Spectacles
-
నేత్ర దరహాసం... వికారాబాద్ జిల్లాలో ‘కంటి వెలుగు’ సంపూర్ణం
వికారాబాద్: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన కంటి వెలుగు కార్యక్రమం పూర్తయ్యింది. వంద పని దినాల్లో ప్రోగ్రామ్‌ను పూర్తిచేయాల్సి ఉండగా.. గడువులోపే ముగించి సర్కారు సంకల్పాన్ని విజయవవంతం చేశారు. ఇందుకోసం వైద్య సిబ్బంది, అధికారులు ఎంతగానో శ్రమించారు. రోజువారీ విధులు నిర్వర్తిస్తూనే కంటివెలుగు శిబిరాలు కొనసాగించారు. ఇదిలా ఉండగా అద్దాలు పంపిణీ చేసే విషయంలో మిగితా జిల్లాలతో పోలిస్తే వికారాబాద్ ముందు వరుసలో నిలిచింది. కలెక్టర్, డీఎంఅండ్‌హెచ్‌ఓ ఇతర అధికారుల నిరంతర పర్యవేక్షణతో పరీక్షలు, చికిత్సలు, అద్దాల పంపిణీ పూర్తయ్యింది. రాష్ట్ర వ్యాప్తంగా పద్దెనిమిదేళ్లు నిండిన ప్రతీ వ్యక్తికి నేత్ర పరీక్షలు చేయాలని ప్రభుత్వం పెట్టుకున్న లక్ష్యం జిల్లాలో త్వరగా పూర్తి కావడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. పరీక్షలు.. అవగాహన జిల్లాలోని 566 గ్రామ పంచాయతీలు, నాలుగు మున్సిపాలిటీలు, 97 వార్డులు ఉన్నాయి. వికారాబాద్, తాండూరు, పరిగి, కొడంగల్ నియోజకవర్గాల పరిధిలోని 20 మండలాల్లో సుమారు 9.27 లక్షల జనాభా ఉంది. వీరందరికీ నేత్ర పరీక్షలు చేసేందుకు 42 వైద్య బృందాలను నియమించారు. ఓ పక్క కంటి వెలుగు స్క్రీనింగ్ చేస్తూనే.. మరోపక్క నేత్ర సమస్యల నివారణపై ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. జిల్లాలో స్క్రీనింగ్ కేంద్రాలకు వచ్చి పరీక్షలు చేయించుకున్నవారిలో 25శాతం (1,24,364) మంది ఏదో ఒక కంటి సమస్యతో బాధ పడుతున్నట్లు తేలింది. ఇందులో కొందరికి రీడింగ్ గ్లాసెస్ అవసరమవగా మరికొందరికి ప్రిస్క్రిప్షన్ గ్లాసెస్ అవసరమని గుర్తించిన వైద్యులు వీటిని పంపిణీ చేశారు. మనమే నంబర్ వన్ జిల్లాలో జనవరి 19న కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఎంపిక చేసిన గ్రామాలు, పట్టణాల్లో నిత్యం 42 బృందాలతో శిబిరాలు నిర్వహించారు. ఒక్కో క్యాంపులో నిత్యం 150 నుంచి 170 మందికి కళ్ల స్క్రీనింగ్ చేశారు. ప్రతీ శిబిరంలో వైద్యాధికారితో పాటు నేత్రవైద్యుడు, సిబ్బంది కలిపి ఎనిమిది మంది పాల్గొన్నారు. జిల్లాలో మొత్తం 9.27 లక్షల జనాభా ఉండగా.. ఇందులో 18 ఏళ్లు పైబడిన 4,83,794 మందికి నేత్ర పరీక్షలు పూర్తిచేశారు. వీరిలో 64,798 మందికి రీడింగ్ గ్లాసెస్ అవసరమని తేల్చి ఆరుగురు మినహా 64,792 మందికి అద్దాలు అందజేశారు. 59,566 మందికి ప్రిస్క్రిప్షన్ గ్లాసెస్ అవసరమని నిర్ధారించి.. ఇప్పటివరకు 50,235 మందికి అద్దాలు అందజేశారు. మిగిలిన వారికి పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రభుత్వం నుంచి వచ్చిన అద్దాలను పంపిణీ చేయడంలో మన జిల్లా రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలిచింది. సమష్టి కృషితోనే.. ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలో కంటి వెలుగు కార్యక్రమాన్ని పూర్తిచేశాం. పరీక్షలు నిర్వహించిన వారిలో తొంభైశాతం మందికి పైగా అద్దాలు పంపిణీ చేశాం. మిగిలిన వారికి త్వరలోనే అందజేస్తాం. అధికారులు, సిబ్బంది, ప్రజాప్రతినిధుల సమష్టి కృషితోనే కార్యక్రమం విజయవంతమైంది. – పల్వాన్‌కుమార్, డీఎంహెచ్ఓ -
దేవనాగరి చీరలో సమంత! కోటి రూపాయల విలువైన ఫ్రేమ్స్ కూడా..
సమంత.. వైవిధ్యమైన నటి అని ప్రత్యేకంగా కితాబివ్వక్కర్లేదు. ఆమె నటించిన సినిమాలు చూస్తే చాలు. అదే వైవిధ్యం ఆమె అనుసరించే ఫ్యాషన్‌లోనూ కనిపిస్తుంది. సాక్ష్యం ఇదిగో.. ఈ బ్రాండ్సే..! దేవనాగరి.. ఓ పండుగ రోజు అమ్మమ్మ తయారుచేసిన సంప్రదాయ దుస్తులు ధరించడంతో అక్కాచెల్లెళ్లు కవిత, ప్రియాంకల భవిష్యత్ ప్రణాళిక మారిపోయింది. ఒకరు ఇంజినీర్, మరొకరు డాక్టర్ కావాలనుకున్నా.. చివరికి వారిద్దరి కల ఒక్కటే అయింది. అదే ఫ్యాషన్ డిజైనింగ్. ఆ ఆసక్తితోనే జైపూర్‌లో లభించే సంప్రదాయ దుస్తులపై పరిశోధన చేశారు. కుటుంబ సభ్యుల సహకారంతో 2013లో సొంతంగా ‘దేవనాగరి’ అనే ఓ ఫ్యాషన్ హౌస్‌ను ప్రారంభించారు. దేశంలోని ఏ ప్రాంతంలో జరుపుకునే పండుగకైనా వీరి వద్ద దానికి తగ్గ ప్రత్యేకమైన డిజైన్స్ లభిస్తాయి. అదే వీరి బ్రాండ్ వాల్యూ. చాలామంది సెలబ్రిటీస్ వివిధ పండుగల్లో ఈ బ్రాండ్ దుస్తుల్లో మెరిసిపోతుంటారు. ధర కాస్త ఎక్కువగానే ఉంటుంది. పలు ప్రముఖ ఆన్లైన్ స్టోర్స్‌లో ఈ డిజైన్స్ లభిస్తాయి. లిండ్బర్గ్.. టాప్ మోస్ట్ లగ్జూరియస్ ఫ్యాషన్ బ్రాండ్స్‌లో లిండ్ బర్గ్ ఐ వేర్ ఒకటి. డెన్మార్క్‌లో మెయిన్ ఆఫీస్ ఉంది. అత్యాధునిక డానిష్ డిజైన్ సూత్రాలపై తయారుచేసే వీరి అందమైన, నాణ్యమైన కళ్లజోళ్లకు ఇండియాలో మంచి గిరాకీ ఉంది. 112 అంతర్జాతీయ అవార్డులను ఈ బ్రాండ్ సొంతం చేసుకుంది. టైటానియం, ప్లాటినం, బంగారం, వెండి, వజ్రాలు పొదిగిన ఫ్రేమ్స్ కూడా ఇక్కడ లభిస్తాయి. అయితే, ఈ బ్రాండ్ కేవలం సంపన్నులకు మాత్రమే. ఇక్కడి ప్రారంభ ధరే రూ. లక్షకు పైగా ఉంటుంది. కోటి రూపాయల విలువైన ఫ్రేమ్స్ కూడా ఉన్నాయి. ఆన్‌లైన్‌లోనూ లభ్యం. నచ్చినట్లు ఉండు నీకు నచ్చినట్లు నువ్వుండు. ఈ భూమి మీదకి వచ్చింది ఎవరి అభినందనల కోసమో, ఇతరులను సంతోష పెట్టడానికో కాదు. మనకు ఉన్నదాంట్లో సంతోష పడటానికి అలవాటు పడితే అవసరమైనవన్నీ మనల్ని వెతుక్కుంటూ వస్తాయి. – సమంత బ్రాండ్ వాల్యూ ఐ వేర్ బ్రాండ్: లిండ్బర్గ్ ధర: డిజైన్, నాణ్యతపై ఆధారపడి ఉంటుంది. చీర బ్రాండ్: దేవనాగరి ధర: రూ. 48,500 చదవండి: Sara Ali Khan: పండ్లే కాదు.. వాటి తొక్కలు కూడా వదలను! నా బ్యూటీ సీక్రెట్ ఇదే Sudha Ravi: రెండ్రోజుల్లో ఫంక్షన్.. మూడు రోజుల్లో పెళ్లి.. సుధా రవికి చెప్పారా? ఆమె స్పెషాలిటీ ఏంటి? -
రెండు రోజుల్లో 3.87 లక్షల మందికి కంటి పరీక్షలు
సాక్షి, హైదరాబాద్: కంటి వెలుగు కార్యక్రమం క్షేత్రస్థాయి క్యాంప్‌ల నిర్వహణ విజయవంతంగా జరుగుతుండటంపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి సంతృప్తి వ్యక్తం చేశారు. రాష్ట్రంలో మొదటి రెండు రోజుల్లో 3.87 లక్షల మందికి కంటి పరీక్షలు నిర్వహించగా, ఇందులో 97,335 మందికి కళ్లద్దాలు పంపిణీ చేసినట్లు తెలిపారు. కంటి వెలుగు అమలుపై శనివారం ఆమె బీఆర్కేఆర్ భవన్ నుంచి జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వైద్య, ఆరోగ్య శాఖ కార్యదర్శి ఎస్.ఎ.ఎం. రిజ్వీ, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ శ్వేతా మహంతి ఇందులో పాల్గొన్నారు. కాగా, అన్ని జిల్లాల్లోని బఫర్ టీమ్స్‌ను ఉపయోగించి ప్రభుత్వ కార్యాలయాలు, జిల్లా కోర్టు భవన సముదాయాలు, పోలీస్ బెటాలియన్లు, జర్నలిస్టుల కోసం ప్రెస్‌క్లబ్‌ల వద్ద ప్రత్యేక కంటి వెలుగు క్యాంప్‌లను నిర్వహించాలని శాంతి కుమారి సూచించారు. -
ఇడియట్స్ అని తిడుతూ..సహనం కోల్పోయిన ఎమ్మెల్యే
కొందరూ ఎమ్మెల్యే కింద స్ధాయి ఉద్యోగులపై తమ ఆవేశాన్ని వెళ్లగక్కడం మామూలే. మరికొందరూ ఏకంగా చేయి జేసుకున్న సందర్భాలు ఉన్నాయి. అచ్చం అలానే ఇక్కడొక ఎమ్మెల్యే రోడ్డునిర్మాణ పనులను ఎందుకు ఆలస్యం చేస్తున్నారంటూ కాంట్రక్టర్ని తిడుతూ..భౌతిక దాడికి దిగారు. ఏకంగా ఆ కాంట్రాక్టర్ కళ్ల అద్దలను కూడా పగలు కొట్టేసి..తోసేస్తానంటూ బెదిరింపులకు దిగారు. ఈఘటన కర్ణాటకలోని రాయచూర్ జిల్లా కవితా పట్టణంలో చోటు చేసుకుంది. కర్ణాటకలోని రాయ్‌చూర్‌లో నిర్మాణ పనుల ప్రాజెక్టును తనిఖీ చేసేందుకు వచ్చిన జేడీఎస్ ఎమ్మెల్యే రాజా వెంకటప్ప సహనం కోల్పోయారు. ఈ పనుల్లోజాప్యం ఎందుకు జరుగుతోందంటూ నిర్మాణ పనుల బాధ్యులపై మండిపడ్డారు. అక్కడు ఉన్న కాంట్రాక్టర్‌ని చూస్తూ..ఇడియట్స్ మీరు గుల్బర్గా నంచి ఇక్కడికి ఎందుకు వలస వచ్చారని ప్రశ్నించారు. మన జిల్లా నుంచి ఉద్యోగానికి ఎవరూ లేరా? అంటూ తిట్టిపోశారు. మనవాళ్ల అయినతే ఈపాటికి పని పూర్తి అయిపోయేదంటూ విరుచుకుపడ్డారు. అంతేగాదుఎమ్మెల్యే ఆ కాంట్రాక్టర్ ముఖానికి ఉన్న కళ్లద్దాలను లాక్కొని పగలు కొట్టడమే గాక ఇక్కడ నుంచి తోసేస్తానని బెదరించారు. ఆ తర్వాత జేఈ శ్యామలప్ప అనే మరో వ్యక్తిని కూడా దుర్భాషలాడారు. వాస్తవానికి రోడ్డు నిర్మాన పనులు ప్రారంభించి ఏడాది దాటిని పూర్తవ్వకపోవడంపై కవితా పట్టణం స్థానికులు ఎమ్మెల్యేను ప్రశ్నిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే జేడీఎస్ ఎమ్మెల్యే వెంకటప్ప రోడ్డు నిర్మాణ కాంట్రాక్టర్లపై మండిపడ్డారు. మీరంతా నాప్రతిష్టను దిగజార్చాలనే ప్రయత్నం చేస్తున్నారంటూ వారిపై ఆరోపణలు చేశారు. చెప్పుడు మాటలు వింటూ కావాలనే జాప్యం చేస్తూ..నాసిరకంగా పనులు చేస్తున్నారంటూ శారీరక దాడికి దిగారు. అందుకు సంబంధించిన దృశ్యాలు కొందరూ కెమరాలో బంధించడంతో ఈ ఘటన వెలుగు చూసింది. (చదవండి: మీకు జీవితఖైదు సరైనదే: షాక్ ఇచ్చిన హైకోర్టు) -
55 లక్షల మందికి ఉచితంగా కళ్లద్దాలు
సాక్షి, హైదరాబాద్: జవనరిలో ప్రారంభమయ్యే కంటివెలుగు రెండోవిడత కార్యక్రమంలో 55 లక్షలమందికి కళ్లద్దాలు ఇవ్వాలని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ నిర్ణయించింది. అందులో అక్కడికక్కడే 30 లక్షల రీడింగ్ గ్లాసులు, 25 లక్షల చత్వారీ కళ్లద్దాలు ఇవ్వనున్నారు. అవసరమైన కళ్లద్దాల కోసం సంబంధిత కంపెనీలతో అధికారులు చర్చలు జరుపుతున్నారు. ఆపరేషన్ అవసరమైనవారి పేర్లను నమోదు చేసుకొని ప్రభుత్వ, ప్రైవేట్, ఎన్జీవో సంస్థల ఆధ్వర్యంలోని ఆసుపత్రుల్లో చేస్తారు. ఈ మేరకు ఆయా ఆసుపత్రులతోనూ అధికారులు చర్చిస్తున్నారు. కంటివెలుగు నిర్వహణకుగాను రాష్ట్రవ్యాప్తంగా 1,500 బృందాలను ఏర్పాటు చేయనున్నారు. గతంలో ఆప్తమాలజిస్టులు చాలామంది కంటివెలుగు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈసారి కూడా వారిని నియమిస్తారు. అందుకు సంబంధించి జిల్లాల్లో త్వరలో నోటిఫికేషన్ జారీచేస్తారు. రాష్ట్రవ్యాప్తంగా వచ్చే ఏడాది జనవరి 18 తేదీ నుంచి కంటివెలుగు కార్యక్రమాన్ని నిర్వహించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించిన సంగతి తెలిసిందే. కంటివెలుగు పథకం ద్వారా కంటి పరీక్షలు నిర్వహించి కావాల్సిన వారందరికీ ఉచితంగా ఆపరేషన్లు నిర్వహించి కళ్లద్దాలు పంపిణీ చేస్తారు. ఐదు నెలలపాటు కోటిన్నర మందికి కంటి పరీక్షలు చేసేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. -
గురువర్యా.. ఇదిగో మీ కళ్లజోడు!
సాక్షి, విజయవాడ/చీరాల అర్బన్: రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో విజయవాడలో నిర్వహించిన గురుపూజోత్సవంలో అరుదైన సంఘటన చోటుచేసుకుంది. రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు పొందిన ఉపాధ్యాయులకు సీఎం వైఎస్ జగన్ అవార్డులను అందజేస్తుండగా.. అవార్డు అందుకుంటున్న బాపట్ల జిల్లా చీరాల రూరల్ మండలం ఈపూరుపాలెం జెడ్పీ బాలికల ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు మొలబంటి వెంకటేశ్వర్లు కళ్ల జోడు కింద పడిపోయింది. ఆ విషయం గమనించిన సీఎం జగన్.. దానిని చేత్తో పైకి తీసి, ఆ ప్రధానోపాధ్యాయుడి జేబులో పెట్టారు. ఓ గురువు పట్ల సీఎం వినయం ప్రదర్శించిన తీరును అక్కడ ఉన్న వారంతా ప్రశంసించారు. చదవండి: (రాష్ట్రంలోనే క్యాన్సర్‌కు చెక్) -
కోతి కళ్లుజోడుని ఎలా తిరిగి ఇచ్చిందో చూడండి!
మన ఇళ్లలోని వస్తువులను కోతులు ఏవిధంగా ఎత్తుకుపోతాయో అందరికీ తెలుసు. ఆ వస్తువులను కోతులు తీసుకెళ్లి ఎక్కడో పడేస్తాయి తప్ప అవి మనకు దొరికే అవకాశం కూడా ఉండదు. కానీ అందుకు విరుద్ధంగా ఇక్కడోక కోతి ఒక వ్యక్తి కళ్లజోడుని ఎత్తుకుపోయి మళ్లా తిరిగి ఇచ్చేసింది. అలా ఎలా ఇచ్చేసిందబ్బా అనిపిస్తుందా? అనుమానంగా ఉందా? అయితే తెలుసుకుందాం రండి. (చదవండి: చీరకట్టు ‘ప్రియుడు’.. ఇది ఏ ఫ్యాషనో తెలుసా?) వివరాల్లోకెళ్లితే.....ఐపీఎస్ ఆఫీసర్ రూపిన్ శర్మ కళ్లజోడుని ఒక కోతి ఎత్తుకుపోతుంది. పైగా ఆ కళ్లజోడు పట్టుకుని ఒక మెస్‌పై కుర్చోంటుంది. దీంతో మొదట అతనికి ఏం చేయాలో తోచదు. ఆ తర్వాత ఆయన ఒక జ్యూస్ ప్యాక్‌ని తీసుకువచ్చి కోతికి ఇస్తాడు. కోతులు సహజసిద్ధంగా ఉండే అనుకరించే బుద్ది కారణంగా ఆ కోతి జ్యూస్ ప్యాక్‌ని తీసుకుని కళ్లజోడుని మెస్ మీద నుంచి వదిలేస్తుంది. అయితే ఆ కళ్లజోడు మెస్‌లో ఇరుక్కుపోతుంది. అయినప్పటికీ ఆ తెలివైన కోతీ ఆ మెస్‌లో ఇరుక్కుపోతున్న కళ్లజోడుని తీసి మరీ శర్మకి తిరిగి ఇస్తుంది. దీనికి సంబంధించిన వీడియోకి "ఒక చేత్తో తీసకుంటూ ఇంకో చేత్తో ఇచ్చింది" అనే క్యాప్షన్ జోడించి ట్టిట్టర్లో పోస్ట్ చేశారు. దీంతో ఆ వీడియో కాస్త నెట్టింట తెగ వైరల్ అవుతోంది. అంతేకాదు నెటిజన్లు తినేందుకు ఏమి ఇవ్వకపోతే కోతులు మనవస్తువులను అంత తేలిగ్గా తిరగి ఇవ్వవు అంటూ రకరకాలు ట్వీట్ చేశారు. (చదవండి: హృదయాన్ని కదిలించే ‘స్వీట్ రిక్వస్ట్’) Smart 🐒🐒🐒 Ek haath do, Ek haath lo 😂😂😂😂🤣 pic.twitter.com/JHNnYUkDEw — Rupin Sharma IPS (@rupin1992) October 28, 2021 -
ఇవి మామూలు కళ్లద్దాలు కావు.. కనీసం రూ.25 కోట్లు
చూడ్డానికి మామూలు కళ్లద్దాల్లాగే కనిపిస్తున్నాయి కదూ.. ! అయితే.. వీటిని వేలం వేయనున్న సథబీస్ సంస్థ మాత్రం ఇలాంటివి ప్రపంచంలో మరెక్కడా లేవని చెబుతోంది.. ఏంటి విషయమని ఆరా తీస్తే.. వీటితో మనకున్న లింకు కూడా బయటపడింది. 17వ శతాబ్దానికి చెందిన ఈ కళ్లద్దాలు.. మన దేశాన్ని పాలించిన మొఘలులకు చెందినవట. సాధారణంగా కళ్లద్దాల అద్దాలను గాజుతో చేస్తారు. వీటిని మాత్రం వజ్రం, పచ్చతో చేశారు. అది కూడా మన గోల్కొండ వజ్రాల గనిలో లభ్యమైన ఓ 200 క్యారెట్ల వజ్రం నుంచే వీటిల్లో ఒక అద్దాన్ని తయారుచేశారట. మొఘలుల కాలం నాటి కళాకారుల పనితనానికి ఇదో మచ్చుతునకని సథబీస్ ప్రతినిధులు చెబుతున్నారు. దీన్ని అప్పటి మొఘల్ చక్రవర్తి లేదా ఆయన దర్బారులో పెద్ద పదవిలో ఉన్న వ్యక్తి ధరించి ఉండొచ్చని అంటున్నారు. జ్ఞానసిద్ధికి.. దుష్టశక్తులు దరిచేరకుండా ఉండటానికి వీటిని ధరించేవారట! వచ్చే నెల్లో జరగనున్న వేలంలో ఇవి కనీసం రూ.25 కోట్లు పలుకుతాయని సథబీస్ సంస్థ చెబుతోంది. -
గాంధీ కళ్లద్దాలకు రూ. 2.55 కోట్లు
లండన్: మహాత్మాగాంధీ ధరించాడని భావిస్తున్న బంగారుపూత పూసిన కళ్లద్దాలు బ్రిటన్‌లో రికార్డు ధరకు అమ్ముడయ్యాయి. ఈస్ట్ బ్రిస్టల్ ఆక్షన్స్ సంస్థ నిర్వహించిన వేలంలో ఈ కళ్లజోడు 2,60,000 పౌండ్ల (రూపాయలు 2.55 కోట్లు)కు అమ్ముడైంది. దక్షిణాఫ్రికాలో బ్రిటిష్ పెట్రోలియంకు పనిచేస్తున్న సమయంలో, 1910– 1930 మధ్యకాలంలో బ్రిటన్ దేశస్తుడికి ఇవి బహుమతిగా వచ్చాయి. తర్వాత ఆయన తన బంధువులకు వీటిని అందజేశారు. సౌత్ గ్లూసెస్టర్‌షైర్‌లో నివసించే వ్యక్తి 50 ఏళ్లుగా తమ ఇంట్లో ఉన్న ఈ కళ్లజోడును వేలం వేయాల్సిందిగా కోరారు. 10 నుంచి 15 వేల పౌండ్లు పలుకుతాయని భావించారు. అయితే ఏకంగా రెండు లక్షల అరవై వేల పౌండ్లకు అమెరికాకు చెందిన ఒక వ్యక్తి దీన్ని సొంతం చేసుకున్నాడు. భారత్, ఖతార్, అమెరికా, రష్యా, కెనడాల నుంచి పలువురు వేలం పాటలో పాల్గొన్నారు. ఇంత ధర పలకడంతో వేలానికి పెట్టిన వ్యక్తి ఆనందంతో తబ్బిబ్బయ్యారు. ఈ సొమ్మును కూతురుతో పంచుకుంటానని చెప్పారు. -
కళ్లజోళ్ల కోసం ఒక్కో జడ్జికి రూ.50వేలు
ముంబై: కళ్ళజోళ్లు కొనుగోలు చేసేందుకు బొంబాయి హైకోర్టులోని ప్రతి న్యాయమూర్తికి సంవత్సరానికి రూ. 50 వేలు చెల్లించడానికి మహారాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ మేరకు రూపొందించిన గవర్నమెంట్ రిసొల్యూషన్(జీఆర్)ను సోమవారం ప్రభుత్వం ఆమోదించింది. రాష్ట్రాల చట్టం, న్యాయవ్యవస్థ జీఆర్ ప్రకారం ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం తెలిపింది. న్యాయమూర్తులు, వారి జీవిత భాగస్వాములతో పాటు వారిపై ఆధారపడిన కుటుంబ సభ్యులు కూడా దీని పరిధిలోకి వస్తారు. ఈ మొత్తంలో పునరావృత ఖర్చులు కూడా ఉంటాయి. ఈ జీఆర్‌పై జూలై 10 జిఆర్ న్యాయ సలహాదారు, జాయింట్ సెక్రటరీ యోగేశ్ అమేటా సంతకం చేశారు. -
‘కంటి వెలుగు’కు 1,59,851 జోళ్లు సిద్ధం
ఖమ్మం, వైద్యవిభాగం : ప్రభుత్వం ప్రతిష్ణాత్మకంగా ప్రారంభిస్తున్న కంటి వెలుగు కార్యక్రమం కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ ఎ.కొండల్రావు తెలిపారు. ఆయన మంగళవారం తన చాంబర్లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఈ కార్యక్రమాన్ని మంగళవారం మధ్యాహ్నం 2:30 గంటలకు బ్యాంక్ కాలనీలో, ప్రకాశ్‌నగర్‌లోని రాజేంద్రనగర్ పాఠశాలలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రారంభిస్తారని చెప్పారు. ‘కంటి వెలుగు’ కోసం 36 బృందాలను సిద్ధం చేశామన్నారు. 25 బృందాలు గ్రామీణ ప్రాంతాల్లో, ఏడు బృందాలు ఖమ్మం నగరంలో పరీక్షలు నిర్వహిస్తాయని, మరో నాలుగు అదనపు బృందాలను అందుబాటులో ఉంచనున్నట్టు వివరించారు. ప్రతి రోజు ఒక్కో బృందం గ్రామీణ ప్రాంతాల్లో 250 మందిని, పట్టణ ప్రాంతాల్లో 300 మందిని పరీక్షిస్తుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో భాగంగా జిల్లాకు 1,59,851 కళ్లద్దాలు వచ్చాయన్నారు. ఆశ కార్యకర్తలు, ఏఎన్ఎంలు పరీక్షించిన తర్వాత మెడికల్ ఆఫీసర్ పర్యవేక్షణలో నిపుణులు పరీక్షించి అవసరమైన వారికి మందులు, ఐ డ్రాప్స్, కళ్ళద్దాలు ఇస్తారని చెప్పారు. జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో, మమత ఆసుపత్రి, అఖిల కంటి ఆసుపత్రిలో ఆపరేషన్లు కూడా నిర్వహిస్తారని చెప్పారు. తప్పదనుకుంటే హైదరాబాద్ ఆస్పత్రికి పంపిస్తారని చెప్పారు. జిల్లాలో ఈ కార్యక్రమం ఆరు నెలలపాటు కొనసాగుతుందన్నారు. ఈ కార్యక్రమ విజయవంతానికి జిల్లాలోని ప్రజాప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు ముందుకు రావాలని కోరారు. మాట్లాడుతున్న డాక్టర్ కొండల్రావు -
50 వేల కళ్లజోడు.. అసెంబ్లీని కుదిపేసింది
తిరువనంతపురం : స్పీకర్ కళ్లజోడు వ్యవహారం కేరళ అసెంబ్లీని కుదిపేస్తోంది. ఖరీదుతో కూడిన కళ్లద్దాలు స్పీకర్ ధరించటం.. ఆ సొమ్మును ప్రభుత్వ ఖజానా నుంచే ఖర్ఛు చేయటంపై ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. కేరళ అసెంబ్లీ స్పీకర్ శ్రీరామకృష్ణన్ సుమారు 50వేల ఖరీదుతో ఈ మధ్యే కళ్లజోడు కొనుకున్నారు. దీనిపై ప్రతిపక్ష సభ్యుడొకరు ఆర్టీఐ ద్వారా సమాచారం రాబట్టారు. అందులో గ్లాసులకు 45,000 వేల రూపాయలు, ఫ్రేమ్‌కు 4,500 రూ. ఖర్చు చేసినట్లు ఉంది. ఈ మొత్తం సొమ్ము ప్రభుత్వ ఖజానా నుంచి ఆయనకు రీ-ఎంబర్స్ అయినట్లు తేలింది. దీంతో ప్రతిపక్షాలు విమర్శలకు దిగాయి. ఇంతకు ముందు ఆరోగ్య శాఖ మంత్రి కేకే శైలజ కూడా 28,000 రూ. కళ్లజోడు కొనుక్కోవటం.. ఆ సొమ్ము కూడా రీఎంబర్స్ కావటం విమర్శలకు తావునివ్వగా... ఇప్పుడు స్పీకర్ వ్యవహారం కూడా వెలుగులోకి రావటంతో విమర్శలు తారా స్థాయికి చేరుకున్నాయి. స్పీకర్ రాజీనామాకు డిమాండ్ చేస్తూ ప్రతిపక్షాలు నిరసన ప్రదర్శనలకు పిలుపునిచ్చాయి. స్పీకర్ వివరణ... గత కొన్ని రోజులుగా నా కళ్లు సరిగ్గా కనిపించటం లేదు. నా పనులు చేసుకోవటం కూడా ఇబ్బందిగా అనిపిస్తోంది. అధికారిక కార్యక్రమాలు కూడా నిర్వహించాల్సిన బాధ్యత నా పై ఉంది. అందుకే వైద్యుడి సలహా మేరకు మంచి కళ్లజోడు తీసుకున్నా. తప్పేముంది అని శ్రీరామకృష్ణన్ వివరణ ఇచ్చారు. కాగా, కేరళ శాసనసభ్యులు, వారి కుటుంబ సభ్యుల చికిత్స పేరిట బిల్లులతో మెడికల్ రీఎంబర్స్మెంట్ సొమ్మును లక్షల్లో వసూలు చేస్తున్నారు. వీరిలో అధికార పక్ష నేతలే ఎక్కువగా ఉన్నట్లు తేలింది. దీనిపై ఇటీవలె స్థానిక మీడియా ఛానెళ్లలో ప్రత్యేక కథనాలు కూడా వెలువడ్డాయి. అయితే ఈ తతంగం వెనుక మొత్తం బీజేపీ హస్తం ఉందని ముఖ్యమంత్రి పినరయి విజయన్ ఆరోపిస్తున్నారు. -
ఇక అమెరికన్లకు అందుబాటులోకి!
న్యూయార్క్: అమెరికా వాసులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న స్పెక్టాకిల్స్(కళ్లద్దాలు) ఆన్ లైన్లో అందుబాటులోకి రానున్నాయి. ఫొటో షేరింగ్ సర్వీస్ స్నాప్ చాట్ ఈ స్పెషల్ కళ్లద్దాలను కనెక్ట్ చేసి వీడియోలను రికార్డు చేసుకునే వెసలుబాటు కల్పించింది. ఈ కళ్లద్దాల వాడకంతో వీడియో రికార్డింగ్, ఫొటో షేరింగ్ ఇకనుంచి సులభతరం కానుంది. బ్లూటూత్, వైఫై సౌకర్యాలతో స్నాప్ చాట్ యూజర్ల తమ అకౌంట్లో వీడియోలు అప్ లోడ్ చేయవచ్చు. అమెరికా నెటిజన్లు ఆన్ లైన్ లో స్నాప్ చాట్ కళ్లద్దాలను బుక్ చేసుకుని యూజ్ చేసుకోవచ్చు. గతేడాది సెప్టెంబర్ లో పలు దేశాల మార్కెట్లోకి ఈ ప్రొడక్ట్ వచ్చినప్పటికీ కేవలం కొన్ని కేంద్రాల్లో మేషిన్ల ద్వారా యూజర్లు కొనుగోలు చేయాల్సి వచ్చేది. మార్చి 2 నుంచి ఆన్ లైన్లో అందుబాటులోకి రానున్న కళ్లద్దాల ధర 129.99 అమెరికన్ డాలర్లు (భారత కరెన్సీలో దాదాపు రూ.8706 )గా ఉంది. కళ్లద్దాలను ఛార్జింగ్ చేసే కేబుల్ వైరు బ్లాక్, కోరల్ రెడ్, టియల్ బ్లూ రంగుల్లో లభించనుంది. -
అద్భుతాలను చూపించే కళ్లజోడు
బుడాపెస్ట్: కళ్లముందు అద్భుతాలను ఆవిష్కరించే కళ్లజోడును హంగేరికి చెందిన ప్రముఖ ఆర్టిస్ట్ బెన్స్ అగోస్టన్ కనిపెట్టాడు. ఆప్టికల్ ఇల్యూషన్స్ (దృశ్య భ్రాంతి) సిద్ధాంతం ఆధారంగా దీన్ని అభివృద్ధి చేశారు. దీనికి ‘మూడ్ స్పెక్టాకల్స్’ అని పేరు కూడా పెట్టాడు. దీన్ని ధరిస్తే కళ్లు ముందు దృశ్యాలు కదలనిది కదిలినట్టుగా, కదిలేది కదలనట్టుగా, కొండవాలు నుంచి జాలువారే జలపాతం పైకి ఎగబాకుతున్నట్టుగా సప్తవర్ణశోభితమై కనవిందు చేస్తాయి. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ లోకాన్ని విస్మరించి దేదీప్యమానమైన దివ్యలోకాన్ని సందర్శిస్తున్న భ్రాంతి కలుగుతుంది. అంతే కాకుండా ధరించిన వ్యక్తి మానసిక స్థితిని బట్టి కళ్లముందు కదలాడే దృశ్యాలు క్షణక్షణం మారిపోతుంటాయి. మరో మాటలో చెప్పాలంటే ‘బాహుబలి’ చిత్రంలో బాహుబలి కొండ ఎక్కుతున్న దృశ్యంలో అచ్చం మనమే ఉన్నట్టుగా భ్రాంతి కలుగుతుంది. ఇక్కడ సినిమాకు, ఈ కళ్లజోడు ధరించిన వ్యక్తి అనుభూతికి తేడా ఏమిటంటే...సినిమాలో కనిపించేది వాస్తవంగా భావిస్తే, అందులో జాలువారుతున్న భారీ జలపాతం మధ్య మేరు పర్వత శిఖరాన్ని బాహుబలి అధిరోహిస్తుంటాడు. కళ్లుజోడు ధరించిన వ్యక్తి ఉన్నచోటు నుంచి కదలడు కనుక తన చుట్టే భారీ జలపాతం జాలువారుతున్నట్టు, మేరు పర్వతం కాళ్ల కింది నుంచి కిందకు తరగిపోతున్నట్టు దృశ్య భ్రాంతి కలుగుతోంది. కళ్లజోడు ధరించిన ప్రతివ్యక్తికి ఒకేలాంటి దృశ్యభ్రాంతి కూడా కలగదు. వారి వారి మూడ్స్, ఆలోచనలనుబట్టి దృశ్యభ్రాంతులుంటాయి. ఎప్పుడు సంగీతాన్ని ఆస్వాదించేవారికి, కొండలు, లోయల మధ్య విహరిస్తూ ఉభయ సంధ్య వేళల్లో ప్రకృతి రమణీయతనను ఆనందించేవారికి ఈ క ళ్లజోడు ఎంతగానో ఉపయోగపడుతుందనడంలో సందేహం లేదని చెబుతున్నారు ఆర్టిస్ట్ అగోస్టన్. ఈస్థాయిలోకాకున్నా ఇలాంటి దృశ్యభ్రాంతిని కలిగించే మాదకద్రవ్యాలు చీకటి మార్కెట్లో కొన్ని దేశాల్లో లభిస్నున్నాయి. అలాంటి డ్రగ్స్ వాడడం ప్రాణాంతకం. మూడ్ కళ్లజోడును వాడడం ఒక్క మూర్ఛ రోగులకు తప్ప ఎవరికి ఎలాంటి హాని కలిగించదు. అలా అని దృశ్యభ్రాంతిలో ఉండడం వల్ల ఎలాంటి చట్ట ఉల్లంఘన చర్యలకు పాల్పడరాదు సుమా. ఈ కళ్లజోడును ఎలా తయారు చేశారంటే.... 3డీ ప్రింటర్ ద్వారా కళ్లజోడు ఫ్రేమ్‌ను తయారు చేశారు. అందులో ఆర రకాల లెన్సులను అమర్చారు. వాటికి ఆకుపచ్చ, ఎరుపు, నీలి రంగుల్లో ఉండే మూడు కాంతి (లైట్) ఫిల్టర్లను ఏర్పాటు చేశారు. ఈ ఫిల్టర్లను ఎవరికి వారు తిప్పుకునే అమరిక ఉంటుంది. వీటిని తిప్పడం ద్వారానే కళ్లు ముందున్న దృశ్యాలు అద్భుతరూపాల్లోకి మారుతాయి. కాంతి కిరణాలు రంగునుబట్టి పరావర్తనం చెందుతాయన్న సైన్స్ సూత్రం తెల్సిందే. ఆ సూత్రం ఆధారంగానే ఈ కళ్లజోడులో కలర్ ఫిల్టర్లు పనిచేస్తాయి. ఈ సరికొత్త కళ్లజోడును అగోస్టన్ ఇప్పటి వరకు ఒకటే తయారు చేశారు. ప్రస్తుతం వివిధ కంపెనీలతో మాట్లాడుతున్నారు. ఎంపిక చేసుకున్న కంపెనీ ద్వారా వీటిని ఉత్పత్తిచేసి మార్కెట్లో విక్రయించాలన్నది ఆయన ఆలోచన. -
కంటి చూపునిచ్చే ఆప్టోమెట్రిస్టు
అప్‌కమింగ్ కెరీర్: సర్వేంద్రియానాం నయనం ప్రధానం.. మనిషికి అన్ని ఇంద్రియాల్లోకెల్లా కళ్లే ముఖ్యం. కంటిచూపు లేకపోతే జీవితం అంధకారమయం. కటిక చీకటి తప్ప వెలుగులు వీక్షించలేం. కంటిచూపు విషయంలో తాజా గణాంకాలు ప్రమాద ఘంటికలను మోగిస్తున్నాయి. ప్రపంచంలోని ప్రతి ముగ్గురు అంధుల్లో ఒకరు భారతీయులేనని తాజా అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. దేశంలో లక్షలాది మంది కంటి సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారు. అంధులకు చూపు రప్పించి, సుందర లోకాన్ని చూపించి, వారి జీవితాల్లో వెలుగులు పూయించాలనే ఆశయం ఉన్నవారికి సరిగ్గా సరిపోయే కెరీర్.. ఆప్టోమెట్రిస్టు. ప్రతి రెండు లక్షల మందికి ఒక్కరే: మనదేశంలో ఆప్టోమెట్రిస్టులకు డిమాండ్ పెరుగుతోంది. అభివృద్ధి చెందిన యూరోపియన్ దేశాల్లో ప్రతి 10 వేల మందికి ఒక కంటి వైద్యుడు ఉండగా.. భారత్‌లో మాత్రం ప్రతి రెండు లక్షల మందికి ఒకరు మాత్రమే ఉండడం గమనార్హం. ప్రస్తుతం మనదేశంలో సంస్థాగతంగా నిపుణులైన ఆప్టోమెట్రిస్టులు దాదాపు 5 వేల మంది మాత్రమే ఉన్నారని అంచనా. ఇక్కడి అవసరాలు తీరాలంటే మరో రెండు లక్షల మంది సుశిక్షితులైన కంటి వైద్యులు అవసరమని నిపుణులు చెబుతున్నారు. అవకాశాలు పుష్కలం: ఆప్టోమెట్రిస్టులకు ప్రస్తుతం చాలా అవకాశాలు న్నాయి. ఆధునిక జీవితంలో చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు అందరూ కంటి సంబంధిత వ్యాధుల బారిన పడుతున్నారు. ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల్లో కంటి వైద్యులకు ఎన్నో ఉద్యోగ అవకాశాలు అందుబాటులో ఉన్నాయి. సొంతంగానూ ప్రాక్టీస్ చేసుకోవచ్చు. నగరాలు, పట్టణాల్లో కొత్త ఆసుపత్రులు ఏర్పాటవుతుండడంతో కంటి వైద్యులకు డిమాండ్ పెరుగుతోంది. అమెరికా, యూరప్, ఆస్ట్రేలియా, కెనడా, న్యూజిలాండ్, మిడిల్ ఈస్టు వంటి దేశాల్లో ఆప్టోమెట్రిస్టులకు భారీ డిమాండ్ ఉంది. కొన్ని దేశాల్లో కళ్లద్దాలు, లెన్స్‌లు వంటివి విక్రయించే దుకాణాల్లో ఆప్టోమెట్రిస్టు తప్పనిసరిగా ఉండాల్సిందే. ఈ కెరీర్లోకి ప్రవేశించాలనుకొనేవారు బీఎస్సీ తర్వాత దేశ విదేశాల్లో ఎం.ఆప్ట్, ఎంఫిల్, ఎంఎస్ లేదా పీహెచ్డీ వంటి కోర్సులు అభ్యసించవచ్చు. వేతనాలు క్వాలిఫైడ్ ఆప్టోమెట్రిస్టులకు భారత్‌లో ప్రస్తుతం ఏడాదికి రూ.2.5 లక్షల నుంచి రూ.6 లక్షల వరకు వేతనం అందుతోంది. అనుభవంతో మంచిపేరు సంపా దిస్తే ఇంకా అధిక వేతనం అందు కోవచ్చు. సొంతంగా ప్రాక్టీస్ ప్రారంభిస్తే పనితీరును బట్టి ఆదాయం ఆర్జించొచ్చు. కావాల్సిన లక్షణాలు * రోగులకు సేవ చేయాలనే ఉన్నతాశయం. * పగలు రాత్రి ఎంతసేపైనా పనిచేయగల సామర్థ్యం * బృంద స్ఫూర్తిని ప్రదర్శించే నైపుణ్యం * ఈ రంగంలో ఎప్పటికప్పుడు వస్తున్న నూతన మార్పులను ఒడిసిపట్టుకోగల తెలివితేటలు ఆప్టోమెట్రీ కోర్సులను ఆఫర్ చేస్తున్న సంస్థలు: * డా. రాజేంద్రప్రసాద్ సెంటర్ ఫర్ ఆఫ్తాల్మిక్ సెన్సైస్, ఎయిమ్స్- న్యూఢిల్లీ వెబ్సైట్: http://www.aiims.edu/rpcentre.htm * సరోజినీ దేవి కంటి వైద్యశాల-హైదరాబాద్ * భారతీ విద్యాపీఠ్ మెడికల్ కాలేజీ-పుణె వెబ్సైట్: http://www.bharatividyapeeth.edu/ ఆప్టోమెట్రీషియన్ కోర్సు.. అవకాశాలు గతంలో కంటి అద్దాలతో సరిచేయదగిన సమస్యలనూ ఆఫ్తాల్మాలజిస్టులే చూసేవారు. కంటిై వెద్యవిజ్ఞానంలో గణనీయమైన పురోగతి రావడం, క్యాటరాక్ట్, కార్నియల్, స్క్వింట్, రెటినల్ సర్జరీలకు సంబంధించిన సబ్స్పెషాలిటీల ఆవిర్భావంతో అద్దాలతో సరిచేయదగిన సమస్యలను ఆప్టోమెట్రీషి యన్ చూస్తారు. అంటే సర్జరీ రంగంలో వచ్చిన సబ్స్పెషాలిటీస్ వల్ల ప్రాథమికమైన క్లినికల్ సమస్య లను ఆప్టోమెట్రీషియన్లు చూస్తున్నారన్న మాట. రోగిని (పేషెంట్‌ను) క్లినికల్‌గా పరీక్షించే సమయం లో రోగి ప్రాథమిక పరీక్షలు (ప్రిలిమినరీ ఎగ్జామి నేషన్స్), రోగి కంటివ్యాధి చరిత్ర (ఐ హిస్టరీ), కంటికి సంబంధించి అతడికి ఉన్న అలర్జీలు వంటివి పరీక్షిస్తారు. ఈ రంగంలో ప్రవేశించడానికి రెండు రకాల కోర్సులు అందుబాటులో ఉన్నాయి. మొదటి ది ఆప్టోమెట్రీషియన్ కోర్సు డిప్లొమా. దీన్ని రెండేళ్ల కోసం చదవాలి. రెండోది బీఎస్సీ ఆప్టోమెట్రీ. ఇది మూడేళ్ల కోర్సు. బీఎస్సీ ఆప్టోమెట్రీ లేదా ఫెలోషిప్ వంటివి చేసిన వారు మాత్రమే కంటి వైద్య రంగంలో నిర్వహించే కొంత పెద్ద పెద్ద పరీక్షలైన స్లిట్‌ల్యాంప్ ఎగ్జామినేషన్స్ వంటివి చేస్తున్నారు. ఈ పరీక్ష ద్వారా కంటి ముందు భాగాన్నీ, కంటి వెనక భాగమైన డిస్క్నూ పరీక్ష చేస్తారు. ఇక కంటి అద్దాలను సూచించే (ప్రిస్క్రయిబ్ చేసే) అర్హత ఆప్టోమెట్రీషియ న్దే. ఆప్టోమెట్రీషియన్ కోర్సుల్లో ఫెలోషిప్ చేసిన వారికి ఆస్ట్రేలియా, కెనడా వంటి దేశాల్లో రీసెర్చ్‌లో సైతం భాగస్వామ్యం వహించేందుకు మంచి అవకా శాలే ఉన్నాయి. కాంటాక్ట్‌లెన్స్‌లు, గ్లకోమా, రెటినల్ ట్రయల్స్ వంటి పరిశోధనల్లో వీరికీ కొన్ని అత్యాధు నిక సంస్థలు స్థానం కల్పిస్తున్నాయి. సాధారణంగా పేరున్న సంస్థల్లోనైతే ఆప్టోమెట్రీషియన్ కోర్సులు చేసిన వారికి తొలివేతనం రూ. 15,000 నుంచి ప్రారంభమవుతుంది. అయితే కొన్ని ఇంట్రాక్యులార్ ఉపకరణాలు తయారీ కంపెనీలు ఆప్టోమెట్రీషియన్ కోర్సులు చేసిన వారిని తమ మార్కెటింగ్ సేవలకోసం ఉపయోగించుకుంటున్నాయి. అలాం టి వారికి హెచ్చు స్థాయి వేతనాలు లభిస్తున్నాయి. అయితే విదేశాల్లో పరిశోధన, ఆప్టిమెట్రీ రంగాల్లోనూ పనిచేయాలనుకున్నవారు అక్కడి లెసైన్సింగ్ పరీక్షలో ఉత్తీర్ణులు కావాల్సి ఉంటుంది. - డాక్టర్ ఎమ్.ఎస్. శ్రీధర్, ఎం.డీ., మ్యాక్సీవిజన్ ఐ హాస్పిటల్, ఎ.ఎస్.రావు నగర్, సికింద్రాబాద్ -
జోడు కుదిరింది..!
ఏటా కళ్లజోళ్ల వ్యాపారం రూ. 21 వేల కోట్లు లైఫ్ స్టైల్లో భాగమైన కళ్లద్దాలు యువత, చిన్నారుల భాగస్వామ్యమే ఎక్కువ హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: గతంలో కళ్లజోడు అంటే 60 ఏళ్లపైబడిన వారికి మాత్రమే అవసరమైన వస్తువు. కానీ, నేడది ఆరేళ్ల పిల్లాడి నుంచి అరవై ఏళ్ల పైబడిన వారికి కూడా నిత్యావసర వస్తువుగా మారింది. ఇంకా చెప్పాలంటే మనిషి జీవితంలో కళ్లద్దాలు భాగమై పోయాయి కూడా. ఎంతలా మారిందంటే ఏటా అక్షరాలా రూ.21 వేల కోట్ల వ్యాపారం జరిగేంతలా. కాంటాక్ట్ లెన్సులు, ఇంట్రాక్యులర్ లెన్సులు, లెన్స్ క్లీనింగ్ సొల్యూషన్స్, ఫ్రేములు, సన్ గ్లాసులు.. వంటి కళ్లజోళ్ల మార్కెట్ దేశవ్యాప్తంగా ఎంతుందనే అంశంపై ఇటీవల అసోచామ్ ఓ సర్వే నిర్వహించింది. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా రూ.21 వేల కోట్ల వ్యాపారం జరుగుతుందని సర్వేలో తేలింది. 2015 చివరినాటికి ఇది రూ.43 వేల కోట్లకు చేరుకుంటుందని మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు. సెల్‌ఫోన్, ఏటీఎం, క్రెడిట్ కార్డుల్లాగే కళ్లద్దాలు కూడా నగరవాసుల జేబుల్లో తప్పనిసరిగా ఉండాల్సిన వస్తువుగా మారింది. నిజం చెప్పాలంటే కాలుష్యం విపరీతంగా ఉండే మెట్రో నగరాల్లో అయితే కళ్లద్దాలు నిత్యావసర వస్తువే. దుమ్ము, ధూళి, గాలి వంటి వాటి నుంచి కళ్లకు రక్షణ కవచంలా ఉంటుండడంతో చిన్నారుల నుంచి పెద్దల వరకు అందరూ కళ్లద్దాలను ఎక్కువగా వినియోగిస్తున్నారు. ‘‘గతంలో కంటి సమస్యలు తీవ్రమైతే తప్ప ఆసుపత్రులకు వచ్చే వారు కాదు. కానీ ఈ మధ్య కాలంలో కళ్ల రక్షణ, నేత్రదానం వంటి వాటిపై ప్రజల్లో విస్తృతమైన అవగాహన కలిగింది. దీంతో ఏ చిన్నపాటి కంటి సమస్య వచ్చినా వెంటనే వైద్యుల్ని సంప్రదిస్తున్నార ని’’ సరోజిని దేవీ కంటి ఆసుపత్రి కంటి వైద్యుడు రవీందర్ గౌడ్ ‘సాక్షి బిజినెస్ బ్యూరో’కు చెప్పారు. మా ఆసుపత్రికి వచ్చే వారిలో చిన్నపిల్లలు 10-20% ఉండగా, యువత 50% ఉంటారని చెప్పారాయన. మారుతున్న ఆహారపు అలవాట్లు, జీవనశైలితో 40 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరికీ కంటి చూపు మందగిస్తుందన్నారు. అందుకే 40 ఏళ్లు దాటి కంటి సమస్యతో ఆసుపత్రికి వచ్చిన ప్రతి ఒక్కరికీ కళ్లద్దాలను వినియోగించాలని వైద్యులు సూచిస్తున్నారు. దీంతో ఏటా కళ్లద్దాల వినియోగం గణనీయంగా పెరుగుతుంది. ‘‘ఏటా రూ.2.40 లక్షల వ్యాపారం జరుగుతుండగా.. ఇందులో 40% యువత, 20% చిన్నపిల్లల కళ్లద్దాలను విక్రయిస్తున్నామని’ భైరవ్ ఆప్టికల్స్ ఎండీ కేతన్ చెప్పారు. గతం లో కళ్లద్దాల గ్లాసులను వాటి జీవితకాలంలో రెండు సార్లకు మించి మార్చేవారు కాదు. కానీ ఇప్పుడు ఏడాదికోమారు మారుస్తున్నారు. ఇందులో యువత అయితే ఏడాదికోసారి, వృద్ధులైతే రెండు మూడేళ్లకోసారి మారుస్తున్నారని చెప్పారు. యువత, పిల్లలే ఎక్కువ..: కళ్లద్దాల వినియోగంలో యువత, చిన్నపిల్లలే ఎక్కువగా ఉంటున్నారు. కంప్యూటర్లు, టీవీల ప్రభావంతో రోజురోజుకూ కళ్లద్దాల వినియోగం పెరుగుతోంది. దీనికి తోడు మెట్రో నగరాల్లో దుమ్ము, ధూళి వంటి కాలుష్యమూ కారణమవుతోంది. హైదరాబాద్‌లో 2,500లకు పైగానే కళ్లద్దాల దుకాణాలున్నాయి. ఇందులో 30 వేల మందికి పైగానే పనిచేస్తున్నారు. నగరంలో మొత్తం కళ్లద్దాల వ్యాపారంలో 70 శాతం కళ్లద్దాలు అమ్ముడవుతుండగా 30 శాతం కాంటాక్ట్ లెన్స్‌ల వ్యాపారముంటోంది. కాంటాక్ట్ లెన్స్‌ల వినియోగంలో 10-20% యువత ఉంటుందని కేతన్ చెప్పారు. కళ్లజోడుతో పనిలేకుండా కనుగుడ్డుపై సులువుగా అమర్చుకునేవి కాంటాక్ట్ లెన్స్‌లు. వీటిలో రోజుకు, నెలకు, ఏడాదికోమారు మార్చుకునేవీ ఉంటాయి. యువత వీటిపై మక్కువ చూపుతున్నారు. 100 మంది కస్టమర్లలో 15 మంది వీటిని కోరుతున్నారన్నారు. వీటిని వాడుతున్న కస్టమర్ సగటు వయసు 15 ఏళ్లంటే అతిశయోక్తి కాదు. జత రూ.80కే లభిస్తుండటం విశేషం. కళ్లజోళ్ల మార్కెట్‌ను విభాగాల వారీగా చూస్తే సన్‌గ్లాసులు 13%, కాంటాక్ట్ లెన్స్‌లు 4%, ఇంప్లాంటెబుల్ కాంటాక్ట్ లెన్స్ 16%, లసిక్ 5%, ఫ్రేములు 11%, కళ్లద్దాల లెన్స్‌లు 51%గా ఉంటుందన్నారాయన. లెగసీ, రెబాన్, వాక్, పోలిస్, యునెటైడ్ కలర్ బెనటన్, ఐడీ, ఫాస్ట్‌ట్రాక్ వంటి దేశ, విదేశీ బ్రాండ్లు యువతను ఎక్కువగా ఆక ర్షిస్తున్నాయి. ఊరిస్తున్న మార్కెట్... దేశంలో ఏటా కళ్లద్దాల మార్కెట్ 30%, కాంటాక్ట్ లెన్స్ మార్కెట్ 25% వృద్ధి చెందుతోందని అసోచామ్ నివేదిక పేర్కొంది. ఏటా కళ్లద్దాల వ్యాపారం రూ.8,500 కోట్లు, కాం టాక్ట్ లెన్స్‌లు రూ.700 కోట్లు, కళ్లద్దాల లెన్స్‌లు రూ.45 కోట్లు, సన్‌గ్లాసులు రూ. 2,200 కోట్లు, కళ్లద్దాల ఫ్రేములు రూ.5,200 కోట్ల మార్కెట్ జరుగుతుందని అంచనా. రేటెంతైనా ఓకే.. కళ్లద్దాల ఎంపికలో రేటెంతైనా నగరవాసులు లెక్కచేయట్లేదు. కళ్లజోడులో వాడే అద్దాన్ని రెసిలియెన్స్, పాలీకొర్బొనేట్, ట్రైవిక్స్, ప్లాస్టిక్‌తో పాటు గాజుతో తయారుచేస్తారు. వీటి ధర రూ.100 నుంచి లక్షకు పైగానే ఉం టుంది. ఇక ఫ్రేముల్లో హాఫ్, రిమ్లెస్, షెల్ వంటివి ఉన్నాయి. ఆసియా బ్రాండ్లయితే రూ. 500 నుంచి రూ. 10 వేలకు పైన, అంతర్జాతీయ బ్రాండ్లయితే రూ.4 వేల నుంచి రూ.5 లక్షల వరకు పలుకుతున్నాయి. స్పోర్టీ, ఏవియేటర్, వేవ్ ఫై వెరైటీలతో సన్‌గ్లాసులు రూ.2 లక్షల వరకు లభిస్తున్నాయి. ఇందులో యూవీ ప్రొటెక్టివ్ పోలరైజ్డ్, డే అండ్ నైట్, పవర్ సన్‌గ్లాసెస్ వంటి వెరైటీలున్నాయి. -
ఆవిష్కరణం : కళ్లద్దాలు... కొత్తవేం కాదండీ!
ఇప్పుడు మనం బహువిధాలుగా ఉపయోగించుకొంటున్న కళ్లజోళ్లు.. మొదట ఏ ఉపయోగం కోసం వాడారు అనే విషయం గురించి శోధిస్తే మూలాలు ఈజిప్టులో కనిపిస్తాయి. క్రీస్తుపూర్వం ఐదో శతాబ్దంలోనే ఈజిప్టు నాగరికతలో కళ్లజోళ్ల ప్రస్తావన ఉంది. అయితే వారు ఎందుకోసం ఉపయోగించారు? అనేదానిపై స్పష్టత లేదు. యూరోపియన్ చరిత్రలోనూ వీటి ప్రస్తావన ఉంది. రోమ్ను పాలించిన నీరో చక్రవర్తికి గురువైన సెనెకా ది యంగర్ కళ్ల జోళ్ల గురించి గ్రంథస్తం చేశాడు. ఆయన క్రీస్తు శకం ఒకటో శతాబ్దానికి చెందిన వారు. ‘‘రసాయనం నింపిన అద్దాలను కళ్లకు పెట్టుకొని చూడటం ద్వారా అక్షరాలు చాలా పెద్దవిగా కనిపిస్తాయి..’’ అని యంగర్ తన గ్రంథం ఒకదానిలో పేర్కొన్నాడు. దీన్ని బట్టి మొదట దృష్టిలోపాన్ని సవరించడానికి, చిన్న సైజులో రాసి ఉన్న అక్షరాలను చదువుకోవడానికి అద్దాలను ఉపయోగించారని అర్థం చేసుకోవచ్చు. ఆ తర్వాత చాలా మంది యూరోపియన్ గ్రంథకర్తలు కళ్ల జోళ్ల గురించి తమ రాతల్లో ప్రస్తావించారు. వీరందరూ ‘‘అక్షరాలను పెద్దవిగా చూపించే’’ కళ్ల జోళ్ల గురించి మాత్రమే చర్చించారు. క్రీస్తు శకం 12 వ శతాబ్దం వరకూ వాటి వినియోగం ఎలా ఉందో అంచనా వేయలేం కానీ.. భూతద్దంలా ఒక చేత్తో పట్టుకుని ఉపయోగించేవారని తెలుస్తోంది. ఇక 12 శతాబ్దంలోనే చైనీయులు సన్ గ్లాసెస్ ఉపయోగించినట్టు చారిత్రక ఆధారాలున్నాయి. అయితే కళ్లజోడు జీవన శైలిలో భాగం అయినది, దృష్టి సంబంధ సమస్యలను అధిగమించడానికి ఒక మార్గంగా మారింది మాత్రం 16, 17 వ శతాబ్దాల్లోనే. అప్పుడే బయోఫోకల్ గ్లాసెస్ కూడా అందుబాటులోకి వచ్చాయి. అలాగే ఐ ప్రొటెక్షన్ కోసం కూడా కళ్లజోడు ఉత్తమమైనవిగా మారాయి.