ఈరోస్ లైబ్రరీ ఆపిల్ కొనబోతుందా!
ముంబయి: ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ ఈరోస్ గ్రూప్ వివిధ సినిమాలకు, సంగీతానికి సంబంధించిన కంటెంట్ లైబ్రరీని విక్రయించనుంది. ఇందుకోసం ఆ సంస్థ ఇప్పటికే ఆపిల్ సంస్థతో ప్రాథమిక చర్చల్లో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే, వీటిని కొనుగోలు చేసేందుకు అమెజాన్, నెట్‌ఫ్లిక్స్‌వంటి సంస్థలు కూడా వరుసలో ఉన్నట్లు తెలిసింది. అయితే, ప్రస్తుతం ఆ చర్చలు ఇంకా ప్రారంభదశలోనే ఉన్నట్లు పేరు చెప్పేందుకు ఇష్టపడని సదరు సంస్థకు చెందిన అధికారి ఒకరు తెలిపారు.
సన్నిహిత వర్గాల సమాచారం ప్రకారం ఈరోస్ తన కంటెంట్ లౌబ్రరీ దాదాపు ఒక బిలియన్ డాలర్ల విలువను కలిగి ఉందంట. అయితే, ప్రస్తుతం దీనిపై తాము ఇప్పుడే ఎలాంటి వ్యాఖ్యలు చేయబోమంటూ ఇటూ ఆపిల్ సంస్థ అలాగే, అమెజాన్, నెట్ ఫ్లిక్స్ సంస్థలు తెలిపాయి. అవన్నీ వదంతలు, ఊహాగానాలు అంటూ కొట్టి పడేశాయి. అయితే, ఇది ప్రైవేటు వ్యవహారం కావడంతో దీనిపై బహిరంగ ప్రకటన చేసేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు. ఒకసారి ఈ కంటెంట్ లైబ్రరీ విక్రయించిన తర్వాత యూరోస్ డిజిటల్ కంటెంట్‌కూడా కొనుగోలు దారుల చేతుల్లోకి వెళ్లిపోనుందట.