
సాక్షి, న్యూఢిల్లీ: వాట్సాప్ మరో కొత్త ఫీచర్‌ను జోడించింది. తన ప్లాట్‌ఫాంలో రోజుకో కొత్త ఫీచర్‌తో యూజర్లను ఆకట్టుకుంటున్న వాట్సాప్ తాజాగా ప్రిడెక్టెడ్ అప్‌లోడ్ (Predicted Upload) అనే కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చింది. ఆండ్రాయిడ్, ఐవోస్ రెండు వెర్షన్లలోనూ ఈ సదుపాయాన్ని అందిస్తోంది. ఫోటో షేరింగ్ ప్రక్రియను మరింత వేగవంతం చేసే ఉద్దేశంతో ఈ కొత్త ఫీచర్‌ను అందిస్తోంది. అయితే ఆండ్రాయిడ్ ఫోన్లలో వాట్సప్ వెర్షన్ 2.18.156, ఐవోస్ ఆపరేటింగ్ సిస్టమ్ ఆధారంగా పనిచేసే ఐఫోన్లలో వాట్సాప్ 2.18.61 వెర్షన్ వాడుతున్నవారిలో కొందరు ఎంపిక చేయబడిన యూజర్లకు ప్రస్తుతం ఈ సదుపాయం లభ్యం. అయితే త్వరలోనే అందరికీ అందుబాటులోకి రానుందని భావిస్తున్నారు.
ముఖ్యంగా వాట్సాప్ ద్వారా తమ మిత్రులతో తరచూ ఫోటోలను షేర్ చేసుకునే వారికి ఈ ఫీచర్ బాగా ఉపయోగపడనుంది. కేవలం పది సెకండ్లలోనే 12 ఫోటోలను సెండ్ చేసుకోవచ్చని సంస్థ వెల్లడించింది. ఈ ఫీచర్‌కు పూర్తి భద్రత కూడా ఉందని తెలిపింది. అలాగే వీడియోలు, జిఫ్ పైల్ షేరింగ్‌కు మాత్రం ఈ సదుపాయం ఉండదని స్పష్టం చేసింది. ఎవరికైనా ఫోటోలు పంపించేటప్పుడు ఫోటోలు ఎంపికచేసి సెండ్ బటన్ ప్రెస్ చేసిన తర్వాత మాత్రమే అవి వాట్సప్ సర్వర్లోకి అప్‌లోడ్ అవుతాయి. అప్‌లోడ్ అయ్యాక మళ్లీ సెండ్ చేయడానికి కొంత సమయం పడుతుంది. ప్రస్తుతం ప్రిడెక్టెడ్ అప్‌లోడ్ ఫీచర్ కారణంగా డైరెక్టుగా గేలరీ నుండి కావలసిన ఫోటోలు సెలెక్ట్ చేసిన వెంటనే అవి వాట్సప్ సర్వర్‌కి అప్‌లోడ్ అవుతాయి. సెండ్ బటన్ ప్రెస్ చేసిన వెంటనే ఎలాంటి ఆలస్యం లేకుండా వెంటనే ఫోటోలు షేర్ అవుతాయి.
Comments
Please login to add a commentAdd a comment