ఇండియా చాయ్ ఆస్ట్రేలియాలోనూ ఫేమసే!
మెల్‌బోర్న్: ఇండియాలో చాయ్ చాలా ఫేమస్. మరి ఆస్ట్రేలియాలో ఎందుకు కాదు? విర్ది వాల్లాకు కూడా ఇలాగే అనిపించింది. ఓసారి ఇండియావాలా చాయ్ రుచిని ఆస్ట్రేలియన్లకు కూడా చూపిస్తే ఎలా ఉంటుందో చూద్దామనుకొని చిన్నగా వ్యాపారాన్ని ప్రారంభించింది. కంగారులకు మన చాయ్ తెగనచ్చేయడంతో గిరాకీ బాగా పెరిగింది. దీంతో విర్ది వేర్వేరు ప్రాంతాల్లో దాదాపు 80 బ్రాంచీలను తెరిచింది.
ఇప్పుడు అవన్నీ హౌస్‌ఫుల్ కలెక్షన్‌తో అలరారుతున్నాయి. అంతేనా.. ఆన్‌లైన్ ద్వారా కూడా సేవలను అందిస్తోంది. చాయ్‌ను ఇంత రుచిగా చేయడం విర్ది తన తాత దగ్గర నేర్చుకుందట. ఆయన ప్రకృతి వైద్యుడు కావడంతో ఏ కాలంలో ఏ చాయ్ తాగాలో, వాటిని ఎలా తయారు చేయాలో తెలుసుకున్న విర్ది ఇప్పుడు ఆస్ట్రేలియాలో అమలు చేస్తోంది. తన బిజినెస్ గురించి విర్ది మాట్లాడుతూ... భారతీయుల చాయ్ గొప్పతనాన్ని కంగారులకు పరిచయం చేయడమే తన లక్ష్యమని చెబుతోంది. ఓ భారతీయ మహిళ ఇదంతా చేయడం నిజంగా గొప్ప విషయమే కదూ!