కొత్తగా.. ఎనిమిదో ఖండం! 375 ఏళ్లుగా .. | Scientists Discover 8th Continent Of The World That Had Been Missing For 375 Years - Sakshi
Sakshi News home page

8th Continent Zealandia Found: కొత్తగా.. ఎనిమిదో ఖండం! 375 ఏళ్లుగా !..వెలుగులోకి షాకింగ్‌ విషయాలు

Published Wed, Sep 27 2023 12:24 PM | Last Updated on Wed, Sep 27 2023 1:18 PM

Scientists Discover Continent That Missing For 375 Years - Sakshi

ఇప్పటి వరకు ఏడు ఖండాలున్నాయని చదువుకున్నాం. కానీ ఇప్పుడూ ఖండాలు ఎనిమిది అని చెప్పక తప్పదేమో!. ఇది దాదాపు 365 ఏళ్లుగా కనపడకుండా దాక్కుని ఉందట. తాజాగా భూవిజ్ఞాన శాస్త్రవేత్తలు, భూకంప శాస్త్రవేత్తలు ఈ కొత్త ఖండాన్ని గుర్తించారు. అందుకు సంబంధించిన ఆసక్తికర విషయాలను టెక్టోనిక్స్‌ జర్నల్‌లో వెల్లడించారు. ఆ కొత్త ఖండం విశేషాలు గురించే ఈ కథనం.

ఈ కొత్త ఖండాన్ని దాదాపు 94 శాతం నీటి అడుగున ఉందని తెలిపారు. దీని పేరు జిలాండియా లేదా టె రియు-ఎ-మౌయి. ప్రస్తుతం శాస్తవేత్తలు ఈ కొత్త ఖండంతో కలిపి సరికొత్త మ్యాప్‌ను సిద్ధం చేశారు. ఈ జిలాండియా అనే ఎనిమిదవ ఖండం దాదాపు 1.89 మిలియన్‌ చదరపు మైళ్ల(4.9 మిలియన్‌ చదరపు కి.మీ) విస్తీరణంలో విశాలంగా ఉందని వెల్లడించారు. ఇది మడగాస్కర్‌ కంటే ఆరు రెట్లు ఎక్కువ అని అన్నారు. ఈ కనుగొన్న కొత్త ఖండంతో కలిపి ప్రస్తుతం మనకు ఎనిమిది ఖండాలు ఉన్నాయని శాస్త్రవేత్తల బృందం పేర్కొంది.

ఇది చూడటానికి సన్నగా అతి పిన్న వయస్కురాలైన ఖండంగా రికార్డు నెలకొల్పిందన్నారు. అలాగే ఈ ఖండాన్ని వెలికితీసేందుకు చాలా సమయం పడుతుందన్నారు. ఈ ఖండాన్ని అధ్యయనం చేయడం చాలా క్లిష్టతరం అన్నారు. ప్రస్తుతానికి ఈ ఖండానికి సంబంధించి..సముద్రపు అడుగు భాగం నుంచి సేకరించిన రాళ్లు, అవక్షేప నమునాలను అధ్యయనం చేస్తున్నారు. ఈ ఖండం పశ్చిమ అంటార్కిటికాలో భౌగోళిక లక్షణాలను కూడా చూపుతోందన్నారు.

ఇది న్యూజిలాండ్‌ పశ్చిమతీరంలో క్యాంప్‌బెల్‌ పీఠభూమి సమీపంలోని ఉన్నట్లు తెలిపారు. ఈ ప్రాంతంలో అయస్కాంత క్రమరాహిత్యాలను కూడా గుర్తించాల్సి ఉంది. ఈ జిలాండియా ఖండం పురాతన సూపర్‌ ఖండమైన గోండ్వానాలో భాగం అని చెబుతున్నారు భూ విజ్ఞాన శాస్త్రవేత్తలు. ఇది సుమారు 550 మిలియన్‌ సంవత్సరాల క్రితమే ఏర్పడిందని, ముఖ్యంగా దక్షిణ అర్థగోళంలోని మొత్తం భూమిని కలిపిందని చెబుతున్నారు శాస్త్రవేత్తలు.

(చదవండి: మనవరాలి సంరక్షణ కోసం.. గంటకు రూ. 1600లు డిమాండ్‌ చేసిన అమ్మమ్మ!..షాక్‌లో కూతురు)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement