Amit Mistry Passed Away: పాపులర్‌ యాక్టర్‌ మృతి | Amit Mistry Death Cause - Sakshi
Sakshi News home page

షాకింగ్‌: గుండెపోటుతో పాపులర్‌ యాక్టర్‌ మృతి

Published Fri, Apr 23 2021 1:23 PM | Last Updated on Fri, Apr 23 2021 3:12 PM

 Amit Mistry passes away from cardiac arrest - Sakshi

సాక్షి,ముంబై: సినీరంగాన్ని వరుస విషాదాలు వెన్నాడుతున్నాయి. గురువారం బాలీవుడ్‌ సంగీత దర్శకుడు శ్రావణ్‌ కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఈ విషాదంనుంచి ఇంకా తేరుకోకముందే పరిశ్రమ మరో ప్రముఖ నటుడిని కోల్పోయింది. ప్రముఖ గుజరాతీ నటుడు అమిత్ మిస్త్రీ తీవ్ర గుండెపోటుతో శుక్రవారం కన్నుమూశారు. ప్రతిభావంతుడైన నటుడు అమిత్ మిస్త్రీ కన్నుమూసిన వార్త షాకింగ్‌గా ఉందంటూ ఇండియన్ ఫిల్మ్ టీవీ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్  ట్వీట్‌ చేసింది. ఈ సందర్భంగా అమిత్‌ కుటుంబ సభ్యులకు సంతాపం తెలిపింది. మిస్త్రీ మరణంపై విచారం వ్యక్తం చేసిన నటి కుబ్రా సైత్ అమిత్ కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. ఇంకా పలువురు మిత్రులు, పరిశ్రమ పెద్దలు మిస్త్రీ అకాలమరణంపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

కాగా అమెజాన్ ప్రైమ్ వీడియోలో రొమాంటిక్ డ్రామా వెబ్ సిరీస్‌ ‘బంధిష్‌, బండిట్స్‌’లో చివరిసారి కనిపించిన ఈ నటుడు పలు టీవీ షోస్, సిరీస్‌ల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అలాగే క్యా  కహనా(ప్రీతి జింటా  సోదరుడు), ఏక్ చాలిస్ కి లాస్ట్ లోకల్, 99, షోర్ ఇన్ ది సిటీ, యమలా పాగ్లా దీవానా లాంటి సినిమాల్లో నటించారు. అంతేకాదు  డైలాగ్ రైటర్‌గా, డైరెక్టర్‌గానూ టెలివిజన్‌తో పాటు బాలీవుడ్, గుజరాతీ సినిమాలకు సేవలందించారు మిస్త్రీ.  చారిత్రక  తెనాలి రామ సీరియల్లో‌ బీర్బల్ పాత్రలో  అమిత్ మిస్త్రీ   పలు భాషల టీవీ ప్రేక్షకులకు ఎప్పటికీ గుర్తిండిపోతారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement