స్నాప్‌చాట్‌ ‘పూర్‌’ కామెంట్స్‌పై జుకర్‌బర్గ్‌ చురకలు! | Facebook is for all: Zuckerberg takes a jab at Snapchat | Sakshi
Sakshi News home page

స్నాప్‌చాట్‌ ‘పూర్‌’ కామెంట్స్‌పై జుకర్‌బర్గ్‌ చురకలు!

Published Wed, Apr 19 2017 11:53 AM | Last Updated on Thu, Jul 26 2018 5:23 PM

స్నాప్‌చాట్‌ ‘పూర్‌’ కామెంట్స్‌పై జుకర్‌బర్గ్‌ చురకలు! - Sakshi

స్నాప్‌చాట్‌ ‘పూర్‌’ కామెంట్స్‌పై జుకర్‌బర్గ్‌ చురకలు!

శాన్‌ఫ్రాన్సిస్కో: స్నాప్‌చాట్‌ సీఈవో తలపొగరు వ్యాఖ్యల నేపథ్యంలో ఫేస్‌బుక్‌ సీఈవో మార్క్‌ జుకర్‌బర్గ్‌ చురకలంటించారు. ఫేస్‌బుక్‌ కేవలం హై ఎండ్‌ వారికోసం మాత్రమే కాదు.. అందరికోసం అని వ్యాఖ్యానించారు.

మంగళవారం శాన్‌ జోస్‌లో జరిగిన ఫేస్‌బుక్‌ ఎఫ్‌8 వార‍్షిక డెవలప్‌మెంట్‌ కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతూ జుకర్‌బర్గ్‌ ఈ వ్యాఖ్యలు చేశారు. అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీ అనేది కేవలం ఉన్నత స్థాయిలో ఉన్నవారికి మాత్రమే కాకుండా సమాజంలో ఉన్న అందరికీ ఉపయోగపడాలని జుకర్‌బర్గ్‌ అన్నారు. అందుకే ‘ఫేస్‌బుక్‌ లైట్‌’ లాంటి వాటిపై తాము దృష్టి పెట్టామని వెల్లడించారు. భారత్‌ లాంటి  పేద దేశంలో స్నాప్‌చాట్‌ వ్యాపార విస్తరణ అవసరం లేదని.. తమ యాప్‌ కేవలం ధనికులకోసమే అని స్నాప్‌చాట్‌ సీఈవో ఇవాన్ స్పీగల్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యల నేపథ్యంలో స్నాప్‌చాట్‌పై సోషల్‌ మీడియాలో తీవ్రస్థాయిలో విమర్శలు వ్యక్తమయ్యాయి.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement