
భారతదేశంలోని కంటెంట్ క్రియేటర్లను శక్తిమంతం చేసేలా హైదరాబాద్‌లో తొలి స్నాప్‌చాట్ క్రియేటర్ కనెక్ట్‌ను ప్రారంభించింది. ఇది లోకల్ టాలెంట్‌ని ప్రోత్సహించడమే గాక పరిశ్రమ సహకారాలతో కంటెంట్ క్రియేటర్ల తమ డిజిటల్ కథలను మరింత మెరుగుపరుచుకునేలా చేస్తుంది. అందులో భాగంగా స్నాప్ చాట్ హైదరాబాద్‌లోని ప్రముఖ క్రియేటర్ ఏజేన్సీలు టమాడా మీడియా, చాయ్‌బిస్కెట్ - ముటినీ, NRGY+, సిల్లీ మాంక్స్, వాక్డ్ అవుట్ మీడియాతో భాగస్వామ్యం కుదుర్చుకుంది.
దీనివల్ల ప్రాంతీయ కంటెంట్ క్రియేటర్లకు మద్దతు లబించడమే గాక తదుపరి తరం ప్రతిభను మెరుగుపరుచుకునేందుకు ఒక వేదిక అవుతుంది కూడా. Savvy on Snap వంటి కంటెంట్ ఎనేబుల్‌మెంట్ ప్రోగ్రామ్‌ల ద్వారా, భాగస్వాములు తమ Snapchat కమ్యూనిటీలకు ఉత్తమ పాప్ సంస్కృతిని తీసుకురావడంలో సహాయపడటానికి అవసరమైన స్నాప్ కన్సల్టింగ్ మద్దతు తోపాటు తగు వనరులను అందిస్తుంది.
అంతేగాదు ఈ ప్లాట్‌ఫాం కంటెంట్‌క్రియేటర్లు లాభాలు ఆర్జించేలా రివార్డ్ ప్రోగ్రామ్‌లను కూడా అందిస్తోంది. ఇక్కడ క్రియేటర్లు తమ కథను ప్రేక్షకులను నిమగ్నం చేసేలా నిర్మించడం అనేది కీలకం. అదే వారికి ఆదాయాలను తెచ్చిపెడుతుంది. ఈ మేరకు స్నాప్ ఇంక్ డాట్ కంటెంట్, ఏఆర్ భాగస్వామ్యాల డైరెక్టర్ మాట్లాడుతూ..ఈ హైదరాబాద్ కంటెంట్ క్రియేటర్లకు నిలయం. ఇక్కడ మా మొట్టమొదటి Snapchat క్రియేటర్ కనెక్ట్ IPని ప్రారంభించడం చాలా సంతోషంగా ఉంది.
ఇది జెన్ జెడ్ క్రియేటర్లు, వినియోగదారులకు కేంద్రంగా మారుతుంది. ట్రెండ్‌కి తగ్గ దృశ్యామన కళ పట్టుకోవడం, కుటుంబల లేదా స్నేమితుల అంతర్గత ఇతి వృత్తంగా ఉన్నవి తదతరాలకు Snapchat పెద్దపీట వేస్తుంది. పాప్ సంస్కృతిలో ఇది సరికొత్త మార్పుకి సంకేతమవుతుంద. భారతదేశం అంతటా ఉన్న కంటెంట్ క్రియేటర్లు ఈ స్నాప్‌చాట్ వేదికపై భాగస్వామ్యం అవుతారు. వారికి కావాల్సిన సహాయసహకారాలను తామందిస్తామని చెప్పారు సాకేత్ ఝా సౌరభ్.
స్నాప్‌చాట్‌లో నేచురల్ స్టార్ అరంగేట్రం
టాలీవుడ్ హీరో నాని ఈ కార్యక్రమంలో పాల్గొని మరింత సందడి తీసుకొచ్చారు. ఈ కార్యక్రమంలో తన మూవీ HIT: ది థర్డ్ కేస్ స్నాప్‌చాట్‌లో సహజంగా ప్రామాణికంగా ఉండటం గురించి మాట్లాడారు. అంతేగాదు స్నాప్‌చాట్ ఈ చిత్రం కోసం కొత్త మూవీ లెన్స్‌ను కూడా ప్రారంభించింది.
ఈ ఇంటరాక్టివ్ AR లెన్స్ అభిమానులను యాక్షన్‌కు దగ్గరగా తీసుకువస్తుంది, పైగా సినీ ప్రపంచంలోకి అడుపెట్టేందుకు వీలు కల్పిస్తుంది. ఇక హీరో నాని మాట్లాడుతూ..కథ చెప్పడం ఎల్లప్పుడూ కనెక్ట్‌వ్‌గానే ఉంటుంది. యువ క్రియేటర్లు కథలు ఎలా చెబుతారు, తాజా ట్రెండ్ ఎలా ఉంటుంది తదితారాలు హైదరాబాద్ క్రియేటర్ కమ్యూనిటీతో తీసుకురావాలన్నా ఆలోచన బాగుంది. ఈ కార్యక్రమంలో భాగమవ్వడం మరింత అద్బుతంగా ఉంది. అంతేగాదు స్నాప్‌చాట్ ప్లాట్‌ఫామ్ క్రియేటర్లకు తమను తాము వ్యక్తీకరించుకోవడానికి కొత్త మార్గాలను అందిస్తున్నాయని అన్నారు.
చివరగా ఈ కార్యక్రమం నయని పావని, శ్వేత నాయుడు, నైనికా అనసురు, ప్రణవి, అనుష రత్నం వంటి 50 మందికి పైగా అగ్ర సృష్టికర్తలను టాలెంట్ ఏజెన్సీలు, బ్రాండ్‌లు, పరిశ్రమ భాగస్వాములు పాల్గన్నారు. నిపుణుల నేతృత్వంలోని చర్చలలో భాగంగా, తమడ మీడియా నుంచి రాహుల్ తమడ క్రియేటర్ అనుభవాలు, వృద్ధి స్నాప్‌చాట్‌లో విజయంపై అనుభవాలను పంచుకున్నారు.
అయితే చాయ్‌బిస్కెట్ నుంచి అనురాగ్ స్నాప్‌లో చిత్రాల భాగస్వామ్యం గురించి నొక్కి చెప్పారు. అందుకు సంబంధించిన కీలక ఉదాహరణలు, విజయగాథలను హైలైట్ చేశారు. స్నాప్‌చాట్ సాధనాలు - లెన్సులు, స్పాట్‌లైట్, స్టోరీస్ - క్రియేటర్ల ఆవిష్కరణ సామర్థ్యాన్ని మెరుగుపరచి, ప్రేక్షకులను ఎలా నిమగ్నమయ్యేలా చేస్తాయో ఈ కార్యక్రమానికి హజరైనవారికి వివరించారు నిర్వాహకులు.
(చదవండి: ప్రియాంక చోప్రా..ఫ్రీడమ్ సెలబ్రేషన్..ఓ బిడ్డకు తల్లి అయితే తిప్పలు తప్పవు..!)