Snapchat
-
నెట్టింట్లో... భద్రం బీ కేర్‌ఫుల్
తెల్లారి లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు ఇంటర్నెట్ ప్రపంచంలో ఉంటాం. మనకు అన్నీ తెలిసినట్లుగానే ఉంటుంది. అన్ని రకాలుగా జాగ్రత్తగా ఉన్నట్లుగానే ఉంటుంది. అయినా సరే... ఏ ప్రమాదం ఎటు నుంచి వచ్చిపడుతుందో తెలియదు.ఇంటర్నెట్ వినియోగించడం ఎంత ముఖ్యమో, మనకు ఎలాంటి చేటు, నష్టాలు జరగకుండా ఉపయోగించడం అంతకంటే ముఖ్యం...‘సేఫర్ ఇంటర్నెట్ డే’ ను పురస్కరించుకొని మల్టీ మీడియా ఇన్స్టంట్ మెసేజింగ్ యాప్ ‘స్నాప్‌చాట్’ డిజిటల్ వెల్–బీయింగ్ ఇండెక్స్ (డిడబ్ల్యూబిఐ) మూడవ ఎడిషన్‌ను విడుదల చేసింది. మన దేశంలో డిజిటల్ విషయాలకు సంబంధించి అవగాహన ఉన్నప్పటికీ ఆన్లైన్ మోసాలు పెరుగుతున్నాయి అని ఈ నివేదిక తెలియజేసింది.మన దేశంతో సహా ఆస్ట్రేలియా, ఫ్రాన్స్, జర్మనీ, యూకే, యూఎస్‌లో నిర్వహించిన డిజిటల్ సేఫ్టీపై నిర్వహించిన సర్వేలో టీనేజర్లు, వారి తల్లిదండ్రులు, యువత... ఇలా ఎంతోమంది పాల్గొన్నారు.మన దేశం హైయెస్ట్ డిజిటల్ వెల్బీయింగ్ స్కోర్‌ను 67తో సాధించింది. ఇంటర్నెట్ భద్రతకు సంబంధించి జాగ్రత్తలు తీసుకుంటున్న తల్లిదండ్రుల సంఖ్య పెరిగింది. డిజిటల్ శ్రేయస్సు (డిజిటల్ వెల్–బీయింగ్)కు సంబంధించి సానుకూల సూచికలు ఉన్నప్పటికీ ఆన్లైన్ బ్లాక్మెయిల్ లాంటివి మన దేశంలో ఎక్కువగా కనిపిస్తున్నాయి. వ్యక్తిగత, సన్నిహిత, ఫోటోలు, వీడియోలను షేర్ చేస్తామని బెదిరించడం లాంటివి ఎక్కువ అవుతున్నాయి, ఆన్లైన్ భద్రతకు సంబంధించి పురోగతి, సవాళ్లను రెండిటినీ నివేదిక నొక్కి చెప్పింది.డిజిటల్ సేఫ్టీలో మన దేశం మెరుగైన స్థితిలో ఉన్నప్పటికీ, ఆన్లైన్ బెదిరింపుల ప్రాబల్యం పెరగడంతో యువ యూజర్లు ప్రమాదాల బారినపడకుండా నిరంతర అవగాహన కలిగించాల్సిన అవపరం గురించి నివేదిక నొక్కి చెప్పింది. ఈ సంవత్సరం సేఫర్ ఇంటర్నెట్ డేకి సంబంధించిన థీమ్... ‘టుగెదర్, ఫర్ ఎ బెటర్ ఇంటర్నెట్’. -
కారు నడుపుతూ సోషల్ మీడియా రీల్స్.. తర్వాత ఏమైందంటే?
భోపాల్: ఇటీవలి కాలంలో సోషల్ మీడియా(Social Media)లో ఫేమస్ అయ్యేందుకు ఎంతో మంది ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో తమ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. తాజాగా ఓ డ్రైవర్ రీల్స్(Social Media Reels) పిచ్చి కారణంగా తనతో పాటు మరో ప్రాణం బలితీసుకున్నాడు. కారు చెరువులోకి దూసుకెళ్లిన ఘటనలో ఇద్దరు మృతిచెందగా.. మరొకరు ఎంతో కష్టం మీద తన ప్రాణాలను దక్కించుకున్నాడు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లో జరిగింది.వివరాల ప్రకారం.. భోపాల్(bhopal)లోని కోలార్ రోడ్లో బుధవారం అర్థరాత్రి కారు కాలువలోకి దూసుకెళ్లడంతో ఇద్దరు వ్యక్తులు మరణించారు. మృతులు పలాష్ గైక్వాడ్, వినీత్ దక్ష(డ్రైవర్)లుగా గుర్తించారు. అయితే, డ్రైవర్ కారు నడుపుతూ రీల్స్ రికార్డ్ చేస్తుండగా కారు అదుపు తప్పి చెరువు పడిపోవడంతో ఈ ప్రమాదం జరిగింది. దీంతో, పలాష్, వినీత్ అక్కడికక్కడే మృతి చెందారు. ఇక, ప్రమాదం సమయంలో మరో వ్యక్తి పియూష్ కారు వెనుక అద్దాన్ని పగులగొట్టి తప్పించుకోగలిగాడు. సమాచారం అందుకున్న కోలారు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కారు అద్దాలు పగలగొట్టి మృతదేహాలను బయటకు తీశారు.అనంతరం, ఈ ఘటనపై కోలార్ పోలీస్ స్టేషన్ ఇన్చార్జ్ సంజయ్ తివారీ మాట్లాడుతూ.. ముగ్గురు స్నేహితులు షాపురా నివాసితులు. వీరు ముగ్డురు దాబా నుంచి తిరిగి వస్తుండగా.. ప్రమాదం జరిగింది. ప్రమాదానికి రీల్స్ చేయడమే కారణం. వేగంతో ఉన్న కారు చెరువు కల్వర్టు దగ్గర అకస్మాత్తుగా అదుపు తప్పి నీటిలో పడిపోయింది. చలి కారణంగా కారు అద్దాలు మూసుకుపోయాయి. అందుకే వారిద్దరూ తప్పించుకోలేకపోయారు అని తెలిపారు. -
సిద్ధిఖీ హత్య కేసు: లారెన్స్ బిష్ణోయ్ సోదరుడితో నిందితుల చాట్
మహారాష్ట్రతోపాటు బాలీవుడ్‌లోనూ సంచలనం రేపిన ఎన్సీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి బాబా సిద్ధిఖీ హత్య కేసులో మరో కీలకవిషయం వెలుగుచూసింది మాజీ మంత్రి అయిన సిద్ధిఖీని హత్య చేసే ముందు గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్సోదరుడు అన్మోల్ బిష్ణోయ్‌తో షూటర్లు సంప్రదింపులు జరిపినట్లు పోలీసులు వెల్లడించారు. హత్యకు గల ఉద్దేశం తెలియనప్పటీకి నిందితులు స్నాప్‌చాట్ ద్వారా నిందితులు తరచూ అన్మోల్తో సంభాషణలు జరిపినట్లు గుర్తించామని తెలిపారు.కెనడా, అమెరికాలకు చెందిన నిందితులతో అన్మోల్కు పరిచయం ఉందని, నిందితుడి నుంచి నాలుగు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. నిందితులు స్నాప్‌చాట్ ద్వారా ఒకరితో ఒకరు టచ్‌లో ఉండేవారని, మెసెజ్ వచ్చిన తర్వాత వారు దానిని వెంటనే తొలగించేవారని పేర్కొన్నారు.. అదేవిధంగా అరెస్టు చేసిన నిందితుల స్నాప్‌చాట్‌ను నిశితంగా పరిశీలించగా.. షూటర్లు, ప్రవీణ్ లోంకర్ నేరుగా అన్మోల్ బిష్ణోయ్‌తో టచ్‌లో ఉన్నట్లు తేలిందని ముంబై పోలీసులు తెలిపారు.స్నాప్‌చాట్‌లో 24 గంటల్లోపు చాట్ మాయమయ్యే ఆప్షన్‌ను ఉపయోగించి నిందితులు సంప్రదింపులు జరుపుకునేవారని, దానిద్వారానే అన్మోల్ వారికి సిద్దిఖీ, అతడి కుమారుడి ఫొటోలు పంపాడని నిందితులు పేర్కొన్నట్లు వెల్లడించారు. అయితే 24 గంటల తర్వాత మెసేజ్‌లు డిలీట్ అవ్వడం వల్ల వారి సంభాషణలను సేకరించలేకపోయినట్లు పేర్కొన్నారు. ఇప్పటివరకు ఈ కేసులో 10 మంది నిందితులను అరెస్టు చేశామని, మరో నిందితుడు శివకుమార్ గౌతమ్ పరారీలో ఉన్నాడని తెలిపారు. సిద్దిఖీని హత్య చేసేందుకు కాంట్రాక్ట్ తీసుకున్న షూటర్లు దాడికి ముందు అటవీ ప్రాంతంలో చెట్లను లక్ష్యంగా చేసుకొని షూటింగ్ ప్రాక్టీస్ చేసినట్లు పేర్కొన్నారన్నారు. దీనిపై విచారణ కొనసాగుతోందని తెలిపారు.కాగా దసరా సందర్భంగా బాబా సిద్ధిక్ ముంబైలోని బాంద్రాలో తన కుమారుడు జీషన్ సిద్ధిక్ కార్యాలయం వెలుపల బాణాసంచా పేలుస్తుండగా దుండగులు ఆరు రౌండ్లు కాల్పులు జరిపిచంపిన విషయం తెలిసిందే.వెంటనే ఆయన్ని లీలావతి ఆసుపత్రికి తరలించగా..చికిత్స పొందుతూ మృతి చెందారు. అనంతరం సిద్దిఖీని చంపింది తామే అని లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ ప్రకటించింది. బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్‌తో ఉన్న సన్నిహిత సంబంధాల కారణంగానే ఆయనను హత్య చేసినట్లు పేర్కొంది. దావూద్ ఇబ్రహీం వంటి అండర్‌వరల్డ్ వ్యక్తులతో సంబంధాలు ఉన్నాయని ఆరోపించింది. -
టీనేజర్ల రక్షణ కోసం.. సరికొత్తగా స్నాప్‌చాట్!
సాక్షి, సిటీబ్యూరో: ఆన్లైన్ నేరాలకు టీనేజర్లు బాధితులుగా మారకుండా చూసేందుకు ప్రముఖ వ్యక్తిగత సంబంధాల యాప్.. స్నాప్‌చాట్ కొత్త ఫీచర్లను జత చేసింది. ఈ విషయాన్ని సంస్థ నగర ప్రతినిధులు ఓ సమావేశంలో తెలిపారు.నిజమైన స్నేహాలను బలోపేతం చేస్తూ హానికరమైన సంబంధాలను అరికట్టే దిశగా ఇవి రూపొందాయని, బ్లాకింగ్ కేపబులిటీస్‌ను అభివృద్ధి చేయడం, లొకేషన్ షేరింగ్‌ను సరళీకృతం చేయడం, స్నేహబంధాల రక్షణ టూల్స్‌ను విస్తరించడం, ఇన్–చాట్ వార్నింగ్స్‌ను పెంచడం.. వంటి మార్పు చేర్పులతో ఫీచర్లు జత చేశామని వివరించారు.ఈ సందర్భంగా టీన్ ఆన్లైన్ సేఫ్టీపై ఏర్పాటు చేసిన ప్యానెల్ చర్చలో నటి, స్నాప్ స్టార్ నితాన్షి గోయెల్, యంగ్ లీడర్స్ ఫర్ యాక్టివ్ సిటిజన్‌షిప్(వైఎల్ఎసి) సహ వ్యవస్థాపకులు అపరాజితా భత్రి, స్పాన్ పబ్లిక్ పాలసీ హెడ్ ఉత్తరా గణేష్ పాల్గొన్నారు.ఇవి చదవండి: Neenu Rathin: తక్కువ కాలంలోనే.. ‘సోషల్ ఎంటర్ప్రెన్యూర్’గా.. -
తండ్రి స్నాప్‌చాట్ వద్దన్నాడని..16 ఏళ్ల బాలిక సూసైడ్
ఈ మధ్య కాలంలో యువత ఆత్మహత్య ఘటనలు ఎక్కువైపోతున్నాయి. చిన్న చిన్న విషయాలకే కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నారు. పరీక్షల్లో ఫెయిల్ పరీక్షలో ఫెయిల్ అయ్యామని, తల్లిదండ్రులు మందలించారని, ఫోన్ కొనియ్యలేదని, స్నేహితులు అల్లరి చేశారని.. ఇలాంటి చిన్న చిన్న కారణాలతో ప్రాణాలు తీసుకుంటున్నారు.. తాజాగా మహారాష్ట్రలో ఇలాంటి తరహా ఘటనే చోటు చేసుకుంది.ప్రముఖ మెసేజింగ్ యాప్ స్నాన్చాట్ను వాడొద్దని తండ్రి మందలించినందుకు 16 ఏళ్ల బాలిక బలవన్మరణానికి పాల్పడింది. థానే జిల్లాలోని డోంబివిలీ ప్రాంతంలోని శుక్రవారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. బాలిక తన ఫోన్లో స్నాప్‌చాట్ అప్లికేషన్‌ను డౌన్లోడ్ చేసుకుంది. ఇది చూసిన ఆమె తండ్రి ఆమెను సున్నితంగా స్నాప్‌చాట్‌ను వాడొద్దని సూచించాడు. తండ్రి మాటలకు ఆగ్రహానికి గురైన సదరు బాలిక రాత్రి తన గదిలో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.ఉదయం గది తలుపులు తెరవకపోడంతో అనుమానం వచ్చిన కుటుంబ సభ్యులు డోర్లు బద్దలు కొట్టి చూడగా.. అప్పటికే బాలిక ఫ్యాన్‌కు విగతజీవిగా వేలాడుతూ కనిపించింది. సమాచారం అందుకున్న మాన్పాడ పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు ప్రమాదవశాత్తు మృతిగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
రహస్య ప్రాజెక్ట్.. ఫేస్‌బుక్‌పై సంచలన ఆరోపణలు
Facebook Secret Project: మార్క్ జుకర్‌బర్గ్ నేతృత్వంలోని ఫేస్‌బుక్‌పై సంచలన ఆరోపణలకు సంబంధిచిన పత్రాలు బయటకొచ్చాయి. స్నాప్‌చాట్, యూట్యూబ్, అమెజాన్ వంటి ప్రత్యర్థి ప్లాట్‌ఫామ్‌ల యూజర్లపై ఫేస్బుక్ స్నూపింగ్ (అనైతిక విశ్లేషణ) చేసినట్లు ఆరోపిస్తూ కాలిఫోర్నియాలోని ఫెడరల్ కోర్టు కొత్త పత్రాలను విడుదల చేసింది. ‘టెక్ క్రంచ్’ కథనం ప్రకారం.. స్నాప్‌చాట్ (Snapchat) యాప్‌కి, తమ సర్వర్లకు మధ్య నెట్వర్క్ ట్రాఫిక్‌ను అడ్డగించడానికి, డీక్రిప్ట్ చేయడానికి ఫేస్బుక్ 2016లో 'ప్రాజెక్ట్ ఘోస్ట్‌బస్టర్స్' అనే రహస్య కార్యక్రమాన్ని ప్రారంభించింది. కోర్టు పత్రాల ప్రకారం.. యూజర్ బిహేవియర్‌ను అర్థం చేసుకోవడానికి, స్నాప్‌చాట్‌పై ప్రయోజనాన్ని పొందేందుకు ఫేస్బుక్ ఈ చొరవను రూపొందించింది. ఈ పత్రాల్లో రహస్య ప్రాజెక్ట్ గురించి ప్రస్తావించిన ఫేస్బుక్ అంతర్గత ఈమెయిల్‌లు కూడా ఉన్నాయి. 2016 జూన్ 9 నాటి అంతర్గత ఈమెయిల్లో ఫేస్బుక్ సీఈవో మార్క్ జుకర్‌బర్గ్ స్నాప్‌చాట్‌లో ఎన్క్రిప్టెడ్ ట్రాఫిక్ ఉన్నప్పటికీ దానిలో విశ్లేషణలను పొందాలని ఉద్యోగులను ఆదేశించినట్లుగా ఉంది. దీంతో నిర్దిష్ట సబ్డొమైన్ల ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించడానికి 2013లో ఫేస్బుక్ ద్వారా పొందిన వర్చువల్ ప్రైవేట్ నెట్వర్క్ ‘ఒనావో’ను ఉపయోగించాలని ఫేస్బుక్ ఇంజనీర్లు ప్రతిపాదించారు. ఒక నెల తర్వాత, వారు ఐవోఎస్, ఆండ్రాయిడ్ ప్లాట్‌ఫారమ్‌లలో ఇన్స్టాల్ చేయగల ప్రతిపాదన కిట్లను అందించారు. ఈ ప్రాజెక్ట్‌ను అమెజాన్, యూట్యూబ్ యూజర్ల డేటా కోసం విస్తరించారు. సీనియర్ ఎగ్జిక్యూటివ్‌ల బృందంతో పాటు దాదాపు 41 మంది న్యాయవాదులు ప్రాజెక్ట్ ఘోస్ట్బస్టర్స్లో పనిచేశారు. ఓనావోను ఉపయోగించడానికి ఫేస్బుక్ టీనేజర్లకు రహస్యంగా డబ్బు చెల్లిస్తోందని దర్యాప్తులో వెల్లడైన తర్వాత, ఫేస్బుక్ 2019లో ఒనావోను మూసివేసింది. -
ఉద్యోగుల తొలగింపునకు సిద్దమైన మరో కంపెనీ - 10 శాతం మందిపై వేటు!
Snapchat Layoff: 2024 ప్రారంభం నుంచి అనేక దిగ్గజ కంపెనీలు తమ ఉద్యోగులను తొలగిస్తూనే ఉన్నాయి. ఈ ఏడాది ఇప్పటి వరకు ఏకంగా 32000 కంటే ఎక్కువ మంది ఉద్యోగులు, ఉద్యోగాలు కోల్పోయినట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇన్స్టంట్ మెసేజింగ్ యాప్ స్నాప్‌చాట్ (Snapchat) మాతృ సంస్థ, స్నాప్ కూడా 10 శాతం ఉద్యోగులను తొలగించనున్నట్లు ప్రకటించింది. ఖర్చులను తగ్గించుకోవడంలో భాగంగా తమ ఉద్యోగులను తగ్గించుకోవాలని యోచిస్తున్న కంపెనీల జాబితాలో.. స్నాప్ కూడా చేరింది. రెగ్యులేటరీ ఫైలింగ్‌లో ఉద్యోగుల తొలగింపు విషయాన్ని ప్రస్తావిస్తూ.. ప్రపంచ వ్యాప్తంగా పనిచేస్తున్న కంపెనీ ఉద్యోగుల్లో 10 శాతం మందిని తొలగించనున్నట్లు వెల్లడించింది. సంస్థలో ఇప్పటికి 5367 మంది ఉద్యోగులు పనిచేస్తున్నట్లు.. ఇందులో 10 శాతం, అంటే సుమారు 540 మంది ఉద్యోగాలు కోల్పోనున్నారు. స్నాప్ సంస్థ ఉద్యోగులను తొలగించడం ఇదే మొదటిసారి కాదు. 2022లో 20 శాతం ఉద్యోగులను, 2023లో 3 శాతం ఉద్యోగులను ఇంటికి పంపింది. ఇదీ చదవండి: చరిత్ర సృష్టించిన 'టాటా' - ఏకంగా రూ.30 లక్షల కోట్లు.. కంపెనీ 10 శాతం ఉద్యోగులను తొలగిస్తుందన్న విషయం ప్రకటించినప్పటికీ.. ఏ విభాగంలో ఎంతమందిని తొలగిస్తుందన్న విషయాన్ని అధికారికంగా ప్రకటించలేదు. కంపెనీ ఎదుగుదలకు ప్రాధాన్యత ఇస్తూ.. రాబోయే రోజుల్లో మంచి వృద్ధిని సాధించడానికి సంస్థ ఈ లే ఆప్స్ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. -
స్నాప్‌చాట్ వాడుతున్నారా?తస్మాత్ జాగ్రత్తా! లేదంటే..
స్నాప్‌చాట్ అనేది ఈ రోజుల్లో టీనేజర్స్ ఎక్కువగా ఉపయోగిస్తున్న మోడర్న్ మెసేజింగ్ యాప్. ఇందులో యూజర్లు తమ ఫొటోలు, వీడియోలను స్నాప్లుగా వర్చుకుంటారు. మన ఫ్రెండ్స్ జాబితాలోని వారు వాటిని చూసిన తర్వాత అవి అదృశ్యమవుతాయి. స్నేహితులతో కనెక్ట్ అవడం, గేమ్స్, న్యూస్, వినోదం, క్విజ్లు, వినూత్న ఫొటో, వీడియో ఎడిటింగ్ టూల్స్ వంటి వివిధ ఫీచర్లను ఇది అందిస్తుంది. ఈ ఫీచర్లు, దాని ఇంటరాక్టివ్ నేచర్, సృజనాత్మకత కారణంగా స్నాప్‌చాట్ వినియోగదారులను... ముఖ్యంగా యువతను ఆకర్షిస్తోంది. స్నాప్‌చాట్ అకౌంట్.. హ్యాకింగ్, సెక్సార్షన్, సైబర్ బెదిరింపు, మోసం వంటి వివిధ సైబర్ నేరాలకు అవకాశం ఇచ్చేలా ఉంది. ఇవి యూజర్ల వ్యక్తిగత సమాచారానికి తీవ్రమైన నష్టాలను కలిగిస్తాయి. స్నాప్‌చాట్ సురక్షితంగా ఉండటానికి, వినియోగదారులు పటిష్టమైన భద్రతా పద్ధతులను అమలుచేయోలి. గోప్యతా సెట్టింగ్‌ల విషయంలో జాగ్రత్త వహించాలి. అలాగే, కంటెంట్‌ను షేర్ చేసేటప్పుడు, ఏవైనా అనుమానాస్పద కార్యకలాపాలు ఉన్నట్టుగా అనిపిస్తే వెంటనే స్నాప్‌చాట్ సంబంధిత అధికారులకు నివేదించాలి. తరచూ జరిగే నేరాలు ఇది వర్చువల్ దండయాత్రగా చెప్పుకోవచ్చు. స్నాప్‌చాట్ అకౌంట్ హ్యాకింగ్ అనేది ప్రధానంగా ఉన్న సైబర్‌నేరం. దీనివల్ల బాధితులు వివిధ రకాల దోపిడీకి గురవుతారు. హ్యాకర్లు యూజర్ ఖాతాలకు అనధికారక యాక్సెస్‌ను పొందడానికి ఫిషింగ్, కీ లాగింగ్ లేదా బ్రూట్ ఫోర్స్ దాడులు వంటి అనేక రకాల టెక్నాలజీలను ఉయోగిస్తారు. ఒకసారి రాజీ పడితే హ్యాకర్లు వ్యక్తిగత సమాచారాన్ని దుర్వినియోగం చేయవచ్చు. హానికరమైన సందేశాలను పంపవచ్చు. లేదా తదుపరి నేరాలకు పాల్పడేందుకు యూజర్లా నటించవచ్చు. సెక్స్టార్షన్ అనేది ఇందులో మరింత ఆందోళన కలిగించే అంశం. సైబర్ నేరగాళ్లు అభ్యంతరకరమైన కంటెంట్‌ను పంపేలా బలవంతం చేయడం ద్వారా బాధితుల నమ్మకాన్ని దోపిడీ చేస్తారు. ఇక్కడ నుంచి తరచుగా ఆర్థికపరమైన డిమాండ్లను నెరవేర్చకపోతే విషయాన్ని బహిరంగంగా విడుదల చేస్తామని లేదా బాధితుడి పరిచయాలకు షేర్ చేస్తామని బెదిరిస్తారు. దీంతో బాధితులు తీవ్ర ఒత్తిడితో కూడిన పరిణామాలను ఎదుర్కొంటారు. స్నాప్‌చాట్ మెసేజ్‌ల ద్వారా సైబర్ బెదిరింపుల నుంచి విముక్తి లభించదు. వ్యక్తులను లక్ష్యంగా చేసుకుని వేధించే, బెదిరించే లేదా ద్వేషపూరిత కంటెంట్‌ను వ్యాప్తి చేసే హానికరమైన వినియోగదారులకు ఈ ప్లాట్‌ఫారమ్ బ్రీడింగ్ గ్రౌండ్‌గా పనిచేస్తుంది. స్నాప్‌చాట్ సైబర్ బెదిరింపు తీవ్రమైన వనసిక క్షోభకు దారి తీస్తుంది. ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తుంది. వ్యక్తుల నకిలీ ప్రొఫైల్స్ సృష్టించడానికి స్నాప్‌చాట్ సులువుగా అనుమతిస్తుంది. దీనిని సాధారణంగా క్యాట్‌ఫిషింగ్ అని పిలుస్తారు. ఈ మోసగాళ్లు యూజర్లను తప్పుడు సంబంధాలు లేదా స్నేహాలలోకి ఆకర్షిస్తారు. కల్పిత కథలు, దొంగిలించిన చిత్రాలతో మోసగిస్తారు. ఈ విధానాల వల్ల తీవ్ర ఒత్తిడితో అనారోగ్య సమస్యలకు దారితీయవచ్చు. ∙స్నాప్‌చాట్ మెసేజ్‌లు వెంటనే అదృశ్యమై, అభద్రతా భావాన్ని సృష్టించగలదు. ఈ విషయంలో యూజర్లు జాగ్రత్త వహించాలి. స్క్రీన్షాట్లు, అనధికారిక అప్లికేషన్లు, వ్యక్తిగత కంటెంట్‌ను క్యాప్చర్ చేయగలవు. ఒకసారి లీక్ అయితే, ఆ వ్యక్తి ప్రతిష్టకు తన వ్యక్తిగత జీవితానికి కోలుకోలేని నష్టం కలిగిస్తుంది. కొన్ని భద్రతా చిట్కాలు ∙మీ కంఫర్ట్ లెవల్‌కు అనుగుణంగా ఉండే సెట్టింగ్‌లను ఎంచుకోండి. నమ్మదగిన స్నేహితులకు మాత్రమే యాక్సెస్‌ని పరిమితం చేయండి. నిజజీవితంలో మీకు తెలిసిన, విశ్వసించే వ్యక్తులను మాత్రమే అనుమతించండి. హాని కలిగించే అపరిచితుల రిక్వెస్ట్‌ను యాడ్ చేయడం మానుకోండి. లైంగికపరమైన కంటెంట్‌ను షేర్ చేయడాన్ని నివారించండి. ∙మీ సమాచారాన్ని ఇతరులు దుర్వినియోగం చేసే అవకాశం ఉన్నందున మీ పూర్తి పేరు, చిరునావ, ఫోన్ నంబర్ లేదా ఆర్థిక వివరాలను స్నాప్‌చాట్‌లో షేర్ చేయవద్దు. స్నాప్‌చాట్ నుండి ఎవరినైనా కలవాలని నిర్ణయించుకుంటే పబ్లిక్ లొకేషన్‌ను మాత్రమే ఎంచుకోండి. ∙తెలియని షార్ట్ లింక్‌లపై క్లిక్ చేయడం లేదా అనుచిత మెసేజ్‌లకు ప్రతిస్పందిస్త వ్యక్తిగత సవచారాన్ని అందించడం మానుకోండి. స్నాప్ చాట్ లేదా చట్టబద్ధమైన కంపెనీలు... యాప్ ద్వారా మీ లాగిన్ ఆధారాలను లేదా వ్యక్తిగత వివరాలను ఎన్నటికీ అడగవు. స్నాప్‌చాట్ రీసెంట్ అప్డేట్స్ను ఇన్స్టాల్ చేయండి. దీని ద్వారా దోపిడీ ప్రమాదాన్ని నివారించవచ్చు. స్నాప్ మ్యాప్ ఫీచర్‌ని ఉపయోగిస్తున్నప్పుడు జాగ్రత్తగా ఉండండి. ఇది మీరున్న ప్లేస్‌ను అకౌంట్లోని స్నేహితులకు చపుతుంది. అందుకుని మ్యాప్ ఫీచర్‌ను స్టాప్ చేయండి. స్పాప్‌చాట్ ద్వారా సైబర్‌నేరానికి గురైతే వెంటనే.. https://help.snapchat.com/hc/en-us/articles/7012399221652-How-to-Report-Abuse-on-Snapchat పోర్ట్ చేయాలి. అదేవిధంగా, సమస్య పరిష్కారానికిhttps://www.cybercrime.gov.inలో రిపోర్ట్ చేయాలి. అనీల్ రాచమల్ల, డిజిటల్ వెల్బీయింగ్ ఎక్స్పర్ట్, ఎండ్ నౌఫౌండేషన్ (చదవండి: ఓ నది హఠాత్తుగా నీలం, నారింజ రంగులో మారిపోయింది! ఎక్కడంటే) -
స్నాప్‌చాట్ గుడ్ న్యూస్: వారికి నెలకు రూ. 2 లక్షలు
న్యూఢిల్లీ: కొత్త కొత్త ఫీచర్లతో యూజర్లను ఆకట్టుకునే పాపులర్ ఫొటో మెసేజింగ్ ట్యాప్ స్నాప్‌చాట్ తాజాగా మరో అద్భుతమైన ఫీచర్‌ను ప్రకటించింది. భారతదేశంలో స్నాప్‌చాట్ సౌండ్స్ క్రియేటర్ ఫండ్‌ను ప్రారంభించినట్లు స్నాప్‌చాట్ మాతృ సంస్థ స్నాప్మంగళవారం ప్రకటించింది. ఇందుకు డిజిటల్ మ్యూజిక్ డిస్ట్రిబ్యూషన్ సర్వీస్ డిస్ట్రోకిడ్తో భాగస్వామ్యాన్ని కుదుర్చుకుంది. తద్వారా నెలకు 20 మంది బడ్డింగ్ ఆర్టిస్టులకు ఒక్కొక్కరికి 2,500 (దాదాపు రూ. 2,04,800) ప్రోత్సాహాన్ని అందించనుంది. కొత్తగా ప్రకటించిన స్నాప్ సౌండ్స్ క్రియేటర్ ఫండ్ ద్వారా దేశంలోని అభివృద్ధి చెందుతున్న కళాకారులను గుర్తించి వారికి నగదు ప్రోత్సాహకాలను అందించనుంది. నెలకు మొత్తంగా 50వేల డాలర్ల (దాదాపు రూ.41 లక్షలు) వరకు గ్రాంట్లను అందజేస్తామని కంపెనీ ప్రకటించింది. భవిష్యత్తు కళాకారులే లక్ష్యంగా ప్లాట్‌ఫారమ్‌లోని స్నాప్‌లు, ఇతర క్రియేషన్‌లకు లైసెన్స్ పొందిన సంగీతాన్ని జోడించేలా సౌండ్స్ ఫీచర్‌ను తీసుకొచ్చింది. నవంబర్ మధ్య నాటికి ఈ గ్రాంట్ ప్రోగ్రాం షురూ అవుతుందని అంచనా. స్నాప్‌చాట్ సౌండ్స్ ఫీచర్ మ్యూజిక్ వీడియోలు 2.7 బిలియన్లకు పైగా క్రియేట్ అయ్యాయని, వీటిని 183 బిలియన్లకు పైగా వీక్షించారని కంపెనీ తెలిపింది. కాగా ఈ ఏడాది ఆగస్టులో స్నాప్‌చాట్+సబ్స్క్రిప్షన్ ఇండియాలో లాంచ్ చేసింది. ఈ సబ్స్క్రిప్షన్ ద్వారా యూజర్లు ప్రత్యేకమైన ప్రయోగాత్మక, ప్రీ-రిలీజ్ ఫీచర్లకు ముందస్తుగానే యాక్సెస్ పొందొచ్చు. అంతేకాదు దేశంలో స్నాప్‌చాట్ ప్లస్ నెలవారీ సబ్‌స్క్రిప్షన్‌ను రూ.49గా నిర్ణయించగా, యూఎస్‌లో ప్లస్ సర్వీస్‌కు నెలకు 3.99 డాలర్లు ( సుమారు రూ.330) వసూలు చేస్తోంది. -
ఇన్‌స్టాలో కొత్త అవతార్, స్నాప్‌చాట్‌లో స్పెషల్ ఫీచర్లు
సోషల్ మీడియా ప్లాట్ ఫాం ఫేస్బుక్ సొంతమైన ఇన్‌స్టాగ్రామ్‌లో అవతార్‌ని క్రియేట్ చేసుకోవడం ఇపుడు చాలా ఈజీ. ఫేస్బుక్, ఇన్‌స్టాలో మనకు నచ్చిన అవతార్ సృష్టించుకునే అవకాశాన్ని మెటా కల్పించింది. తద్వారా మన స్నేహితులతో చాట్ చేస్తున్నప్పుడు మనకు నచ్చిన అవతార్‌ను క్రియేట్ చేసుకోవచ్చు. ప్రొఫైల్ పిక్‌ను కూడా తయారు చేసుకోవచ్చు. అదెలాగో చూద్దాం. (Har Ghar Tiranga: 10 రోజుల్లో ఎన్ని పతాకాలు కొన్నారో తెలుసా?) ఇన్‌స్టాగ్రామ్‌లో మీ అవతార్ ఇలా.... ఇన్‌స్టాగ్రామ్‌లో మీ అవతార్‌ను క్రియేట్ చేసుకోవడానికి... ♦ మీ ప్రొఫైల్లోకి వెళ్లిన తరువాత స్క్రీన్ రైట్ కార్నర్‌లోని హంబర్గర్ మెనూ క్లిక్ చేయాలి. ♦ ఎకౌంట్–అవతార్‌లోకి వెళితే ‘అవతార్ మేకింగ్ స్క్రీన్’ ఓపెన్ అవుతుంది. ♦ స్కిన్ టోన్‌ను ఎంపిక చేసుకొని మీ ఇన్‌స్టా అవతార్‌ను తయారు చేసుకోవాలి. ♦ మీ అవతార్‌కు మీకు ఓకే అనిపిస్తే...స్క్రీన్ టాప్‌రైట్ కార్నర్‌లోని ‘డన్’ క్లిక్ చేయాలి. ♦ ఫేస్స్ట్రక్చర్, హెయిర్ స్టైల్, నోస్షేప్... మొదలైన ఆప్షన్స్‌ను యూజర్ ఎంపిక చేసుకోవచ్చు. ఫోటో షేరింగ్ ప్లాట్‌ఫారమ్ స్నాప్‌చాట్ ఇండియాలో స్నాప్‌చాట్+ సబ్‌స్క్రిప్షన్‌ను నెలకు కేవలం 49 రూపాయలకే అందిస్తోంది. దీంతో పాటు అనేక ప్రత్యేక ఫీచర్లను కూడా యూజర్లకు అందిస్తోంది. స్నాప్‌చాట్+లో ఎక్స్‌క్లూజివ్ ఫీచర్స్ మెసేజింగ్ అండ్ అప్డేట్ షేరింగ్ ప్లాట్‌ఫామ్ స్నాప్‌చాట్ ‘స్నాప్‌చాట్ ప్లస్ సబ్స్క్రిప్షన్’ సర్వీస్‌ను లాంచ్ చేసింది. దీనిలో భాగంగా యూజర్లు ఎక్స్‌క్లూజివ్, ఎక్స్పెరిమెంటల్, ఫ్రీ రిలీజ్ ఫీచర్లతో యాక్సెస్ కావచ్చు. రీవాచ్ ఇండికేటర్, బ్యాడ్జ్, కస్టమ్ యాప్ ఐకాన్స్, బెస్ట్‌ఫ్రెండ్స్ ఫర్ఎవర్, ఘోస్ట్ ట్రయల్స్ ఆన్ స్నాప్ మ్యాప్, సోలార్ సిస్టమ్...అనే ఆరు ఎక్స్‌క్లూజివ్ ఫీచర్స్‌ను ప్రవేశపెట్టింది. సబ్స్క్రిప్షన్ సర్వీస్‌లోకి వచ్చాం అనేదానికి సూచనగా యూజర్ ప్రొఫైల్‌లో స్నాప్‌చాట్ ప్లస్ బ్యాడ్జ్, స్టార్లు కనిపిస్తాయి. ఇది కూడా చదవండి: Anand Mahindra: వీకెండ్ మూడ్‌లోకి ఆనంద్ మహీంద్ర, భార్య జంప్, మైండ్ బ్లోయింగ్ రియాక్షన్స్ -
ఎగిరే కెమెరా.. అదిరిందయ్యా
కెమెరా గాల్లో ఎగురుతూ మన చుట్టూ తిరుగుతూ ఫొటోలు, వీడియోలు తీస్తుంటే ఎలా ఉంటుంది? వారెవా.. భలే ఉంటుంది అంటారు కదా. అచ్చం ఇలాంటి ప్రత్యేకతలతోనే స్నాప్ చాట్ కంపెనీ ఓ ఎగిరే కెమెరాను విడుదల చేసింది. ఎలాంటి సెటప్ అవసరం లేకుండా దానంతట అదే పని చేసే ఈ కెమెరాకు ‘పిక్సీ’ అని పేరు పెట్టింది. దీన్ని నియంత్రించాల్సిన అవసరం ఉండదు. వెళ్లాల్సిన 4 మార్గాలు ముందే ఇందులో నిర్దేశించి ఉంటాయి. మనకు కావాల్సిన మార్గాన్ని ఎంచుకొని బటన్ నొక్కితే గాల్లో తేలియాడుతుంది. మనతో పాటు కదులుతుంది. ఫొటోలు, వీడియోలు తీస్తుంది. అంతా అయిపోయాక మన అరచేయిని కింద పెడితే వచ్చి వాలిపోతుంది. దీన్ని ప్రస్తుతం అమెరికా, ఫ్రాన్స్‌లలో అందుబాటులోకి తెచ్చారు. ధర రూ. 17,600. దీని బరువు 101 గ్రాములు. ఇందులో 12 మెగా పిక్సెల్ కెమెరా ఉంటుంది. 2.7కె వీడియోలు తీస్తుంది. 16జీబీ డేటాను నిల్వ చేసుకుంటుంది. అంటే దాదాపు వెయ్యి ఫొటోలు, వంద వీడియోల వరకు తీస్తుంది. పిక్సీ బ్యాటరీ ఎంతసేపు ఉంటుందో కంపెనీ చెప్పలేదు. అయితే ఫుల్‌గా చార్జ్ చేస్తే దాదాపు 5 నుంచి 8 సార్లు ఎగురుతుందని చెబుతున్నారు. ఒక్కసారి ఎగిరితే దాదాపు 10 నుంచి 20 సెకన్లు గాల్లో ఉంటుంది. – సాక్షి, సెంట్రల్ డెస్క్ -
ఒకప్పుడు ఫేస్బుక్, ట్విట్టర్.. ఇప్పుడు స్నాప్‌చాట్
న్యూఢిల్లీ: సోషల్ మీడియా దిగ్గజాలుగా ఉన్న ఫేస్బుక్, ట్విట్టర్ బాటలోనే పయణిస్తోంది ఫోటో మేసేజింగ్యాప్ స్నాప్ చాట్. అనతి కాలంలోనే ఇండియాలో యూజర్ల సంఖ్యను గణనీయంగా పెంచుకోగలిగింది. సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో తనదైన ముద్ర వేసేందుకు వడివడిగా అడుగులు వేస్తోంది. ఫోటో మెసేజింగ్ యాప్ స్నాప్‌చాట్ వినియోగదార్ల సంఖ్య 10 కోట్లు దాటిందని ఆ కంపెనీ సీఈవో ఇవాన్ స్పైగల్ తెలిపారు. ‘ ఇండియాలో యూజర్ల సంఖ్యను పెంచుకునేందుకు ప్రత్యేక ప్రణాళిక అమలు చేశామని తెలిపారు. ముఖ్యంగా లోకల్ ఫీల్ తెచ్చేందుకు కంటెంట్ కోసం భారీగా ఖర్చు చేశామన్నారు. ఆ ప్రయమ్నం ఫలించిందని. అందువల్లే ఈ ఏడాది ఆరంభంలో ఆరు కోట్లు ఉన్న యూజర్ల సంఖ్య ప్రస్తుతం పది కోట్లకు చేరింది’ అని వివరించాడు. స్నాప్‌చాట్ వేదికపై ప్రకటనదార్ల సంఖ్య 2020లో 70% పెరిగిందని కూడా ఇవన్ స్పైగల్ వెల్లడించారు. ఇండియాలో యూజర్ బేస్ పెరగడంతో స్నాప్‌చాట్‌ని వ్యాపార భాగస్వామిగా ఎంచుకునేందుకు దిగ్గజ కంపెనీలు ముందుకు వస్తున్నాయి. ఆగ్యుమెంటెంట్ రియాల్టీని ఉపయోగిస్తూ షాపింగ్‌లో కొత్త అనుభూతిని ఇచ్చేందుకు ఇప్పటికే ఫ్లిప్‌కార్ట్, స్నాప్‌చాట్‌లు సంయుక్తంగా పని చేస్తున్నాయి. అంతేకాదు జోమాటో, షుగర్ కాస్మోటిక్స్, మైగ్లామ్ కంపెనీలు కూడా స్నాప్‌చాట్‌తో కలిసి పని చేస్తున్నాయి. -
సోషల్ మీడియాలో 'దమ్ మారో దమ్'..యువతకు చెక్ పెట్టేలా
ఫేస్బుక్ ఆధ్వర్యంలో నడుస్తోన్న ఇన్‌స్టాగ్రామ్‌పై వరుస ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అదే సమయంలో సోషల్ మీడియా సైట్స్‌లలో డ్రగ్స్ అమ్మకాలు పెరిగిపోతున్నాయనే కొన్ని రిపోర్ట్లు వెలుగులోకి వచ్చాయి. దీంతో ఈ వ్యవహారం తన మెడకు చుట్టుకునే ప్రమాదం ఉందని భావించిన స్నాప్ చాట్ కొత్త టూల్‌ను లాంఛ్ చేసింది. అమెరికన్ సోషల్ మీడియా ఫ్లాట్ ఫాం స్నాప్ చాట్ విమర్శల్ని మూటగట్టుకుంది. ఈ ఏడాది సమ్మర్ సీజన్లో పిల్లల మరణాలపై నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో అధికారుల విచారణ చేపట్టారు. ఈ విచారణలో స్నాప్ చాట్‌లో నకిలి డ్రగ్స్ అమ్ముకాలు జరిగినట్లు గుర్తించారు.ఆ మందులు తీసుకోవడం వల్లనే పిల్లలు మరణించారనే ఆధారాలు వెలుగులోకి రావడంతో స్నాప్ చాట్‌పై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ వివాదం చల్లారక ముందే గత వారం యుఎస్ డ్రగ్ ఎన్ఫోర్స్మెంట్ అడ్మినిస్ట్రేషన్ (డీఈఏ) అధికారులు సోషల్ నెట్ వర్క్‌లలో ఫెంటానిల్,మెథాంఫేటమిన్ నకిలి డ్రగ్స్ అమ్మకాలు పెరిగిపోతున్నాయంటూ హెచ్చరికలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో స్నాప్ చాట్ నష్టనివారణకు సిద్ధమైంది కొత్త టూల్ యూజర్లు స్నాప్ చాట్‌లో ఏ అంశం గురించి సెర్చ్ చేస్తున్నారు? సెర్చ్‌లో ప్రమాదకరమైన అంశాలు ఏమైనా ఉన్నాయా' వంటి అంశాల్ని గుర్తించేందుకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో టూల్‌ను లాంఛ్ చేసింది. దీంతో యూజర్లు ఎవరైనా డ్రగ్స్ గురించి వెతికితే అలర్ట్ చేస్తుంది. వెంటనే యూజర్ల అకౌంట్లపై చర్యలు తీసుకుంటుంది. చదవండి: తీవ్ర విమర్శలు.. వెనక్కి తగ్గిన జుకర్‌బర్గ్ -
ఫేస్బుక్ డౌన్.. వారికి మాత్రం పండుగే పండుగ!
రెండు రోజుల క్రితం ఫేస్బుక్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ డౌన్ అయిన విషయం తెలిసిందే. అయితే, ఈ సమయంలో అమెరికాకు చెందిన ఫోటో మెసేజింగ్ యాప్ స్నాప్‌చాట్ వినియోగం ఒకేసారి 23 శాతం పెరిగింది. ఫేస్బుక్లో ఈ అంతరాయం కారణంగా సుమారు 2.7 బిలియన్ వినియోగదారులు అసౌకర్యానికి గురి అయ్యారు. ఫేస్బుక్ యాజమాన్యంలోని యాప్స్ లో అంతరాయం కలగడంతో సిగ్నల్, టెలిగ్రామ్, టిక్ టాక్, ట్విట్టర్ వంటి ఇతర సోషల్ మీడియా ప్లాట్ ఫారమ్‌లను యూజర్లు ఎక్కువగా వినియోగించారు. దీంతో ఇతర యాప్స్ వినియోగం భారీగా పెరిగింది. టెలిగ్రామ్ వినియోగం 18 శాతం, సిగ్నల్ యాప్ వినియోగం 15 శాతం పెరిగినట్లు ఆ సంస్థలు నివేదించాయి. అక్టోబర్ 4(సోమవారం) ఫేస్బుక్లో అంతరాయం ఏర్పడిన సమయంలో 70 మిలియన్లకు పైగా కొత్త వినియోగదారులు టెలిగ్రామ్ యాప్ ను వినియోగించారు. ఫేస్బుక్, వాట్సాప్, ఇన్‌స్ట్రాగామ్ సేవలు అన్ని గంటల సేపు నిలిచిపోవడానికి అంతర్గతంగా నెలకొన్న కమ్యూనికేషన్ టూల్స్‌లో లోపాలే కారణమని వెల్లడైంది. కన్ఫిగరేషన్ మార్పుల్లో తలెత్తిన లోపాల వల్ల సర్వీసులకి అంతరాయం ఏర్పడింది ఆ సంస్థ ఇంజినీర్ల బృందం తన బ్లాగ్‌లో వెల్లడించింది. (చదవండి: గూగుల్ నుంచి ‘స్నోకోన్’, దాని వెనుక చరిత్ర ఏంటో తెలుసా?) -
సీరియస్ మీటింగ్స్ కాస్తా ఎంటర్టైన్ చేస్తున్నాయే
వార్ రూమ్ తరహాలో సీరియస్‌గా సాగే జూమ్ మీటింగ్స్ ఇకపై ఈ స్నాప్ కెమెరా ఆప్షన్ తో మరింత ఎంటర్ టైన్మెంట్గా మారనున్నాయి. కోవిడ్ కారణంగా ఆన్లైన్ క్లాసుల నుంచి ఆఫీస్ మీటింగ్స్ వరకు అన్నీ ఆన్లైన్లో జరుగుతున్నాయి.అయితే ఆయా టెక్ దిగ్గజాలు సరికొత్త ఫీచర్లతో ఆన్లైన్ మీటింగ్స్ ను మరింత అందంగా తీర్చిదిద్దేందుకు ప్రయత్నిస్తున్నాయి. తాజాగా వీడియో కమ్యూనికేషన్ 'జూమ్'లో స్నాప్ చాట్ కు చెందిన స్నాప్ కెమెరా ఫిల్టర్ ఫీచర్ అందుబాటులోకి వచ్చింది. ఈ ఫీచర్‌ను వినియోగించి ఆన్ లైన్లో కుటుంబ సభ్యులతో,స్నేహితులతో కలిసి ఫన్ జనరేట్ చేసుకోవచ్చు. జూమ్ మీటింగ్‌లో ఫిల్టర్ ఫీచర్‌ను వినియోగించి మన ఫేస్ కంప్లీట్‌గా జనరిక్ ఫిక్సార్, డ్రీమ్ వర్క్స్ కార్టూన్ క్యారక్టర్ లోకి ట్రాన్స్ ఫామ్ అయ్యేలా ఎనేబుల్ చేసుకోవచ్చు. ఈ ఆప్షన్ స్నాప్ కెమెరా v1.14.0 , విండోస్ 10, మాక్ 10.13 ఓఎస్, ఇంటెల్ కోర్ ఐ 3 2.5 జీహెచ్‌జెడ్, ఎఎమ్డి ఎఫ్ఎక్స్ 4300 2.6 జీహెచ్‌జెడ్, ఇంటెల్ హెచ్డి గ్రాఫిక్స్ 4000 లేదంటే ఎన్విడియా జిఫోర్స్ 710, ఎఎమ్డి రేడియన్ హెచ్డి 6450 ఈ ఆపరేటింగ్ సిస్టమ్స్‌లో మాత్రమే పనిచేస్తుంది. ఈ కార్టూన్ ఫిల్టర్ కావాలనుకుంటే అఫీషియల్ వెబ్ సైట్ స్నాప్ ఐఎన్‌సీ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఆప్షన్ ఎలా ఎనేబుల్ చేసుకోవాలి జూమ్ ఓపెన్ చేసిన తరువాత రైట్ సైడ్ కార్నర్లో వీడియో గేర్ ఐకాన్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే డ్రాప్ డౌన్ మెనూ బార్ లో వీడియో క్లిక్ చేస్తే కెమెరా ఆన్ అవుతుంది కెమెరా ఆన్ చేస్తే స్నాప్ కెమెరా ఆప్షన్ కనిపిస్తుంది. ఆ స్నాప్ కెమెరా ఆప్షన్‌లోకి వెళ్లితే మీకు కావాల్సినట్లు మీ ఫేస్ కార్టూన్ కేరక్టర్‌లోకి ట్రాన్స్ ఫార్మ్ అవుతుంది. -
ఈ రోజు ఫేస్ మార్చుకుందామా!
నా ఫేస్ చూసీ చూసీ నాకే బోర్ కొడుతుంది... అనుకుంటాం చాలాసార్లు. మీ ఫేస్ కొత్తగా, తమాషాగా కనిపించాలనుకుంటున్నారా? అయితే ఇవి మీ కోసమే. జపాన్ యానిమేషన్ చిత్రాలలో కనిపించే ఫేస్‌లతో కనిపించడానికి యానిమి స్టైల్ లెన్స్, అమెరికన్ కంప్యూటర్ యానిమేషన్ ఫాంటసీ కామెడీ ఫిల్మ్ ‘ది గ్రించ్’లో మాదిరిగా పచ్చగా కనిపించడానికి గ్రించ్ లెన్స్, పిల్లి ముఖంతో గర్జించడానికి క్యాట్ వుమెన్ లెన్స్, ప్రిన్సెస్ జాస్మీన్లా అందంగా మెరవడానికి స్నాప్‌చాట్, ఇన్‌స్టాగ్రామ్‌లో అందుబాటులో ఉన్నాయి. ఇవి కొన్ని మాత్రమే...ఇంకా మీరు ప్రయత్నించడానికి చాలా ఫేస్ ఫిల్టర్లు ఉన్నాయి. జస్ట్ ట్రై చేసి చూడండి.(చదవండి: వన్‌ప్లస్ యూజర్లకు గుడ్ న్యూస్) -
మరో అద్భుతమైన ఫీచర్‌తో స్నాప్‌చాట్!
స్నాప్‌చాట్‌లో ఇకపై సబ్‌స్రైబర్స్ సంఖ్య కనబడనుంది. క్రియేటర్లకు ఆ అవకాశాన్ని కల్పిస్తూ ప్రముఖ యాప్ అనుమతినిచ్చింది. ఇది స్నాప్‌చాట్ సాధించిన గొప్ప విజయంగా చెప్పవచ్చు ఎందుకంటే ఇప్పటి వరకు స్నాప్‌చాట్‌లో సబ్స్రైబర్స్ను చూసే అవకాశం లేదు. ప్రసుత్తం యాప్‌ను అప్డేట్ చేసి క్రియేటర్స్‌కు తమకు ఉన్న సబ్స్రైబర్స్ను బహిర్గతం చేసే అవకాశాన్ని కల్పించింది. ఎలాంటి సోషల్‌మీడియా నిషేధాలు లేకుండా సన్నిహితులు ఉపయోగించుకోవడానికి ఇది ఒక మంచి యాప్ అని చెప్పవచ్చు. ప్రస్తుతం స్నాప్‌చాట్‌లో ఈ అప్డేట్ కనిపిస్తోంది. ఈ యాప్‌లో క్రియేటర్స్‌ను స్నాప్ స్టార్స్ అని కంపెనీ సంబోధిస్తుంది. క్రియేటర్స్ కంటెంట్ డిస్కవరీ అనే విభాగంలో కనిపిస్తోంది. అదేవిధంగా సెర్చ్ అప్షన్ ద్వారా కూడా మీరు కావలసిన క్రియేటర్స్ కోసం వెతకవచ్చు. సెర్చ్ బార్ దగ్గర స్నాప్‌చాట్ ప్రసిద్ధ స్నాప్స్టార్స్ను కూడా చూపెడుతోంది. ఇక క్రియేటర్‌కు ఎంత మంది సబ్‌స్రైబర్స్ ఉన్నారో తెలుసుకోవాలంటే వారి ప్రొఫైల్ మీద ప్రెస్ చేయాలి. చదవండి: క్షమాపణలు చెప్పిన స్నాప్‌చాట్, కారణం? స్నాప్‌చాట్‌లో కొత్తగా వచ్చిన ఈ అప్డేట్ వలన వివిధ రకాల సోషల్‌మీడియా ఫ్లాట్‌ఫాంలలో ప్రముఖులకు ఉన్న ఫాలోవర్స్‌ను స్నాప్‌చాట్‌లో ఉన్న ఫాలోవర్స్‌తో పోల్చి చూసుకోవచ్చు. అయితే చాలా మంది క్రియేటర్స్ తమ ఫాలోవర్స్ సంఖ్యను తెలిపే అవకాశం ఇవ్వాలని కోరడంతో ఈ అప్డేట్ను తీసుకువచ్చినట్లు స్నాప్‌చాట్ ప్రతినిధులు తెలిపారు. ప్రస్తుతం స్నాప్‌చాట్ వినియోగం పెరుగుతోంది. భారతదేశంలో దీని వినియోగం రెట్టింపు అయ్యింది. చదవండి: ‘మానసిక సమస్యలకు స్నాప్‌చాట్ ఫీచర్’ -
‘మానసిక సమస్యలకు స్నాప్‌చాట్ ఫీచర్’
సాక్షి, ముంబై: దేశీయ సోషల్ మీడియా మెసేజింగ్ యాప్ స్నాప్‌చాట్ త్వరలో మరో కొత్తఫీచర్‌ను తీసుకురానుంది. ఇటీవల కాలంలో దేశ ప్రజలు మానసిక సమస్యలతో బాధపడుతున్నారు. కాగా దేశ ప్రజల మానసిక సమస్యలను తీర్చేందుకు స్నాప్‌చాట్ యాప్ హియర్ ఫర్ యూ ఫీచర్‌ను(మీ సమస్యలను తీర్చడానికి) త్వరలో ప్రారంభించనుంది. ఈ ఫీచర్లో వినియోగదారులు ఎదుర్కొంటున్న మానసిక సమస్యలకు పరిష్కారం మార్గాన్ని సూచిస్తుందని స్నాప్‌చాట్ యాజమాన్యం పేర్కొంది. కాగా అన్ని రకాల ఉద్యేగ నియంత్రణ, మానసిక సమస్యలకు ఈ ఫీచర్ ఎంతో ఉపయోగపడుతుందని స్నాప్‌చాట్ యాజమాన్యం తెలిపింది. అయితే గతంలో స్నాప్‌చాట్ హెడ్‌స్పేస్ అనే ఫీచర్ ద్వారా వినియోగదారులకు మానసిక సమస్యలు, మిని మెడిటేషన్ తదితర సేవలను అందించింది. ఈ ప్రత్యేక ఫీచర్ రూపకల్పనలో చాలా అంశాలను అధ్యయనం చేసినట్లు స్నాప్‌చాట్ పేర్కొంది. (చదవండి: యూజర్లకు స్నాప్‌చాట్ క్షమాపణలు) -
క్షమాపణలు చెప్పిన స్నాప్‌చాట్, కారణం?
సాక్షి, న్యూఢిల్లీ: స్నాప్‌చాట్.. ఈ మెసెంజర్ యాప్‌ద్వారా కేవలం మెసేజ్‌లు, కాల్స్ మాత్రమే కాకుండా రకరకాల ఫిల్టర్లను ఉపయోగించి వివిధ రకాల ఫోటోలను దిగవచ్చు. ప్రస్తుతం ఉన్న పరిస్థితులకు అనుగుణంగా స్నాప్‌చాట్ యూజర్లకు వివిధ రకాల థిమ్స్లో ఫిల్టర్లను అందుబాటులో ఉంచుతుంది. అయితే మల్టీ మీడియా మెసేంజింగ్ యాప్ స్నాప్‌చాట్ తన యూజర్లకు క్షమాపణలు తెలిపింది. జూన్ 19 జూన్టీన్త్ డే సందర్భంగా ఒక క్తొత ఫిల్టర్‌ను స్నాప్‌చాట్ యూజర్లకు అందుబాటులో ఉంచింది. మనం నవ్వితే సంకెళ్లు తెగుపోతాయి అనే థీమ్‌ను సృష్టించింది. అయితే జూన్టీన్త్ డే సందర్భంగా రూపొందించిన ఈ ఫిల్టర్‌కు యూజర్ల నుంచి నెగిటివ్ రివ్యూ రావడంతో స్నాప్‌చాట్ క్షమాపణలు చెప్పింది. (వాట్సాప్‌లో కొత్త ఫీచర్.. మల్టీ లాగిన్) ‘ఇలాంటి అభ్యంతరకరమైన జూన్టీన్త్ లెన్స్ రూపొందించినందుకు క్షమాపణలు చెబుతున్నాము. మా రివ్యూ ప్రాసెస్‌లో మేం ఈ లెన్స్ వాడకానికి అనుమతి నివ్వలేదు. దీనికి సంబంధి దర్యాప్తు చేస్తున్నాము. మరోసారి ఇలాంటిది పునరావృతం కాదు’ అని ట్విట్టర్ వేదికగా క్షమాపణలు కోరింది. అమెరికాలో బానిసలుగా ఉన్న ప్రజల విముక్తి జ్ఞాపకార్థం జూన్ 19న సెలవుదినంగా జరుపుకుంటారు. దీనిని మొదట 1865లో టెక్సాస్‌లో జరుపుకున్నారు. అంతర్యుద్ధం తరువాత 1862 విముక్తి ప్రకటన నిబంధనల ప్రకారం బానిసలకు స్వేచ్ఛగా ప్రకటించారు. దీంతో ప్రతి సంవత్సరం జూన్19(జూన్టీన్త్ డే)న వేడుకలు చేసుకుంటారు. (ఐటీ చరిత్రలో సంచలన కలయిక) We deeply apologize for the offensive Juneteenth Lens. The Lens that went live hadn’t been approved through our review process. We are investigating so this doesn’t happen again. — Snapchat (@Snapchat) June 19, 2020 This SnapChat #Juneteenth filter is...um...interesting. Smile to break the chains? Okay then. pic.twitter.com/Wyob3kT3ew — Mark S. Luckie (@marksluckie) June 19, 2020 -
‘టిక్‌టాక్’ విశేషాలెన్నో!
సాక్షి, న్యూఢిల్లీ : నేడు సోషల్ మీడియా అన్నింటిలోకెల్లా ‘టిక్ టాక్’ యాప్ భారత్‌లో అతి వేగంగా విస్తరిస్తోంది. వినోద ప్రధానమైన ఈ యాప్‌ను చైనా డెవలపర్ బైట్ డాన్స్ 2017లోనే ప్రవేశపెట్టినప్పటికీ భారత్‌లోకి 2018 జనవరిలో అడుగు పెట్టింది. అప్పటి నుంచి 2019, ఆగస్టు నాటికి 18 నెలల కాలంలోనే ఇది భారత్‌లోని అన్ని స్మార్ట్ఫోన్లలో 30 శాతానికి విస్తరించింది. దీన్ని ఎక్కువగా ఉపయోగిస్తున్న వారంతా 18–35 ఏళ్ల లోపు వారవడం విశేషం. వారంతా కూడా టూ టైర్, త్రీటైర్ నగరాలకు చెందిన వారే అవడం మరో విశేషమని ‘కాలాగాటో’ వ్యాపార విశ్లేషణా సంస్థ తెలియజేసింది. ‘టిక్‌టాక్’ వినియోగదారుల్లో అధిక జీతాలు అందుకునే వారు కాకుండా తక్కువ జీతాలు అందుకునే వారే ఎక్కువగా ఉండడం ఇంకో విశేషం. భారత టిక్‌టాక్ యూజర్లలో 52 శాతం మంది నెలకు 25 వేల రూపాయల లోపు సంపాదించేవారే! వీరందరికి ఈ రోజుల్లో అతి తక్కువ ఖర్చుతో వినోదం లభించడమే కాకుండా తమ నైపుణ్యాన్ని ప్రదర్శించుకునేందుకు, తద్వారా తన తోటి సమాజంలో ఓ గుర్తింపు తెచ్చుకోవడానికి ‘టాక్‌టాక్’ తోడ్పడుతుండడంతో ఆదరణ పెరుగుతోంది. జియో కారణంగా ఇంటర్నెట్ ధరలు దిగివస్తున్న పరిస్థితుల్లో ‘టిక్‌టాక్’ రావడం దాన్ని సక్సెస్‌కు ఒక కారణమని చెప్పవచ్చు. టిక్‌టాక్‌లో అతి తక్కువ వీడియో, అంటే 15 సెకండ్ల ఫార్మట్ ఉపయుక్కంగా ఉండడం, ఔత్సాహిక నటులు, డ్యాన్సర్లు, ఇతర పర్ఫామర్లకు తొందరగా గుర్తింపు రావడానికి దోహద పడడం కూడా దీని ప్రాచుర్యాన్ని పెంచింది. అన్ని యాప్స్‌కన్నా టిక్‌టాక్ కోసమే భారతీయులు ఎక్కువ సమయాన్ని కేటాయించడం కూడా విశేషమనే చెప్పవచ్చు. ‘లైకీ, ఇన్స్టాగ్రామ్, హెలో, స్నాప్‌చాట్‌లకన్నా ఎక్కువగా యూజర్ సరాసరి 30 నిమిషాలపాటు టిక్‌టాక్‌కు కేటాయిస్తున్నారు. స్నాప్‌చాట్‌కు సరాసరి 9.5 నిమిషాలు మాత్రమే కేటాయిస్తున్నారు. గత సెప్టెంబర్ నెలలో ప్రపంచంలో అన్ని యాప్‌లకన్నా ఎక్కువగా టిక్‌టాక్‌ను డౌన్లోడ్ చేసుకున్నారు. వాటిలో 44 శాతం భారత్‌లోనే జరగడం కూడా విశేషమే. టిక్‌టాక్‌కు పోటీగా గత సెప్టెంబర్ నెలలోనే ‘ఫైర్‌వర్క్’ అనే మరో వీడియో షేరింగ్ యాప్ వచ్చింది. సిల్లీ జోకులు, సిల్లీ లిప్ సింకింగ్ వీడియోలను తీసుకోమని స్పష్టం చేసిన ‘ఫైర్‌వర్క్ ఇండియా’ సీఈవో, మేనేజింగ్ డైరెక్టర్ సునీల్ నాయర్, ఇప్పుడు పునరాలోచనలో పడినట్లు తెలుస్తోంది. -
ఆ కంపెనీలో వాట్సాప్, స్నాప్‌చాట్ నిషేధం
జర్మన్ ఆటోమేటివ్ పార్ట్‌ల సప్లయిర్ కాంటినెంటల్ ఏజీ కీలక నిర్ణయం తీసుకుంది. తమ కంపెనీ ఆఫీసులో పనిచేసే ఉద్యోగులు వాట్సాప్, స్నాప్‌చాట్ వంటి సోషల్ మీడియా యాప్స్ వాడకుండా నిషేధం విధించింది. కంపెనీ జారీచేసే ఫోన్ల ద్వారా వీటిని ఉపయోగించకూడదని, ఈ నిర్ణయం వెంటనే అమల్లోకి వస్తుందని పేర్కొంది. భద్రతా కారణాలతో ఈ నిషేధం విధిస్తున్నట్టు కంపెనీ తెలిపింది. ఫోన్లు, టాబ్లెట్లలో సమాచారం నిక్షిప్తమై ఉండటం వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పింది. ఈ నిషేధంతో దాదాపు 36వేల మంది ఉద్యోగులపై ప్రభావం పడనుందని కాంటినెంటల్ అధికార ప్రతినిధి చెప్పారు. ప్రపంచంలో దిగ్గజ కారు పార్ట్‌ల కంపెనీల్లో ఒకటిగా ఉన్న కాంటినెంటల్‌లో గ్లోబల్‌గా 2 లక్షల 40వేల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. డేటా రక్షణ విషయానికి వచ్చేసరికి సోషల్ మీడియా సర్వీసుల్లో లోపాలున్నాయని తాము విశ్వసిస్తున్నామని కంపెనీ ఓ ప్రకటన విడుదల చేసింది. ఈ యాప్స్ యూజర్ల వ్యక్తిగత, రహస్య సమాచారాన్ని యాక్సస్ చేస్తున్నాయని పేర్కొంది. తమ ఉద్యోగులను, బిజినెస్ పార్టనర్లను రక్షించుకోవాల్సినవసరం ఉందని కాంటినెంటల్ చెప్పింది. మే 25 నుంచి అమల్లోకి వచ్చిన యూరప్ జనరల్ డేటా ప్రొటెక్షన్ రెగ్యులేషన్(జీడీపీఆర్)తో సోషల్ మీడియా కంపెనీల టాప్ ఎగ్జిక్యూటివ్‌లకు ప్రైవసీ అనేది తలనొప్పిగా మారిందని తెలిసింది. ఈ క్రమంలో జీడీపీఆర్‌కు అనుగుణంగా సోషల్ మీడియా కంపెనీలు తమ బాధ్యతల్ని మార్చారని కాంటినెంటల్ చెప్పింది. ఈ సర్వీసులతో డేటా షేర్ చేయాలంటే, ప్రతి ఒక్క యూజర్, తమ కాంటాక్ట్ లిస్ట్‌లోని యూజర్లందరితో అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి కంపెనీకి ఎలాంటి పరిష్కారం లభించడం లేదు. దీంతో తమ వ్యాపార ప్రయోజనాలను కాపాడటం కోసం ఈ సర్వీసులను పూర్తిగా రద్దు చేయడమే మేలని కాంటినెంటల్ నిర్ణయించింది. -
స్నాప్ ఉద్యోగులపై వేటు
అమెరికన్ టెక్నాలజీ, సోషల్ మీడియా కంపెనీ అయిన స్నాప్ తన ఉద్యోగులపై వేటు వేస్తోంది. ఇప్పటికే ఇంజనీరింగ్, కంటెంట్ ఉద్యోగులను తీసేసిన ఈ కంపెనీ, మరికొంత మంది ఉద్యోగులను తీసేయాలని నిర్ణయించింది. అయితే ఈ సారి అడ్వర్టైజింగ్ వైపు ఈ వేటు ఉండనున్నట్టు తెలుస్తోంది. మొత్తంగా వంద మంది ఉద్యోగులపై వేటు వేయనున్నట్టు సంబంధిత వర్గాలు చెప్పాయి. గతేడాది చివరిలో తమ టీమ్స్‌ను జాగ్రత్తగా పరిశీలించాలని స్నాప్ సీనియర్ లీడర్లను ఆదేశించామని స్నాప్ చీఫ్ స్ట్రాటజీ ఆఫీసర్ ఇమ్రాన్ ఖాన్ చెప్పారు. తమ వ్యాపారాల్లో నిలకడగా వృద్ధి సాధించడానికి తమ టీమ్‌ల మధ్య సన్నిహిత సహకారాలు ఏర్పరచడం చాలా క్లిష్టమైన ప్రక్రియ అని పేర్కొన్నారు. స్నాప్‌చాట్ యాప్‌ను నిర్వహించే స్నాప్ ఈ నెల మొదట్లోనే 120 మంది ఇంజనీర్లను తన కంపెనీ నుంచి తీసేసింది. అడ్వర్టైజింగ్ బిజినెస్‌లను అభివృద్ధి చేసుకోవడానికి, కొత్త ఉత్పత్తులను విడుదల చేయడం కోసం స్నాప్ ఎక్కువగా అడ్వర్టైజింగ్ స్టాఫ్‌ను నియమించుకుంది. ప్రస్తుతం వీరిలో కొంతమంది ఉద్యోగులను స్నాప్ తీసేస్తోంది. గత ఏడాది క్రితం స్నాప్ ఐపీఓకి వచ్చిన తర్వాత, కంపెనీ వరుసగా మూడు క్వార్టర్ల నుంచి రెవెన్యూ వృద్ధిలో నిరాశపరుస్తూనే వచ్చింది. -
రూ. 900 కోట్లు ఆవిరయ్యాయి
న్యూఢిల్లీ : సోషల్‌మీడియా యాప్ స్నాప్ చాట్ సంపద భారీగా ఆవిరయ్యింది. కొద్దిరోజుల క్రితం పాప్ సింగర్ రిహన్నాపై ఉద్దేశించిన ఓ యాడ్‌ను స్నాప్‌చాట్ ప్రచురించింది. దీంతో రిహాన్నా ఫ్యాన్స్ స్నాప్‌చాట్ ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. అంతేకాదు రిహన్నాపై యాడ్ తర్వాత స్నాప్ చాట్ రూ. 9 వేల కోట్ల నష్టపోయింది. తాజాగా స్నాప్‌చాట్ సహవ్యవస్థాపకుడు, సీఈవో ఇవాన్ సంపద రూ. 900 కోట్ల మేర ఆవిరయ్యింది. ఈ విషయాన్ని ఫోర్బ్ వెల్లడించింది. ప్రసుత్తం ఇవాన్ సంపద 3.8 బిలియన్ డాలర్లుగా ఉంది. 2009లో రిహన్నాపై ఆమె బాయ్‌ఫ్రెండ్ బ్రౌన్ దాడి చేయడాన్ని ఆధారంగా చేసుకొని స్నాప్‌చాట్ యాడ్‌ను రూపొందించారు. దీనిపై రిహన్నా తీవ్రస్థాయిలో మండిపడ్డారు. స్నాప్‌చాట్ యాప్‌ను డిలీట్ చేయాల్సిందిగా ఆమె తన అభిమానులకు పిలుపునిచ్చారు. కాగా యాడ్‌పై స్నాప్‌చాట్ ఇప్పటికే రిహన్నాకు క్షమాపణలు చెప్పింది. -
ఆ ఫీచర్ తొలగించిన క్రేజీ యాప్స్
న్యూయార్క్: ప్రముఖ మేసేజింగ్ యాప్స్ ఇన్స్టాగ్రాం, స్నాప్‌చాట్‌లు సంచలన నిర్ణయం తీసుకున్నాయి.యూజర్ల మనోభావాలను దెబ్బతీస్తున్నాయానే అంచనాలతో కీలక ఫీచర్‌ను తాత్కాలికంగా తొలగించేందుకు నిర్ణయించాయి. తద్వారా తమ సేవలు యూజర్ ఫ్రెండ్లీగా ఉండాలని భావిస్తున్నట్లు తెలిపాయి. ఫోటోలు, వీడియోలు షేరింగ్ యాప్స్ ఇన్స్టాగ్రాం, స్నాప్చాట్లలో టెక్ట్స్ కు బదులుగా సందేశాన్ని తెలియజేసే జిఫ్ (జిఫ్ఫి) లు వివక్షను, జాత్యాంహకారాన్ని సూచించేవిగా ఉన్నందువల్ల వాటిని తాత్కాలికంగా తొలగిస్తున్నట్లు ప్రకటించాయి. వీటి వల్ల కొంతమంది మనోభావాలు దెబ్బతినే అవకాశం ఉందనీ, ఇటీవల తమ సర్వేలో తేలిందని వెల్లడించాయి. వీటీపై కొంతమందితో సర్వే నిర్వహించిన అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నట్లు రెండు సంస్థలు తెలిపాయి. ఈ నిర్ణయంపై స్పందించిన వినియోగదారులు తమ వ్యక్తిగత వివరాల భద్రతకు తీసుకుంటున్న చర్యలు కూడా వివరిస్తే బాగుంటుందని అభిప్రాయపడుతున్నారు. -
ఒక్క ట్వీట్‌తో 7వేల కోట్లకు ముంచేసింది
వాషింగ్టన్ : రియాల్టీ టీవీ స్టార్, ప్రముఖ మోడల్ కైలీ జెన్నర్ చేసిన ఒక్క ట్వీట్ సోషల్ మీడియా దిగ్గజం స్నాప్ ఛాట్ కొంపముంచింది. షేర్లు మొత్తం ఢమాల్ అన్నాయి. 1.3 బిలియన్ డాలర్లు (సుమారు 7వేల కోట్లకు పైగా) నష్టాన్ని సంస్థకు కలగజేసింది. ఇంతకీ విషయం ఏంటంటే.. స్నాప్ ఛాట్ ఇక మీదట ఎవరైనా తెరవకూడదనుకుంటున్నారా? అది నేనే అనుకుంటున్నారా? ఇది చాలా బాధకరం అంటూ 19 ఏళ్ల కైలీ ఓ ట్వీట్ చేసింది. 24.5 మిలియన్ ఫాలోవర్లు ఉన్న ఆమె ట్విట్టర్ ఖాతా మార్కెట్‌పై తీవ్ర ప్రభావం చూపింది. షేర్లన్నీ ఒక్కసారిగా కుప్పకూలిపోయాయి. అయితే ఆ వెంటనే అయినప్పటికీ నువ్వే నా తొలిప్రేమ.. నువ్వంటే నాకిష్టం అంటూ స్నాప్ ఛాట్‌ను ఉద్దేశించి ట్వీట్ చేసింది. కానీ, అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. సుమారు 8శాతం పైగా షేర్లు పడిపోయి వాల్ స్ట్రీట్ వద్ద 6 శాతానికి చేరుకుని.. షేర్ విలువ 17 డాలర్ల వద్ద కొనసాగుతోంది. స్నాప్ ఛాట్ స్థాపించిన సమయంలో షేర్ ఇదే విలువ ఉండటం విశేషం. కారణం.. ఇన్‌స్ట్రామ్ నుంచి గట్టి పోటీని ఎదుర్కుంటున్న స్నాప్ ఛాట్ లో మార్పులు కోరుతూ ఖాతాదారులు పెద్ద ఎత్తున్న సంతకాల సేకరణ చేపట్టారు. సుమారు 10 లక్షల మందికి పైగా పిటిషన్‌పై సంతకం చేసి స్నాప్ ఛాట్‌కు సమర్పించారు. అయినప్పటికీ మార్పులు చేసేందుకు స్నాప్‌ఛాట్ విముఖత వ్యక్తం చేస్తూ వస్తోంది. ఈ క్రమంలో కైలీ కూడా అసంతృప్తి వ్యక్తం చేయటం.. వేల కోట్ల నష్టం వాటిల్లటం జరిగిపోయాయి. -
ఒక్క రాత్రి రూ . 24 కోట్లు తగలేశాడు
శాన్ఫ్రాన్సిస్కో: ఇన్స్టాగ్రామ్ నుంచి పోటీతో స్నాప్‌చాట్ ఇబ్బందులు పడుతున్నా జల్సాలు, పార్టీల విషయంలో మాత్రం కంపెనీ సీఈవో ఇవాన్ స్పీజెల్ ఏమాత్రం వెనక్కితగ్గడం లేదు. లాస్ఏంజెల్స్లో న్యూ ఇయర్ పార్టీకి ఇవాన్ ఏకంగా రూ .24 కోట్లు ఖర్చు పెట్టాడు. పార్టీకి ఉద్యోగులు హాజరయ్యేందుకు వీలుగా కంపెనీకి సెలవు ప్రకటించి మరీ భారీ హంగామా చేశాడు. డీజే రాపర్ డ్రేక్ పెర్ఫామెన్స్ పార్టీకి హైలైట్‌గా నిలిచిందని కంపెనీ వర్గాలు పేర్కొన్నాయి. స్నాప్‌చాట్ టీమ్‌తో న్యూఇయర్ వేడుకలు సెలబ్రేట్ చేసుకోవాలనుకున్నామని, ఇవాన్ తన సొంత ఖర్చుతో గ్రాండ్ పార్టీ ఇచ్చాడని తెలిపాయి. ఈ మెగా ఈవెంట్ కోసం కంపెనీ చాలా ముందుగానే ప్లాన్ చేసిందని చెబుతున్నారు. 5000 మంది గెస్ట్‌లు పార్టీకి తరలివచ్చారు. ప్రపంచం నలుమూలల నుంచీ స్నాప్‌చాట్ ఉద్యోగులు పార్టీకి హాజరయ్యారు. -
స్నాప్‌చాట్‌లో సరికొత్త ఫీచర్!
శాన్ఫ్రాన్సిస్కో: ఫొటోషేరింగ్ యాప్ స్నాప్‌చాట్ వెబ్సైట్లలో ఇక నుంచి ‘స్టోరీస్’ సదుపాయం నెటిజన్లకు అందుబాటులోకి రానుంది. దీనిని స్టోరీస్ ఎవ్రీవేర్గా పిలుస్తున్నారు. ఫేస్బుక్ టైమ్‌లైన్ మాదిరిగానే స్నాప్‌చాట్ యూజర్ రోజంతా తీసిన వీడియోలు, ఫొటోలను కలిపి అందంగా ప్రదర్శించడాన్నే స్టోరీస్‌గా పిలుస్తారు. స్నాప్‌చాట్ యాప్‌లోనూ స్టోరీస్‌ను సృష్టించుకునేందుకు కొన్ని రోజులు వేచిచూడాల్సిందే. 'స్టోరీస్' సదుపాయం వల్ల స్నాప్‌చాట్ అప్లికేషన్ వాడని వాళ్లను కూడా వెబ్ ద్వారా ఆకర్షించవచ్చని స్నాప్‌చాట్ యాజమాన్యం భావిస్తోంది. అంతేగాక వెబ్ప్లేయర్ ద్వారా ఇతర పరికరాలకు సులువుగా వీడియోలను పంపుకునే సదుపాయాన్ని కూడా ప్రవేశపెడుతోంది. -
యూజర్ల కోసం ‘సోషల్’ వ్యూహం!
శాన్ ఫ్రాన్సిస్కో: సోషల్ మీడియా సంస్థలు ట్విటర్, స్నాప్‌చాట్ .. మరింత మంది యూజర్లను ఆకర్షించేందుకు కొత్త ప్రయోగాలు చేస్తున్నాయి. ఇందులో భాగంగా ట్విటర్.. ట్వీట్స్‌లో క్యారక్టర్స్ పరిమితిని యూజర్లందరికీ 280కి పెంచుతోంది. ప్రస్తుతం ఈ పరిమితి 140 క్యారక్టర్స్గానే ఉంది. మరోవైపు, స్నాప్‌చాట్ యూజర్లకు చేరువయ్యే విధంగా తమ యాప్ స్వరూపాన్ని మరింతగా సరళతరం చేయడంపై కసరత్తు చేస్తోంది. ఇరు కంపెనీలు ఈ మేరకు ప్రకటన చేశాయి. రెండో త్రైమాసికంతో పోలిస్తే మూడో త్రైమాసికం ఆఖరు నాటికి ట్విటర్ యూజర్ల సంఖ్య స్వల్పంగా 1 శాతం వృద్ధితో 33 కోట్లకు చేరింది. అటు స్నాప్‌చాట్ రోజువారీ యూజర్ల సంఖ్య 45 లక్షల మేర పెరిగి 17.8 కోట్లకు పెరిగింది. ఇది మూడు శాతం వృద్ధి. మరో సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్‌తో పోలిస్తే ఈ రెండింటి వృద్ధి చాలా స్వల్పంగానే ఉండటం గమనార్హం. ఫేస్బుక్ నెలవారీ యూజర్లు 16 శాతం పెరిగి 207 కోట్లకు చేరింది. యాప్ సరళతరం.. ‘స్నాప్‌చాట్‌ను ఉపయోగించడానికి గానీ అర్థం చేసుకోవడానికి ఒకింత కష్టంగా ఉంటోందనే అభిప్రాయాలు గత కొన్నాళ్లుగా వింటున్నాం. ఈ నేపథ్యంలోనే యాప్‌ను మరింత సరళతరంగా మార్చడంపై మా టీమ్ కసరత్తు చేస్తోంది‘ అని పరిశ్రమ విశ్లేషకులతో కాన్ఫరెన్స్ కాల్లో స్నాప్ సీఈవో ఇవాన్ స్పీగెల్ తెలిపారు. అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, ఆస్ట్రేలియాలోని 13–34 ఏళ్ల యూజర్లను దాటి తమ యూజర్ బేస్‌ను మరింతగా పెంచుకోవాల్సి ఉందని వివరించారు. మూడో త్రైమాసికంలో ఆర్థిక పనితీరు ఆశించిన స్థాయిలో లేకపోవడంతో పాటు యూజర్ల సంఖ్య కూడా పెద్దగా వృద్ధి చెందని నేపథ్యంలో స్పీగెల్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. 280 క్యారక్టర్స్కి పెంపు.. ఇంగ్లీష్‌లో పోస్ట్ చేసే ట్వీట్స్‌లో దాదాపు 9 శాతం వరకూ ట్వీట్స్.. 140 క్యారక్టర్స్ పరిమితిని దాటేసేలాగా ఉంటున్నాయని గుర్తించినట్లు ట్విటర్ తెలిపింది. దీంతో యూజర్లు తమ ట్వీట్స్‌ను ఎడిట్ చేయడంపై సమయం వెచ్చించడమో లేక మొత్తానికి ట్వీట్‌నే విరమించుకోవడమో జరుగుతోందని పేర్కొంది. ఈ నేపథ్యంలోనే ట్వీట్ పరిమితిని 280 క్యారక్టర్స్కి పెంచుతున్నట్లు తెలిపింది. సెప్టెంబర్‌లోనే దీన్ని ప్రయోగాత్మకంగా పరీక్షించడం ప్రారంభించగా, క్యారక్టర్స్ పరిమితి పెంచడంపై యూజర్లు సంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు ప్రాజెక్ట్ మేనేజర్ అలీజా రోసెన్ తెలిపారు. చైనీస్, జపనీస్, కొరియన్ భాషల్లోని ట్వీట్స్‌కి మినహా మిగతా అన్ని భాషల్లోని ట్వీట్స్‌కి ఈ పరిమితిని 280 క్యారక్టర్స్కి పెంచబోతున్నామని చెప్పారు. -
సూపర్ మోడల్‌ను పెళ్లాడిన టాప్ సీఈవో!
సూపర్ మోడల్ మిరాండ కెర్ వైవాహిక జీవితంలో అడుగుపెట్టింది. స్నాప్‌చాట్ సీఈవో ఎవాన్ స్పీగల్ను ఆమె పెళ్లాడింది. లాస్ ఏంజిల్స్‌లోని ఎవాన్ స్పీగల్ నివాసంలో వీరి పెళ్లి జరిగింది. పెద్ద ఆర్భాటం లేకుండా రహస్యంగా జరిగిన వీరి పెళ్లికి దాపు 40 మంది సన్నిహిత అతిథులు హాజరయ్యారని పీపుల్స్.కామ్ తెలిపింది. బయటకు తెలిసేలా పెద్దగా హడావిడి చేయకున్నా అత్యంత విలాసవంతంగా, వివాహం, రిసెప్షన్ ఘనంగా జరిగాయని ఈ వేడుకకు హాజరైన సన్నిహిత వర్గాలు తెలిపాయి. మిరాండ, ఎవాన్ 2015 నుంచి డేటింగ్ చేస్తున్నారు. వీరు 2016 జూలై 20న నిశ్చితార్థం చేసుకున్నారు. స్నాప్‌చాట్ యాప్‌లో తమ ఎంగేజ్మెంట్ ప్రకటన చేసి ఎవాన్ ఆశ్చర్యపరిచాడు. మిరాండ కెర్ గతంలో ఇంగ్లిష్ యాక్టర్ ఓర్లాండో బ్లూమ్‌ను పెళ్లాడింది. 2013లో విడాకులు తీసుకున్న వీరికి ఆరేళ్ల కొడుకు ఫ్లిన్ ఉన్నాడు. -
స్నాప్‌చాట్ ‘పూర్’ కామెంట్స్‌పై జుకర్‌బర్గ్ చురకలు!
శాన్ఫ్రాన్సిస్కో: స్నాప్‌చాట్ సీఈవో తలపొగరు వ్యాఖ్యల నేపథ్యంలో ఫేస్బుక్ సీఈవో మార్క్ జుకర్‌బర్గ్ చురకలంటించారు. ఫేస్బుక్ కేవలం హై ఎండ్ వారికోసం మాత్రమే కాదు.. అందరికోసం అని వ్యాఖ్యానించారు. మంగళవారం శాన్ జోస్‌లో జరిగిన ఫేస్బుక్ ఎఫ్8 వార్షిక డెవలప్మెంట్ కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతూ జుకర్‌బర్గ్ ఈ వ్యాఖ్యలు చేశారు. అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీ అనేది కేవలం ఉన్నత స్థాయిలో ఉన్నవారికి మాత్రమే కాకుండా సమాజంలో ఉన్న అందరికీ ఉపయోగపడాలని జుకర్‌బర్గ్ అన్నారు. అందుకే ‘ఫేస్బుక్ లైట్’ లాంటి వాటిపై తాము దృష్టి పెట్టామని వెల్లడించారు. భారత్ లాంటి పేద దేశంలో స్నాప్‌చాట్ వ్యాపార విస్తరణ అవసరం లేదని.. తమ యాప్ కేవలం ధనికులకోసమే అని స్నాప్‌చాట్ సీఈవో ఇవాన్ స్పీగల్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యల నేపథ్యంలో స్నాప్‌చాట్‌పై సోషల్ మీడియాలో తీవ్రస్థాయిలో విమర్శలు వ్యక్తమయ్యాయి. -
సీఈవో 'పూర్' కామెంట్స్: స్పందించిన కంపెనీ
సీఈవోపై ఆరోపణలను ఖండిస్తున్న స్నాప్ చాట్ న్యూయార్క్ : భారత్, స్పెయిన్ మార్కెట్లపై స్నాప్ చాట్ సీఈవో ఇవాన్ స్పీగల్ సంచలన వ్యాఖ్యలు చేశారంటూ వచ్చిన ఆరోపణలపై కంపెనీ స్పందించింది. కంపెనీకి చెందిన మాజీ ఉద్యోగి, సీఈవోపై చేస్తున్న ఆరోపణలను స్నాప్‌చాట్ కొట్టిపారేసింది. తమ మల్టిమీడియా మొబైల్ యాప్ ప్రతిఒక్కరికీ అంటూ సీఈవోను కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తోంది. కంపెనీ ఎల్లవేళలా భారత యూజర్లకు ''కృతజ్ఞత'' భావంతో ఉంటుందని పేర్కొంటోంది. '' స్నాప్‌చాట్ ప్రతిఒక్కరికీ! ఉచితంగా ఈ యాప్ డౌన్ లోడ్ చేసుకునేందుకు ప్రపంచవ్యాప్తంగా ఇది అందుబాటులో ఉంది'' అని కంపెనీ అధికారప్రతినిధి ఓ ప్రకటించారు. కంపెనీ మాజీ ఉద్యోగి ఆంథోనీ పాంప్లియాన్ చేసిన ఆరోపణలను తాము తీవ్రంగా ఖండిస్తున్నామని పేర్కొన్నారు. స్నాప్ చాట్ యాప్ కేవలం ధనిక వ్యక్తులకేనని, భారత్, స్పెయిన్ లాంటి పేదదేశాలకి విస్తరించాలనుకోవడం లేదని స్పీగల్ వ్యాఖ్యానించినట్టు మాజీ ఉద్యోగి ఆరోపించారు. స్పీగల్ ఈ వ్యాఖ్యలు చేసినట్టు కథనాలు వెలువడగానే, కంపెనీపై యూజర్లు మండిపడుతున్నారు. ట్విట్టర్లో స్నాప్ చాట్ పై విమర్శల వెల్లువ కొనసాగుతోంది. చాలామంది ఇప్పటికే తమ స్నాప్ చాట్ యాప్ ను అన్ఇన్స్టాల్ చేసి, బాయ్ కాట్‌కు పిలుపునిచ్చారు. కొంతమంది తెలియక, స్నాప్ చాట్ బదులు స్నాప్ డీల్ ను అన్ఇన్స్టాల్ చేశారు. -
ఒక్కసారిగా స్నాప్‌చాట్ రేటింగ్స్ ఢమాల్
న్యూఢిల్లీ : భారత్, స్పెయిన్లపై స్నాప్ చాట్ సీఈవో ఇవాన్ స్పీగల్ చేసిన సంచలన వ్యాఖ్యలు కంపెనీకి భారీగా దెబ్బకొడుతున్నాయి. ట్విట్టర్లో ఇప్పటికే ఈ కంపెనీపై పలు రకాలుగా కామెంట్లు వెల్లువెత్తుతుండగా.. చాలామంది తమ మొబైల్ నుంచి స్నాప్ చాట్ ను అన్ఇన్స్టాల్ చేసేస్తున్నారు. అంతేకాక యాప్ స్టోర్‌లోనూ కంపెనీ రేటింగ్స్ కూడా భారీగా పడిపోతున్నట్టు తెలిసింది. యాప్ స్టోర్‌లో అంతకమునుపు 'ఫైవ్ స్టార్' రేటింగ్ ను సంపాదించుకున్న స్నాప్ చాట్ ఆ రేటింగ్ ను ఒక శాతానికి పడగొట్టుకుంది. యాప్ స్టోర్‌లోని యాప్ సమాచారం ప్రకారం ప్రస్తుత వెర్షన్కున్న కస్టమర్ రేటింగ్స్ ఆదివారం ఉదయానికి 'సింగిల్ స్టార్'(6099 రేటింగ్స్ ఆధారితంగా) నమోదైనట్టు తెలిసింది. మొత్తం వెర్షన్ల రేటింగ్ కూడా 'వన్ అండ్ ఆఫ్ స్టార్'(9527 రేటింగ్స్ ఆధారితంగా) మాత్రంగానే ఉన్నట్టు వెల్లడైంది. ఆండ్రాయిడ్ ప్లే స్టోర్ లో మాత్రమే 'ఫోర్ స్టార్' దక్కించుకుంది. తమ మెసేజింగ్ యాప్ స్నాప్ చాట్ ధనవంతులకే తప్ప పేదవాళ్లకి కాదని ఇవాన్ 2015 సెప్టెంబర్ లో వ్యాఖ్యానించినట్టు కంపెనీ మాజీ ఉద్యోగి ఆంథోనీ పాంప్లియాన్ చేసిన ఆరోపణలను వెరైటీ రిపోర్టు చేసింది. భారత్, స్పెయిన్ వంటి దేశాల్లో స్నాప్‌చాట్‌కు వృద్ధి అవకాశాలు ఉన్నాయని తాను చెప్పానని కానీ అప్పుడు ఇవాన్ స్పీగెల్ జోక్యం చేసుకుని 'స్నాప్‌చాట్ కేవలం సంపన్నులకు మాత్రమేనని, పేదదేశాలకు కాదని చెప్పి, తన మాటలను అడ్డుకున్నారని ఆంథోనీ ఆరోపించినట్లు వెరైటీ తన కథనంలో పేర్కొంది. ఇవాన్ స్పీగల్ కామెంట్లు బయటికి రాగానే, ఒక్కసారిగా స్నాప్ చాట్ పై యూజర్లు మండిపడుతున్నారు. పేద దేశాలు భారత్, స్పెయిన్ లు స్నాప్ చాట్ కంటే బెటర్ అని కొంతమంది యూజర్లు తన పోస్ట్ లో చెబుతున్నారు. స్నాప్ చాట్ అకౌంట్ ను అన్ఇన్స్టాల్ చేస్తూ.. యాప్ ను బాయ్ కాట్ చేయాలని పిలుపునిస్తున్నారు. I was addicted to @Snapchat but I love my country more than this app. Let's see how you earn without Indians. @evanspiegel #boycottsnapchat — Shreya Tewari (@SarcasticSheeya) April 16, 2017 -
యూజర్లపై స్నాప్‌చాట్ సీఈవో తలపొగరు వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: ఒకవైపు సోషల్‌మీడియా దిగ్గజాలు భారత మార్కెట్లో పాగా వేసేందుకు పోటీ పడుతోంటే స్నాప్‌చాట్ సీఈవో ఇవాన్ స్పీగెల్ మాత్రం సంచలన వ్యాఖ్యలు చేశాడు. తమ వ్యాపారాన్ని విస్తరించేంత సీన్ భారత్‌కు లేదన్నట్టు ప్రవర్తించాడు. భారతదేశంలాంటి పేద దేశంలో స్నాప్‌చాట్ వ్యాపార విస్తరణ అవసరం లేదని వ్యాఖ్యానించాడు. తమ యాప్ కేవలం ధనికులకోసతే తప్ప పేదోళ్లకి కాదంటూ నిర్లక్ష్యంగా వ్యాఖ్యానించడం విస్తుగొలిపింది. అంతేకాదు ఇండియా, స్పెయిన్ లాంటి పేద దేశాల్లో విస్తరించాలని తాను కోరుకోవడంలేదని పేర్కొన్నాడు. తన మెసేజింగ్ యాప్ స్నాప్ చాట్ ధనవంతులకే తప్ప పేదవాళ్లకి కాదని ఇవాన్ పేర్కొన్నాడు. కేవలం ప్రీమియం యూజర్లపైనే తాము దృష్టి పెట్టినట్టు చెప్పాడు. ఇండియా, స్పెయిన్ పేద దేశాల్లో తన వ్యాపారాన్ని విస్తరించదల్చుకోలేదంటూ అహంకారాన్ని ప్రదర్శించాడు.2015 సం.రంలో స్నాప్ చాట్ యూజర్ బేస్ వృద్ధిపై నిర్వహించిన సమావేశాలో ఇవాన్ స్పీగెల్ ఈ వ్యాఖ్యలు చేసినట్టు వెరైటీ మీడియా రిపోర్ట్ చేసింది. కాగా స్నాప్ చాట్ మాజీ ఉద్యోగి ఆంథోనీ పాంప్లియానో ఇన్వెస్టర్లను, వ్యాపార భాగస్వాములను మోసం చేస్తోందని ఆరోపిస్తూ కోర్టుకు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఇండియా, స్పెయిన్ లాంటి దేశాల్లో పొటెన్షియల్ గ్రోత్ పై దృష్టి పెట్టాలని సూచించాడు. ఈ నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేసినట్టుగా వెరైటీ మీడియా నివేదించింది. భారత్, స్పెయిన్ వంటి దేశాల్లో స్నాప్‌చాట్‌కు వృద్ధి అవకాశాలు ఉన్నాయని చెప్పానని, అప్పుడు స్పీగెల్ జోక్యం చేసుకుని ‘‘స్నాప్‌చాట్ కేవలం సంపన్నులకు మాత్రమే’’నని చెప్పి, తన మాటలను అడ్డుకున్నారని ఫిర్యాదులో ఆంథోనీ ఆరోపించినట్లు ‘వెరైటీ’ కథనం తెలిపింది. -
స్నాప్‌చాట్ జోరు
లిస్టింగ్‌లో 44 శాతం లాభాలు న్యూయార్క్: స్నాప్‌చాట్ మెనేజింగ్ యాప్ మాతృ కంపెనీ, స్నాప్ ఇన్‌కార్పొ అమెరికా స్టాక్ మార్కెట్లో భారీ లాభాలతో లిస్టయింది. ట్రేడింగ్ తొలిరోజు 44 శాతం లాభపడింది. స్నాప్ ఇన్‌కార్పొ విలువ 2,830 కోట్ల డాలర్లు (సుమారుగా రూ.1,90,000 కోట్లు)గా నమోదైంది. న్యూయార్క్ స్టాక్ ఎక్సే్చంజ్‌లో కంపెనీ వ్యవస్థాపకులు ఇవాన్ సీగెల్, బాబీ మర్ఫీలు ఓపెనింగ్ బెల్‌ను మోగించగానే ఈ షేర్ కూడా లాభాల మోత మోగించింది. గైడ్ ధర ఒక్కో షేర్‌కు 17 డాలర్లుగా ఉండగా, 40 శాతం ప్రీమియమ్‌తో 24 డాలర్ల ధరతో ప్రారంభమైంది. 24.48 డాలర్ల ధర వద్ద ముగిసింది. ఒక దశలో ఈ ధర 26.05 డాలర్లకు ఎగసింది. రోజూ 250 కోట్ల స్నాప్‌లు 2012లో ప్రారంభమైన ఈ కంపెనీ గత ఏడాది 51 కోట్ల డాలర్ల నష్టాలను ప్రకటించింది. ప్రతి రోజూ 15.8 కోట్ల మంది ప్రజలు ఈ సర్వీస్‌ను వినియోగిస్తున్నారని, 250 కోట్ల స్నాప్‌లు వారి మధ్య క్రియేట్ అవుతున్నాయని స్నాప్‌చాట్ తెలిపింది. ఫేస్బుక్ సోషల్ నెట్‌వర్క్‌ను వినియోగిస్తున్న వంద కోట్ల మంది యూజర్లతో పోల్చితే స్నాప్‌చాట్ యూజర్ల సంఖ్య తక్కువైనా, స్నాప్‌చాట్ యూజర్లలో అధికులు యువజనులేనని, సగటున రోజుకు అరగంట ఈ సర్వీస్ కోసం వెచ్చిస్తున్నారని అంచనా. స్నాప్ చాట్‌ను మొబైల్ ఫోన్ల కోసం డిజైన్ చేశారు. ఫొటోలు, వీడియోలు షేర్ చేయడానికి ఉపయోగిస్తారు. -
స్టంట్ చేయబోయి..
సింగపూర్ : అసలే యువకుడు పక్కనే ఓ అమ్మాయి. చేతిలో ఫోన్, అందులోనూ ఇతరులతో వీడియో చాటింగ్. ఇంకేముంది.. ఓ అద్భుతమైన స్టంట్ చేసి వీడియో చాట్‌లో ఉన్న స్నేహితులను, పక్కనే ఉన్న వారి దృష్టిని ఒకేసారి ఆకర్షించాలనుకున్నాడు. అనుకున్నదే తడవుగా ఒక్కసారిగా దూకి తన అంచనా తప్పి నాలుగంతస్తుల భవనం పై నుంచి పడి బంగారు భవిష్యత్తును చేతులారా చేజార్చుకున్నాడో యువకుడు. వివరాలు..17 ఏళ్ల జోనాథన్ చో తన స్నేహితురాలు రుతుతో కలిసి సింగపూర్‌లోని ఓ ప్రముఖ షాపింగ్ మాల్‌కు వెళ్లాడు. నాలుగో అంతస్తుపైకి చేరుకోగానే తన ఫోన్లో మరొకరితో స్నాప్ చాట్‌లో వీడియో కాల్లో సంభాషిస్తున్నాడు. ఒక్కసారిగా ఫోన్‌ను రుతు చేతికి ఇచ్చి స్టంట్ చేస్తున్నాను, వీడియో తీయి అని చెప్పి బిల్డింగ్ బయటివైపు ఉన్న కొన భాగంపై దూకడానికి ప్రయత్నించాడు. అక్కడే ఉన్న సీసీటీవీ కెమెరాలో ఈ దృశ్యాలు రికార్డయ్యాయి. బిల్డింగ్‌పైనుంచి కిందపడకుండా అడ్డుగా ఉన్న నిర్మాణం పై చేతులు పెట్టి జోనాథన్ ఒక్కసారిగా బయటవైపున్న బిల్డింగ్ కొన భాగంపై దూకాడు. ఇది చాలా డేంజర్ స్టంట్ అని తనకు తెలుసని కానీ, అతనికి చెప్పేలోపే జొనాథన్ దూకేశాడని రుతు కన్నీటిపర్యంతమయ్యింది. బిల్డింగ్ కొన కాంక్రీట్‌తో నిర్మించామని మేమిద్దరం అనుకున్నామని చెప్పింది. అయితే బిల్డింగ్కొన నిర్మాణం జోనాథన్ బరువును మోయలేకపోవడంతో సరాసరి నాలుగు అంతస్తుల పై నుంచి భూమి మీద పడి మరణించాడు. -
ఇక అమెరికన్లకు అందుబాటులోకి!
న్యూయార్క్: అమెరికా వాసులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న స్పెక్టాకిల్స్(కళ్లద్దాలు) ఆన్ లైన్లో అందుబాటులోకి రానున్నాయి. ఫొటో షేరింగ్ సర్వీస్ స్నాప్ చాట్ ఈ స్పెషల్ కళ్లద్దాలను కనెక్ట్ చేసి వీడియోలను రికార్డు చేసుకునే వెసలుబాటు కల్పించింది. ఈ కళ్లద్దాల వాడకంతో వీడియో రికార్డింగ్, ఫొటో షేరింగ్ ఇకనుంచి సులభతరం కానుంది. బ్లూటూత్, వైఫై సౌకర్యాలతో స్నాప్ చాట్ యూజర్ల తమ అకౌంట్లో వీడియోలు అప్ లోడ్ చేయవచ్చు. అమెరికా నెటిజన్లు ఆన్ లైన్ లో స్నాప్ చాట్ కళ్లద్దాలను బుక్ చేసుకుని యూజ్ చేసుకోవచ్చు. గతేడాది సెప్టెంబర్ లో పలు దేశాల మార్కెట్లోకి ఈ ప్రొడక్ట్ వచ్చినప్పటికీ కేవలం కొన్ని కేంద్రాల్లో మేషిన్ల ద్వారా యూజర్లు కొనుగోలు చేయాల్సి వచ్చేది. మార్చి 2 నుంచి ఆన్ లైన్లో అందుబాటులోకి రానున్న కళ్లద్దాల ధర 129.99 అమెరికన్ డాలర్లు (భారత కరెన్సీలో దాదాపు రూ.8706 )గా ఉంది. కళ్లద్దాలను ఛార్జింగ్ చేసే కేబుల్ వైరు బ్లాక్, కోరల్ రెడ్, టియల్ బ్లూ రంగుల్లో లభించనుంది. -
పెళ్లి పెటాకులు చేసిన చాటింగ్
దుబాయ్: సోషల్ మీడియా పుణ్యమా అని సౌదీ అరేబియాలో ఓ పెళ్లి రెండు గంటల్లోనే పెటాకులైంది. ముందుగా కుదుర్చుకున్న ఒప్పందాన్ని ఆ అమ్మాయి ఉల్లంఘించినందుకు అతడు ఆమెను రెండు గంటల్లోనే వద్దన్నాడు. వెంటనే పెళ్లి రద్దు చేసుకొని విడాకులు కోరాడు. ఇంతకీ ఆ అమ్మాయితో ఆ అబ్బాయి కుదుర్చుకున్న ఒప్పందం ఏమిటంటారా.. మరేంలేదు. వారి వివాహానికి సంబంధించిన ఫొటోలను ఎట్టి పరిస్థితుల్లో సోషల్ మీడియా యాప్‌ల ద్వారా స్నేహితులకు పంపొద్దని అతడు షరతు విధించాడు. అందుకు ఆ అమ్మాయి కూడా ఒప్పుకుంది. అయితే, ఆ విషయాన్ని అంతగా పట్టించుకోని ఆ పెళ్లి కూతురు పెళ్లయిన ఆనందంలో వారి వివాహ ఫొటోలను స్నాప్ చాట్ ద్వారా తన స్నేహితులకు పంపించింది. ఈ విషయం తెలుసుకున్న వరుడు కాస్త ఆగ్రహానికి లోనై వివాహం వెంటనే రద్దన్నాడు. విడాకులకు దరఖాస్తు చేసుకున్నాడు. ఈ విషయాన్ని పెళ్లి కూతురు సోదరుడు స్వయంగా మీడియాకు తెలిపాడు. -
సరికొత్త ఫీచర్లతో వాట్సాప్
-
సరికొత్త ఫీచర్లతో వాట్సాప్
ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్, తన యూజర్ల కోసం సరికొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకురానుంది. తాజా బీటా 2.16.264 అప్డేషన్తో స్నాప్‌చాట్ మాదిరిగా యూజర్లు తమ ఇమేజ్‌పై ఏదైనా టెక్ట్స్ రాసుకునేందుకు, డ్రాయింగ్ వేసుకునేందుకు సౌకర్యం కల్పించనుంది. ఉదాహరణకు వాట్సాప్ యాప్ ద్వారా ఫ్రంట్ పేసింగ్ ఫ్లాష్‌తో ఫోటో తీసుకున్నప్పుడు, ఎడిటింగ్ టూల్స్‌ను తాజా అప్డేషన్తో యూజర్లు పొందుతారు. ఫోటోపై ఏదైనా టెక్ట్స్‌ను రాసుకునే విధంగా, డ్రాయింగ్ వేసుకునేందుకు వీలుగా పెన్సిల్, "టీ"బటన్స్ కనిపిస్తాయి. ఫోటో మెసేజింగ్ యాప్ స్నాప్‌చాట్ మాదిరిగా వివిధ రంగులను వాడుకుంటూ యూజర్లు తమ ఫోటోలను డిజైన్ చేసుకోవచ్చు. యూజర్ల ఇమేజ్‌లను మరింత తీర్చిదిద్దడానికి స్టికర్ల కూడా వాడుకుని ఫోటోలను ఎడిట్ చేసుకోవచ్చట. మొదట ఈ ఫీచర్‌ను స్నాప్‌చాట్ ప్రవేశపెట్టింది. అనంతరం ఇన్స్టాగ్రామ్ కూడా ఇదేమాదిరి ఫీచర్‌ను తీసుకొచ్చింది. తాజాగా వాట్సాప్ కూడా మెసేజింగ్ ప్రేమికుల కోసం సరికొత్త ఫీచర్లను తీసుకొస్తోంది. ఇక్కడ ఇంకో విషయం గురించి తెలుసుకోవాలి. కేవలం మన స్మార్ట్‌ఫోన్ కెమెరా నుంచి వాట్సాప్ ద్వారా తీసిన ఫొటోలకు మాత్రమే ఎఫెక్ట్స్ ఇవ్వడం వీలవుతుంది. షేర్ చేసుకునే వాటికి ఎఫెక్ట్స్ ఇవ్వడం సాధ్యం కాదు. ప్రస్తుతం ఈ ఫీచర్ టెస్ట్ దశలో ఉంది. ఈ అధికారిక వెర్షన్‌ను వాట్సాప్ త్వరలో విడుదల చేయనుంది. టెస్ట్ చేయాలనుకునే యూజర్లు గూగుల్ ప్లే స్టోర్ యాప్‌లో తాజా వాట్సాప్ వెర్షన్‌ను డౌన్ లోడ్ చేసుకుంటే, ఈ ఫీచర్లు యూజర్లకు ఇన్స్టాల్ అవుతాయి. అదేవిధంగా త్వరలోనే యూజర్ల చాట్‌ను వాట్సాప్ చదివేలా టెస్టింగ్ జరుగుతుందట. మెసేజ్‌లో ఉన్న టెస్ట్‌ను వాట్సాపే బయటికి చదివేలా స్పీక్ ఆప్షన్ కూడా అందుబాటులోకి రానుంది. అయితే ఐఓఎస్ డివైజ్‌లన్నింటికీ ఒకేసారి ఈ ఫీచర్ అందుబాటులోకి రాదంట. -
హీరోయిన్‌కు ఘోర అవమానం!
ఆధునిక సమాజంలోనూ వర్ణవివక్షకు గురవ్వడం ఎంతో బాధిస్తోందని హాలీవుడ్ సెలబ్రిటీలు ఈ విషయంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎంతో అభివృద్ధి చెందిన అమెరికాలో సాధారణ వ్యక్తుల మాట దేవుడెరుగును.. కానీ సెలబ్రిటీలు కూడా వర్ణవివక్షకు గురవుతున్నారంటూ హాలీవుడ్ నటి, సింగర్ జెండయ కోలెమన్ అంటోంది. ఇందుకు తానే ప్రత్యక్ష ఉదాహరణ అంటూ తన స్నాప్ చాట్ ఖాతాలో దీనికి సంబంధించిన కొన్ని వీడియోలను పోస్ట్ చేసి నిరసన తెలిపింది. నటి కోలెమన్ ఉత్తర అమెరికాలోని ఓన్స్ సూపర్ మార్కెట్ కు వెళ్లింది. తనకు కావలసిన వస్తువులు కొనుక్కుని బిల్లు కౌంటర్ వద్దకు వెళ్లింది. అయితే అక్కడ ఉన్న ఉద్యోగి కోలెమన్ వాలెట్ తీసి విసిరికోట్టాడు. దీంతో తనకు ఏం చేయాలో కొద్దిసేపు అర్థంకాలేదని వాపోయింది. గిఫ్ట్ కార్డులు కొనేందుకు వెళ్లగా తన రంగు(నలుపు) అయినుందున తనకు అవమానం జరిగిందని వివరించింది. వాలెట్ పడేసి నువ్వు ఇవి కొనేందుకు అర్హురాలివి కాదంటూ వ్యాఖ్యానించిందని, వాలెట్ లో ఎంతో విలువైన వస్తువులు ఉంటాయన్న కనీస అవగాహన కూడా ఆ ఉద్యోగికి లేదంటూ తీవ్రస్థాయిలో మండిపడింది. నల్లజాతీయులకు అవమానాలు చాలా దేశాల్లో జరుగుతున్నాయని స్నాప్ చాట్ వీడియోల రూపంలో తన బాధను అభిమానులు, ఫాలోయర్స్ తో కోలెమన్ పంచుకుంది. -
'రిస్క్ తీసుకోకపోవడంకన్నా మరో రిస్క్ లేదు'
న్యూయార్క్: ఏ వ్యాపార రంగంలో రాణించాలన్నా రిస్క్ తీసుకోవడం ముఖ్యం. ఏ రిస్క్ తీసుకోక పోవడం అన్నింటికన్నా పెద్ద రిస్క్. ఫేస్బుక్ సీఈవో మార్క్ జుకర్ బర్గ్ పేటెండ్ డైలాగ్ ఇది. ప్రపంచవ్యాప్తంగా స్టార్టప్ కంపెనీల్లో ఏటా పెట్టుబడులు పెట్టే 'వై కాంబినేటర్’ కంపెనీ ప్రెసిడెంట్ శ్యామ్ ఆల్ట్మేన్కు ఇచ్చిన తాజా ఇంటర్వ్యూలో కూడా ఆయన ఈ మాటనే చెప్పారు. అయితే రిస్క్ తీసుకోవడం అంటే తొందరపడి వెర్రి నిర్ణయాలు తీసుకోవడం కాదని ఆయన స్పష్టం చేశారు. వ్యాపార రంగంలో రాణించాలంటే యువతకు ఇచ్చే సలహా ఏమిటని శ్యామ్ ఆయన్ని సూటిగా ప్రశ్నించగా, ‘వేగంగా మారుతున్న నేటి ప్రపంచంలో అతిపెద్ద రిస్క్ తీసుకోకపోవడమే అన్నింటికన్నా పెద్ద రిస్క్. కంపెనీలో ప్రతిష్టంభన ఏర్పడినప్పుడు, మార్పులు, చేర్పులు చేయకపోతే కంపెనీ ఎదగడంలో వెనకబడి పోతుంది. అలాఅని ఉత్పత్తుల్లో తరచుగా మార్పులు తీసుకరాకూడదు. కంపెనీ గురించి దూరాలోచన చేయక పోవడం వల్ల అలాంటి మార్పులకు ఆస్కారం ఏర్పడుతుంది. ఏ కంపెనీలోనైనా తోటి వారి అభిప్రాయాలను కూడా పరిగణలోకి తీసుకొని ఓ నిర్ణయానికి రావాల్సి ఉంటుంది. మన కంపెనీ బాగా రాణిస్తున్నప్పుడు మార్పుల పేరిట వెర్రి నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం లేదు’ అని జుకర్ బర్గ్ తెలిపారు. ఫేస్బుక్ ఇటీవల 200 కోట్ల డాలర్లకు ‘ఆకులస్’ కంపెనీని కొనుగోలు చేసిన విషయాన్ని ఆయన ప్రస్తావిస్తూ, ఫేస్‌బుక్‌కు కూడా ఆకులస్ లాంటి టాలెంట్ ఉందని, అయితే అన్ని తామే చేయాలనుకునే తత్వం కూడా మంచిది కాదని అన్నారు. అంతేకాకుండా ప్రతిసారి ఉన్న కంపెనీలో మార్పులు తీసుకొచ్చే బదులు కొత్త కంపెనీలను తీసుకోవడం పెద్ద ముందడుగు అనిపిస్తుందని, ఆకులస్ కంపెనీని కొనుగోలు చేయడం కూడా అలాంటి ముందడుగని తాను భావిస్తున్నానని చెప్పారు. పైగా ఆకులస్లో టాలెంట్ పీపుల్ ఉన్నారని ఆయన చెప్పారు. అచ్చం స్నాప్‌చాట్ తరహాలో పనిచేసే ఇన్స్టాగ్రామ్ స్టోరీస్‌ను ఫేస్బుక్ ఇటీవల ఆవిష్కరించడాన్ని జుకర్‌బర్గ్ ప్రస్తావిస్తూ, వినియోగదారుల మనోభావాల మేరకు అలా చేయాల్సి వచ్చిందని చెప్పారు. కావాలనుకుంటే స్నాప్‌చాట్ స్టోరీస్ ఫీచర్‌ను ఫేస్బుక్ తీసుకరావచ్చని, కానీ కాపీ అనే ముద్ర కూడా కంపెనీ మీద ఉండకూడదని ఆయన చెప్పారు. ‘ఏదైనా పెద్ద రిస్క్ తీసుకోవాలనుకున్నప్పుడు అందులో ఉన్న ప్రతికూల అంశాల గురించి మన చుట్టూ ఉన్నవాళ్లు మనల్ని హెచ్చరిస్తుంటారు. వారి మాటల్లో వాస్తవం లేకపోలేదు. ప్రతి నిర్ణయంలో సానుకూల, ప్రతికూల అంశాలు తప్పక ఉంటాయి. ప్రతికూల అంశాలకు భయపడి ఏ నిర్ణయం తీసుకోకపోతే కంపెనీలో ప్రతిష్టంభన ఏర్పడుతుంది. అది ప్రమాదరకరం. అందుకని పెద్ద రిస్క్ తీసుకోకపోవడమే అతి పెద్ద రిస్క్ అన్నది సర్వదా నా అభిప్రాయం’ అని జుకర్ బర్గ్ తన ఇంటర్వ్యూను ముగించారు. -
ఫేస్బుక్ కాపీ కొట్టిందట!
ఫేస్బుక్ అంటే సోషల్ మీడియా దిగ్గజం. అలాంటి సంస్థకు కాపీ కొట్టాల్సిన అవసరం ఏముంటుందని అనుకుంటాం. కానీ.. ఒకప్పుడు తాను కొనేయాలని ప్రయత్నించిన 'స్నాప్‌చాట్' యాప్ నుంచి తన ఆధీనంలో ఉన్న ఇన్స్టాగ్రాం కోసం 'స్టోరీస్' అనే ఫీచర్‌ను ఫేస్బుక్ కాపీ కొట్టిందట. కాపీ కొట్టినప్పుడు కనీసం పేరైనా మారిస్తే బాగుంటుంది కదూ.. కానీ ఏమాత్రం మార్చకుండా అదే పేరుతో ఆ ఫీచర్‌ను ఇప్పుడు ఇన్‌స్టాగ్రాంలో పెట్టేశారని ఆండ్రాయిడ్అథారిటీ.కామ్ అనే సైట్ తెలిపింది. ఇప్పుడు ఇన్‌స్టాగ్రాంలోని 'స్టోరీస్'లో ఒక స్లైడ్ షో ఫార్మాట్ కనిపిస్తుంది. దాన్ని ఫాలోవర్లు 24 గంటల పాటు చూసే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత అది హోం పేజిలోంచి అదృశ్యం అయిపోతుంది గానీ, ప్రొఫైల్‌లో మాత్రం ఉంటుంది. సరిగ్గా స్నాప్‌చాట్‌లో ఉండే స్టోరీస్ ఫీచర్ కూడా ఇలాగే ఉంటుంది. ఈ స్టోరీలో మనం కావల్సిన టెక్స్ట్, స్టిక్కర్లు, డ్రాయింగ్లు, ఫొటోలు.. ఇలా అన్నీ యాడ్ చేసుకోవచ్చు. త్వరలోనే ఆండ్రాయిడ్‌తో పాటు ఐఓఎస్ ప్లాట్‌ఫాంలో కూడా ఇన్స్టాగ్రాం 'స్టోరీస్' ఫీచర్ వస్తోంది. యూజర్లు తాము ఫాలో అయ్యేవాళ్ల ప్రొఫైల్‌లో ఉన్న స్టోరీలను పైన కనిపించే ఒక బార్లో చూడొచ్చు. -
ఆ వీడియోలు ఇక వద్దంటూ యాప్‌పై దావా!
న్యూయార్క్: పాపులర్ మొబైల్ యాప్ స్నాప్ ఛాట్ పై ఓ తల్లీకొడుకులు కోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం(పిల్) దాఖలు చేశారు. ఫ్రెండ్స్, బంధువులు, సన్నిహితులు ఇలా ఎవరికైనా సందేశాలు, వీడియోలు పంపించేందుకు వినియోగించే ఈ యాప్ అశ్లీలాన్ని అడ్డుకోలేక పోతుందని ఆ తల్లీకొడుకులు ఆరోపించారు. స్నాప్ ఛాట్ లో అశ్లీల ఫొటోలు, వీడియోలు అప్ లోడ్ అవుతున్నాయని, వీటి వల్ల యువత చెడిపోతుందని సెంట్రల్ కాలిఫోర్నియాలోని డిస్ట్రిక్ట్ కోర్టులో పిల్ దాఖలైందని మార్క్ గెరాగస్ అనే న్యాయవాది తెలిపారు. ఓ బాలుడు డిస్నీ కార్టూన్లను అశ్లీల రూపంలో తయారుచేయడంతో పాటు వాటిని శృంగారంలో పాటిస్తారని, ఎప్పూడూ సెక్స్ చేయని వాళ్లు చూడండి అంటూ పోస్ట్ చేయడాన్ని ఆమె తీవ్రంగా వ్యతిరేకించారు. మరోవైపు స్నాప్ ఛాట్ అధికార ప్రతినిధి ఈ విషయంపై స్పందిస్తూ.. పిల్ దాఖలైన విషయం నిజమే, ప్రజలు కోరినట్లుగా అశ్లీల డాటా వచ్చినప్పుడు హెచ్చరికలు జారీ చేసేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. కమ్యునికేషన్స్ డీసెన్సీ యాక్ట్ 1996 ప్రకారం పోర్న్ వీడియోలు, వాటికి సంబంధించి ఎలాంటి సమాచారం ఇంటర్ నెట్లో పోస్ట్ అవకూడదని తెలిపారు. కనీసం పిల్లలు అయినా ఈ యాప్ యూజ్ చేస్తున్నప్పుడు వారి వయసు ఆధారంగా వారికి కనిపించకుండా ఉండేలా తగిన చర్యలు అయినా తీసుకోవాలని లాయర్ మార్క్ గెరాగస్ సూచించారు. -
నన్ను ఫాలో అవ్వండి: స్టార్ హీరోయిన్
టాలీవుడ్ మిల్కీబ్యూటీ తమన్నా తనను ఫాలో అవాలని కోరుతోంది. అదేంటీ హీరోయిన్ ఏంటి ఇలా అంటుందనుకుంటున్నారా.. ఆ విషయం ఏంటంటే.. స్నాప్ చాట్ అనే లేటెస్ట్ సోషల్ నెటివర్కింగ్ సైట్ లో మిల్కీ బ్యూటీ ఇటీవల ఖాతా తెరిచింది. తన అభిమానులు, మిత్రులతో స్నాప్ చాట్ లో తీరిక వేళల్లో చాటింగ్ చేయాలని భావించినట్లుంది. స్నాప్ చాట్ లో తాను జాయిన్ అయ్యాయని, తన అభిరుచులు, విశేషాలను పంచుకోవాలనుకుంది. అందుకే తనను స్నాప్ చాట్ అకౌంట్ లో ఫాలో అవ్వాలని కోరుతూ తన ట్విట్టర్ ఖాతాలో తమన్నా పోస్ట్ చేసింది. ట్విట్టర్, ఇన్ స్టాగ్రామ్ లాంటి సోషల్ మీడియా సైట్లలో ఇప్పటికే సెలబ్రిటీలు తమ ఆనందాన్ని అభిమానులతో పంచుకుంటున్న విషయం తెలిసిందే. లేటెస్ట్ మూవీలు, ఫారిన్ ట్రిప్స్, తీరిక వేళల్లో ఏం చేస్తుంటారు.. ఇలా చాలా విషయాలను సెలబ్రిటీలు తమ ఫాలోయర్స్ తో షేర్ చేసుకుంటున్నారు. లైక్ టీచర్, లైక్ స్టూడెంట్ అంటూ మార్నింగ్ వర్కవుట్ గురించి ట్రెయినర్ సిద్ధార్థ సింగ్ తో కలిసి దిగిన ఫొటోలను తన ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. ట్రెయినర్ తో కలిసి అల్లరి చేసింది. తమ ఇద్దరి వేషాలు ఎలా ఉన్నాయో తెలిపేందుకు ఆ విశేషాలను ఫొటో ద్వారా పంచుకుంది.