భోపాల్: ఇటీవలి కాలంలో సోషల్ మీడియా(Social Media)లో ఫేమస్ అయ్యేందుకు ఎంతో మంది ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో తమ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. తాజాగా ఓ డ్రైవర్ రీల్స్(Social Media Reels) పిచ్చి కారణంగా తనతో పాటు మరో ప్రాణం బలితీసుకున్నాడు. కారు చెరువులోకి దూసుకెళ్లిన ఘటనలో ఇద్దరు మృతిచెందగా.. మరొకరు ఎంతో కష్టం మీద తన ప్రాణాలను దక్కించుకున్నాడు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లో జరిగింది.
వివరాల ప్రకారం.. భోపాల్(bhopal)లోని కోలార్ రోడ్‌లో బుధవారం అర్థరాత్రి కారు కాలువలోకి దూసుకెళ్లడంతో ఇద్దరు వ్యక్తులు మరణించారు. మృతులు పలాష్ గైక్వాడ్, వినీత్ దక్ష(డ్రైవర్)లుగా గుర్తించారు. అయితే, డ్రైవర్ కారు నడుపుతూ రీల్స్ రికార్డ్ చేస్తుండగా కారు అదుపు తప్పి చెరువు పడిపోవడంతో ఈ ప్రమాదం జరిగింది. దీంతో, పలాష్, వినీత్ అక్కడికక్కడే మృతి చెందారు. ఇక, ప్రమాదం సమయంలో మరో వ్యక్తి పియూష్ కారు వెనుక అద్దాన్ని పగులగొట్టి తప్పించుకోగలిగాడు. సమాచారం అందుకున్న కోలారు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కారు అద్దాలు పగలగొట్టి మృతదేహాలను బయటకు తీశారు.
అనంతరం, ఈ ఘటనపై కోలార్ పోలీస్ స్టేషన్ ఇన్‌చార్జ్ సంజయ్ తివారీ మాట్లాడుతూ.. ముగ్గురు స్నేహితులు షాపురా నివాసితులు. వీరు ముగ్డురు దాబా నుంచి తిరిగి వస్తుండగా.. ప్రమాదం జరిగింది. ప్రమాదానికి రీల్స్ చేయడమే కారణం. వేగంతో ఉన్న కారు చెరువు కల్వర్టు దగ్గర అకస్మాత్తుగా అదుపు తప్పి నీటిలో పడిపోయింది. చలి కారణంగా కారు అద్దాలు మూసుకుపోయాయి. అందుకే వారిద్దరూ తప్పించుకోలేకపోయారు అని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment