ఫేస్‌బుక్ అంటే సోషల్ మీడియా దిగ్గజం. అలాంటి సంస్థకు కాపీ కొట్టాల్సిన అవసరం ఏముంటుందని అనుకుంటాం. కానీ.. ఒకప్పుడు తాను కొనేయాలని ప్రయత్నించిన 'స్నాప్‌చాట్' యాప్ నుంచి తన ఆధీనంలో ఉన్న ఇన్‌స్టాగ్రాం కోసం 'స్టోరీస్' అనే ఫీచర్‌ను ఫేస్‌బుక్ కాపీ కొట్టిందట. కాపీ కొట్టినప్పుడు కనీసం పేరైనా మారిస్తే బాగుంటుంది కదూ.. కానీ ఏమాత్రం మార్చకుండా అదే పేరుతో ఆ ఫీచర్‌ను ఇప్పుడు ఇన్‌స్టాగ్రాంలో పెట్టేశారని ఆండ్రాయిడ్అథారిటీ.కామ్ అనే సైట్ తెలిపింది.
ఇప్పుడు ఇన్‌స్టాగ్రాంలోని 'స్టోరీస్'లో ఒక స్లైడ్ షో ఫార్మాట్ కనిపిస్తుంది. దాన్ని ఫాలోవర్లు 24 గంటల పాటు చూసే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత అది హోం పేజిలోంచి అదృశ్యం అయిపోతుంది గానీ, ప్రొఫైల్‌లో మాత్రం ఉంటుంది. సరిగ్గా స్నాప్‌చాట్‌లో ఉండే స్టోరీస్ ఫీచర్ కూడా ఇలాగే ఉంటుంది. ఈ స్టోరీలో మనం కావల్సిన టెక్స్ట్, స్టిక్కర్లు, డ్రాయింగ్‌లు, ఫొటోలు.. ఇలా అన్నీ యాడ్ చేసుకోవచ్చు. త్వరలోనే ఆండ్రాయిడ్‌తో పాటు ఐఓఎస్ ప్లాట్‌ఫాంలో కూడా ఇన్‌స్టాగ్రాం 'స్టోరీస్' ఫీచర్ వస్తోంది. యూజర్లు తాము ఫాలో అయ్యేవాళ్ల ప్రొఫైల్‌లో ఉన్న స్టోరీలను పైన కనిపించే ఒక బార్‌లో చూడొచ్చు.
ఫేస్‌బుక్ కాపీ కొట్టిందట!
Published Wed, Aug 3 2016 1:00 PM | Last Updated on Thu, Jul 26 2018 5:23 PM
Advertisement
Advertisement