స్టార్ యూట్యూబర్ కావాలంటే చేతిలో స్మార్ట్‌ఫోన్ ఉండగానే సరిపోదు. స్మార్ట్‌గా ఆలోచించాలి. మహేష్ కేశ్‌వాలా ‘డిజిటల్ స్టార్’ స్టేటస్ రాత్రికి రాత్రి రాలేదు. మోడలింగ్ ఎక్స్‌పీరియన్స్‌తో సోషల్ మీడియాలోకి అడుగుపెట్టిన మహేష్ ఒక్కో మెట్టు ఎక్కుతూ ‘డిజిటల్ స్టార్’ అయ్యాడు. ‘ఫోర్బ్స్’ జాబితాలో చోటు సంపాదించాడు...
గేష్‌గా ప్రసిద్ధుడైన సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్, కంటెంట్ క్రియేటర్ మహేష్ కేశ్‌వాలాకు ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్‌లలో ఏడు మిలియన్‌ల మంది ఫాలోవర్‌లు ఉన్నారు. ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించడమే తన బలం.
‘దైనందిన జీవితంలోని సంఘటనల నుంచి కంటెంట్ క్రియేట్ చేస్తాను. అలా అని తొందరపడకుండా ఏది ట్రెండింగ్‌లో ఉందో, ఏది ప్రేక్షకులకు నచ్చుతుందో ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తాను. ఎంతో పరిశోధించాకగానీ ఒక వీడియో చేయడం జరగదు’ అంటున్నాడు ముంబైకి చెందిన తుగేష్.
‘ది తుగేష్ షో’ బాగా పాపులర్ అయింది. ఈ షో కోసం తాను సాధారణంగా క్రియేట్ చేసే రీల్స్, కామెంటరీ వీడియోలతో పోలిస్తే పదిరెట్లు ఎక్కువగా కష్టపడ్డాడు. ‘మందులకే కాదు కంటెంట్‌కు కూడా ఎక్స్‌పైరీ డేట్ ఉంటుంది. అయిదు సంవత్సరాల క్రితం సూపర్ హిట్ అయిన కంటెంట్‌ను ఇప్పుడు ఎవరూ పట్టించుకోక΄ోవచ్చు. అందుకే కంటెంట్ క్రియేటర్‌లు కాలంతోపాటు ప్రయాణించాలి’ అంటాడు తుగేష్.
‘సక్సెస్ మంత్రా ఏమిటి?’ అనే ప్రశ్నకు మహేష్ చెప్పిన జవాబు...‘సక్సెస్‌కు షార్ట్ కట్‌లు ఉండవు. కఠోర శ్రమ, అంకితభావం ఉంటే ఎవరికైనా విజయం సాధ్యమే. నా ప్రపంచంలో క్రియేటివ్ బ్లాక్స్‌కు తావు లేదు’ హాస్యమే కాకుండా ఇండియన్ మీడియా, సోషల్ మీడియా ప్రముఖులపై తుగేష్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాడు.
‘తుగేష్ లైవ్’ అనే వ్లాగింగ్ చానల్ ద్వారా తన ట్రావెల్ వ్లాగ్‌లు, వ్యక్తిగత అనుభవాలను షేర్ చేస్తుంటాడు. ‘ఒక ప్రాజెక్ట్‌కు మంచి పేరు వచ్చిన తరువాత ‘నెక్ట్స్ ప్రాజెక్ట్ దీనికంటే భిన్నంగా ఉండాలి అని ఆలోచిస్తాను’ అంటున్న మహేష్ ఇటీవల ‘ఫోర్బ్స్ ఇండియా టాప్ డిజిటల్ స్టార్స్’ జాబితాలో చోటు సంపాదించాడు.
ఏ పని చేసినా యాంత్రి కంగా కాకుండా శ్రద్ధగా చేయాలి. కంటెంట్ విషయంలో ‘నాకు నచ్చితే చాలు’ అనుకోకుండా 360 డిగ్రీ కోణంలో విశ్లేషించాలి. ఎప్పుడూ కొత్తగా ఆలోచించాలి. అని చెబుతున్నాడు తగేష్.
(చదవండి: సింపుల్ అండ్ గ్రేస్‌ఫుల్..!)
Comments
Please login to add a commentAdd a comment