కంటి చూపునిచ్చే ఆప్టోమెట్రిస్టు | Using Optometrists can be help to check eye contact | Sakshi
Sakshi News home page

కంటి చూపునిచ్చే ఆప్టోమెట్రిస్టు

Published Sat, Jun 28 2014 3:02 AM | Last Updated on Sat, Sep 2 2017 9:27 AM

కంటి చూపునిచ్చే ఆప్టోమెట్రిస్టు

కంటి చూపునిచ్చే ఆప్టోమెట్రిస్టు

అప్‌కమింగ్ కెరీర్: సర్వేంద్రియానాం నయనం ప్రధానం.. మనిషికి అన్ని ఇంద్రియాల్లోకెల్లా కళ్లే ముఖ్యం. కంటిచూపు లేకపోతే జీవితం అంధకారమయం. కటిక చీకటి తప్ప వెలుగులు వీక్షించలేం. కంటిచూపు విషయంలో తాజా గణాంకాలు ప్రమాద ఘంటికలను మోగిస్తున్నాయి. ప్రపంచంలోని ప్రతి ముగ్గురు అంధుల్లో ఒకరు భారతీయులేనని తాజా అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. దేశంలో లక్షలాది మంది కంటి సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారు. అంధులకు చూపు రప్పించి, సుందర లోకాన్ని చూపించి, వారి జీవితాల్లో వెలుగులు పూయించాలనే ఆశయం ఉన్నవారికి సరిగ్గా సరిపోయే కెరీర్.. ఆప్టోమెట్రిస్టు.
 
 ప్రతి రెండు లక్షల మందికి ఒక్కరే: మనదేశంలో ఆప్టోమెట్రిస్టులకు డిమాండ్ పెరుగుతోంది. అభివృద్ధి చెందిన యూరోపియన్ దేశాల్లో ప్రతి 10 వేల మందికి ఒక కంటి వైద్యుడు ఉండగా.. భారత్‌లో మాత్రం ప్రతి రెండు లక్షల మందికి ఒకరు మాత్రమే ఉండడం గమనార్హం. ప్రస్తుతం మనదేశంలో సంస్థాగతంగా నిపుణులైన ఆప్టోమెట్రిస్టులు దాదాపు 5 వేల మంది మాత్రమే ఉన్నారని అంచనా. ఇక్కడి అవసరాలు తీరాలంటే మరో రెండు లక్షల మంది సుశిక్షితులైన కంటి వైద్యులు అవసరమని నిపుణులు చెబుతున్నారు.
అవకాశాలు పుష్కలం: ఆప్టోమెట్రిస్టులకు ప్రస్తుతం చాలా అవకాశాలు న్నాయి. ఆధునిక జీవితంలో చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు అందరూ కంటి సంబంధిత వ్యాధుల బారిన పడుతున్నారు.
 
 ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల్లో కంటి వైద్యులకు ఎన్నో ఉద్యోగ అవకాశాలు అందుబాటులో ఉన్నాయి. సొంతంగానూ ప్రాక్టీస్ చేసుకోవచ్చు. నగరాలు, పట్టణాల్లో కొత్త ఆసుపత్రులు ఏర్పాటవుతుండడంతో కంటి వైద్యులకు డిమాండ్ పెరుగుతోంది. అమెరికా, యూరప్, ఆస్ట్రేలియా, కెనడా, న్యూజిలాండ్, మిడిల్ ఈస్టు వంటి దేశాల్లో ఆప్టోమెట్రిస్టులకు భారీ డిమాండ్ ఉంది. కొన్ని దేశాల్లో కళ్లద్దాలు, లెన్స్‌లు వంటివి విక్రయించే దుకాణాల్లో ఆప్టోమెట్రిస్టు తప్పనిసరిగా ఉండాల్సిందే. ఈ కెరీర్‌లోకి ప్రవేశించాలనుకొనేవారు బీఎస్సీ తర్వాత దేశ విదేశాల్లో ఎం.ఆప్ట్, ఎంఫిల్, ఎంఎస్ లేదా పీహెచ్‌డీ వంటి కోర్సులు అభ్యసించవచ్చు.
 
 వేతనాలు
 క్వాలిఫైడ్ ఆప్టోమెట్రిస్టులకు భారత్‌లో ప్రస్తుతం ఏడాదికి రూ.2.5 లక్షల నుంచి రూ.6 లక్షల వరకు వేతనం అందుతోంది. అనుభవంతో మంచిపేరు సంపా దిస్తే ఇంకా అధిక వేతనం అందు కోవచ్చు. సొంతంగా ప్రాక్టీస్ ప్రారంభిస్తే పనితీరును బట్టి ఆదాయం ఆర్జించొచ్చు.  
 
 కావాల్సిన లక్షణాలు
*    రోగులకు సేవ చేయాలనే ఉన్నతాశయం.
*   పగలు రాత్రి ఎంతసేపైనా  పనిచేయగల సామర్థ్యం  
*   బృంద స్ఫూర్తిని ప్రదర్శించే నైపుణ్యం
*   ఈ రంగంలో ఎప్పటికప్పుడు వస్తున్న నూతన మార్పులను ఒడిసిపట్టుకోగల తెలివితేటలు
 
ఆప్టోమెట్రీ కోర్సులను ఆఫర్ చేస్తున్న సంస్థలు:
*   డా. రాజేంద్రప్రసాద్ సెంటర్ ఫర్ ఆఫ్తాల్మిక్ సెన్సైస్, ఎయిమ్స్- న్యూఢిల్లీ
 వెబ్‌సైట్: http://www.aiims.edu/rpcentre.htm
*   సరోజినీ దేవి కంటి వైద్యశాల-హైదరాబాద్
*   భారతీ విద్యాపీఠ్ మెడికల్ కాలేజీ-పుణె
 వెబ్‌సైట్: http://www.bharatividyapeeth.edu/
 
 ఆప్టోమెట్రీషియన్ కోర్సు.. అవకాశాలు
 గతంలో కంటి అద్దాలతో సరిచేయదగిన సమస్యలనూ ఆఫ్తాల్మాలజిస్టులే చూసేవారు.  కంటిై వెద్యవిజ్ఞానంలో గణనీయమైన పురోగతి రావడం, క్యాటరాక్ట్, కార్నియల్, స్క్వింట్, రెటినల్ సర్జరీలకు సంబంధించిన సబ్‌స్పెషాలిటీల ఆవిర్భావంతో అద్దాలతో సరిచేయదగిన సమస్యలను ఆప్టోమెట్రీషి యన్ చూస్తారు. అంటే సర్జరీ రంగంలో వచ్చిన సబ్‌స్పెషాలిటీస్ వల్ల ప్రాథమికమైన క్లినికల్ సమస్య లను ఆప్టోమెట్రీషియన్లు చూస్తున్నారన్న మాట. రోగిని (పేషెంట్‌ను) క్లినికల్‌గా పరీక్షించే సమయం లో రోగి ప్రాథమిక పరీక్షలు (ప్రిలిమినరీ ఎగ్జామి నేషన్స్), రోగి కంటివ్యాధి చరిత్ర (ఐ హిస్టరీ), కంటికి సంబంధించి అతడికి ఉన్న అలర్జీలు వంటివి పరీక్షిస్తారు. ఈ రంగంలో ప్రవేశించడానికి రెండు రకాల కోర్సులు అందుబాటులో ఉన్నాయి. మొదటి ది ఆప్టోమెట్రీషియన్ కోర్సు డిప్లొమా. దీన్ని రెండేళ్ల కోసం చదవాలి. రెండోది బీఎస్సీ ఆప్టోమెట్రీ. ఇది మూడేళ్ల కోర్సు.  బీఎస్సీ ఆప్టోమెట్రీ లేదా ఫెలోషిప్ వంటివి చేసిన వారు మాత్రమే కంటి వైద్య రంగంలో నిర్వహించే కొంత పెద్ద పెద్ద పరీక్షలైన స్లిట్‌ల్యాంప్ ఎగ్జామినేషన్స్ వంటివి చేస్తున్నారు.
 
 ఈ పరీక్ష ద్వారా కంటి ముందు భాగాన్నీ, కంటి వెనక భాగమైన డిస్క్‌నూ పరీక్ష చేస్తారు. ఇక కంటి అద్దాలను సూచించే (ప్రిస్క్రయిబ్ చేసే) అర్హత ఆప్టోమెట్రీషియ న్‌దే. ఆప్టోమెట్రీషియన్ కోర్సుల్లో ఫెలోషిప్ చేసిన వారికి ఆస్ట్రేలియా, కెనడా వంటి దేశాల్లో రీసెర్చ్‌లో సైతం భాగస్వామ్యం వహించేందుకు మంచి అవకా శాలే ఉన్నాయి. కాంటాక్ట్‌లెన్స్‌లు, గ్లకోమా, రెటినల్ ట్రయల్స్ వంటి పరిశోధనల్లో వీరికీ కొన్ని అత్యాధు నిక సంస్థలు స్థానం కల్పిస్తున్నాయి. సాధారణంగా పేరున్న సంస్థల్లోనైతే ఆప్టోమెట్రీషియన్ కోర్సులు చేసిన వారికి తొలివేతనం రూ. 15,000 నుంచి ప్రారంభమవుతుంది. అయితే కొన్ని ఇంట్రాక్యులార్ ఉపకరణాలు తయారీ కంపెనీలు ఆప్టోమెట్రీషియన్ కోర్సులు చేసిన వారిని తమ మార్కెటింగ్ సేవలకోసం ఉపయోగించుకుంటున్నాయి. అలాం టి వారికి హెచ్చు స్థాయి వేతనాలు లభిస్తున్నాయి. అయితే విదేశాల్లో పరిశోధన, ఆప్టిమెట్రీ రంగాల్లోనూ పనిచేయాలనుకున్నవారు అక్కడి లెసైన్సింగ్ పరీక్షలో ఉత్తీర్ణులు కావాల్సి ఉంటుంది.
- డాక్టర్ ఎమ్.ఎస్. శ్రీధర్, ఎం.డీ.,
మ్యాక్సీవిజన్ ఐ హాస్పిటల్,
ఎ.ఎస్.రావు నగర్,  సికింద్రాబాద్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement