శాన్‌ఫ్రాన్సిస్కో: ఫొటోషేరింగ్ యాప్ స్నాప్‌చాట్ వెబ్‌సైట్లలో ఇక నుంచి ‘స్టోరీస్’ సదుపాయం నెటిజన్లకు అందుబాటులోకి రానుంది. దీనిని స్టోరీస్ ఎవ్రీవేర్‌గా పిలుస్తున్నారు. ఫేస్‌బుక్ టైమ్‌లైన్ మాదిరిగానే స్నాప్‌చాట్ యూజర్ రోజంతా తీసిన వీడియోలు, ఫొటోలను కలిపి అందంగా ప్రదర్శించడాన్నే స్టోరీస్‌గా పిలుస్తారు. స్నాప్‌చాట్ యాప్‌లోనూ స్టోరీస్‌ను సృష్టించుకునేందుకు కొన్ని రోజులు వేచిచూడాల్సిందే. 'స్టోరీస్' సదుపాయం వల్ల స్నాప్‌చాట్ అప్లికేషన్ వాడని వాళ్లను కూడా వెబ్ ద్వారా ఆకర్షించవచ్చని స్నాప్‌చాట్ యాజమాన్యం భావిస్తోంది. అంతేగాక వెబ్‌ప్లేయర్ ద్వారా ఇతర పరికరాలకు సులువుగా వీడియోలను పంపుకునే సదుపాయాన్ని కూడా ప్రవేశపెడుతోంది.
Comments
Please login to add a commentAdd a comment