సాక్షి, సిటీబ్యూరో: ఆన్‌లైన్ నేరాలకు టీనేజర్లు బాధితులుగా మారకుండా చూసేందుకు ప్రముఖ వ్యక్తిగత సంబంధాల యాప్.. స్నాప్‌చాట్ కొత్త ఫీచర్లను జత చేసింది. ఈ విషయాన్ని సంస్థ నగర ప్రతినిధులు ఓ సమావేశంలో తెలిపారు.
నిజమైన స్నేహాలను బలోపేతం చేస్తూ హానికరమైన సంబంధాలను అరికట్టే దిశగా ఇవి రూపొందాయని, బ్లాకింగ్ కేపబులిటీస్‌ను అభివృద్ధి చేయడం, లొకేషన్ షేరింగ్‌ను సరళీకృతం చేయడం, స్నేహబంధాల రక్షణ టూల్స్‌ను విస్తరించడం, ఇన్–చాట్ వార్నింగ్స్‌ను పెంచడం.. వంటి మార్పు చేర్పులతో ఫీచర్లు జత చేశామని వివరించారు.
ఈ సందర్భంగా టీన్ ఆన్‌లైన్ సేఫ్టీపై ఏర్పాటు చేసిన ప్యానెల్ చర్చలో నటి, స్నాప్ స్టార్ నితాన్షి గోయెల్, యంగ్ లీడర్స్ ఫర్ యాక్టివ్ సిటిజన్‌షిప్(వైఎల్‌ఎసి) సహ వ్యవస్థాపకులు అపరాజితా భత్రి, స్పాన్ పబ్లిక్ పాలసీ హెడ్ ఉత్తరా గణేష్ పాల్గొన్నారు.
ఇవి చదవండి: Neenu Rathin: తక్కువ కాలంలోనే.. ‘సోషల్ ఎంటర్‌ప్రెన్యూర్’గా..
Comments
Please login to add a commentAdd a comment