ఇక అమెరికన్లకు అందుబాటులోకి!
న్యూయార్క్: అమెరికా వాసులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న స్పెక్టాకిల్స్(కళ్లద్దాలు) ఆన్ లైన్లో అందుబాటులోకి రానున్నాయి. ఫొటో షేరింగ్ సర్వీస్ స్నాప్ చాట్ ఈ స్పెషల్ కళ్లద్దాలను కనెక్ట్ చేసి వీడియోలను రికార్డు చేసుకునే వెసలుబాటు కల్పించింది. ఈ కళ్లద్దాల వాడకంతో వీడియో రికార్డింగ్, ఫొటో షేరింగ్ ఇకనుంచి సులభతరం కానుంది. బ్లూటూత్, వైఫై సౌకర్యాలతో స్నాప్ చాట్ యూజర్ల తమ అకౌంట్లో వీడియోలు అప్ లోడ్ చేయవచ్చు. అమెరికా నెటిజన్లు ఆన్ లైన్ లో స్నాప్ చాట్ కళ్లద్దాలను బుక్ చేసుకుని యూజ్ చేసుకోవచ్చు.
గతేడాది సెప్టెంబర్ లో పలు దేశాల మార్కెట్లోకి ఈ ప్రొడక్ట్ వచ్చినప్పటికీ కేవలం కొన్ని కేంద్రాల్లో మేషిన్ల ద్వారా యూజర్లు కొనుగోలు చేయాల్సి వచ్చేది. మార్చి 2 నుంచి ఆన్ లైన్లో అందుబాటులోకి రానున్న కళ్లద్దాల ధర 129.99 అమెరికన్ డాలర్లు (భారత కరెన్సీలో దాదాపు రూ.8706 )గా ఉంది. కళ్లద్దాలను ఛార్జింగ్ చేసే కేబుల్ వైరు బ్లాక్, కోరల్ రెడ్, టియల్ బ్లూ రంగుల్లో లభించనుంది.