1/8
ఏ దేశంలో అయినా మైనారిటీలను అక్కడి ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేస్తాయనే విమర్శలు సహజం. ఇస్లాం దేశమైన పాకిస్తాన్‌లో హిందువులది అదే పరిస్థితి!. అయితే ఒకప్పుడు అఖండ భారతంలో అంతర్భాగమైన ఆ నేలలో.. ప్రముఖ ఆలయాలు కొన్ని భక్తుల పూజలు అందుకుంటున్నాయి.
2/8
కటాస్ రాజ మందిరం : కటాసరాజ ఆలయం పాకిస్తాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్ చక్వాల్ జిల్లాలోని కటాస్ గ్రామంలో ఉంది. ఇది ఒక శివాలయం. మహాభారతకాలంలో పాండవులు తమ అరణ్యవాసంలో కొంతకాలాన్ని ఈ ప్రదేశంలో గడిపినట్టు భావిస్తారు. దక్షయజ్ఞసమయంలో, సతీదేవి ప్రయోప్రవేశం చేసినదన్న వార్త తెలిసినపుడు శివుని కంటి నుండి రెండు కన్నీటిబొట్లు రాలాయి. అవి భూమి మీద పడినపుడు, ఒకటి ఇక్కడి కటాసక్షేత్రంలోని అమృతకుండ్ తీర్థంగానూ, రెండవది భారతదేశం, రాజస్థాన్ రాష్ట్రంలోని అజమేరు (అజ్మీర్)లోని పుష్కరరాజ్ తీర్థంగానూ మారాయి అని స్థలపురాణం చెబుతోంది. ఈ ఆలయక్షేత్రాన్ని ప్రపంచవారసత్వ సంపదగా గుర్తింపజేయాలని పాకిస్తాన్ ప్రయత్నిస్తోంది. 2005 సంవత్సరంలో భారత మాజీ ఉపప్రధాని లాల్ కృష్ణ అద్వానీ ఈ ఆలయాన్ని సందర్శించారు.
3/8
హింగ్లాజ్ మాత దేవాలయం : బెలోచిస్తాన్ హింగోల్ నేషనల్ పార్క్‌లోని గుహలో ఉందీ ఆలయం. ఆత్మ బలిదానంలో సతీ దేవి తల ఈ ప్రాంతంలోనే పడిందని చెబుతూ.. శక్తి పీఠాలలో ఒకటిగా దీనిని కొలుస్తుంటారు. పాక్ హిందువులు ప్రతీ ఏడాది క్రమం తప్పకుండా హింగ్లాజ్ యాత్ర నిర్వహిస్తుంటారు. ఈ ఆలయాన్ని ముస్లింలు నాని మందిర్‌గా గౌరవిస్తుంటారు.
4/8
5/8
కల్కా ఆలయం : మాతా కల్కా దేవి ఆలయం.. సింధ్ ప్రావిన్స్‌లో అరోర్ పర్వత గుహల్లో ఉందీ ఆలయం. హిందువులతో పాటు ముస్లింలు ఈ దేవిని కొలుస్తుంటారు.
6/8
సాధు బేలా ఆలయం : సింధ్ ప్రావిన్స్ ఇండస్ నది తీరాన సుక్కూరులో ఉన్న ద్వీపంలో ఉందీ ఆ ఆలయం.
7/8
శ్రీ పంచముఖి హనుమాన్ మందిర్ : కరాచీలోని రద్దీ ఏరియా సోల్జర్ బజార్‌లో ఉంది ఈ ఆలయం. దాదాపు పదిహేను వందల ఏళ్ల చరిత్ర ఉన్న ఆ ఆలయం.. పాక్ గడ్డలో అత్యంత పురాతన ప్రార్థనా మందిరాల్లో ఒకటిగా పేరు దక్కించుకుంది.
8/8
వరుణ్ దేవ్ టెంపుల్ : కరాచీలోనే ఉన్న మరో ఆలయం వరుణ్ దేవ్ మందిర్. మనోరా ఐల్యాండ్‌లో ఉటుందీ ఆలయం. హిందువులు ఈ ఆలయాన్ని పరమ పవిత్రంగా భావిస్తూ.. ఆలయ పరిసరాల్లో పరిశుభ్రతను పాటిస్తుంటారు.