంటున్నాడు మయాంక్. నిజమే కదా!మనం ఎంత తెలుసుకున్నా తెలుసుకోవాల్సింది ఎంతో ఉంటుంది. మరి ఈరోజు నుంచే మీ ప్రయత్నం మొదలు పెట్టండి. ‘జనరల్ నాలెడ్జ్‌లో దిట్ట’ అనిపించుకోండి. -
ఐఎండీబీలో...రెండో స్థానంలో శోభిత... మూడో స్థానంలో షారుక్
ఫెమీనా మిస్ ఇండియా ఎర్త్ (2013) విజేతగా, మోడల్‌గా ‘గూఢచారి, మేజర్’ వంటి తెలుగు చిత్రాలతో, హిందీ ‘రామన్ రాఘవ్ 2.ఓ’ చిత్రంతో, ‘మేడ్ ఇన్ హెవెన్, ది నైట్ మేనేజర్’ వంటి సిరీస్‌లతో... ఇలా శోభితా ధూళిపాళ్ల చాలా పాపులార్టీ సంపాదించుకున్నారు. అయితే హీరో నాగచైతన్యతో ఎంగేజ్మెంట్ తర్వాత ఒక్కసారిగా వార్తల్లో ట్రెండింగ్‌గా నిలిచారామె.అందుకు నిదర్శనం ఎంటర్టైన్మెంట్ పోర్టల్ ‘ఐఎండీబీ’ (ఇంటర్నెట్ మూవీ డేటా బేస్) తాజాగా రిలీజ్ చేసిన భారతీయ సెలబ్రిటీల జాబితా. ఈ జాబితాలో శోభిత రెండో స్థానంలో నిలిచారు. గత వారానికి సంబంధించిన పాపులర్ ఇండియన్ సెలబ్రిటీల లిస్ట్‌ను ఐఎండీబీ తాజాగా విడుదల చేసింది. బాలీవుడ్ నటి శార్వరీ వాఘ్ (‘ముంజ్యా’ మూవీ ఫేమ్) తొలి స్థానంలో నిలవగా, శోభిత ద్వితీయ స్థానంలో నిలిచారు. బాలీవుడ్ స్టార్ హీరో షారుక్ ఖాన్‌కి మూడో స్థానం దక్కింది. నాగచైతన్య–శోభితల నిశ్చితార్థం ఈ నెల 8న హైదరాబాద్‌లో జరిగిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా పలువురు నెటిజన్లు ఆమె గురించి గూగుల్‌లో సెర్చ్ చేశారు. ఈ కారణంగా గత వారం ఇండియన్ పాపులర్ సెలబ్రిటీగా నిలిచారు శోభిత. ఇక ‘ఐఎండీబీ’ జాబితాలో కాజోల్ నాలుగో స్థానం, జాన్వీ కపూర్ ఐదో స్థానం, బ్యాడ్మింటన్ ప్లేయర్ లక్ష్యసేన్ ఆరు, దీపికా పదుకోన్ ఏడు, విజయ్ సేతుపతి ఎనిమిది, మృణాల్ ఠాకూర్ తొమ్మిది, ఐశ్వర్యా రాయ్ పదో స్థానాల్లో నిలిచారు. -
పల్లెటూరి పొలం గట్లపై రచ్చచేస్తున్న పాపులర్ బ్యూటీ ఫోటోలు వైరల్
-
పాక్‌లో ప్రముఖ ఆలయాలు (ఫొటోలు)
-
‘నా పొట్ట.. నా ఇష్టం’.. నెట్టింట్లో వైరల్ అవుతోన్న రెస్టారెంట్
కొత్తగా వ్యాపారం మొదలు పెట్టాలంటే పబ్లిసిటీ చాలా అవసరం. ట్రెండ్‌కు తగ్గట్లు కస్టమర్లను అట్రాక్ట్ చేయడానికి చేస్తున్న ప్రయత్నాలు అన్నీ ఇన్నీ కావు. ఈమధ్య రెస్టారెంట్ బిజినెస్‌కి డిమాండ్ బాగా పెరిగింది. డిఫరెంట్ థీమ్స్‌తో,క్యాచీ నేమ్స్‌తో వ్యాపారాన్ని విస్తరిస్తున్నారు. కొన్ని రెస్టారెంట్ పేర్లు అయితే ఒక్కసారి చదివితే గుర్తుండేలా వెరైటీగా ప్లాన్ చేస్తున్నారు. వెరైటీ పేర్లతో కస్టమర్లను ఆకర్షిస్తున్నారు. తాజాగా మరో రెస్టారెంట్ పేరు ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది. ఇటీవలె ప్రారంభమన ఆ రెస్టారెంట్ పేరు వింటే నవ్వు ఆపుకోలేరు. లేటెస్ట్గా ‘నా పొట్ట నా ఇష్టం’ అనే రెస్టారెంట్ పేరు సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతుంది. ఇప్పటికే ఈ రెస్టారెంట్ పేరుపై పలు ఫన్నీ మీమ్స్ నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. ఈ రెస్టారెంట్ రాజమండ్రిలోని దానవాయిపేటలో ఉంది. ఇదే పేరుతో మరో రెస్టారెంట్ జగిత్యాలలో ఉంది. దానిపై సరదా కవిత్వాలు అల్లేస్తున్నారు. “నా పొట్ట నా ఇష్టం” 😂 చూడూ - చూడకపో నీ ఇష్టం తినడం నా అభీష్టం 😃 నే తినకపోతే హోటెల్ వాడికి నష్టం 😪 మధ్యలో నీకేమిటి కష్టం? 🤔 భోజన ప్రియుల్ని ఆకర్షించేందుకు వినూత్న ఐడియాలతో రెస్టారెంట్ ఓనర్స్ తెగ ట్రై చేస్తున్నారు. మొదట్లో ఓ హోటల్ ప్రారంభిస్తే అక్కడి టేస్ట్, క్వాలిటీ బావుంటే ఆటోమెటిక్‌గా వ్యాపారం పుంజుకునేది. కానీ ప్రస్తుతం నిర్వాహకులు మౌత్ పబ్లిసిటీకే సై అంటున్నారు. క్రియేటివిటీతో కొత్త మార్గాలను ఎంచుకుంటున్నారు. తమ రెస్టారెంట్లకు డిఫరెంట్ పేర్లు పెట్టి సోషల్ మీడియాలో వైరల్ అయ్యేలా ప్రయత్నిస్తారు. ఇలా గతంలోనూ..తిందాంరా మామ, తిన్నంత భోజనం, పాలమూరు గ్రిల్స్, వివాహ భోజనంబు, సుబ్బయ్యగారి హోటల్, బాబాయ్ భోజనం, రాయలసీమ రుచులు, ఉలవచారు, నాటుకోడి, మాయాబజార్,రాజుగారి పులావ్, ఘుమఘుమలు,నిరుద్యోగి ఎంఏ, బీఈడి, కోడికూర చిల్లు వంటి వెరైటీ రెస్టారెంట్ల పేర్లు వైరల్ అయిన సంగతి తెలిసిందే. హైదరాబాద్ లో కనిపించే వెరైటీ టైటిల్స్ - హోటల్స్ తిన్నంత భోజనం - నాగోల్ మెట్రో ఉప్పు కారం - కొండాపూర్ కోడికూర, చిట్టిగారె - జూబ్లీ హిల్స్ రాజుగారి రుచులు - కొండాపూర్ వివాహ భోజనంబు - జూబ్లీ హిల్స్ దిబ్బ రొట్టి - మణికొండ అరిటాకు భోజనం - అమీర్ పేట వియ్యాలవారి విందు - ఎల్బీనగర్ తాలింపు - అమీర్ పేట తినేసి పో - కొంపల్లి బకాసుర - AS రావు నగర్ అద్భుతః - దిల్సుఖ్ నగర్ -
నోరూరించే నూడుల్స్‌పై చిరు కప్పలు.. లొట్టలేసుకుంటూ తింటున్న జనం!
మనదేశంలో తయారయ్యే ఫాస్ట్‌ఫుడ్‌లలో అత్యధికంగా అమ్ముడయ్యే ఆహారం నూడుల్స్. దేశంలో ఏ మూల చూసినా నూడుల్స్ దుకాణాలు కనిపిస్తాయి. అయితే ఇటీవలికాలంలో తైవాన్‌లో నూడుల్స్‌తో రూపొందించిన ఒక డిష్ ఎంతో ఆదరణ పొందుతోంది. ప్రపంచంలో రకరకాల ఆహార పదార్థాలు అందుబాటులో ఉన్నాయి. మనదేశంలో ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి వెళ్లినప్పుడు అక్కడి ఆహారాలలో ఎంతో వైవిధ్యం కనిపిస్తుంది. ఆహార ప్రియులు అన్ని రకాల ఆహారాలను ఆస్వాదించేందుకు ఉవ్విళ్లూరుతుంటారు. అటు మాంసాహారులు, ఇటు శాకాహారులు తమకు అనువైన వంటకాల కోసం వెదుకుతుంటారు. కొన్ని దేశాల్లో పురుగులు, కీటకాలు, కప్పలు ఆహారంలో భాగంగా మారిపోయాయి. కొన్ని ఆహారాలు ఎంత వింతగా ఉంటాయంటే వాటి గురించి వినగానే ఆశ్చర్యం కలుగుతుంది. అలాంటి విచిత్రమైన ఒక డిష్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. చిరు కప్పలతో నోరూరించే నూడుల్స్.. తైవాన్‌లో ఇటీవలికాలంలో కప్పల నూడుల్స్ ఎంతో ఆదరణ పొందుతోంది. ఆహార ప్రియులు ఈ నూడుల్స్‌ను తెగ ఎంజాయ్ చేస్తూ లాగించేస్తున్నారు. నోరూరించే వేడివేడి నూడుల్స్‌పై చిరు కప్పలను ఉంచి, సర్వ్ చేయడం ఈ డిష్ ప్రత్యేకత. కప్పలను ఉడికించి, మసాలా దట్టించి.. ఆడిటీ సెంట్రల్ న్యూస్ అందించిన ఒక రిపోర్టు ప్రకారం తైవాన్‌లోని యున్‌లిన్‌లో యువాన్ రమెన్ అనే రెస్టారెంట్ ఉంది. ఈ రెస్టారెంట్లో కప్పల నూడుల్స్‌ను ప్రత్యేకంగా తయారుచేస్తారు. ఈ డిష్ ప్రత్యేకత ఏమిటంటే గార్నిషింగ్‌లో కప్పలను వినియోగిస్తారు. ఇందుకోసం కప్పలను ముందుగా బాగా ఉడికించి, వాటికి మసాలా దట్టించి, నూనెలో దోరగా వేయిస్తారు. ఈ డిష్ పేరు ఏమిటంటే.. నూడుల్స్‌పై అప్పటికే మసాలా దట్టించి సిద్ధం చేసిన కప్పలను గార్నిషింగ్ చేస్తారు. కప్పల పైచర్మాన్ని తీయకుండానే ఇందుకోసం వినియోగిస్తారు. సోషల్ మీడియా యూజర్స్ ఈ డిష్‌కు ‘ఫ్రాగ్, ఫ్రాగ్, ఫ్రాగ్ రమెన్’ అనే పేరు పెట్టారు. ధర ఎంతంటే.. మీడియాకు అందిన సమాచారం ప్రకారం రమెన్ రెస్టారెంట్లో ఈ డిష్‌ను కేవలం మంగళవారం, బుధవారం రాత్రి డిన్నర్ సమయాలలో మాత్రమే వడ్డిస్తారు. ఈ విచిత్రమైన డిష్ ఖరీదు 8 అమెరికన్ డాలర్లు. భారత కరెన్సీలో రూ. 650. రెస్టారెంట్‌కు వెళ్లిన ఎవరైనా ఈ డిష్‌కు ఫొటో తీసుకోవాలనుకంటే 3.2 డాలర్లు చెల్లించాల్సి ఉంటుంది. కాగా ఈ డిష్‌ను అక్కడి ఆహార ప్రియులు లొట్టలేసుకుంటూ తింటారు. ఇది కూడా చదవండి: చైనాలో మరో అద్భుతం: బిల్డింగ్ మధ్య నుంచి దూసుకుపోయే రైలు.. -
భారతదేశంలోని టాప్-10 సంపన్న నటులు
-
టాప్ 10 మార్కెట్లలో నాలుగు బెంగళూరులోనే.. ఎక్కడెక్కడో తెలుసా?
న్యూఢిల్లీ: హైదరాబాద్‌లోని సోమాజిగూడ దేశంలోని ప్రముఖ 30 ప్రాంతాల్లో (ప్రముఖ మార్కెట్ ప్రాంతాలు) రెండో స్థానాన్ని దక్కించుకుంది. బెంగళూరులోని ఎంజీ రోడ్డు మొదటి స్థానంలో నిలవగా, ముంబై లింకింగ్ రోడ్డు మూడో స్థానంలో ఉంది. నాలుగో స్థానంలో ఢిల్లీలోని సౌత్ ఎక్స్టెన్షన్ (పార్ట్ 1, 2) ఉన్నట్టు నైట్ ఫ్రాంక్ ఇండియా ప్రకటించింది. ఆయా ప్రాంతాల్లో కస్టమర్లకు లభించే మెరుగైన అనుభవం ఆధారంగా ఈ స్థానాలను కేటాయించారు. కస్టమర్లకు మెరుగైన ప్రాంతాలు బెంగళూరులో ఎక్కువగా ఉన్నాయి. టాప్–10లో నాలుగు ఈ నగరం నుంచే ఉన్నాయి. దేశవ్యాప్తంగా ఎనిమిది ప్రధాన పట్టణాల్లోని ప్రాంతాలను టాప్–30 కోసం నైట్ ఫ్రాంక్ అధ్యయనం చేసింది. ‘థింక్ ఇండియా థింక్ రిటైల్ 2023 – హై స్ట్రీట్ రియల్ ఎస్టేట్ అవుట్‌లుక్’ పేరుతో నివేదికను విడుదల చేసింది. కొల్కతా పార్క్ స్ట్రీట్ అండ్ కామెక్ స్ట్రీట్ ఐదో స్థానంలో ఉంటే.. చెన్నై అన్నా నగర్, బెంగళూరు కమర్షియల్ స్ట్రీట్, నోయిడా సెక్టార్ 18 మార్కెట్, బెంగళూరు బ్రిగేడ్ రోడ్, చర్చి రోడ్ టాప్ 10లో ఉన్నాయి. వీటిని ప్రముఖ ప్రాంతాలుగా చెప్పడానికి అక్కడ పార్కింగ్ సౌకర్యాలు, అక్కడకు వెళ్లి రావడంలో ఉండే సౌకర్యం తదితర అంశాలను పరిగణనలోకి తీసుకున్నారు. దేశవ్యాప్తంగా టాప్ 8 పట్టణాల్లోని ప్రముఖ మార్కెట్ ప్రాంతాల్లో 13.2 మిలియన్ చదరపు అడుగుల పరిధిలో రిటైల్ స్టోర్లు ఉన్నాయి. ఇందులో 5.7 మిలియన్ చదరపు అడుగులు ఆధునిక రిటైల్ వసతులకు సంబంధించినది. ఈ టాప్–30 మార్కెట్లలో 2023–24లో 2 బిలియన్ డాలర్ల వినియోగం నమోదైనట్టు నైట్ ఫ్రాంక్ నివేదిక తెలిపింది. -
డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ యూజర్లకు షాక్: ఏప్రిల్ ఫూల్ కాదు నిజం!
సాక్షి, ముంబై: ప్రముఖ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫారమ్ డిస్నీ+ హాట్ స్టార్ యూజర్లకు షాక్. డిస్నీ+హాట్‌స్టార్ హెచ్బీవోతో డీల్‌ను ముగించుకుంది. ఫలితంగా హెచ్‌బీవో కంటెంట్ డిస్నీ+ హాట్‌స్టార్‌లో ఇకపై అందుబాటులో ఉండదు. ఈ విషయాన్ని సంస్థ స్వయంగా ట్విటర్ ద్వారా ధృవీకరించింది. డిస్నీ సీఈవో బాబ్ ఇగెర్ కంపెనీలో ఖర్చుల తగ్గింపు పునర్నిర్మాణాన్ని ప్రకటించిన తర్వాత ఈ పరిణామం చోటు చేసుకుంది. తాజా నిర్ణయంతో 'గేమ్ ఆఫ్ థ్రోన్స్' ,'ది సక్సెషన్' వంటి షోలను ఏప్రిల్ ఒకటి తరువాత అభిమానులు చూడలేరు. మార్చి 31 తరువాతనుంచి బడిస్నీ+ హాట్‌స్టార్‌లో హెచ్‌బీవో కంటెంట్ అందుబాటులో ఉండదు. కానీ ప్రధాన ప్రపంచ క్రీడా కార్యక్రమాలతోపాటు కంటెంట్ లైబ్రరీలో 100,000 గంటల టీవీ షోలు, సినిమాలను 10 భాషల్లో ఆస్వాదించవచ్చు అని ప్రకటించింది. మరోవైపు ఈ ప్రకటన తర్వాత డిస్నీ+ హాట్‌స్టార్ చందాదారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ సబ్స్క్రిప్షన్ డబ్బును రీఫండ్ చేయమని సోషల్ మీడియాలో డిమాండ్ చేస్తున్నారు. ఐపీఎల్ లేదు, ఎఫ్1 లేదు. ఇపుడు హెచ్‌బీవో లేదు. ఇక వార్షిక చందా కోసం ఎందుకు చెల్లించినట్టు అంటూ ఒక యూజర్ మండిపడ్డారు. Hi! Starting 31st March, HBO content will be unavailable on Disney+ Hotstar. You can continue enjoying Disney+ Hotstar’s vast library of content spanning over 100,000 hours of TV Shows and Movies in 10 languages and coverage of major global sporting events. — Disney+HS_helps (@hotstar_helps) March 7, 2023 ఏప్రిల్ 1 నుండి కనిపించని షోల జాబితా బాలర్స్ బ్రదర్స్ బ్యాండ్ క్యాచ్ అండ్ కిల్ కర్బ్ యువర్ ఎంత్ ఆంట్రేజ్ గేమ్ ఆఫ్ థ్రోన్స్ హౌస్ ఆఫ్ ది డ్రాగన్ మార్ ఆఫ్ ఈస్ట్‌టౌన్ మైండ్ ఓవర్ మర్డర్ ఒబామా సీన్స్ ఫ్రమ్ ఏ మ్యారేజ్ షాక్ సక్సెషన్ ద బేబీ ది నెవర్స్ ది సోప్రానోస్ ది టైమ్ ట్రావెలర్స్ వైఫ్ అండర్ కరెంట్ వాచ్ మెన్ వీ వోన్ దిస్ సిటీ కాగాహెచ్బీవో పలు బ్లాక్‌బస్టర్ షోలను నిర్మించింది. దశాబ్దాల తర్వాత కూడా వాటికి ఆదరణ తగ్గలేదు. 'ది ఫ్లైట్ అటెండెంట్', 'ప్రెట్టీ లిటిల్ లియర్స్: ఒరిజినల్ సిన్'తో సహా అనేక హెచ్‌బీవో మాక్స్ ఒరిజినల్లు ఇప్పటికే అమెజాన్‌లో అందుబాటులో ఉన్న నేపథ్యంలో అమెజాన్ ప్రైమ్ వీడియో ఇండియాలో హెచ్‌బీవో కంటెంట్‌ను ప్రసారం చేసే అవకాశం కూడా ఉందని పలువురు భావిస్తున్నారు. 2015లోహెచ్బీవ కంటెంట్ కోసం స్టార్ ఇండియా భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఏప్రిల్, 2020లో, వాల్ట్ డిస్నీ కంపెనీ 20 సెంచరీ స్టూడియోస్‌ను కొనుగోలు అనంతరం దానిపేరును డిస్నీ+ హాట్‌స్టార్‌గా మార్చిన సంగతి తెలిసిందే. -
ఉత్తమ కాపలా కుక్కలు.. అత్యంత అరుదుగా మొరిగే కుక్కలు
-
అరుదైన రికార్డు సాధించిన ధనుష్..
-
భారత్ లో ఫుట్ బాల్ ఎందుకు పాపులర్ కాలేదు..?
-
నయగరా జలపాతం కింద 100ల ఏళ్ల నాటి సొరంగం
ఇంతవరకు చాలామంది పర్యాటకులు నయాగరా జలపాతం అందాలను వీక్షించారు. ఆ దృశ్యాలను ఇంతవరకు పర్యాటకులు దూరం నుంచే వీక్షించారు. ఇక నుంచి చాలా దగ్గర నుంచే కళ్లను కట్టిపడేసే ఆ నయాగరా అందాలను వీక్షించొచ్చు అంటున్నారు అధికారులు. ఈ నయాగరా జలపాతం పర్యాటక కేంద్రంగా చాలా ప్రసిద్ధిగాంచింది. ఐతే జలపాతం కింద ఉన్న 100 ఏళ్ల నాటి సొరంగం పర్యాటక ఔత్సాహికుల కోసం తెరిచారు. దీంతో ఈ సొరంగం గుండా ఉన్న పవర్‌స్టేషన్ కూడా చూడవచ్చు. కెనడియన్ వైపు శతాబ్దం క్రితం నిర్మించిన 670 మీటర్ల సొరంగం నాటి ఇంజనీరింగ్ అద్భుతాన్ని బహిర్గతం చేస్తోంది. ఇప్పుడు ఈ పవర్ స్టేషన్‌ని కూడా నయగరా పర్యటనలో భాగంగా అందరూ వీక్షించే సువర్ణావకాశం కల్పించారు. 1905 నుంచి 2006 వరకు పనిచేసిన ఈ పవర్‌స్టేషన్ శక్తివంతమైన జెయింట్ జనరేటర్‌తో నయగరా నది నీటిని మళ్లించి ప్రాంతీయ పరిశ్రమను విద్యుద్దీకరించేవారు. ఈ ప్రాంతం ఒకప్పుడు జలవిద్యుత్‌ను వినియోగించుకోవాలనుకునే వ్యాపారవేత్తల కార్యకలాపాలకు కేంద్రంగా ఉంది. ఒక గాజుతో కప్పబడిన ఎలివేటర్ సదర్శకులను సొరంగంలోకి తీసుకువెళ్తుంది. అక్కడ పర్యాటకులు నయగరా జలపాతం అందమైన దృశ్యాల తోపాటు దిగువన ఉన్న పవర్ స్టేషన్‌ని కూడా చూడవచ్చు. (చదవండి: చిన్నారిని వీపుకి తగిలించుకున్న బాలుడెవరో తెలుసా!) -
ప్రధాని మోదీ అరుదైన రికార్డు.. బైడెన్ కంటే
న్యూఢిల్లీ: భారత ప్రధాని నరేంద్రమోదీ అరుదైన రికార్డు సొంతం చేసుకున్నారు. ప్రపంచంలోనే అత్యధిక ప్రజాదరణ ఉన్న నాయకులందరిలో మోదీ అగ్రస్థానాన్ని సాధించారు. యూఎస్‌కు చెందిన గ్లోబల్ లీడర్ మార్నింగ్ కన్సల్ట్ అనే పొలిటికల్ ఇంటెలిజెన్స్ సంస్థ తాజాగా రేటింగ్లను విడుదల చేసింది. సదరు సర్వే ఈ ఏడాది జనవరి 13 నుంచి 19 వరకూ కలెక్ట్ చేసిన డేటా ప్రకారం భారత ప్రధాని 71 శాతం రేటింగ్‌తో అత్యధిక ప్రజాదరణ ఉన్న నాయకునిగా అగ్రస్థానంలో నిలిచారు. ఆ తర్వాత 66 శాతం రేటింగ్‌తో మెక్సికో అధ్యక్షుడు ఆండ్రెస్ మేన్యుయెల్ లోపెజ్ ఓబ్రడార్ రెండో స్థానంలోను, 60 రేటింగ్‌తో ఇటలీ దేశానికి చెందిన మారియో డ్రాఘీ మూడో స్థానం సంపాదించారు. ఇక ఈ లిస్ట్‌లో చివరి స్థానంలో జపాన్ ప్రధాని సుగా నిలిచారు. ఈ సంస్థ 13 మంది ప్రపంచంలోని నాయకుల జాబితాను తన వెబ్సైట్లో విడుదల చేసింది. వీరిలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ 43 శాతం రేటింగ్‌తో ఆరోస్థానంలో నిలిచారు. కెనడా అధ్యక్షుడు జస్టిస్ ట్రూడో కూడా 43 శాతం రేటింగ్ సాధించారు. ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మారిసన్ 41 శాతం రేటింగ్‌ను సాధించారు. మార్నింగ్ కన్సల్ట్ పొలిటికల్ ఇంటెలిజెన్స్ సంస్థ ఆస్ట్రేలియా, బ్రెజిల్, కెనడా, ఫ్రాన్స్,జర్మనీ, ఇండియా, జపాన్, మెక్సికో, దక్షిణ కొరియా, స్పెయిన్, యూనైటెడ్ కింగ్డమ్, యూనైటేడ్ స్టేట్స్లో ప్రభుత్వ నాయకులు, ప్రజల్లో వారి పట్ల ఉన్న ఆదరణపై సర్వే నిర్వహిస్తుంది. మోదీ 2020లో కూడా 84 శాతం రేటింగ్‌తో అగ్రస్థానం పొందారు. అయితే, 2021లో మాత్రం ఆయన రేటింగ్ 63 శాతానికి పడిపోయింది. ఈ సంస్థ ప్రధానంగా ఎన్నికైన నాయకులు, అధికారులు, స్థానిక ఓటింగ్ సమస్యలపై ఆయాప్రాంతాలలోసర్వే నిర్వహిస్తుంది. ప్రధానంగా స్థానికంగా ఉన్నవయోజనులతో ఇంటర్వ్యూలు నిర్వహిస్తుంది. ప్రతిరోజు దాదాపు 20,000 కంటె ఎక్కువ మందిని కలుస్తారు. సర్వేలో ప్రతి దేశంలో వయస్సు, లింగం, ప్రాంతాలలో సర్వే నిర్వహిస్తారు. దేశాన్ని బట్టి నమునాలు మారుతూ ఉంటాయి. చదవండి: యూపీ ఎన్నికల్లో కాంగ్రెస్ సీఎం అభ్యర్థి ఎవరు?... క్లూ ఇచ్చిన ప్రియాంక! Global Leader Approval: Among All Adults https://t.co/wRhUGstJrS Modi: 71% López Obrador: 66% Draghi: 60% Kishida: 48% Scholz: 44% Biden: 43% Trudeau: 43% Morrison: 41% Sánchez: 40% Moon: 38% Bolsonaro: 37% Macron: 34% Johnson: 26% *Updated 01/20/22 pic.twitter.com/nHaxp8Z0T5 — Morning Consult (@MorningConsult) January 20, 2022 -
షాకింగ్: గుండెపోటుతో పాపులర్ యాక్టర్ మృతి
సాక్షి,ముంబై: సినీరంగాన్ని వరుస విషాదాలు వెన్నాడుతున్నాయి. గురువారం బాలీవుడ్ సంగీత దర్శకుడు శ్రావణ్ కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఈ విషాదంనుంచి ఇంకా తేరుకోకముందే పరిశ్రమ మరో ప్రముఖ నటుడిని కోల్పోయింది. ప్రముఖ గుజరాతీ నటుడు అమిత్ మిస్త్రీ తీవ్ర గుండెపోటుతో శుక్రవారం కన్నుమూశారు. ప్రతిభావంతుడైన నటుడు అమిత్ మిస్త్రీ కన్నుమూసిన వార్త షాకింగ్‌గా ఉందంటూ ఇండియన్ ఫిల్మ్ టీవీ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ట్వీట్ చేసింది. ఈ సందర్భంగా అమిత్ కుటుంబ సభ్యులకు సంతాపం తెలిపింది. మిస్త్రీ మరణంపై విచారం వ్యక్తం చేసిన నటి కుబ్రా సైత్ అమిత్ కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. ఇంకా పలువురు మిత్రులు, పరిశ్రమ పెద్దలు మిస్త్రీ అకాలమరణంపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కాగా అమెజాన్ ప్రైమ్ వీడియోలో రొమాంటిక్ డ్రామా వెబ్ సిరీస్ ‘బంధిష్, బండిట్స్’లో చివరిసారి కనిపించిన ఈ నటుడు పలు టీవీ షోస్, సిరీస్‌ల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అలాగే క్యా కహనా(ప్రీతి జింటా సోదరుడు), ఏక్ చాలిస్ కి లాస్ట్ లోకల్, 99, షోర్ ఇన్ ది సిటీ, యమలా పాగ్లా దీవానా లాంటి సినిమాల్లో నటించారు. అంతేకాదు డైలాగ్ రైటర్‌గా, డైరెక్టర్‌గానూ టెలివిజన్‌తో పాటు బాలీవుడ్, గుజరాతీ సినిమాలకు సేవలందించారు మిస్త్రీ. చారిత్రక తెనాలి రామ సీరియల్లో బీర్బల్ పాత్రలో అమిత్ మిస్త్రీ పలు భాషల టీవీ ప్రేక్షకులకు ఎప్పటికీ గుర్తిండిపోతారు. Shocking and Deeply Saddening news of one of the talented actor Amit Mistry passing away...Heartfelt condolence to family and friends..RIP🙏🏻 #IFTPC #SajidNadiadwala @JDMajethia @rtnjn @RameshTaurani @nrpachisia @Vijay_Galani @tsunami_singh #SureshAmin pic.twitter.com/Zm3o50qhHp — INDIAN FILM TV PRODUCERS COUNCIL (@IftpcM) April 23, 2021 I was ready to start shooting a show that Amit Mistry is an integral part of. His talent, his insight were a thing to behold. We've lost a truly wonderful artist today. Rest in Peace. — Vir Das (@thevirdas) April 23, 2021 My co star in the series "Saath pheron ki here pheri"(2018) actor Amit Mistry died of a cardiac arrest this morning.Absolutely shocked to hear this news.A fairly young guy and a gifted actor.Will miss you buddy. Rip🙏 — Shekhar Suman (@shekharsuman7) April 23, 2021 Absolutely shocking and unbelievable .. Amit Mistry departed to Heavenly abode............still can’t believe it...... — Dilip Joshi (@dilipjoshie) April 23, 2021 -
'పొట్ట పెంచుదాం'.. వైరల్‌గా మారిన రెస్టారెంట్
కొన్ని రెస్టారెంట్ల పేర్లు భలే వెరైటీగా ఉంటాయి. దీంతో అక్కడ దొరికే ఫుడ్ కంటే రెస్టారెంట్ పేరే ఫేమస్ అవ్వడం చాలా సందర్భల్లో చూస్తుంటాం. తాజాగా తెలుగు రాష్ట్రాల్లో ఓ రెస్టారెంట్ పేరు చర్చనీయాంశంగా మారింది. ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో కొత్తగా ఏర్పాటైన ఈ రెస్టారెంట్ పేరు 'పొట్ట పెంచుదాం'. వినడానికి చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించడంతో ఈ రెస్టారెంట్ పేరు ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది. సోషల్ మీడియా పుణ్యమాని ఇప్పటికే ఈ రెస్టారెంట్‌కు బోలెడంత మంది క్యూ కడుతున్నారు. (ఏనుగు మృతి.. వెక్కివెక్కి ఏడ్చిన అధికారి ) పేరే అంత వెరైటీగా ఉంటే ఇక ఫుడ్ ఇంకెంత టేస్టీగా ఉంటుందో అని చాలామంది ఈ రెస్టారెంట్‌కు వెళ్తున్నారట. దీంతో ప్రారంభించిన అతి తక్కువ టైంలోనే దీనికి మంచి గుర్తింపు లభించింది. తిండి తగ్గించి పొట్ట తగ్గించుదామనుకుంటే ఇదెక్కడి రెస్టారెంట్ రా బాబూ అని కొందరు ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు. గతంలో కూడా ఇలాంటి వెరైటీ రెస్టారెంట్లు బాగా పాపులర్ అయిన సంగతి తెలిసిందే. తినేసి పో, ఉప్పు కారం, దిబ్బ రొట్టె, అద్భుతః, కోడి కూర చిట్టి గారే, దా తిను, అమ్మ ముద్ద, పచ్చిపులుసు లాంటి పేర్లు జనాలను ఆకట్టుకున్నాయి. (ఇలాంటి ఫ్యామిలీ నెవర్ బిఫోర్, ఎవర్ ఆఫ్టర్!) -
ఫుట్‌పాత్ సౌందర్యం
కెమెరా ముందు నిలుచునే మోడల్స్ కొంతమంది. ఎప్పటికీ కెమెరా తెలియక ఫుట్‌పాత్ మీదే జీవితాలను వెళ్లమార్చే మోడల్స్ కొంతమంది. కానరాని ఈ ముఖాలను కనిపించేలాచేయొచ్చు కదా అనుకున్నాడు కేరళ ఫొటోగ్రాఫర్ మహదేవన్ థంపి. కొచ్చి ఫుట్‌పాత్ మీద చిన్న చిన్న వస్తువులు అమ్మేఅస్మాన్ అనే 21 ఏళ్ల అమ్మాయిని ఫొటోలు తీశాడు.‘స్ట్రీట్ టు స్టూడియో’ పేరుతో ఆస్మాన్కు తీసిన ఫొటోలు ఇప్పుడు అతనికీ, ఆమెకు కూడా ప్రశంసలు తెచ్చిపెడుతున్నాయి. అజ్ఞాత సౌందర్యం గురించి సంభాషిస్తున్నాయి. ఫ్లవర్ ఎగ్జిబిషన్లో పెట్టేవి మాత్రమే పూలు కాదు. ఒక సందు చివర ఏదో ఒక పూరిగుడిసె మట్టికుండలో ఒక పువ్వు పూస్తుంది. ఏదో మధ్యతరగతి ఇంటి పెరడులో ఉదయపు వెలుతురు రాక మునుపు ఒక పూవు పూస్తుంది. పొలాలకు వెళ్లే బాట అంచున ఒక పూవు పూస్తుంది. అడవిలో ఎవరి కంటా పడనివ్వని గుబురు వెనుక ఒక పువ్వు పూస్తుంది. వాటిని ఎవరు చూస్తారు. స్ట్రీట్ ఫొటోగ్రాఫర్లు, లైఫ్‌స్టైల్ ఫొటోగ్రాఫర్లు తమ దారిలో అదాటున కనిపించిన ముఖాలను ఫొటోలు తీస్తుంటారు. వాటిని పత్రికలలో వేసినప్పుడు ఆ ఫొటోలలోని వ్యక్తుల సౌందర్యం ఎంత బాగుందో అనిపిస్తుంది. ముఖ్యంగా రాజస్తాన్, కశ్మీర్ ప్రాంత స్త్రీలను గిరిజన ప్రాంతాల మహిళలను తీసినప్పుడు వారి స్వచ్ఛమైన సౌందర్యం ఎంతో గొప్పగా అనిపిస్తుంది. అయితే అలాంటి వారిని తీసుకొచ్చి వారి చేత ఫ్యాషన్ ఫొటోగ్రఫీ ఎవరూ చేయరు. ఎందుకంటే అందుకు వారు ఒప్పుకోరు. కాని కేరళకు చెందిన సినిమాటోగ్రాఫర్ కమ్ ఫ్యాషన్ ఫొటోగ్రాఫర్ అయిన మహదేవన్ థంపి ఇటీవల చేసిన ఆ ప్రయోగం ఇప్పుడు అందరి ప్రశంసలు అందుకుంటోంది. ఫుట్‌పాత్ సౌందర్యానికి సలామ్ కొచ్చికి చెందిన ఫొటోగ్రాఫర్ మహదేవన్ థంపి భిన్నమైన ప్రయోగాలు చేస్తాడన్న పేరు సంపాదించాడు. అతని ఫొటోసెషన్స్ అన్నీ నిర్భయంగా, మొహమాటాలు లేకుండా సాగుతాయి. ఆ విధంగా అతడు కొచ్చి వాసులకు తెలుసు. అలాగే కొచ్చిలో ఎడప్పల్లి ట్రాఫిక్ సిగ్నల్ మీదుగా వెళ్లేవారికి ఆస్మాన్ తెలుసు. ఆ ట్రాఫిక్ పాయింట్ దగ్గర చాలా రోజులుగా ఆస్మాన్ సీజనల్ వస్తువులు అమ్ముతూ ఉంటుంది. వానొస్తే గొడుగు, ఎండొస్తే విండ్‌షీల్డ్... ఇలా. ‘ఒక రోజు ఆమెను చూశాను. ఆమె నవ్వు చాలా బాగుందనిపించింది. అదొక్కటే కాదు.. ఆమె రూపం.. చర్మం కూడా ఒక ఫ్యాషన్ ఫొటోగ్రఫీకి బాగా పనికొస్తాయని అనిపించింది. వెంటనే ఆమెతో ఫొటో షూట్ చేయాలని నిశ్చయించుకున్నాను’ అన్నాడు థంపి. ‘ ఫుట్‌పాత్ మీద జీవించేవారిని మనం సాధారణంగా గౌరవించం. వారి శ్రమలో ఏం తక్కువ ఉంది. ముఖ్యంగా ఆ ఎండకు వానకు తడిచి స్త్రీలు ఎంత కష్టం చేస్తారు పొట్టకూటి కోసం. అలాంటి మహిళా స్ట్రీట్ వెండర్స్‌ను గౌరవించమని చెప్పడానికి కూడా నేను ఈ ఫొటో షూట్ చేయాలని అనుకున్నాను. నా మిత్రుడు మేకప్‌మేన్ అయిన ప్రబిన్కు ఈ విషయం చెప్తే జోక్ చేస్తున్నానేమో అనుకున్నాడు. కాని నేను నిజమే చెబుతున్నానని అర్థమయ్యాక చాలా ఉత్సాహంగా పనిలో దిగాడు’ అన్నాడు థంపి.రాజస్తాన్‌కు చెందిన దేశ దిమ్మరి జాతికి చెందిన ఆస్మాన్ కుటుంబం కొచ్చిలోనే కలమాస్సెరిలో మిగిలిన తమలాంటి కుటుంబాలతో ఉంటోంది. ‘నేను వాళ్లను కలిశాను. ఆస్మాన్ కుటుంబంతో మాట్లాడాను. వాళ్లు ఇవన్నీ పట్టని ప్రాథమిక జీవనాన్ని కోరుకునేవారు. చాలా చెప్పి ఒప్పించాల్సి వచ్చింది. మొత్తం మూడు కాస్టూమ్ సెషన్స్ అనుకున్నాం. నా మిత్రురాలు షెరీన్ కాస్ట్యూమ్స్ డిజైన్ చేసింది. క్లాప్ మీడియా ఈ ఫొటోషూట్‌ను ప్రొడ్యూస్ చేసింది’ అని తెలిపాడు థంపి. మెరిసిన ముత్యం ఫొటోషూట్ రోజున ఆస్మాన్ వచ్చింది. వచ్చాక కూడా ఇది నిజం కాదనే భావించింది. ‘ఆమెకు మేము ఎక్కువ మేకప్ వద్దనుకున్నాం. మొదటి ఫొటోషూట్ ముగిసే వరకూ ఆస్మాన్ ఇదంతా ఉత్తుత్తికే ఏమో అనుకుంది. కాని ఆ సెషన్ ఫొటోలు చూశాక ఆమెలో ఆత్మవిశ్వాసం పెరిగి మిగిలిన సెషన్స్‌లో స్వేచ్ఛగా ఫోజులిచ్చింది’ అన్నాడు థంపి. ఈయన తీసిన ఫొటోలు బయటకు వచ్చాక అందరూ థంపీని మెచ్చుకున్నారు. ఆస్మాన్కు అభినందనలు తెలిపారు. ‘సాధారణంగా ఇలాంటి ప్రయోగాలకు విమర్శలు కూడా వస్తాయి. స్ట్రీట్ వెండర్స్‌ను ఉద్ధరించినట్టు ఫోజులు కొడుతున్నాం అని కూడా అనవచ్చు. కాని ఎవరూ అనలేదు. నా ఉద్దేశాన్ని అర్థం చేసుకున్నారు. నేను చేసిన పని మరికొంతమందికి స్ఫూర్తినిచ్చి ఇలాంటి ప్రయోగాలు చేయనిస్తే అంతే చాలు’ అన్నాడు థంపి.ఈ ఫొటోలు వచ్చాక ఆస్మాన్ కొచ్చిన్‌లో ఇంకా ఫేమస్ అయ్యింది. కాని ఆమెకు ఈ రంగం ఏమీ ఇష్టం లేదు. మరునాడు యధావిధిగా ట్రాఫిక్ సిగ్నల్ దగ్గరకు చేరింది. గుప్పెడు మెతుకుల కోసం జీవితం అనే కెమెరా ముందు ఆమె అహర్నిశలు పోజులు ఇవ్వక తప్పదు కదా. – సాక్షి ఫ్యామిలీ -
రెనాల్ట్ ట్రైబర్ ఇండియా ధరల వాత
సాక్షి, ముంబై: రెనాల్ట్ ఇండియా తన పాపులర్ ఎంపీవీ ట్రైబర్ ధరలను పెంచేసింది. గత ఏడాది ఆగస్టులో భారత మార్కెట్ లో రెనాల్ట్ ట్రైబర్ లాంచ్ చేసింది. ఆ తరువాత కొత్త నిబంధనలకు అనుగుణంగా అప్ డేట్ చేసి బీఎస్-6 వేరియంట్ ట్రైబర్‌ను 4.99 లక్షల (ఎక్స్-షోరూమ్) ఈ ఏడాది జనవరిలో తీసుకొచ్చింది. ఈ సందర్భంగా 29 వేల రూపాయల మేర ధర పెంచింది. తాజాగా మరోసారి పెంపుతో 11,500 నుండి 13,000 మేర వినియోగదారులపై భారం మోపనుంది. దేశంలో రెనాల్ట్ ట్రైబర్ ప్రారంభ ధర రూ. 5.12 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉండనుంది. ఈ కారును లాంచ్ చేసినప్పటినుంచి ఇప్పటికి నాలుగు సార్లు ధర పెంచడం గమనార్హం. ప్రధానంగా ఆర్ఎక్స్ఈ మోడల్ ధరను 13 వేల రూపాయలు పెంచింది. దీంతో దీని ధర ఇప్పుడు 5.12 లక్షలుగా ఉంది. అలాగే 12,500 పెంపుతో ఆర్ఎక్స్ జెడ్, ఆఎక్స్ జెడ్ ఏఏంటీ వేరియంట్ ధరలు 6.94 లక్షలు, 7.34 లక్షలు (అన్ని ధరలు ఎక్స్-షోరూమ్) రూపాయలు. రెనాల్ట్ ట్రైబర్ ఎంపీవీ సింగిల్ పవర్ ట్రెయిన్ ఆప్షన్‌తో వస్తుంది. 1.0 లీటర్, 3 సిలిండర్ ఇంజిన్, 5 స్పీడ్ ఏఎంటీ, 5 స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో లభ్యం. -
ఎక్కడున్నా నాగులూరిని అరెస్టు చేస్తాం..
సాక్షి, ప్రకాశం : పశ్చిమ ప్రాంతంలో నాటుసారా సరఫరాలో కింగ్ మేకర్‌గా పేరు పొందిన నాగులూరి ఏసును ఎక్కడున్నా అరెస్టు చేసి తీరుతామని మార్కాపురం ఈఎస్ ఆవులయ్య హెచ్చరించారు. సోమవారం రాత్రి 120 లీటర్ల నాటుసారా స్వాధీనం చేసుకొని నలుగురిని అరెస్టు చేసినట్లు విలేకరుల సమావేశంలో వెల్లడించారు. ఈఎస్ కథనం ప్రకారం.. పొదిలి సీఐ వెంకట్రావు ఆధ్వర్యంలో గోగినేనివారిపాలెం సమీపంలో 100 లీటర్ల నాటుసారా స్వా«దీనం చేసుకుని అరుణ్‌కుమార్, కోటేశ్ అనే ఇద్దరిని ఎక్సైజ్ పోలీసులు అరెస్టు చేశారు. వీరిని విచారణ చేయగా వచ్చిన సమాచారం మేరకు చీమకుర్తి మండలం గురవారెడ్డిపాలేనికి చెందిన షేక్ బీబీని అరెస్టు చేశారు. మరో వైపు విచారణలో సారా అమ్మకాలు సాగిస్తున్న పోలా ఏసును సింగరాయకొండ సీఐ లత ఆధ్వర్యంలో అరెస్టు చేశారు. వీరి నుంచి 20 లీటర్ల నాటుసారా, 75 కేజీల నల్లబెల్లం స్వాధీనం చేసుకున్నారు. వీరికి కింగ్ మేకర్‌గా నాగులూరి ఏసు వ్యవహరిస్తున్నారు. నాగులూరి కుటుంబ సభ్యుల సహకారంతో విచ్చలవిడిగా నాటుసారా కేంద్రాలను గతంలో నిర్వహించారు. అతడిని పది రోజుల్లో అరెస్టు చేస్తామని ఈఎస్ ఆవులయ్య విలేకరుల సమావేశంలో హెచ్చరించారు. నాటుసారా తయారీని అరికట్టేందుకు తమ శాఖ కృత నిశ్చయంతో ఉందన్నారు. దుర్గా ప్రసాద్ ఆధ్వర్యంలో స్పెషల్ టీమ్‌ను నియమించినట్లు చెప్పారు. నాగులూరి ఏసు ఎక్కడ కనిపించినా తమకు సమాచారం ఇవ్వాలని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు. -
భారత్‌లో పాపులర్ బ్రాండ్లు ఇవే!
సాక్షి, న్యూఢిల్లీ : ఇప్పటికీ అమెరికాకు చెందిన ఐటీ దిగ్గజ కంపెనీలే భారతీయుల విశ్వాసాన్ని చూరగొంటున్నవి. అమెరికాలోని కాలిఫోర్నియా ప్రధాన కేంద్రంగా పనిచేస్తున్న ఇంటర్నెట్ సర్చ్ ఇంజన్ ‘గూగుల్’ భారత్‌లో ఎక్కువ పాపులర్ అయిన బ్రాండ్. ఆ తర్వాత స్థానాల్లో వాట్సాప్, యూట్యూబ్‌లు కొనసాగుతున్నట్లు లండన్‌లోని మార్కెట్ పరిశోధన, డేటా విశ్లేషణ సంస్థ ‘యూగౌ’ తెలిపింది. ‘బ్రాండ్ హెల్త్ ర్యాంకింగ్స్’ పేరిట పది సంస్థలకు ఇది రేటింగ్ ఇచ్చింది. వాటిలో స్విగ్గీకి ఐదవ ర్యాంక్, మేక్‌మైట్రిప్‌కు ఆరవ ర్యాంక్ లభించాయి. నాణ్యత, విలువ, సంతృప్తి, పేరు ప్రతిష్టలతోపాటు వినియోగదారులు ఇతరులకు వీటిని సిఫార్సు చేస్తారా? అన్న అంశాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ ర్యాంకింగ్‌లనూ యూగౌ కేటాయించింది. భారతీయుల విశ్వాసాన్ని చూరగొన్న ఇతర పాపులర్ బ్రాండుల్లో అమెజాన్‌కు నాలుగవ ర్యాంక్, ఉబర్‌కు ఏడవ ర్యాంక్, ఫేస్బుక్, ఓలా, జుమాటోలకు వరుసగా ఎనిమిది, తొమ్మిది, పదవ ర్యాంకులు లభించాయి. 2018, జూలై ఒకటవ తేదీ నుంచి 2019, జూన్ 30 వరకు ఏడాది కాలాన్ని పరిగణలోకి తీసుకొని ఈ బ్రాండ్లను కేటాయించారు. ప్రపంచ ర్యాంకుల్లో కూడా గూగుల్ మొదటి స్థానంలో ఉండడం విశేషం. ఆ తర్వాత స్థానాల్లో వరుసగా వాట్సాప్, యూట్యూబ్, శ్యామ్‌సంగ్, ఫేస్బుక్, అమెజాన్, ఐకియా, నైక్, పేపాల్, నెట్ఫిక్స్లు కొనసాగుతున్నాయి. భారత్‌లో 2018లోనే ఉబర్ఈట్స్, జొమాటో, స్విగ్గీ, ఇన్స్టాగ్రామ్, కొటక్ మహీంద్రా బ్యాంక్, అమెజాన్ బ్రాండ్లు ఎక్కువ ప్రాచుర్యంలోకి వచ్చినట్లు ‘యూగౌ’ సంస్థ తెలిపింది. -
సాహో సగ్గుబియ్యమా...
సాగో అనే పేరుతో ప్రాచుర్యం పొందాయి సగ్గుబియ్యం. వీటిని కర్ర పెండలం నుంచి తీసుకున్న పొడితో తయారు చేస్తారు. సగ్గుబియ్యాన్ని పాయసంగా, ఉప్మాగా తయారు చేసుకుని తింటారు. జావగా కాచుకుని కూడా తాగుతారు. వీటిలో కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉంటాయి. ఫ్యాట్ తక్కువగా ఉంటుంది. బరువు తగ్గాలనుకునేవాళ్లకు సగ్గుబియ్యం సరైన ఆహారం. ఇందులో పిండిపదార్థం శాతం ఎక్కువగా ఉంటుంది. రసాయనాలు లేని సహజమైన తీపి గుణం ఉండటం వల్ల చాలమంది సగ్గు బియ్యానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. సగ్గుబియ్యంలో అనేక ఆరోగ్య రహస్యాలు దాగున్నాయి. కండరాల పెరుగుదలకి సగ్గుబియ్యం ఉపయోగపడతాయి. వీటిలో ప్రొటీన్లు, క్యాల్షియం ఎక్కువగా ఉంటాయి. ఇవి రక్తపోటును నియంత్రించడంతో పాటు రక్తంలో ఉండే చెడు కొలెస్ట్రాల్ స్థాయులను తగ్గిస్తాయి. వీటిలో ఎక్కువ మొత్తంలో పొటాషియం ఉండటం వల్ల రక్తప్రసరణ సజావుగా సాగుతుంది. ఫలితంగా గుండె సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశాలను తగ్గిస్తాయి. వీటిని ఆహారంలో చేర్చుకుంటే సత్తువ వస్తుంది. దాంతో రోజంతా ఉత్సాహంగా ఉంటారు. వీటిలోని కార్బొహైడ్రేట్స్ శరీరానికి కావాల్సిన మోతాదులో ఉంటాయి. గ్యాస్, కడుపు ఉబ్బరం వంటి సమస్యలను నివారిస్తాయి. అలాగే శరీరంలో మంచి కొలెస్ట్రాల్ స్థాయులను పెంచి.. ఆరోగ్యంగా ఉండటానికి సహాయపడతాయి. వీటిలో ఫోలిక్ యాసిడ్, విటమిన్ బి ఉంటాయి కాబట్టి గర్భిణీలు వీటిని డైట్ లో చేర్చుకోవాలి. వీటిలో ఉండే విటమిన్ కె మెదడుకి మంచిది. -
యూట్యూబ్ టాప్ వీడియో ఏదో తెలుసా?
శాన్ఫ్రాన్సిస్కో: వీడియో షేరింగ్ వెబ్సైట్ యూ ట్యూబ్ మోస్ట్‌పాపులర్ వీడియో ఏదో తెలుసా? తాజాగా యూ ట్యూబ్ 2017 అత్యంత జనాదరణ పొందిన వీడియోల జాబితాను విడుదల చేసింది. వాచింగ్, షేరింగ్, కమెంట్లు, లైక్‌లు ఇతర గణాంకాల ఆధారంగా వీటిని ఎంపిక చేసింది. వీటిలో "ది మాస్క్ సింగర్" అనే వీడియో మొదటి స్థానంలో నిలిచింది. ఈ సంవత్సరపు వైరల్ వీడియో గా థాయ్‌లాండ్ రియాల్టీ షోలో "అంటిల్ విల్ విల్ బికమ్ డస్ట్" సాంగ్ వీడియో టాప్ లో నిలిచింది. 182 మిలియన్ కంటే ఎక్కువ వ్యూస్‌ను ఇది సొంతం చేసుకుంది. అలాగే అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ప్రారంభోపన్యాసంపై రూపొందించిన పేరడీ వీడియో ‘బ్యాడ్లిప్ రీడింగ్’ వీడియోకూడా టాప్ ట్రెండింగ్ వీడియోస్‌లో ఒకటిగా నిలిచింది. జనవరి 25న ప్లబిష్ అయిన ఈ వీడియో 35 మిలియన్లకు పైగా వ్యూలను, 5లక్షల 11వేల లైక్‌లను 27వేలకు కమెంట్లను సాధించింది. అలాగే అమెరికన్ పాప్‌స్టార్ లేడీ గాగా సూపర్ బౌల్ లి, అమెరికా గాట్ టాలెంట్ షో లో 12 ఏళ్ల వెంట్రిలోక్విస్ట్ గానం, బీబీసీ లైవ్ షోలో హల్చల్ చేసిన ఇద్దరు పిల్లల వీడియో ఈ లిస్ట్‌లో టాప్ 10లో నిలిచాయి. -
ఎదురులేని మోదీ
వాషింగ్టన్: దేశ రాజకీయాల్లో అత్యంత ప్రజాదరణ కలిగిన నేతగా ప్రధాని మోదీ కొనసాగుతున్నారు. అమెరికా కేంద్రంగా పనిచేస్తున్న ప్రముఖ సర్వే సంస్థ ప్యూ బుధవారం వెల్లడించిన వివరాల ప్రకారం.. ఈ జాబితాలో 88 శాతం పాయింట్లతో మోదీ అగ్రస్థానంలో, కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ 58 శాతంతో రెండో స్థానంలో ఉన్నారు. ఆ తరువాత వరసగా కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీకి 57%, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు 39% పాయింట్లు దక్కాయి. ఈ ఏడాది ఫిబ్రవరి 21 నుంచి మార్చి 10 మధ్య 2,464 భారతీయులపై ఈ సర్వే నిర్వహించించారు. దీని ప్రకారం.. ప్రతి పది మందిలో 8 మంది దేశ ఆర్థి క పరిస్థితులు మెరుగ్గా ఉన్నట్లు చెప్పారు. దక్షిణాది రాష్ట్రాల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, పశ్చిమ రాష్ట్రాల్లో మహారాష్ట్ర, గుజరాత్, ఛత్తీస్‌గఢ్‌లలో ప్రతి 10 మందిలో 9 మంది మోదీపై సానుకూలంగా స్పందించారు. ఇప్పటికీ దేశంలో మత కలహాలు ఆందోళన కలిగించే విషయమని కొందరు చెప్పారు. -
ఆరో రోజూ అదే ఆదరణ
♦ వైఎస్సార్ సీపీ శ్రే ణులకు ఘన స్వాగతం పలుకుతున్న ప్రజలు ♦ స్థానిక సమస్యలు నేతల దృష్టికి.. ♦ అధికారంలోకి రాగానే పరిష్కరిస్తామని హామీ సాక్షి ప్రతినిధి, ఒంగోలు : జిల్లాలో చేపట్టిన గడప గడపకు వైఎస్సార్సీపీ కార్యక్రమానికి విశేష ఆదరణ లభిస్తోంది. పార్టీ నేతలు ఉత్సాహంగా కార్యక్రమంలో పాల్గొంటున్నారు. తమ ముంగిటకు వచ్చిన నాయకులకు స్థానికులు ఘనస్వాగతం పలుకుతున్నారు. ప్రజా సమస్యలను నేతల దృష్టికి తెచ్చారు. పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే అన్ని సమస్యలు పరిష్కరిస్తామని నేతలు హామీ ఇస్తున్నారు. ఆరో రోజు కార్యక్రమంలో భాగంగా బుధవారం ఒంగోలులో నగరంలోని 2వ డివిజన్ పరిధిలోని చిన్నమల్లేశ్వరకాలనీ, కేశవరాజుకుంట ప్రాంతాల్లో పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి గడప గడపకు వైఎస్సార్సీపీ కార్యక్రమాన్ని నిర్వహించారు. స్థానికుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు నిర్వహించిన పర్యటనలో మహిళలతో పాటు స్థానిక ప్రజలు ఆయనకు ఘన స్వాగతం పలికారు. చీరాల నియోజకవర్గంలో పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త యడం బాలాజీ వేటపాలెం మండలం దేశాయిపేటలో కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రజా బ్యాలెట్లు పంపిణీ చేశారు. కనిగిరి నియోజకవర్గ సమన్వయకర్త బుర్రా మధుసూదన్‌యాదవ్ పీసీపల్లి మండలం చౌటగోగులపల్లిలో, పర్చూరు నియోజకవర్గంలో పార్టీ సమన్వయకర్త గొట్టిపాటి భరత్ కారంచేడు మండలం ఆదిపూడిలో, కొండపి నియోజకవర్గంలో నియోజకవర్గ సమన్వయకర్త వరికూటి అశోక్‌బాబు మర్రిపూడి మండలం ధర్మవరం గ్రామంలో గడప గడపకు వైఎస్సార్ సీపీ కార్యక్రమం నిర్వహించారు. సంతమాగులూరు మండలం కొప్పరం గ్రామంలో జరిగిన కార్యక్రమంలో అద్దంకి నియోజకవర్గ సమన్వయకర్త బాచిన చెంచు గరటయ్య, మండల కేంద్రం అర్థవీడులో నిర్వహించిన కార్యక్రమంలో గిద్దలూరు నియోజకవర్గ సమన్వయకర్త ఐ.వి.రెడ్డి పాల్గొన్నారు.