సాక్షి, ముంబై: ప్రముఖ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫారమ్ డిస్నీ+ హాట్ స్టార్ యూజర్లకు షాక్. డిస్నీ+హాట్‌స్టార్ హెచ్‌బీవోతో డీల్‌ను ముగించుకుంది. ఫలితంగా హెచ్‌బీవో కంటెంట్ డిస్నీ+ హాట్‌స్టార్‌లో ఇకపై అందుబాటులో ఉండదు. ఈ విషయాన్ని సంస్థ స్వయంగా ట్విటర్ ద్వారా ధృవీకరించింది. డిస్నీ సీఈవో బాబ్ ఇగెర్ కంపెనీలో ఖర్చుల తగ్గింపు పునర్నిర్మాణాన్ని ప్రకటించిన తర్వాత ఈ పరిణామం చోటు చేసుకుంది.
తాజా నిర్ణయంతో 'గేమ్ ఆఫ్ థ్రోన్స్' ,'ది సక్సెషన్' వంటి షోలను ఏప్రిల్ ఒకటి తరువాత అభిమానులు చూడలేరు. మార్చి 31 తరువాతనుంచి బడిస్నీ+ హాట్‌స్టార్‌లో హెచ్‌బీవో కంటెంట్ అందుబాటులో ఉండదు. కానీ ప్రధాన ప్రపంచ క్రీడా కార్యక్రమాలతోపాటు కంటెంట్ లైబ్రరీలో 100,000 గంటల టీవీ షోలు, సినిమాలను 10 భాషల్లో ఆస్వాదించవచ్చు అని ప్రకటించింది. మరోవైపు ఈ ప్రకటన తర్వాత డిస్నీ+ హాట్‌స్టార్ చందాదారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ సబ్‌స్క్రిప్షన్ డబ్బును రీఫండ్ చేయమని సోషల్ మీడియాలో డిమాండ్ చేస్తున్నారు. ఐపీఎల్ లేదు, ఎఫ్1 లేదు. ఇపుడు హెచ్‌బీవో లేదు. ఇక వార్షిక చందా కోసం ఎందుకు చెల్లించినట్టు అంటూ ఒక యూజర్ మండిపడ్డారు.
Hi! Starting 31st March, HBO content will be unavailable on Disney+ Hotstar. You can continue enjoying Disney+ Hotstar’s vast library of content spanning over 100,000 hours of TV Shows and Movies in 10 languages and coverage of major global sporting events.
— Disney+HS_helps (@hotstar_helps) March 7, 2023
ఏప్రిల్ 1 నుండి కనిపించని షోల జాబితా
బాలర్స్
బ్రదర్స్ బ్యాండ్
క్యాచ్ అండ్ కిల్
కర్బ్ యువర్ ఎంత్
ఆంట్రేజ్
గేమ్ ఆఫ్ థ్రోన్స్
హౌస్ ఆఫ్ ది డ్రాగన్
మార్ ఆఫ్ ఈస్ట్‌టౌన్
మైండ్ ఓవర్ మర్డర్
ఒబామా
సీన్స్ ఫ్రమ్ ఏ మ్యారేజ్
షాక్
సక్సెషన్
ద బేబీ
ది నెవర్స్
ది సోప్రానోస్
ది టైమ్ ట్రావెలర్స్ వైఫ్
అండర్ కరెంట్
వాచ్ మెన్
వీ వోన్ దిస్ సిటీ
కాగాహెచ్‌బీవో పలు బ్లాక్‌బస్టర్ షోలను నిర్మించింది. దశాబ్దాల తర్వాత కూడా వాటికి ఆదరణ తగ్గలేదు. 'ది ఫ్లైట్ అటెండెంట్', 'ప్రెట్టీ లిటిల్ లియర్స్: ఒరిజినల్ సిన్'తో సహా అనేక హెచ్‌బీవో మాక్స్ ఒరిజినల్‌లు ఇప్పటికే అమెజాన్‌లో అందుబాటులో ఉన్న నేపథ్యంలో అమెజాన్ ప్రైమ్ వీడియో ఇండియాలో హెచ్‌బీవో కంటెంట్‌ను ప్రసారం చేసే అవకాశం కూడా ఉందని పలువురు భావిస్తున్నారు. 2015లోహెచ్‌బీవ కంటెంట్ కోసం స్టార్ ఇండియా భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఏప్రిల్, 2020లో, వాల్ట్ డిస్నీ కంపెనీ 20 సెంచరీ స్టూడియోస్‌ను కొనుగోలు అనంతరం దానిపేరును డిస్నీ+ హాట్‌స్టార్‌గా మార్చిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment