Content Library
-
కొత్తగా.. ఎనిమిదో ఖండం! 375 ఏళ్లుగా ..
ఇప్పటి వరకు ఏడు ఖండాలున్నాయని చదువుకున్నాం. కానీ ఇప్పుడూ ఖండాలు ఎనిమిది అని చెప్పక తప్పదేమో!. ఇది దాదాపు 365 ఏళ్లుగా కనపడకుండా దాక్కుని ఉందట. తాజాగా భూవిజ్ఞాన శాస్త్రవేత్తలు, భూకంప శాస్త్రవేత్తలు ఈ కొత్త ఖండాన్ని గుర్తించారు. అందుకు సంబంధించిన ఆసక్తికర విషయాలను టెక్టోనిక్స్ జర్నల్‌లో వెల్లడించారు. ఆ కొత్త ఖండం విశేషాలు గురించే ఈ కథనం. ఈ కొత్త ఖండాన్ని దాదాపు 94 శాతం నీటి అడుగున ఉందని తెలిపారు. దీని పేరు జిలాండియా లేదా టె రియు-ఎ-మౌయి. ప్రస్తుతం శాస్తవేత్తలు ఈ కొత్త ఖండంతో కలిపి సరికొత్త మ్యాప్‌ను సిద్ధం చేశారు. ఈ జిలాండియా అనే ఎనిమిదవ ఖండం దాదాపు 1.89 మిలియన్ చదరపు మైళ్ల(4.9 మిలియన్ చదరపు కి.మీ) విస్తీరణంలో విశాలంగా ఉందని వెల్లడించారు. ఇది మడగాస్కర్ కంటే ఆరు రెట్లు ఎక్కువ అని అన్నారు. ఈ కనుగొన్న కొత్త ఖండంతో కలిపి ప్రస్తుతం మనకు ఎనిమిది ఖండాలు ఉన్నాయని శాస్త్రవేత్తల బృందం పేర్కొంది. ఇది చూడటానికి సన్నగా అతి పిన్న వయస్కురాలైన ఖండంగా రికార్డు నెలకొల్పిందన్నారు. అలాగే ఈ ఖండాన్ని వెలికితీసేందుకు చాలా సమయం పడుతుందన్నారు. ఈ ఖండాన్ని అధ్యయనం చేయడం చాలా క్లిష్టతరం అన్నారు. ప్రస్తుతానికి ఈ ఖండానికి సంబంధించి..సముద్రపు అడుగు భాగం నుంచి సేకరించిన రాళ్లు, అవక్షేప నమునాలను అధ్యయనం చేస్తున్నారు. ఈ ఖండం పశ్చిమ అంటార్కిటికాలో భౌగోళిక లక్షణాలను కూడా చూపుతోందన్నారు. ఇది న్యూజిలాండ్ పశ్చిమతీరంలో క్యాంప్‌బెల్ పీఠభూమి సమీపంలోని ఉన్నట్లు తెలిపారు. ఈ ప్రాంతంలో అయస్కాంత క్రమరాహిత్యాలను కూడా గుర్తించాల్సి ఉంది. ఈ జిలాండియా ఖండం పురాతన సూపర్ ఖండమైన గోండ్వానాలో భాగం అని చెబుతున్నారు భూ విజ్ఞాన శాస్త్రవేత్తలు. ఇది సుమారు 550 మిలియన్ సంవత్సరాల క్రితమే ఏర్పడిందని, ముఖ్యంగా దక్షిణ అర్థగోళంలోని మొత్తం భూమిని కలిపిందని చెబుతున్నారు శాస్త్రవేత్తలు. (చదవండి: మనవరాలి సంరక్షణ కోసం.. గంటకు రూ. 1600లు డిమాండ్ చేసిన అమ్మమ్మ!..షాక్‌లో కూతురు) -
డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ యూజర్లకు షాక్: ఏప్రిల్ ఫూల్ కాదు నిజం!
సాక్షి, ముంబై: ప్రముఖ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫారమ్ డిస్నీ+ హాట్ స్టార్ యూజర్లకు షాక్. డిస్నీ+హాట్‌స్టార్ హెచ్బీవోతో డీల్‌ను ముగించుకుంది. ఫలితంగా హెచ్‌బీవో కంటెంట్ డిస్నీ+ హాట్‌స్టార్‌లో ఇకపై అందుబాటులో ఉండదు. ఈ విషయాన్ని సంస్థ స్వయంగా ట్విటర్ ద్వారా ధృవీకరించింది. డిస్నీ సీఈవో బాబ్ ఇగెర్ కంపెనీలో ఖర్చుల తగ్గింపు పునర్నిర్మాణాన్ని ప్రకటించిన తర్వాత ఈ పరిణామం చోటు చేసుకుంది. తాజా నిర్ణయంతో 'గేమ్ ఆఫ్ థ్రోన్స్' ,'ది సక్సెషన్' వంటి షోలను ఏప్రిల్ ఒకటి తరువాత అభిమానులు చూడలేరు. మార్చి 31 తరువాతనుంచి బడిస్నీ+ హాట్‌స్టార్‌లో హెచ్‌బీవో కంటెంట్ అందుబాటులో ఉండదు. కానీ ప్రధాన ప్రపంచ క్రీడా కార్యక్రమాలతోపాటు కంటెంట్ లైబ్రరీలో 100,000 గంటల టీవీ షోలు, సినిమాలను 10 భాషల్లో ఆస్వాదించవచ్చు అని ప్రకటించింది. మరోవైపు ఈ ప్రకటన తర్వాత డిస్నీ+ హాట్‌స్టార్ చందాదారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ సబ్స్క్రిప్షన్ డబ్బును రీఫండ్ చేయమని సోషల్ మీడియాలో డిమాండ్ చేస్తున్నారు. ఐపీఎల్ లేదు, ఎఫ్1 లేదు. ఇపుడు హెచ్‌బీవో లేదు. ఇక వార్షిక చందా కోసం ఎందుకు చెల్లించినట్టు అంటూ ఒక యూజర్ మండిపడ్డారు. Hi! Starting 31st March, HBO content will be unavailable on Disney+ Hotstar. You can continue enjoying Disney+ Hotstar’s vast library of content spanning over 100,000 hours of TV Shows and Movies in 10 languages and coverage of major global sporting events. — Disney+HS_helps (@hotstar_helps) March 7, 2023 ఏప్రిల్ 1 నుండి కనిపించని షోల జాబితా బాలర్స్ బ్రదర్స్ బ్యాండ్ క్యాచ్ అండ్ కిల్ కర్బ్ యువర్ ఎంత్ ఆంట్రేజ్ గేమ్ ఆఫ్ థ్రోన్స్ హౌస్ ఆఫ్ ది డ్రాగన్ మార్ ఆఫ్ ఈస్ట్‌టౌన్ మైండ్ ఓవర్ మర్డర్ ఒబామా సీన్స్ ఫ్రమ్ ఏ మ్యారేజ్ షాక్ సక్సెషన్ ద బేబీ ది నెవర్స్ ది సోప్రానోస్ ది టైమ్ ట్రావెలర్స్ వైఫ్ అండర్ కరెంట్ వాచ్ మెన్ వీ వోన్ దిస్ సిటీ కాగాహెచ్బీవో పలు బ్లాక్‌బస్టర్ షోలను నిర్మించింది. దశాబ్దాల తర్వాత కూడా వాటికి ఆదరణ తగ్గలేదు. 'ది ఫ్లైట్ అటెండెంట్', 'ప్రెట్టీ లిటిల్ లియర్స్: ఒరిజినల్ సిన్'తో సహా అనేక హెచ్‌బీవో మాక్స్ ఒరిజినల్లు ఇప్పటికే అమెజాన్‌లో అందుబాటులో ఉన్న నేపథ్యంలో అమెజాన్ ప్రైమ్ వీడియో ఇండియాలో హెచ్‌బీవో కంటెంట్‌ను ప్రసారం చేసే అవకాశం కూడా ఉందని పలువురు భావిస్తున్నారు. 2015లోహెచ్బీవ కంటెంట్ కోసం స్టార్ ఇండియా భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఏప్రిల్, 2020లో, వాల్ట్ డిస్నీ కంపెనీ 20 సెంచరీ స్టూడియోస్‌ను కొనుగోలు అనంతరం దానిపేరును డిస్నీ+ హాట్‌స్టార్‌గా మార్చిన సంగతి తెలిసిందే. -
ఫేస్బుక్ గుడ్‌న్యూస్,పెద్దమొత్తంలో డబ్బులు సంపాదించేలా..
న్యూఢిల్లీ: facebook launches online courses for content creators కంటెంట్ క్రియేటర్లకు ఆన్లైన్ కోర్స్‌ను సామాజిక మాధ్యమం ఫేస్బుక్ పరిచయం చేసింది. ఫేస్‌బుక్‌తోపాటు ఇన్‌స్ట్రాగామ్‌లో ఈ కోర్స్ అందుబాటులో ఉంటుంది. మార్కెట్ ధోరణి, ఉత్పత్తి నవీకరణలు, సవాళ్ల గురించి నిపుణులతో బోధన ఉంటుంది. క్రియేటర్లకు విషయ పరిజ్ఞానం పెంచుకోవడానికి, అధిక ఆదాయం, వృద్ధికి తోడ్పడుతుందని ఇన్‌స్ట్రాగామ్ హెడ్ అడమ్ మోసెరీ తెలిపారు. చిన్న పట్టణాల్లోనూ ఇన్‌స్ట్రాగామ్ షార్ట్ వీడియో ఫీచర్ అయిన రీల్స్ వాడకం పెరిగిందని చెప్పారు. ప్రతిరోజూ సగటున 60 లక్షల రీల్స్ నమోదవుతున్నాయని వెల్లడించారు. చదవండి: పైసా ఖర్చుండదు.. కానీ, డబ్బులే డబ్బులు -
Gimbal: వీడియో కంటెంట్ ఇప్పుడు మరింత కొత్తగా
హైదరాబాద్: వీడియో కెమెరాలు, స్మార్ట్ఫోన్లను మరింత సమర్థంగా ఉపయోగించుకునేందుకు వీలుగా చైనాకి చెందిన ప్రముఖ ఎలక్ట్రానిక్ సంస్థ జియూన్ సరికొత్త జింబల్లను ఇండియాలో రిలీజ్ చేసింది. జింబల్స్ స్మూత్ క్యూ3, విబిల్ 2ను ఇటీవల ఆవిష్కరించింది. జియూన్ అందిస్తోన్న జింబల్లో త్రీ-యాక్సిస్, రొటేటబుల్ ఫిల్ లైట్, 17 స్మార్ట్ టెంప్లేట్స్ వంటి ఫీచర్లు ఉన్నాయి. అంతేకాదు 4300k వార్మ్ టోన్డ్ ఇంటిగ్రేటెడ్ ఫిల్ లైట్, మూడు లెవల్స్‌లో బ్రైట్ అడ్జస్ట్మెంట్, ఫ్రంట్, రియర్ లైటింగ్ కోసం 180° టచ్ బటన్ కంట్రోల్ వంటి ఫీచర్లు ఉన్నాయి. వీటి సాయంతో తక్కువ వెలుతురులోనూ నాణ్యమైన వీడియోలను మరిన్ని యాంగిల్స్‌లో తీసే వీలు కలుగుతుంది. స్మూత్-క్యూ3 యూజర్లు స్మార్ట్ టెంప్లేట్స్, అడ్వాన్స్డ్ ఎడిటర్ వంటి కొత్త ఫీచర్లతో గతంలో కంటే అధిక విధాలుగా ఇప్పుడు తమ స్టోరీలు క్యాప్చర్ చేయవచ్చు, క్రియేట్ చేసుకోవచ్చు. స్మార్ట్ఫోన్ల కోసం ప్రత్యేకంగా రూపొందించిన స్మూత్ క్యూ3 అన్ని ప్రధాన ఆండ్రాయిడ్, యాపిల్ ఫోన్లను సపోర్టు చేస్తుంది. కంటెంట్ క్రియేటర్లు, ఇతరులకు మెరుగైన క్వాలిటీ అందిస్తుంది. కొత్త ప్రొడక్టు ఆవిష్కరణ సందర్భంగా జియూన్ ఇండియా ప్రతినిధి మయాంక్ చచ్రా మాట్లాడుతూ... భారతీయ మార్కెట్ నుంచి మాకు మంచి స్పందన లభిస్తోందన్నారు. ప్రస్తుతం మా బ్రాండ్ నుంచి 11 ఉత్పత్తులు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ఈ ఆర్థిక సంవత్సరం చివరి నాటికి ఈ సంఖ్యను 15 పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు వివరించారు. చదవండి : Xiaomi Smart Glasses: మాట్లాడేందుకు కళ్ల జోళ్లొస్తున్నాయ్ -
ఫేస్బుక్లో హింస ఈ రేంజ్లో ఉందా!?
ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం ఫేస్బుక్ కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగించే అకౌంట్లపై దృష్టిసారించింది. ఇందులో భాగంగా ఈ ఏడాది జూన్ 16 నుంచి జులై 31 మధ్య కాలంలో సుమారు 33.3 మిలియన్ల కంటెంట్ పీస్ (ఇమేజ్)లను అకౌంట్ల నుంచి తొలగించినట్లు ప్రకటించింది. యూజర్లు సేఫ్ అండ్ సెక్యూర్‌గా ఉండేందుకు ఫేస్ బుక్ గత కొంత కాలంగా యూజర్లు టెక్నాలజీ, ఏఐలపై భారీ ఎత్తున పెట్టుబడులు పెడుతోంది. తద్వారా ఫేస్ బుక్ యూజర్లకు ఎలాంటి నష్టం జరగకుండా ఉండేలా ఇమేజెస్, కంటెంట్లపై కన్నేసింది. ఈ రెండింటిలో ఫేస్‌బుక్‌కు చెందిన 10 కంటెంట్ పాలసీ నిబంధనలతో పాటు ఆ సంస్థకు చెందిన మరో సోషల్ నెట్ వర్క్ ఇన్ స్టాగ్రామ్‌లో 8 పాలసీల నిబంధనల్ని ఉల్లంఘించిన అకౌంట్లపై చర్యలు తీసుకుంటుంది. సోషల్ మీడియా వల్ల హింస పెరిగిపోతుందా? కరోనా కారణంగా సోషల్ మీడియా వినియోగం రోజురోజుకి పెరిగిపోయింది. సరైన అవగాహన ఉన్నవారు మనీ ఎర్నింగ్ కోసం ఫేస్‌బుక్‌ను ఓ వేదికగా మార్చుకుంటున్నారు. అదే సమయంలో మరికొందురు రెచ్చగొడుతూ హింసను ప్రేరేపించేలా ఉన్న కంటెంట్లను భారీగా తొలగించామంటూ ఇటీవల ఫేస్బుక్ స్పోక్ పర్సన్ కీలక వ్యాఖ్యలు చేశారు. జులై 16 నుంచి జులై 31 మధ్య కాలంలో 25.6 మిలియన్ల ఇమేజ్ కంటెంట్, హింసను రెచ్చగొట్టేలా ఉన్న 3.5 మిలియన్ల గ్రాఫికల్ ఇమేజెస్‌పై, 2.6 మిలియన్ల అడల్ట్ కంటెంట్ ఉన్న ఇమేజెస్‌లను తొలగించినట్లు తెలిపారు. వీటితో పాటు 1లక్షా 23,400 హరాస్ మెంట్ కంటెంట్ ఉన్న అకౌంట్లపై చర్యలు తీసుకుంటున్నట్లు,1504 రిపోర్ట్‌ల ఫిర్యాదులు అందాయని వెల్లడించింది. ఫేస్బుక్కే కాదు.. ఇన్ స్టాగ్రామ్ లో కూడా.. ఫేస్బుక్కే కాదు..ఇన్ స్టాగ్రామ్ పోస్ట్‌లపై చర్యలు తీసుకుంటున్నట్లు ఫేస్బుక్ యాజమాన్యం వెల్లడించింది. 1.1 మిలియన్ల హింసాత్మక పోస్ట్‌లు, 8,11,000 వేల సూసైడ్, సెల్ఫ్ ఇంజూరీ ఇమేజ్ కంటెంట్ లపై చర్యలకు ఉపక్రమించింది. జూన్ 16 నుంచి జులై 31 వరకు 265 అకౌంట్లపై యూజర్లు ఫిర్యాదు చేసినట్లు వెల్లడించింది. వాట్సాప్ లో సైతం ఫేస్బుక్ కు చెందిన మెసేజింగ్ ప్లాట్ ఫామ్ వాట్సాప్‌లో జూన్ 16 నుంచి జులై 31 వరకు 3 మిలియన్ కంటే ఎక్కువ అకౌంట్లును తొలగించింది. ఇదే సమయంలో సెర్చ్ ఇంజిన్ గూగుల్ కు 36,934 ఫిర్యాదులు అందగా..95,680 ఇమేజెస్‌ను తొలగించింది. చదవండి: ఇకపై ఈజీగా ఎలక్ట్రిక్ వెహికల్‌ను సొంతం చేసుకోవచ్చు! -
ఈరోస్ లైబ్రరీ ఆపిల్ కొనబోతుందా!
ముంబయి: ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ ఈరోస్ గ్రూప్ వివిధ సినిమాలకు, సంగీతానికి సంబంధించిన కంటెంట్ లైబ్రరీని విక్రయించనుంది. ఇందుకోసం ఆ సంస్థ ఇప్పటికే ఆపిల్ సంస్థతో ప్రాథమిక చర్చల్లో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే, వీటిని కొనుగోలు చేసేందుకు అమెజాన్, నెట్ఫ్లిక్స్వంటి సంస్థలు కూడా వరుసలో ఉన్నట్లు తెలిసింది. అయితే, ప్రస్తుతం ఆ చర్చలు ఇంకా ప్రారంభదశలోనే ఉన్నట్లు పేరు చెప్పేందుకు ఇష్టపడని సదరు సంస్థకు చెందిన అధికారి ఒకరు తెలిపారు. సన్నిహిత వర్గాల సమాచారం ప్రకారం ఈరోస్ తన కంటెంట్ లౌబ్రరీ దాదాపు ఒక బిలియన్ డాలర్ల విలువను కలిగి ఉందంట. అయితే, ప్రస్తుతం దీనిపై తాము ఇప్పుడే ఎలాంటి వ్యాఖ్యలు చేయబోమంటూ ఇటూ ఆపిల్ సంస్థ అలాగే, అమెజాన్, నెట్ ఫ్లిక్స్ సంస్థలు తెలిపాయి. అవన్నీ వదంతలు, ఊహాగానాలు అంటూ కొట్టి పడేశాయి. అయితే, ఇది ప్రైవేటు వ్యవహారం కావడంతో దీనిపై బహిరంగ ప్రకటన చేసేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు. ఒకసారి ఈ కంటెంట్ లైబ్రరీ విక్రయించిన తర్వాత యూరోస్ డిజిటల్ కంటెంట్కూడా కొనుగోలు దారుల చేతుల్లోకి వెళ్లిపోనుందట.