Eros Group
-
బడా నిర్మాతకు సెబీ షాక్.. ఈరోస్ ప్రమోటర్లపై నిషేధం
న్యూఢిల్లీ: మీడియా, ఎంటర్టైన్మెంట్ కంపెనీ ఈరోస్ ఇంటర్నేషనల్ మీడియా లిమిటెడ్‌కు క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ తాజాగా షాకిచ్చింది. కంపెనీ, ప్రమోటర్లతోపాటు.. ఎండీ సునీల్ అర్జన్ లుల్లా, సీఈవో ప్రదీప్ కుమార్ ద్వివేదిపై నిషేధ అస్త్రాన్ని ప్రయోగించింది. నిధుల అక్రమ మళ్లింపు అభియోగాల కేసులో సెక్యూరిటీల మార్కెట్ల నుంచి దూరం పెడుతూ ఆదేశాలు జారీ చేసింది. అంతేకాకుండా లుల్లా, ద్వివేదిలను ఏ లిస్టెడ్ కంపెనీలోనూ డైరెక్టర్ లేదా యాజమాన్య సంబంధ ఏ విధమైన పదవినీ చేపట్టకుండా నిషేధించింది. తదుపరి ఆదేశాలు జారీ చేసేవరకూ ఈరోస్ ఇంటర్నేషనల్సహా అనుబంధ సంస్థలలోనూ పదవులు నిర్వహించకుండా కొరడా ఝళిపించింది. ఇక ప్రమోటర్ సంస్థలు ఈరోస్ వరల్డ్‌వైడ్ ఎఫ్‌జెడ్ ఎల్ఎల్సీ, ఈరోస్ డిజిటల్ ప్రయివేట్ లిమిటెడ్‌కూ నిషేధం వర్తించనున్నట్లు సెబీ మధ్యంతర ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. మరోవైపు నిధుల అక్రమ తరలింపునకు సహకరించాయన్న ఆరోపణలతో దింక్ఇంక్ పిక్చర్జ్ లిమి టెడ్, మీడియావన్ గ్లోబల్ ఎంటర్టైన్మెంట్ లిమిటెడ్, స్పైసీ ఎంటర్టైన్మెంట్ అండ్ మీడియా లిమిటెడ్ పుస్తకాలను పరిశీలించేందుకు ఫోరెన్సిక్ ఆడిటర్‌ను నియమించవలసిందిగా బీఎస్ఈని సెబీ ఆదేశించింది. మూడు నెలల్లోగా ఫోరెన్సిక్ ఆడిటర్ సెబీకి నివేదికను దాఖలు చేయవలసి ఉంటుంది. -
ఈరోస్ లైబ్రరీ ఆపిల్ కొనబోతుందా!
ముంబయి: ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ ఈరోస్ గ్రూప్ వివిధ సినిమాలకు, సంగీతానికి సంబంధించిన కంటెంట్ లైబ్రరీని విక్రయించనుంది. ఇందుకోసం ఆ సంస్థ ఇప్పటికే ఆపిల్ సంస్థతో ప్రాథమిక చర్చల్లో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే, వీటిని కొనుగోలు చేసేందుకు అమెజాన్, నెట్ఫ్లిక్స్వంటి సంస్థలు కూడా వరుసలో ఉన్నట్లు తెలిసింది. అయితే, ప్రస్తుతం ఆ చర్చలు ఇంకా ప్రారంభదశలోనే ఉన్నట్లు పేరు చెప్పేందుకు ఇష్టపడని సదరు సంస్థకు చెందిన అధికారి ఒకరు తెలిపారు. సన్నిహిత వర్గాల సమాచారం ప్రకారం ఈరోస్ తన కంటెంట్ లౌబ్రరీ దాదాపు ఒక బిలియన్ డాలర్ల విలువను కలిగి ఉందంట. అయితే, ప్రస్తుతం దీనిపై తాము ఇప్పుడే ఎలాంటి వ్యాఖ్యలు చేయబోమంటూ ఇటూ ఆపిల్ సంస్థ అలాగే, అమెజాన్, నెట్ ఫ్లిక్స్ సంస్థలు తెలిపాయి. అవన్నీ వదంతలు, ఊహాగానాలు అంటూ కొట్టి పడేశాయి. అయితే, ఇది ప్రైవేటు వ్యవహారం కావడంతో దీనిపై బహిరంగ ప్రకటన చేసేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు. ఒకసారి ఈ కంటెంట్ లైబ్రరీ విక్రయించిన తర్వాత యూరోస్ డిజిటల్ కంటెంట్కూడా కొనుగోలు దారుల చేతుల్లోకి వెళ్లిపోనుందట.