photo sharing
-
నాసా ఇంటెర్న్.. ఇష్ట దైవాలు
‘నాసా’ ఇంటెర్న్‌గా శిక్షణ పొందుతున్న భారత సంతతి అమెరికన్ ప్రతిమా రాయ్ నాసా లోగో ఉన్న షర్ట్ వేసుకుని, తన డెస్క్‌టాప్ వెనుక హైందవ దేవతల విగ్రహాలు కనిపించేలా తీయించుకున్న ఫొటో ఇంటర్నెట్ను ఇప్పుడు మంత్రముగ్ధం చేస్తోంది. నిజానికి ఆ ఫొటోను ఆమె షేర్ చేయలేదు. కొత్త అభ్యర్థుల కోసం దరఖాస్తులు ఆహ్వానించే ప్రకటనకు నాసా ఉపయోగించిన నలుగురు ఇంటెర్న్ ఫొటోలలో ఈ ఫొటో కూడా ఉంది. ‘మా దగ్గర శిక్షణ పొందదలచిన ఔత్సాహిక వ్యోమగాములకు గడువు తేదీ దగ్గర పడింది’ అని గుర్తు చేస్తూ ఈ నెల 10 న నాసా ఆ ఫొటోలను ట్విట్టర్లో అప్లోడ్ చేసింది. వాటిల్లో ఒకటైన ప్రతిమ ఫొటో భారతీయ సంస్కృతీ సంప్రదాయాలకు ప్రతీకగా ఉంది. అదే సమయంలో శాస్త్ర విజ్ఞాన పరిశోధనలకు సంకేతంగా ఆమె వేసుకున్న షర్ట్ ప్రతిఫలిస్తోంది. ఈ వైరుధ్యంపై నెటిజన్లు మొదట ప్రతికూలంగా స్పందించినప్పటికీ.. మెల్లిమెల్లిగా ప్రతిమకు మద్దతు లభించడం ఆరంభమైంది. సైన్స్‌కు, విశ్వాసాలకు పొంతన ఏమిటి అనే ప్రశ్న కన్నా.. ఒక దేశ సంస్కృతిని ప్రతిబింబిస్తూ ప్రతిమ ఫొటో చక్కగా ఉన్నదన్న సమర్థింపులే ఎక్కువగా పోస్ట్ అవుతున్నాయి. అలా ఫొటో తీయించుకున్న ప్రతిమకు, ఆ ఫొటోనే ఏరి కోరి షేర్ చేసిన నాసాకు ప్రశంసలు లభిస్తున్నాయి. -
ఫ్రాన్స్‌లో భద్రతా బిల్లుపై జనాగ్రహం
పారిస్: విధి నిర్వహణలో ఉన్న పోలీసుల ఫొటోలను షేర్ చేయడాన్ని నిషేధిస్తూ ఫ్రాన్స్ ప్రభుత్వం తీసుకొచ్చిన భద్రతా బిల్లుపై ప్రజలు తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. బిల్లును వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ శనివారం దేశవ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు చేపట్టారు. ఇటీవల ఫ్రాన్స్‌లో ఓ నల్ల జాతీయుడిని పోలీసులు కొడుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అనంతరం ప్రభుత్వం భద్రతా బిల్లును తీసుకొచ్చింది. ఇది పార్లమెంట్ దిగువ సభలో ఆమోదం పొందింది. ఇక సెనేట్‌లో ఆమోదం పొందాల్సి ఉంది. ఈ కొత్త బిల్లు ప్రకారం.. విధుల్లో ఉన్న పోలీసుల ఫోటోలు తీయడం, వాటిని షేర్ చేయడం వంటివి చేస్తే ఏడాది జైలు శిక్ష, 53 వేల డాలర్ల జరిమానా విధిస్తారు. -
'బాయ్స్ లాకర్ రూమ్'లో కొత్త ట్విస్ట్
న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన 'బాయ్స్ లాకర్ రూమ్' కేసులో కొత్త ట్విస్ట్ బయటపడింది. తమ క్లాస్మేట్స్ అమ్మాయిల బాడీ షేమింగ్‌పై మాట్లాడుతూ గ్యాంగ్ రేప్ చేద్దాం అంటూ కొందరు విద్యార్థులు చేసిన గ్రూప్ చాట్ సర్వత్రా చర్చనీయాంశమైంది. దీంతో విచారణ చేపట్టిన పోలీసులకు విస్తుపోయే వాస్తవాలు బయటపడ్డాయి. ఓ టీనేజీ అమ్మాయే అబ్బాయిగా ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసి అబ్బాయిలతో చాట్ చేసినట్లు విచారణలో తేలింది. తన శరీరంపై తానే అసభ్యకర వ్యాఖ్యలు చేస్తూ, దానికి అబ్బాయిలు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలని తాను ఈ పని చేసినట్లు పేర్కొందని ఢిల్లీ సైబర్ పోలీసులు వెల్లడించారు. తన పేరు సిద్దార్థ్‌గా పరిచయం చేసుకొని తన శరీరంపై అసభ్యకర వ్యాఖ్యలు చేసింది. దానికి అబ్బాయి ఎలా రియాక్ట్ అవుతాడో దాన్ని బట్టి తన క్యారెక్టర్ తెలుసుకోవచ్చని సదరు టీనేజీ అమ్మాయి విచారణలో పేర్కొంది. (డర్టీ ఛాట్ ) కొంతమంది టీనేజీ విద్యార్థులు ఇన్‌స్టాగ్రామ్‌లో బాయ్స్ లాకర్ రూం అనే అకౌంట్ క్రియేట్ చేసి తమ క్లాస్మేట్స్ అమ్మాయిల బాడీ షేమింగ్‌పై అసభ్యకర వ్యాఖ్యలు చేస్తూ చాటింగ్ చేసిన ఘటన తెలిసిందే. వీరంతా ఢిల్లీలోని ప్రముఖ స్కూల్లో చదువుతున్న వారే. గ్యాంగ్ రేప్ చేద్దామంటూ సదరు విద్యార్థులు చాట్ చేసిన స్క్రీన్ షాట్లు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. వీరంతా 18 ఏళ్లు అంతకంటే తక్కువ వయసు ఉన్నవారే. అమ్మాయిల ఫోటోలు అశ్లీలంగా మార్ఫింగ్ చేసి అసభ్యకరంగా గ్రూప్‌లో చర్చించుకున్నారు. దీనికి సంబంధించి విచారణ చేపట్టిన పోలీసులు 24 మంది విద్యార్థులను అదుపులోకి తీసుకున్నారు. (‘బాయ్స్ లాకర్ రూం’ తరహాలో.. ఆ యూనివర్సిటీలో ) -
అమ్మా తప్పు చేశానా?
మంచివాళ్లనుకున్న అబ్బాయిలు మంచి స్కూళ్లలోని అబ్బాయిలు మంచి కుటుంబాల అబ్బాయిలు ఇలా ఎలా చేయగలుగుతారు?.. మోనా తల్లి విస్మయం. మోనాకైతే లోకం మీదే నమ్మకం పోయింది. టీనేజ్‌లో ఉన్న అమ్మాయి వందల్లో ఫాలోవర్స్ ఉన్న అమ్మాయి వేల లైక్స్ ఉండే అమ్మాయి బాయ్స్ దగ్గర తన మార్ఫింగ్ ఫొటోలు చూసి గదిలోకి వెళ్లి వెక్కి వెక్కి ఏడుస్తోంది. అబ్బాయిలూ.. ఆలోచించండి. ఏడిపించడం ఫన్ అవుతుందా?! ‘‘అమ్మా.. నేనేమైనా తప్పు చేశానా? నువ్వు వద్దంటున్నా వినకుండా ఫొటోలు షేర్ చేసి తప్పు చేశాను కదా..’’ గట్టిగా ఏడుస్తోంది మోనా (పేరు మార్చాం). పద్నాలుగేళ్ల అమ్మాయి. ఢిల్లీలో మంచి పేరున్న స్కూల్లో చదువుతోంది. ఇన్స్టాగ్రామ్ ‘బాయ్స్ లాకర్ రూమ్’ స్క్రీన్ షాట్స్‌లో మోనా మార్ఫింగ్ ఫొటో ఉంది. మోనాపై బాయ్స్ చేసిన బాడీ షేమింగ్ కామెంట్స్ ఉన్నాయి. వాటిని తనే తల్లికి చూపించింది. ‘‘లేదురా.. నువ్వు తప్పేం చేయలేదు. నువ్వు ఎవరికీ భయపడాల్సిన అవసరం కూడా లేదు. అబ్బాయిలదే తప్పు. నేను నీవైపే ఉన్నాను. వాళ్లకు బద్ధొచ్చేలా చేస్తాను’’ అన్నారు మోనా తల్లి. ఆ రాత్రి ఆమెకు నిద్రపట్టలేదు. అబ్బాయిలు మళ్లీ ఇలాంటి పని చేయకుండా గట్టి శి„ý పడేలా చేయడానికి ఏమేమి చట్టాలు ఉన్నాయో పుస్తకాలు తిరగేయడం మొదలుపెట్టారు. ∙∙ ఇది ఢిల్లీలో జరిగిన ఘటన. అయితే మిగతా చోట్ల భవిష్యత్తులో బయట పడబోయే ఘటన కూడా కావచ్చు! ‘బాయ్స్ లాకర్ రూమ్’ అనే మాటను దేశం ఈ ఆదివారం తొలిసారిగా వినింది. ఇదేమీ భారత్‌పై ఉగ్రవాదులు తలపెట్టిన దాడుల ఆపరేషన్ పేరు కాదు. దేశవిద్రోహల కోడ్ లాంగ్వేజి కూడా కాదు. ఒక ఇన్స్టాగ్రామ్ గ్రూప్ అకౌంట్ పేరు. అందులో ఉన్నవాళ్లంతా పసితనం వీడని పద్నాలుగూ పదిహేనేళ్ల మగ పిల్లలే. ఢిల్లీలోని ఐదారు స్కూళ్లలోని వాళ్లు. వాళ్లలోనే ఒకరిద్దరు అడ్మిన్లు. ఆ అకౌంట్ చాట్ గ్రూప్‌లో జరిగే రహస్య సంభాషణలన్నీ తమ క్లాస్మేట్స్ అయిన ఆడపిల్లల గురించే! వాళ్ల ఫొటోలను షేర్ చేస్తారు. మార్ఫింగ్ చేస్తారు. కామెంట్స్ రాస్తారు. నవ్వుకుంటారు. వాటిల్లో బాడీ షేమింగ్ ఉంటుంది, రేపిస్టు మెంటాలిటీ ఉంటుంది. వీళ్ల చాటింగ్ స్క్రీన్ షాట్స్ కొందరు అమ్మాయిల (వాళ్లలో మోనా కూడా ఉంది) ఇన్‌స్టాగ్రామ్‌లో, ట్విట్టర్లో షేర్ అవడంతో ‘బాయ్స్ లాకర్ రూమ్’ సంగతి బయటపడింది. ఎదిగే వయసులో ఉన్న ఆడపిల్లల్ని మానసికంగా కృంగదీసి, వారి కాన్ఫిడెన్స్‌ను దెబ్బతీసే చాటింగ్ అది. సున్నిత మనస్కులు తట్టుకోలేరు. కరోనా వైరస్‌ను వుహాన్‌లో మొదట ఒక చైనా నర్సు గుర్తించారు. అలా ఈ ప్రమాదాన్ని మనదేశంలో వెంటనే గుర్తించిన వ్యక్తి.. స్వాతీ మలీవాల్. ఢిల్లీ మహిళా కమిషన్ ఛైర్పర్సన్. ఢిల్లీపోలీసులకు, ఇన్స్టాగ్రామ్ సంస్థకు మర్నాడే.. అంటే సోమవారమే.. ఆమె నోటీసులు పంపారు. ఇలాంటి తత్వం ఉన్న మగపిల్లలకు తక్షణం ఒక బలమైన హెచ్చరిక వెళ్లాలి అని స్వాతి అనుకున్నారు. ∙∙ మంగళవారం ఉదయానికి పోలీసులు లాకర్ రూమ్ సభ్యుడొకరిని కనిపెట్టారు. పద్నాలుగేళ్ల విద్యార్థి అతడు. ఢిల్లీలో పేరున్న స్కూల్లో చదువుతున్నాడు. ‘రూమ్’ తాళం చెవిలా దొరికాడతడు. మిగతా సభ్యులు పేర్లు, వాళ్లు ఏయే స్కూళ్లలో చదువుతున్నదీ అతడి నుంచి, అతడి స్నేహితుల నుంచి పోలీసులు రాబట్టారు. వాళ్లలో ఒకరిద్దరు ఇంటర్ స్టూడెంట్స్ కూడా ఉన్నారు. ఏప్రిల్ మొదటివారంలో ‘బాయ్స్ లాకర్ రూమ్’ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ మొదలైంది. ఒకర్నుంచి ఒకరు జమ అయ్యారు. ఇద్దరు అడ్మిన్లు కాబట్టి గ్రూపు త్వరత్వరగా వృద్ధిచెందింది. గ్రూపు టాపిక్ ఒక్కటే.. అమ్మాయిలు.. అమ్మాయిలు.. అమ్మాయిలు! తెలిసిన అమ్మాయిలు. క్లాస్మేట్స్ అయిన అమ్మాయిలు! వాళ్ల ఫొటోలను సోషల్ మీడియా అకౌంట్ల నుంచి సంపాదించడం, ఇందులో షేర్ చేయడం. షేమింగ్ చేయడం! బుధ, గురువారాల్లో వీళ్లలో మరికొందరు బయటపడ్డారు. వీరిపైన ఏం చర్య తీసుకుంటారని తెలియకపోయినా, ఈ పిల్లల తల్లిదండ్రులు మాత్రం.. ‘పోలీసులు ఇంటికి రావడం’ అనే శిక్షను అనుభవిస్తున్నారు. లాక్‌డౌన్‌తో జువెనైల్ జస్టిస్ బోర్డు.. కేసులేమీ తీసుకోవడం లేదు. దాంతో పోలీసులు నిందిత విద్యార్థులను ప్రస్తుతానికి వాళ్ల తల్లిదండ్రుల అదుపులోనే ఉంచుతున్నారు. మొబైల్ ఫోన్స్ తీసేసుకున్నారు. తమకు తెలియకుండా వాళ్లను సిటీ బయటికి పంపించడం చేయకూడదని చెప్పి వెళుతున్నారు. బాయ్స్ లాకర్ రూమ్ చాట్‌లో తమ కూతుళ్ల ఫొటోలు ఉన్నాయని తెలుసుకున్న తల్లిదండ్రుల పరిస్థితీ దాదాపుగా అలానే ఉంది. ‘‘అమ్మా.. నా తప్పేమీ లేదు కదా’’ అని కూతురు అపరాధిలా అడగడం ఏ తల్లిని మాత్రం బాధించదు! ∙∙ తల్లి చెబుతున్న దానిని బట్టి మోనాకైతే ఈ అనుభవం తర్వాత లోకం మీదే నమ్మకం పోయింది! ‘నేనీ సమాజంలో ఉండలేను మమ్మీ’ అంటోంది. ‘ఫొటోలు షేర్ చెయ్యకమ్మా.. ఎవరైనా మిస్ యూజ్ చేస్తారు’ అని మొదట్లో తల్లి చెప్పినప్పుడు మోనా నవ్వింది. ‘పిచ్చి భయాలు మమ్మీ నీవన్నీ. మీ రోజుల్లో అలా ఉండేదేమో. బాయ్స్ ఇప్పుడు మర్యాదగా ఉంటున్నారు. గర్ల్స్‌ని, ఆడవాళ్లని రెస్పెక్ట్ చేస్తున్నారు’ అని మోనా అంది. ఇప్పుడు అదే బాయ్స్ ఆమె నమ్మకాన్ని వమ్ము చేశారు! ఎందుకిలా చేశారు అని అడితే.. ‘ఫర్ ఫన్’ అంటున్నారు! దుర్గంధం ఈ దర్గంధపూరిత ప్రవర్తనకు అబ్బాయిల తల్లిదండ్రులనే నిందించాలి. ఎవరికీ రెస్పెక్ట్ ఇవ్వక పోవడం మీ హక్కు అన్నట్లు అబ్బాయిల్ని పెంచుతున్నారు. బాయ్స్.. ఈ పనికి మీరు సిగ్గుపడాలి. – నటి సోనమ్ కపూర్ ఇంత విషమా! ఈ వయసులో ఇంత పురుషాహంకారం అంటే ఈ విషం ఎంతవరకూ పాకపోబోంది! అత్యాచారాలను ప్రేరేపించే ఇలాంటి ఆలోచనా ధోరణులను ఇప్పుడే అదుపులో పెట్టాలి. – నటి స్వరా భాస్కర్ -
వందలో ఒక్కరు!
సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‌గా ఉండే బాలీవుడ్ హీరోయిన్లలో ప్రియాంకా చోప్రా ఒకరు. ఫొటో షేరింగ్ యాప్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమెకు దాదాపు 4 కోట్ల 30 లక్షల ఫాలోయర్స్ ఉన్నారు. ట్విటర్లో దాదాపు 2 కోట్ల 50 లక్షల ఫాలోయర్స్ ఉన్నారు. ఇప్పుడీ సంగతి ఎందుకంటే.. సెలబ్రీటీలు తమ ఇన్స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేసిన వాటికి ఎంత చార్జ్ చేస్తారనే అంశం ఆధారంగా యూఎస్‌కు చెందిన ఓ కంపెనీ విడుదల చేసిన ‘ఇన్స్టాగ్రామ్ రిచ్ లిస్ట్’లో ప్రియాంకా చోప్రా 19వ స్థానంలో నిలిచారు. ఏదైనా ప్రొడక్ట్‌ను తన ఇన్‌స్టా ఖాతా ద్వారా ప్రమోట్ చేయడానికి ప్రియాంకా చోప్రా దాదాపు కోటీ 86 లక్షల 80 వేల రూపాయలు తీసుకుంటారట. ఆ కంపెనీ విడుదల చేసిన వందమంది జాబితాలో ఉన్న ప్రముఖుల్లో అమెరికన్ మోడల్ కైలీ జెన్నర్ తొలి స్థానంలో నిలిచారు. అలాగే ఈ జాబితాలో చోటు సంపాదించిన ఒకేఒక్క బాలీవుడ్ నటి కూడా ప్రియాంకే కావడం విశేషం. అలాగే ఇండియా తరఫున విరాట్ కోహ్లీ 23వ స్థానంలో నిలవడం విశేషం. -
లవ్ జర్నీ
‘చేతిలోన చెయ్యేసి చెప్పేయవా....’ అంటూ న్యూయార్క్ వీధుల్లో పాడుకుంటున్నారు లవ్ బర్డ్స్ ప్రియాంకా చోప్రా, నిక్ జోనస్. బాలీవుడ్ బ్యూటీ ప్రియాంకా, హాలీవుడ్ సింగర్ నిక్ జోనస్ పీకల్లోతు ప్రేమలో మునిగి తేలుతున్న సంగతి తెలిసిందే. వీలు కుదిరినప్పుడల్లా చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నారీ జోడీ. ఇటీవలే ఇండియాకు వచ్చిన నిక్, ప్రియాంక, పరిణీతీ చోప్రాతో కలసి గోవా వెకేషన్ ఎంజాయ్ చేసిన సంగతి తెలిసిందే.ఆ తర్వాత నిక్‌తో కలసి ప్రియాంక న్యూయార్క్ రిటర్న్ అయ్యారు. ఇప్పుడు అక్కడ చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నారు. చేతులు కలుపుకుంటూ న్యూయార్క్ స్ట్రీట్స్‌లో షికారు చేస్తున్నారు, సైక్లింగ్ చేస్తూ వీధులన్నీ చుట్టేస్తున్నారు. ఇలా ప్రేమలో మునిగి తేలుతున్న ఈ జంట కలసి ఏడడుగులు ఎప్పుడేస్తారని ఎదురు చూస్తున్నారు ప్రియాంక అభిమానులు. 25 దాటేశారు కేవలం ఒక్కరోజు గ్యాప్‌లోనే 25 క్రాస్ చేశారు దీపికా పదుకోన్, ప్రియాంకా చోప్రా. మూడు పదుల వయసు దాటిన వీళ్లు ఇప్పుడు 25 క్రాస్ చేయడమేంటంటే అది ఏజ్‌లో కాదండీ.. ఫాలోయింగ్‌లో. ఫొటో షేరింగ్ యాప్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ ఇద్దరు భామలు 25 మిలియన్ (రెండున్నర కోట్లు) ఫ్యాన్స్‌ను సాధించారు. ఈ ఫీట్‌ను ప్రియాంకా గురువారం చేరుకోగా, ఆ మరుసటి రోజే దీపికా పదుకోన్ 25 మిలియన్స్‌ను చేరుకోవడం విశేషం. -
వాట్సాప్‌లో కొత్త ఫీచర్ : వారికి హ్యాపీ
సాక్షి, న్యూఢిల్లీ: వాట్సాప్ మరో కొత్త ఫీచర్‌ను జోడించింది. తన ప్లాట్‌ఫాంలో రోజుకో కొత్త ఫీచర్‌తో యూజర్లను ఆకట్టుకుంటున్న వాట్సాప్ తాజాగా ప్రిడెక్టెడ్ అప్లోడ్ (Predicted Upload) అనే కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చింది. ఆండ్రాయిడ్, ఐవోస్ రెండు వెర్షన్లలోనూ ఈ సదుపాయాన్ని అందిస్తోంది. ఫోటో షేరింగ్ ప్రక్రియను మరింత వేగవంతం చేసే ఉద్దేశంతో ఈ కొత్త ఫీచర్‌ను అందిస్తోంది. అయితే ఆండ్రాయిడ్ ఫోన్లలో వాట్సప్ వెర్షన్ 2.18.156, ఐవోస్ ఆపరేటింగ్ సిస్టమ్ ఆధారంగా పనిచేసే ఐఫోన్లలో వాట్సాప్ 2.18.61 వెర్షన్ వాడుతున్నవారిలో కొందరు ఎంపిక చేయబడిన యూజర్లకు ప్రస్తుతం ఈ సదుపాయం లభ్యం. అయితే త్వరలోనే అందరికీ అందుబాటులోకి రానుందని భావిస్తున్నారు. ముఖ్యంగా వాట్సాప్ ద్వారా తమ మిత్రులతో తరచూ ఫోటోలను షేర్ చేసుకునే వారికి ఈ ఫీచర్ బాగా ఉపయోగపడనుంది. కేవలం పది సెకండ్లలోనే 12 ఫోటోలను సెండ్ చేసుకోవచ్చని సంస్థ వెల్లడించింది. ఈ ఫీచర్‌కు పూర్తి భద్రత కూడా ఉందని తెలిపింది. అలాగే వీడియోలు, జిఫ్ పైల్ షేరింగ్‌కు మాత్రం ఈ సదుపాయం ఉండదని స్పష్టం చేసింది. ఎవరికైనా ఫోటోలు పంపించేటప్పుడు ఫోటోలు ఎంపికచేసి సెండ్ బటన్ ప్రెస్ చేసిన తర్వాత మాత్రమే అవి వాట్సప్ సర్వర్లోకి అప్లోడ్ అవుతాయి. అప్లోడ్ అయ్యాక మళ్లీ సెండ్ చేయడానికి కొంత సమయం పడుతుంది. ప్రస్తుతం ప్రిడెక్టెడ్ అప్లోడ్ ఫీచర్ కారణంగా డైరెక్టుగా గేలరీ నుండి కావలసిన ఫోటోలు సెలెక్ట్ చేసిన వెంటనే అవి వాట్సప్ సర్వర్కి అప్లోడ్ అవుతాయి. సెండ్ బటన్ ప్రెస్ చేసిన వెంటనే ఎలాంటి ఆలస్యం లేకుండా వెంటనే ఫోటోలు షేర్ అవుతాయి. -
స్నాప్‌చాట్‌లో సరికొత్త ఫీచర్!
శాన్ఫ్రాన్సిస్కో: ఫొటోషేరింగ్ యాప్ స్నాప్‌చాట్ వెబ్సైట్లలో ఇక నుంచి ‘స్టోరీస్’ సదుపాయం నెటిజన్లకు అందుబాటులోకి రానుంది. దీనిని స్టోరీస్ ఎవ్రీవేర్గా పిలుస్తున్నారు. ఫేస్బుక్ టైమ్‌లైన్ మాదిరిగానే స్నాప్‌చాట్ యూజర్ రోజంతా తీసిన వీడియోలు, ఫొటోలను కలిపి అందంగా ప్రదర్శించడాన్నే స్టోరీస్‌గా పిలుస్తారు. స్నాప్‌చాట్ యాప్‌లోనూ స్టోరీస్‌ను సృష్టించుకునేందుకు కొన్ని రోజులు వేచిచూడాల్సిందే. 'స్టోరీస్' సదుపాయం వల్ల స్నాప్‌చాట్ అప్లికేషన్ వాడని వాళ్లను కూడా వెబ్ ద్వారా ఆకర్షించవచ్చని స్నాప్‌చాట్ యాజమాన్యం భావిస్తోంది. అంతేగాక వెబ్ప్లేయర్ ద్వారా ఇతర పరికరాలకు సులువుగా వీడియోలను పంపుకునే సదుపాయాన్ని కూడా ప్రవేశపెడుతోంది. -
ఇక వాట్సాప్ లోకి ఎన్ని కొత్త ఫీచర్లో!
ప్రపంచంలోనే అతిపెద్ద మెసేజింగ్ మొబైల్ యాప్ వాట్సాప్ సరికొత్త ఫీచర్స్ తో మరింత మెరుగయింది. తాజా అప్ డేట్ లో వాట్సాప్ లోని చిన్న చిన్న సాంకేతిక అంశాలను సరిచేయడమే కాకుండా చాలావరకు కొత్త మార్పులను జోడించారు. మొబైల్ యూజర్లు మరింత సులువుగా ఫొటోలు, పీడీఎఫ్, వర్డ్ ఫైల్స్ పంపించుకునేందుకు వీలుగా లెటేస్ట్ అప్ డేట్ లో ఫీచర్స్ చేర్చారు. వాట్సాప్ లో ఫొటో షేరింగ్ ఫీచర్ మరింత మెరుగవ్వనుంది. ఇక కేవలం మొబైల్ స్టోరేజ్ లోని ఫొటో ఆల్బమ్స్ మాత్రమే కాదు.. గూగుల్ డ్రైవ్, డ్రాప్ బాక్స్, మైక్రోసాఫ్ట్ వన్ డ్రైవ్ వంటి ఆన్ లైన్ వేదికల్లో ఉన్న ఫొటోలను సైతం ఇప్పుడు వాట్సాప్ లో మిత్రులకు షేర్ చేయవచ్చు. ఇందుకు కావాల్సిందల్లా ఆ యాప్స్ మన మొబైల్ ఫోన్లో ఇన్ స్టాల్ చేసుకోవడమే. ఇక ఫైల్స్ పంపించుకోవడానికి ఈ-మెయిల్ పైనే ఆధారపడాల్సిన అవసరమే లేదు. వర్డ్స్, పీడీఎఫ్ డాక్యుమెంట్స్ నేరుగా వాట్సాప్ లోనే మిత్రులతో షేర్ చేసుకోవచ్చు. అంతేకాకుండా గూగుల్ డ్రైవ్, డ్రాప్ బాక్స్ లలో ఉన్న డాక్యుమెంట్స్ ను కావాలంటే మిత్రులకు పంపవచ్చు. వాట్సాప్ లో వీడియో ఫీచర్ క్వాలిటీని కూడా మెరుగుపరిచారు. ఇప్పుడు కావాలంటే వీడియోను జూమ్ చేసుకొని అందులోని యాక్షన్స్ క్లియర్ గా చూడొచ్చు. ఐఫోన్లలో వాట్సాప్ బాగా స్టోరేజ్ స్పేస్ తీసుకుంటున్న నేపథ్యంలో దీనిని కూడా కాస్తా మెరుగుపరిచారు. వాట్సాప్ 2.12.15 వెర్షన్ అప్ డేట్ ను ఆండ్రాయిడ్, ఐవోఎస్ ఫోన్లలో నేరుగా వేసుకోవచ్చు.