eye test
-
డ్రైవర్లకు ఉచిత కంటి పరీక్షలు
చిట్యాల: రోడ్డు ప్రమాదాలకు గల కారణాల్లో డ్రైవర్లకు దృష్టిలోపం ఉండటం కూడా ఒకటి. చాలామంది డ్రైవర్లకు అవగాహన లేక కంటి పరీక్షలు చేయించుకోరు. దాంతో వారికి దృష్టిలోపం ఉన్న విషయం వారికే తెలియదు. ఈ విషయాన్ని గుర్తించిన రోడ్డు రవాణా, పోలీస్ శాఖల అధికారులు.. వైద్యారోగ్య సహకారంతో డ్రైవర్లకు రహదారుల వెంట ఉచితంగా కంటిపరీక్షలు నిర్వహించి, అవసరమైనవారికి వెంటనే కళ్లద్దాలు అందిస్తున్నారు. రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో భాగంగా సడక్ సురక్ష అభియాన్ కార్యక్రమంలో రాష్ట్రంలో మొదటిసారి నల్లగొండ జిల్లాలోని 65వ నంబర్ జాతీయ రహదారిపై ‘నల్లగొండ దృష్టి’పేరుతో ఈ కార్యక్రమం చేపట్టారు. చిట్యాల మండలం వట్టిమర్తి గ్రామ పరిధిలో జాతీయ రహదారి పక్కన ఉన్న ఓ దాబా వద్ద ఏర్పాటు చేసిన కంటి వైద్య శిబిరాన్ని రోడ్లు, భవనాలశాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఆదివారం ప్రారంభించారు. వెంటనే అద్దాలు.. కంటి పరీక్షల శిబిరంలో పరీక్ష చార్ట్‌ను ఆహార పదార్థాల మెనూ కార్డు మాదిరిగా ఏర్పాటు చేశారు. రోటి, పరోటా, తందూరి, దాల్ వంటి పేర్లను హిందీలో రాశారు. ఆదివారం వివిధ రాష్ట్రాలకు చెందిన 82 మంది డ్రైవర్లకు కంటి పరీక్షలు నిర్వహించారు. వారిలో 32 మందికి కంటి అద్దాలు అందజేశారు. వీరిలో చాలామంది మొదటిసారి కంటి పరీక్షలు చేయించుకోవటం విశేషం. రాష్ట్రంలోని అన్ని జాతీయ రహదారుల వెంట ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని మంత్రి వెంకట్‌రెడ్డి తెలిపారు. కోమటిరెడ్డి ప్రతీక్ రెడ్డి ఫౌండేషన్ ద్వారా అవసరమైన సహకారం అందజేస్తామని హామీ ఇచ్చారు. -
మసకబారిన కంటి వెలుగు
చంద్రబాబు కూటమి ప్రభుత్వ అనాలోచిత నిర్ణయం స్కూలు పిల్లలకు, పేద వృద్ధులకు అందించే ‘కంటి వెలుగు’ కార్యక్రమాన్ని దెబ్బతీసింది. గత ఐదేళ్లలో రాష్ట్రంలోని ప్రతి విద్యారి్థకీ, పేదలకు కంటి పరీక్షలు నిర్వహించి, అవసరమైన సూచనలు, కళ్లద్దాలు, చికిత్స అందించిన వైఎస్సార్ కంటి వెలుగు కార్యక్రమం ఇప్పుడు కుంటుపడింది.కూటమి ప్రభుత్వం రాగానే ఇటీవలి వరకు ఈ కార్యక్రమం కింద సేవలందించిన ఆప్తాల్మిక్ అసిస్టెంట్లను తొలగించడంతోపాటు కమ్యూనిటీ హెల్త్ సెంటర్లలో (సీహెచ్‌సీల్లో) ఉండే ‘ సీఎం ఈ–ఐ’ కేంద్రాలను కూడా మూసివేసింది. దీంతో ఆ ఉద్యోగుల కుటుంబాలు రోడ్డునపడ్డాయి. కంటి వైద్యానికి విద్యార్థులు, పేద ప్రజలు తీవ్ర అవస్తలు పడుతున్నారు. - సాక్షి, అమరావతిప్రత్యేకంగా డీఎస్సీ ద్వారా..వైఎస్ జగన్ ప్రభుత్వం కంటి వెలుగు కార్యక్రమం కోసమే ప్రత్యేకంగా డీఎస్సీ ద్వారా 108 మంది ఆప్తాల్మిక్ అసిస్టెంట్లను నియమించింది. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉండే ఆప్తాల్మిక్ అసిస్టెంట్లతో పాటు వీరు కూడా విద్యార్థులకు కంటి పరీక్షలు చేసేవారు. వీరి సేవలను జూలై 30వ తేదీ నుంచి చంద్రబాబు ప్రభుత్వం నిలిపివేసింది. తమను కొనసాగించాలని వీరందరూ డిప్యూటీ సీఎం, మంత్రులను కోరినా పట్టించుకోలేదు. ఆగస్టు నెల నుంచి కేవలం ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉన్న 208 మంది ఆప్తాల్మిక్ అసిస్టెంట్లతోనే హైసూ్కళ్లలో విద్యార్థులకు పరీక్షలు చేయిస్తోంది. ఒక్కో ఆప్తాల్మిక్ అసిస్టెంట్‌కు రోజుకు 200 మంది విద్యార్థులను స్క్రీనింగ్ చేయాలని పలు జిల్లాల్లో లక్ష్యాలను నిర్దేశించారు. ఇది వారికి తలకు మించిన భారంగా మారింది. సాధారణంగా ఒక విద్యారి్థని పరీక్షించడానికి కనీసం పావుగంట పడుతుంది. ఈ లెక్కన రోజుకు 60 నుంచి 80 మందిని పరీక్షించడమే కష్టం. అలాంటిది 200 మందిని ఎలా పరీక్షించగలుగుతామని వారు వాపోతున్నారు. చాలా చోట్ల అరకొరగా పరీక్షలు చేసి మమ అనిపించేస్తుండటంతో దీని ప్రభావం విద్యార్థుల భవిష్యతపై పడుతోంది. మరోపక్క కంటి వైద్యం గురించి తెలియని ఉపాధ్యాయులతో కూడా కంటి పరీక్షలు చేయించేస్తున్నారు. పిల్లల్లో మెల్ల కన్ను, శుక్లాలు, గ్లకోమా, పుట్టుకతో, పౌష్టికాహార లోపంతో వచ్చే దృష్టిలోపాలను 12 ఏళ్లలోపే గుర్తించి, వాటి నివారణకు కళ్లద్దాలు, సర్జరీలు చేయాల్సి ఉంటుంది. నిపుణులైన ఆప్తాల్మిక్ అసిస్టెంట్లే ఈ లోపాలను పసిగట్టడానికి వీలుంటుంది. లేని పక్షంలో ఈ సమస్యలు తీవ్రమై భవిష్యత్తుకు ప్రమాదమని నిపుణులు చెబుతున్నారు.సీహెచ్‌సీల్లో స్క్రీనింగ్ బంద్అపోలో సంస్థతో ఒప్పందం ముగిసిందనే కారణంతో రాష్ట్రవ్యాప్తంగా 115 సీహెచ్‌సీల్లోని ఈ–ఐ కేంద్రాలను కూటమి ప్రభుత్వం మూసివేసింది. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. గత ప్రభుత్వ విన్నపం మేరకు కేంద్ర ప్రభుత్వం నేషనల్ హెల్త్ మిషన్ పరిధిలో 91 ఆప్తాల్మిక్ అసిస్టెంట్ పోస్టులను ఎన్నికల సమయంలో మంజూరు చేసింది. ఇప్పుడున్న ప్రభుత్వం ఈ పోస్టులను భర్తీ చేయకుండా తాత్సారం చేస్తోంది. దీంతో ప్రజలు కూడా కంటి పరీక్షలు జరగక ఇబ్బందులు పడుతున్నారు.91 పోస్టుల్లో మమ్మల్ని సర్దుబాటు చేయాలి వైఎస్సార్ కంటి వెలుగు కార్యక్రమంలో సేవలందించిన మమ్మల్ని జూన్ నెల నుంచి ఆపేశారు. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన నాటి నుంచి వేతనాలు కూడా ఇవ్వడంలేదు. మా కుటుంబాలు రోడ్డున పడ్డాయి. ఎన్హెచ్ఎం కింద రాష్ట్రానికి మంజూరైన 91 పోస్టుల్లో మమ్మల్ని సర్దుబాటు చేయాలి. విద్యార్థులకు కంటి పరీక్షల కోసం నైపుణ్యం లేని ఉపాధ్యాయులను వాడుతున్నారు. ప్రత్యేకంగా కంటి పరీక్షల కోసమే నియమించిన మా సేవలను వినియోగించుకుంటే పేద ప్రజలకు మేలు జరుగుతుంది. – తలారి ఆనంద్‌కుమార్, రాష్ట్ర ఆప్తాల్మిక్ అసిస్టెంట్ల సంఘం కార్యదర్శి -
కోటిన్నరకు చేరువలో కంటి వెలుగు పరీక్షలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కంటి వెలుగు కార్యక్రమం కోటిన్నర కంటి పరీక్షలకు చేరువైంది. ఈ ఏడాది జనవరి 18న ప్రారంభమైన రెండో విడత కంటి వెలుగు కార్యక్రమం కింద 1,42,30,576 మందికి కంటి వైద్య పరీక్షలు చేశారు. వీరిలో 20.69లక్షల మందికి రీడింగ్ అద్దాలు పంపిణీ చేశారు. ఇప్పటివరకు 10,285 గ్రామ పంచాయతీ వార్డులు, 3,221 మున్సిపల్ వార్డుల్లో ఈ కార్యక్రమం నిర్వహించినట్టు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ వెల్లడించింది. ప్రభుత్వ సెలవు దినాలు, పండుగలు మినహాయించి ప్రభుత్వ పనిదినాలకు అనుగుణంగా కొనసాగిస్తూ వచ్చిన ఈ రెండో విడత కార్యక్రమం జూన్ 15వ తేదీ నాటికి వందరోజులు పూర్తి చేసుకోనున్నట్లు రాష్ట్ర వైద్య,ఆరోగ్య శాఖ తెలిపింది. దగ్గరి చూపు సమస్యలున్న వారే ఎక్కువ కంటివెలుగు కార్యక్రమంలో అత్యధికంగా దగ్గరి చూపు సమస్యలున్న వారే గుర్తించబడుతున్నారు. వారికి తక్షణమే రీడింగ్ అద్దాలను పంపిణీ చేస్తున్నట్లు వైద్య శాఖ వర్గాలు చెబుతున్నాయి. దగ్గరి చూపు సమస్యలున్న వారిలో అత్యధికులు 40 ఏళ్ల వయసు పైబడిన వారున్నారు. ఇవి కాకుండా కంటి సమస్యలతో వస్తున్న చాలా మందికి చుక్కల మందులతో పాటు విటమిన్ ఏ, డీ, బీ కాంప్లెక్స్ టాబ్లెట్లు పంపిణీ చేస్తున్నారు. కాగా, 50 ఏళ్లు పైబడిన వారు అత్యధికంగా మోతబిందు(కాటరాక్ట్) సమస్యతో బాధపడుతున్నారు. శస్త్ర చికిత్స అవసరమైన వారికి చికిత్స చేసే సమయాన్ని సెల్‌ఫోన్ ద్వారా సమాచారం చేరవేస్తున్నామని వైద్య శాఖ అధికారులు చెబుతున్నారు. ఇదివరకే శస్త్ర చికిత్స పూర్తయి ఇతర సమస్యలతో బాధపడుతున్న వారికి ఎప్పటికప్పుడు వైద్యులు సలహాలు, సూచనలు అందజేస్తున్నారు. -
మలిసంధ్యలో ‘వెలుగు’రేఖ
సాక్షి, అమరావతి: చూపు లేకపోతే లోకమంతా చీకటే. చూపు కొద్దిగా మందగించినా జీవనం కష్టమవుతూ ఉంటుంది. అందుకే వైఎస్సార్సీపీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రాధాన్యతాంశాల్లో రాష్ట్ర ప్రజల కంటి చూపు పరిరక్షణకు కూడా చోటిచ్చారు. రాష్ట్రంలోని ప్రజలందరికీ కంటి వైద్య పరీక్షలు చేయాలని నిర్ణయించారు. ఇందుకోసం ‘వైఎస్సార్ కంటి వెలుగు’ పథకాన్ని ప్రవేశపెట్టారు. 2019 అక్టోబర్ 10న శ్రీకారం చుట్టిన ఈ కార్యక్రమం పిల్లలు, వృద్ధులకు వరమే అయింది. ఆరు దశల్లో చేపట్టిన ఈ కార్యక్రమంలో తొలి రెండు దశల్లో ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో చదువుతున్న 66.17 లక్షల మంది పిల్లలను పరీక్షించారు. వీరిలో 1.58 లక్షల మందికి ఉచితంగా కళ్లద్దాలు పంపిణీ చేశారు. 60 ఏళ్లు పైబడిన 56,88,424 మంది వృద్ధులకు కంటి పరీక్షల లక్ష్యంతో 2020 ఫిబ్రవరిలో మూడో దశ ప్రారంభించారు. ఈ కార్యక్రమం వడివడిగా జరుగుతోంది. 361 వైద్య బృందాలు నిత్యం పరీక్షలు నిర్వహిస్తున్నాయి. రోజుకు సగటున 2,500 మందికి పరీక్షలు చేస్తున్నారు. సుమారు 900 కేటరాక్ట్ (శుక్లాలు) ఆపరేషన్లు చేస్తున్నారు. ఇప్పటివరకు 33.90 శాతం అంటే 19,28,511 మంది వృద్ధులకు వైద్య పరీక్షలు చేశారు. వీరిలో చిన్న సమస్యలు ఉన్న 8,51,772 మందికి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. 9,22,373 మందికి కళ్లద్దాలు అవసరం ఉండగా 7,90,704 మందికి ఉచితంగా పంపిణీ పూర్తయింది. 1,54,366 మంది వృద్ధులు శుక్లాల సమస్యతో బాధపడుతున్నట్టు వైద్య బృందాలు గుర్తించాయి. వీరిలో 1,44,476 మందికి ప్రభుత్వం ఉచితంగా కేటరాక్ట్ సర్జరీలు చేయించింది. సెప్టెంబర్‌లోగా వృద్ధులందరికీ పరీక్షలు పూర్తి కంటి వెలుగు వైద్య పరీక్షలు, సర్జరీల్లో వేగం మరింతగా పెంచుతాం. ఈ ఏడాది సెప్టెంబర్ నాటికి వృద్ధులందరికీ కంటి పరీక్షలు పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించింది. ఈ లోగానే పరీక్షలు పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నాం. – డాక్టర్ ఆర్ఆర్ రెడ్డి, రాష్ట్ర అంధత్వ నివారణ జేడీ, కంటివెలుగు సంస్థ రూపాయి ఖర్చు లేకుండా వయసు పైబడటంతో కంటి చూపు మందగించింది. ప్రభుత్వం వైఎస్సార్ కంటి వెలుగు కింద మా పీహెచ్సీలో గత ఏడాది ఉచితంగా కంటి పరీక్షలు చేసింది. ఉచితంగా ఆపరేషన్ చేశారు. తర్వాత కళ్లద్దాలు ఇచ్చారు. ప్రస్తుతం బాగా కనిపిస్తోంది. ఒక్క రూపాయి ఖర్చు లేకుండా ఆపరేషన్ చేశారు. నాలాంటి ఎంతో మంది పేదలకు ఆర్థిక భారం లేకుండా చీకట్లు తొలగిస్తున్నారు. – గోపిశెట్టి బ్రహ్మయ్య, చాగంటివారిపాలెం, ముప్పాళ్ల మండలం, పల్నాడు జిల్లా -
అవ్వాతాతలకు వచ్చేనెలలో కళ్లద్దాలు
సాక్షి, వైఎస్సార్, కడప : డాక్టర్ వైఎస్సార్ కంటి వెలుగు పథకం మళ్లీ వేగం అందుకుంది. కరోనా నేపథ్యంలో తాత్కాలికంగా నిలిపి వేసిన ప్రక్రియను కొనసాగిస్తున్నారు. కళ్లద్దాలు పంపిణీ చేయడానికి, ఇతర సమస్యలకు చికిత్సను అందించడానికి ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. మొదటి దశ గతేడాది అక్టోబర్ 10 వరకు ..రెండవ దశ నవంబర్ నుంచి డిసెంబర్ 31వ తేదీ వరకు అమలు చేసింది. జిల్లా వ్యాప్తంగా ఉన్న 4,450 (1 నుంచి 10వ తరగతి) పాఠశాలల్లో 4,12,301 మంది విద్యార్ధులకు కంటి పరీక్షలు నిర్వహించారు. 32,800 విద్యార్దులకు కంటి వ్యాధులు ఉన్నట్లుగా గుర్తించారు. మళ్లీ కంటి వైద్య నిపుణులు బాధిత విద్యార్ధులకు కంటి పరీక్షలు నిర్వహించారు. వారిలో 13,600 మందికి కంటి అద్దాలు అవసరమని గుర్తించారు. వారందరికీ కళ్లద్దాలను పంపిణీ చేశారు. 2,600 మందికి ఇతర కంటి లోపాలను గుర్తించి చికిత్సను అందించారు.మిగతా విద్యార్ధులకు ఎలాంటి సమస్యలు లేవని నిర్ధారించారు. మూడో దశకింద 60 ఏళ్లకు పైబడిన అవ్వాతాతలకు ఈ ఏడాది ఫిబ్రవరి 18 నుంచి మార్చి 20 వరకు కంటి పరీక్షలు నిర్వహించారు. 10 డివిజన్లలో 14,780 మందికి పరీక్షలు నిర్వహించారు. 9,028 మందికి కళ్లద్దాలు అవసరమని నిర్ధారించారు. 4,164 మందికి కంటి (ఐఓఎల్) ఆపరేషన్లు చేయాలని రెఫర్ చేశారు. ఇప్పటికే 302 మందికి ఆపరేషన్లు నిర్వహించారు. మిగిలిన 1,588 మందికి కంటి లోపాలు లేవని గుర్తించారు. కరోనా వైరస్ కారణంగా అప్పట్లో తాత్కాలికంగా పధకం ప్రక్రియను నిలిపి వేశారు. తాజాగా ప్రభుత్వం తీసుకున్న చర్యలతో అవ్వాతాతలకు కళ్లద్దాలు అందనున్నాయి. వైద్య నిపుణులు, వాలంటీర్ల ద్వారా ఇంటి వద్దకే వెల్లి కళ్లద్దాలను అందజేస్తారు. అవసరమైన వారికి కంటి ఆపరేషన్లను చేస్తారు. (ఇంటివద్దకే కళ్లద్దాలు) వచ్చే నెలలో కళ్లదాలు అందజేస్తాం 'అక్టోబర్ 1న ప్రపంచ దృష్టి దినోత్సవం సందర్భంగా అవ్వాతాతలకు కళ్లద్దాలు పంపిణీ చేయడానికి చర్యలు చేపడుతున్నాం. ఇంటి వద్దకే వెల్లి కళ్లద్దాలు పంపిణీ చేస్తాం. అలాగే అవసరమైన వారికి ఆపరేషన్లు చేయడానికి చర్యలు చేపడుతాం. ఈ పధకం ద్వారా వేలాది మందికి కంటి వెలుగు రావడమే ప్రభుత్వ సంకల్పం.' అని జిల్లా అంధత్వ నివారణ అధికారి డాక్టర్ రామిరెడ్డి తెలిపారు -
ఇంటివద్దకే కళ్లద్దాలు
సాక్షి, అమరావతి: ‘వైఎస్సార్ కంటివెలుగు’ పథకంలో భాగంగా విద్యార్థులకు నిర్వహించిన కంటి పరీక్షల్లో కళ్లద్దాలు అవసరమైన వారికి ఈనెలాఖరులోగా ఉచితంగా పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. కళ్లద్దాలను చిన్నారుల ఇంటి వద్దకే పంపడానికి అధికారులు సిద్ధం చేశారు. మార్చినెలలోనే ఈ కళ్లద్దాలు పంపిణీ చేయాల్సి ఉన్నా కోవిడ్–19 కారణంగా ఆ కార్యక్రమం వాయిదా పడింది. త్వరలో స్కూళ్లు తెరిచే అవకాశం ఉండటంతో ఆలోగా చిన్నారులకు ఉపాధ్యాయుల ద్వారా కళ్లజోళ్లు పంపిణీ చేయాలని భావిస్తున్నారు. అలాగే ఏఎన్ఎం, ఆశా కార్యకర్తల ద్వారా వృద్ధులకు కళ్లజోళ్ల పంపిణీకి ఏర్పాట్లు చేస్తున్నారు. లక్షలాదిమంది చిన్నారులకు, వృద్ధులకు కంటి పరీక్షలు చేసి కళ్లద్దాలు ఇవ్వడం దేశంలో ఒక్క ఆంధ్రప్రదేశ్‌లో మాత్రమే జరుగుతోందని అధికారులు పేర్కొన్నారు. ► రాష్ట్రంలో మొదటి, రెండో దశ కంటి వెలుగులో భాగంగా 60,393 స్కూళ్లలో 66,17,613 మంది విద్యార్థులకు కంటి పరీక్షలు నిర్వహించారు. ► వీరిలో 4.38 లక్షల మంది చిన్నారులకు చిన్న చిన్న సమస్యలు ఉన్నాయని, 1.58 లక్షల మందికి కళ్లద్దాలు అవసరమని వైద్యులు గుర్తించారు. ► మరో 55 వేల మందికి విజన్ కిట్లు పంపిణీ చేస్తున్నారు. ► మూడో దశ కంటి వెలుగులో భాగంగా 60 ఏళ్లు దాటిన 3,06,961 మంది వృద్ధులకు కంటి పరీక్షలు నిర్వహించగా 95,075 మందికి కళ్లజోళ్లు అవసరమని గుర్తించారు. ► వీరికి వచ్చే నెల మొదటి వారంలో కళ్లద్దాలు ఇవ్వాలని భావిస్తున్నారు. ఇప్పటికే కళ్లద్దాలు సిద్ధం చేశామని అధికారులు చెప్పారు. ► మూడో దశలో మరింత మంది వృద్ధులకు కంటి పరీక్షలు చేయాల్సి ఉంది. అయితే ఆ కార్యక్రమం కోవిడ్ కారణంగా వాయిదా పడింది. ► కళ్లద్దాలు ఆర్డర్ ఇచ్చాక కోవిడ్ పరిస్థితులు రావడం, కళ్లద్దాలు తయారుచేసే సంస్థలు కొంతకాలం మూతపడటం వల్ల వాటి పంపిణీ తాత్కాలికంగా వాయిదా పడింది. ► కాగా, మొదటి దశలో రూ.11.18 కోట్లు, రెండో దశలో రూ.12.65 కోట్లు, మూడో దశలో రూ. 6.60 కోట్లు వ్యయం అయ్యింది. -
కంటి పరీక్ష ఇక ఇంట్లోనే...
వయసుతోపాటు చూపు మందగించడం అందరికీ అనుభవమైన విషయమే. కళ్లజోళ్లతో ఆ చిక్కును కాస్తా దాటేస్తామనుకోండి. కాకపోతే తరచూ కళ్లు చెక్ చేయించుకోవడం, తగిన ప్రిస్క్రిప్షన్‌తో కళ్లజోళ్లు ఆర్డర్ చేయడం, వచ్చేదాకా పాతవాటితో సర్దుకుపోవడం కొంచెం చీకాకైన పనే. థ్యాంక్స్‌టు స్మార్ట్‌ఫోన్... ఇకపై ఆ సమస్య ఉండబోదు. ఓ బుల్లి పరికరం దాంతోపాటు పనిచేసే అప్లికేషన్‌తో ఎంచక్కా ఇంట్లోనే కళ్లు పరీక్షించుకునే అవకాశం కల్పిస్తోంది ఓ కంపెనీ. ఐక్యూ విజన్ చెక్ అని పిలుస్తున్న ఈ కొత్త పరికరం, ఆప్ అత్యాధునిక మెషీన్ లెర్నింగ్ ఆధారంగా పనిచేస్తాయి. కళ్లు చెక్ చేసుకోవాలనుకున్నప్పుడు పరికరాన్ని స్మార్ట్‌ఫోన్ కు బిగించుకోవడం.. కళ్లజోళ్లు తీసేసి ఒక్కో కంటికి దగ్గరగా పెట్టుకుని పరీక్ష చేసుకోవచ్చు. కళ్ల ముందు కనిపించే రెండు గీతలను ఒకదానిపై ఒకటి చేర్చేలా ఐక్యూ యంత్రంపై ఉన్న బటన్లను నొక్కుతూండటం ఒక్కటే మనం చేసే పని. కంటిలోని ప్రతి కోణం నుంచి వివరాలు సేకరించి మన దష్టి మాంద్యం తీవ్రత ఎంతన్నది అంకెల్లో చెప్పేస్తుంది ఈ యంత్రం. ఆన్లైన్లో డిజైన్ ఎంచుకుని, ప్రిస్క్రిప్షన్‌ను జోడిస్తే ఒకట్రెండు రోజుల్లో కొత్త కళ్లజోడు రెడీ! -
కోటి ‘కళ్ల’ చూపు ఎటు వైపు!
‘కంటి వెలుగు’పై టీఆర్ఎస్ భారీగా ఆశలు పెట్టుకుంది. ‘కారు’కు గెలుపుబాట చూపుతుందని భావిస్తోంది. ఆ పథకం కింద కంటి పరీక్షలు నిర్విఘ్నంగా కొనసాగుతుండటంతో లబ్ధిదారులు గుర్తు పెట్టుకొని అసెంబ్లీ ఎన్నికల్లో తమకు ఓటేస్తారని ఆ పార్టీ నేతలు, అభ్యర్థులు భావిస్తున్నారు. కంటి పరీక్షల సంఖ్య ఈ నెలాఖరులోగా కోటికి చేరుకోవచ్చని వైద్య, ఆరోగ్య శాఖ వర్గాలు తెలిపాయి. ఈ నెల 20వ తేదీ నాటికి 87.16 లక్షలమందికి కంటి పరీక్షలు చేశారు. రోజుకు సరాసరి 1.15 లక్షలమందికి పరీక్షలు చేస్తున్నారు. కేసీఆర్ ఆధ్వర్యంలోనే ఈ కార్యక్రమం సాగుతోందని గ్రామాల్లో విస్తృత ప్రచారం జరుగుతుండటంతో అది తమకు కలసి వస్తుందని టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. బడుగు, బలహీన వర్గాలే బాధితులు రాష్ట్రంలో ప్రతి ఒక్కరికీ కంటి పరీక్షలు నిర్వహించాలన్న ఉద్దేశంతో ఆగస్టు 15న ప్రభుత్వం కంటి వెలుగు కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వరకు 4,956 గ్రామాల్లో కంటి వెలుగు కార్యక్రమం నిర్వహించారు. అంటే సగం గ్రామాల్లో ఈ పథకం కింద కంటి పరీక్షలు పూర్తిచేశారు. ఈ పథకాన్ని అధికంగా పేదలు, బడుగు, బలహీన వర్గాల వారే ఉపయోగించుకుంటున్నారు. ఇప్పటివరకు కంటి పరీక్షలు చేయించుకున్నవారిలో బీసీలు 49.41 లక్షల (56.68%) మంది ఉండటం గమనార్హం. ఎస్సీలు 17.01, ఎస్టీలు 10.62 శాతం ఉన్నారు. మైనారిటీలు 5.17 శాతమున్నారు. అంటే దాదాపు 90శాతం వరకు ఆయా వర్గాలకు చెందినవారే ఉన్నారు. ఒక రకంగా చెప్పాలంటే ఏళ్లుగా తమ కళ్ల గురించి పట్టించుకున్న నాథుడే లేరని ఆయా వర్గాల ప్రజలు భావించేవారు. కంటి వెలుగు పరీక్షలతో ప్రభుత్వం తమకు ప్రయోజనం చేకూర్చిందన్న భావన వారిలో ఏర్పడింది. కళ్లు కనబడటంలేదని అనుకోవడమే కానీ, ఆసుపత్రికి వెళ్లి చూపించుకునే పరిస్థితి వారికి ఉండేదికాదు. అయితే, గ్రామాల్లోనే కంటి వెలుగు శిబిరాలు నిర్వహిస్తుండడంతో కంటి పరీక్షలు చేయించుకునేందుకు పెద్దఎత్తున జనం ముందుకు రావడం గమనార్హం. 40 ఏళ్లకు పైబడినవారే అధికం ఇప్పటివరకు కంటి పరీక్షలు చేయించుకున్నవారిలో 33.46 లక్షల(38.39%) మందికి ఏదో ఒక లోపం ఉన్నట్లుగా వైద్యులు నిర్ధారించారు. అందులో 15.18 లక్షలమందికి అక్కడికక్కడే ఉచితంగా రీడింగ్ గ్లాసులు ఇచ్చారు. రీడింగ్ గ్లాసులు తీసుకున్నవారిలో 12.53 లక్షలమంది 40 ఏళ్లకు పైబడినవారే కావడం గమనార్హం. వారు కాకుండా చత్వారంతో బాధపడుతున్నవారు 12.07 లక్షల మంది ఉన్నారు. వారికి ప్రత్యేకంగా కళ్లద్దాలు తయారు చేసి ఇవ్వాలని నిర్ణయించారు. అందులో ఇప్పటివరకు 84 వేలు అందజేశారు. ఇంకా లక్షలాది మందికి ఇవ్వడంలో నిర్లక్ష్యం కనిపిస్తున్నా త్వరలోనే అందజేస్తామని అధికారులు చెబుతు న్నారు. వీరుగాక 50 ఏళ్లు పైబడిన వారిలో 6.20 లక్షల మందికి క్యాటరాక్ట్ సహా ఇతర ఆపరేషన్లు చేయాల్సిన అవసరముందని నిర్ధారించారు. ఎన్నికల తర్వాత ఆపరేషన్లు చేస్తారని అధికారులు చెబుతున్నారు. కంటి సమస్యలున్నవారు 40 ఏళ్లకు పైబడిన వారే ఉండటం, ఏళ్లుగా ఎవరూ చేయని విధంగా ఉచిత కళ్లద్దాలు, ఆపరేషన్లు చేయనుండటంతో లబ్ధిదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారని, అది తమకు ఎన్నికల్లో ప్రయోజనం కలిగిస్తుందని టీఆర్ఎస్ వర్గాలు అంటున్నాయి. ►6.20లక్షలు ఆపరేషన్లు చేయాలని నిర్ణయించిన వారు ►15.18లక్షలు రీడింగ్ గ్లాసులు పొందిన వారి సంఖ్య ►90% లబ్ధిదారుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాల శాతం -
అద్దాలు ఇయ్యలె.. ఆపరేషన్లు చెయ్యలె!
సాక్షి, మేడ్చల్ జిల్లా: కంటి వెలుగు పథకంలో భాగంగా మేడ్చల్ జిల్లాలో ఇప్పటివరకు 4.38 లక్షల మందికి నేత్ర పరీక్షలు నిర్వహించారు కానీ వీరిలో అవసరమున్నవారికి సకాలంలో కళ్ల జోళ్లు అందడంలేదు. కంటి శస్త్ర చికిత్సలను చేయడంలేదు. దీంతో బాధితులు ఆస్పత్రుల చుట్టూ తిరుతున్నారు. జిల్లాలో 23.62 లక్షల జనాభా ఉంది. జీహెచ్ఎంసీ పరిధిలో 18.12 లక్షలు, మూడు మున్సిపాలిటీల పరిధిలో 3.72 లక్షలు, గ్రామీణ ప్రాంతాల్లో 1.75 లక్షల మంది ఉన్నట్లు అధికారులు గుర్తించారు. 52 బృందాలు (అర్బన్ పరిధిలో 43, రూరల్ ప్రాంతాల్లో 9) కంటి పరీక్షలు నిర్వహిస్తున్నాయి. జిల్లాలో ఇప్పటివరకు 4.38 లక్షల మందికి కంటి పరీక్షలు చేశారు. వీరిలో 71 వేల మందికి మాత్రమే కంటి అద్దాలు పంపిణీ చేసినట్లు జిల్లా కంటి వెలుగు కోఆర్డినేటర్ డాక్టరు ఆనంద్‌కుమార్ తెలిపారు. మరో 58,490 మందికి కంటి అద్దాలు తెప్పించనున్నారు. దీంతో కంటి అద్దాలు పొందాల్సినవారు క్యాంపులు, ఆస్పత్రుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. కంటి పరీక్షలు చేసుకున్న వారిలో 31,245 మందికి శస్త్ర చికిత్సలు చేయాల్సి ఉంది. జిల్లాలో గుర్తించిన సంబంధిత ఆస్పత్రులకు సిఫారస్ చేసినప్పటికీ ఇప్పటి వరకు 547 మందికి మాత్రమే కంటి ఆపరేషన్లు చేసినట్లు జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారులు తెలిపారు. కంటి శస్త్ర చికిత్సల నిర్వహణలో వరంగల్ తదితర జిల్లాల్లో తలెత్తిన లోపాలను దృష్టిలో పెట్టుకుని అర్హత కలిగిన ఆస్పత్రులకు తిరిగి సిఫారస్ చేయాలన్న ఉన్నతాధికారుల ఆదేశాల నేపథ్యంలో జాప్యం జరుగుతోందని సమాచారం. కంటి శస్త్ర చికిత్సలు చేయించుకోవాల్సిన 30,698 మంది తమకు కేటాయించిన ఆస్పత్రులతో పాటు హైదరాబాద్ నగరంలోని కార్పొరేట్ కంటి దవాఖానాల చుట్టూ తిరుగుతున్నారు. పెద్దాస్పత్రులకు చెందిన వర్గాలు మాత్రం ఎన్నికల కోడ్ కారణంగా శస్త్ర చికిత్సలు నిలిపివేసినట్లు చెబుతున్నారని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
కంటి వెలుగుకు స్పందన కరువు
తాండూరు : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన కంటి వెలుగు పథకం ప్రజల నుంచి ఆదరణ కరువవుతోంది. అధికారుల నిర్లక్ష్యం.. ప్రజా ప్రతినిధుల అలసత్వంతో కంటి వెలుగు మసకబారుతోంది. కంటి వెలుగు వైద్య శిబిరంలో 360 మందికి కంటి పరీక్షలు చేయాల్సి ఉంది. అయితే శిబిరాలకు ప్రజలు నావ మాత్రంగా వస్తున్నారు. అయితే దీనికి కారణం శిబిరాల్లో కంటి పరీక్షలు వైద్య నిపుణులతో కాకుండా ఆయూష్, అఫ్తాల్మిక్ అసిస్టెంట్లతో చేయిస్తుండడంతో ప్రజలు ఆసక్తి కనబర్చడం లేదు. దీంతో ప్రభుత్వ లక్ష్యం నెరవేరడం లేదు. ఈ పథకం అమలై వారమవుతున్నా కంటి శస్త్రచికిత్సలకు ప్రభుత్వం ఆస్పతులను అందుబాటులోకి తీసుకురాకపోవడం గమనార్హం. జిల్లాలోని 18 మండలాల్లో ఉన్న 9.40 లక్షల మందికి కంటి వెలుగు కార్యక్రమంలో భాగంగా వైద్య పరీక్షలు చేసేందుకు 22 వైద్య శిబిరాలను ఏర్పాటుచేశారు. ఈనెల 15వ తేదీ నుంచి జిల్లావ్యాప్తంగా కంటి వెలుగు శిబిరాలు ప్రారంభమయ్యాయి. ఒక శిబిరంంలో రోజుకు 360 మందికి కంటి పరీక్షలు (స్క్రీనింగ్) చేయాలి. అంటే జిల్లాలో 22 కంటి వెలుగు శిబిరాల్లో రోజుకు 7,920 మందికి కంటి పరీక్షలు చేయాలి. 15వ తేదీ నుంచి మంగళవారం వరకు 55,450 మందికి కంటి పరీక్షలు చేయాల్సి ఉంది. అయితే ఆ పరీక్షలు దారిదాపులోకి కూడా చేరుకోలేదు. ఇప్పటివరకు శిబిరాల్లో 13,795 మందికి మాత్రమే కంటి పరీక్షలు చేసినట్లు జిల్లా కంటి వెలుగు నిర్వహణ అధికారి చెప్పారు. ఆయూష్ వైద్యులతో పరీక్షలు కంటి వెలుగు కార్యక్రమంలో ఏర్పాటుచేసిన వైద్య శిబిరాల్లో కంటి వైద్య నిపుణులు కరువయ్యారు. కంటి వైద్యులతో శిబిరాలను నిర్వహించాల్సి ఉం డగా రాష్ట్రీయ బాల స్వస్థ్య కార్యక్రమ్ (ఆర్బీఎస్కే) పరిధిలో విధులు నిర్వహిస్తున్న ఆయూష్ వైద్యులు, పీహెచ్సీలో విధులు నిర్వహిస్తున్న ఆఫ్తాల్మిక్ అసిస్టెంట్లతో శిబిరాలు కొనసాగిస్తున్నారు. శస్త్ర చికిత్సలకు ఆస్పపత్రులేవీ.. కంటి వెలుగు ప్రారంభమై వారమైంది. అయితే ఇప్పటివరకు శస్త్ర చికిత్సల కోసం ఆస్పత్రులను అందుబాటులోకి తీసుకురావడంలో జిల్లా యంత్రాంగం విఫలమైంది. శిబిరాల్లో కంటి సమస్యలతో బాధపడుతున్న వారిని 1,648 మందిని శస్త్ర చికిత్సల కోసం గుర్తించారు. అయితే కంటి శస్త్ర చికిత్సల కోసం ఆస్పత్రుల వివరాలు పొందుపర్చలేదు. దీంతో కంటి పరీక్షలు చేసుకున్న వారు శస్త్ర చికిత్స కోసం రిఫర్ చీటీలను తీసుకుని ఇంటి బాట పడుతున్నారు. 5 ఆస్పత్రులు అందుబాటులో కంటి వెలుగు రోజురోజుకు ఆదరణ వస్తోంది. కంటి వెలుగు వైద్య శిబిరంలో కంటి శస్త్ర చికిత్సలు చేయించేందుకు రెండు, మూడు రోజుల్లో ఆస్పత్రులను అందుబాటులోకి తీసుకువస్తాం. తాండూరులోని ప్రభుత్వ జిల్లా ఆస్పత్రిలో సర్జన్‌ను నియమించాలని ఉన్నతాధికారులకు ప్రతిపాదనలు పంపించాం. కంటి శస్త్ర చికిత్సలను చేసేందుకు మొత్తం 5 ఆస్పత్రులను అందుబాటులోకి తీసుకువస్తాం. – మహేశ్, కంటి వెలుగు జిల్లా ప్రోగ్రామ్ అధికారి ఆదరణ కరువు జిల్లాలో ఏర్పాటుచేసిన కంటి వెలుగు శిబిరాల్లో ఇప్పటివరకు 13,795 మందికి పరీక్షలు చే శారు. వీరిలో పురుషులు 6,081, మహిళలు 7, 714 మందికి కంటి పరీక్షలు నిర్వహించచారు. ఎస్సీలు 2,618 మంది, ఎస్టీలు 1,315, బీసీలు 7,430, ఓసీలు 1,365, మైనార్టీలు 1,069 మందికి కంటి పరీక్షలు చేశారు. వీరిలో 1,381 మందికి కంటి అద్దాలను అందించారు. -
మొక్కుబడిగా ‘కంటి వెలుగు’
నిజాంసాగర్ : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన కంటి వెలుగు కార్యక్రమం గ్రామాల్లో మొక్కుబడిగా సాగుతోంది. వైద్యులు సమయపాలన పాటించకపోవడం, మండల, గ్రామ స్థాయి పలు శాఖల అధికారులు శిబిరాలకు డుమ్మా కొడుతున్నారు. దాంతో క్షేత్రస్థాయిలో కంటి వెలుగు వైద్యుల ఇష్టా రాజ్యంగా మారింది. షెడ్యూల్ ప్రకారం మండలంలోని తెల్గాపూర్ గ్రామంలో మంగళవారం కంటి వెలుగు కార్యక్రమం నిర్వహించారు. ఆరోగ్య కార్యకర్తలు, ఆశవర్కర్లు, అంగన్వాడీ టీచర్లు సమయానికి శిబిరానికి చేరుకున్నారు. అయితే మండల వైద్యులు, కంటి వైద్యులు శిబిరానికి సకాలంలో హాజరుకాకపోవడంతో వైద్య సిబ్బంది, రోగులు నిరీక్షించారు. గ్రామ పంచాయతి కార్యదర్శి, వీఆర్వోతో పాటు మండల అధికారి కంటి వెలుగు శిబిరానికి దూరంగా ఉన్నారు. గ్రామ, మండలస్థాయి అధికారులు శిబిరాలకు దూరంగా ఉండటంతో వైద్యాధికారులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. గ్రామీణ ప్రాంత పేదలకు ప్రపంచానికి చూపు నిచ్చేందుకు ప్రభుత్వం కంటి వెలుగుకు శ్రీకారం చుట్టినా నిర్వాహకుల పనితీరుపై స్థానికులు మండి పడుతున్నారు. అధికారులు ఇకనైనా స్పందించి గ్రామాల్లో కంటి వెలుగు కార్యక్రమాలను పకడ్బందీగా నిర్వహించేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. -
‘ఆపరేషన్ పేరుతో మా అమ్మను చంపేశారు’
షాద్‌నగర్‌టౌన్ రంగారెడ్డి : కంటి ఆపరేషన్ చేస్తామని తీసుకెళ్లి మా అమ్మను చంపేశారని, చావుకు కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కేశంపేట మండలం దత్తాయపల్లి గ్రామానికి చెందిన గంట్లవెళ్లి చెన్నమ్మ కుమారుడు సాయిలు ఆర్డీఓ కార్యాలయంలో ఏఓ ఆంజనేయులుకు వినతిపత్రం అందజేశారు. అనంతరం మృతురాలి కొడుకు సాయిలు మాట్లాడుతూ... కంటివెలుగు పథకంలో భాగంగా దత్తాయపల్లి గ్రామంలో ఈనెల 17న వైద్య శిబిరం నిర్వహించారని, తన తల్లి చెన్నమ్మ పరీక్షల నిమిత్తం శిబిరానికి వెళ్లినట్లు తెలిపారు. కంటి పరీక్షల అనంతరం ఆపరేషన్ చేయాలంటూ చెప్పి ప్రభుత్వ వాహనంలో కొత్తూరులోని కంటి ఆస్పత్రికి తరలించారని, ఆమెతో పాటు గ్రామంలోని మరికొందరు కూడా వెళ్లినట్లు చెప్పారు. సాయంత్రం అయినా ఆపరేషన్ కోసం వెళ్లి నర్సమ్మ ఇంటికి తిరిగి రాలేదన్నారు. మరుసటిరోజు కొత్తూరు ఆసుపత్రి నుంచి మా ఇంటికి ఇద్దరు వ్యక్తులు చెన్నమ్మ పరిస్థితి విషమంగా ఉందని, షాద్‌నగర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలిస్తున్నామని చెప్పారన్నారు. విషయం తెలుసుకొని ఆస్పత్రికి వెళితే అప్పటికే చెన్నమ్మ మృతి చెందిందని డాక్టర్లు తెలిపారని కన్నీరుపెట్టుకున్నాడు. చెన్నమ్మ మృతికి కారకులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే చెన్నమ్మ మృతి చెందిందని వాపోయారు. వినతిపత్రం అందించిన వారిలో సంఘమేశ్వర్, భీమయ్య, సురేష్, జంగయ్య, యాదయ్య ఉన్నారు. -
‘కంటి వెలుగు’ ఉచిత పథకం
కౌడిపల్లి(నర్సాపూర్) : కంటి వెలుగు వైద్యశిబిరాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఎవరి ఎక్కడ డబ్బులు చెల్లించవద్దని డీఎంహెచ్ఓ వెంకటేశ్వరరావ్ తెలిపారు. శుక్రవారం కౌడిపల్లి ప్రాథమిక ఆరోగ్యకేంద్రంలో కొనసాగుతున్న కంటి వెలుగు వైద్యశిబిరాన్ని తనిఖీ నిర్వహించారు. రోగులకు వైద్యసేవలను గురించి అడిగితెలుసుకున్నారు. వైద్యచికిత్సలు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో 20 బృందాలు కంటి వెలుగు వైద్యశిబిరంలో చికిత్సలు చేస్తున్నట్లు తెలిపారు. ఇప్పటివరకు 354 మందికి కంటి అద్దాలు పంపిణీ చేసినట్లు వెల్లడించారు. మరో 750 మందికి వివిధ రకాల కంటి అద్దాలు అవసరంగా గుర్తించినట్లు తెలిపారు. వీరికి మూడు వారాలలో కంటి అద్దాలు పంపిణీ చేస్తామన్నారు. 90 మందికి కంటి శుక్లాలు ఇతర ఆపరేషన్లు అవసరంగా గుర్తించామన్నారు. వీరికి 114 కార్పోరేట్ ఆసుపత్రులలో వారి కోరిక మేరకు ఆపరేషన్లు నిర్వహిస్తామని పేర్కొన్నారు. డబ్బులడిగితే ఫిర్యాదు చేయాలి.. గ్రామంలో కొనసాగిని వైద్యశిబిరం పూర్తయిన తరువాత ఆపరేషన్లు అవరంగా గుర్తించిన వారిని వైద్యుల సహాయంతో వాహనంలో పంపించి ఆపరేషన్లు చేయిస్తామన్నారు. ఎక్కడ ఎవరకి ఒక్కరూపాయి చెల్లించాల్సిన అవసరం లేదన్నారు. ఎవరైనా డబ్బులు అడిగితే ఫిర్యాదు చేయాలన్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రజలుకు కంటి వెలుగు పథకంద్వార పూర్తిగా ఉచితంగా వైద్యచికిత్సలు చేయిస్తుందని తెలిపారు. వర్షం కారణంగా కొంత నెమ్మదిగా కొనసాగుతుందన్నారు. రోజుకు 250 మందికి వైద్యం చేయాల్సి ఉండగా కొంత తక్కువగా ఉందన్నారు. ప్రజలు సహకరించి వైద్యశిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. కార్యక్రమంలో డాక్టర్ వెంకటస్వామి, డాక్టర్ శోభన సిబ్బంది పాల్గొన్నారు. నర్సాపూర్: ప్రభుత్వం ప్రతాష్టాత్మకంగా చేపట్టిన కంటి వెలుగు కార్యక్రమంలో ఏర్పాటు చేసిన కంటి పరీక్ష కేంద్రాలకు వచ్చే ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా చూడాలని జిల్లా డీఎంఅండ్ హెచ్ఓ డాక్టర్ వెంకటేశ్వరరావు సూచించారు. శుక్రవారం ఆయన నర్సాపూర్‌లోని పురపాలక కార్యాలయంలో ఏర్పాటు చేసిన కంటి వెలుగు కేంద్రాన్ని పరిశీలించారు. ఏర్పాట్లపై ప్రజలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన çప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా చూడాలని అన్నారు. కంటి పరీక్షలు చేసి పలు సూచనలు చేశారు. ఆయన వెంట డిప్యూటీ డీఎంఅండ్‌హెచ్‌ఓ డాక్టర్ విజయ నిర్మల, డీఐఓ డాక్టర్ నవీన్ తదితరులు ఉన్నారు. నర్సాపూర్ కేంద్రంలో చేపడుతున్న పరీక్షల వివరాలను డాక్టర్ పావని ఆయనకు వివరించారు. కొల్చారంలో.. కొల్చారం(నర్సాపూర్): కంటి సమస్యలతో బాధపడుతున్న వారు ప్రభుత్వం ద్వారా చేపట్టిన కంటి వెలుగు కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా వైద్యాధికారి వెంకటేశ్వర్లు తెలిపారు. శుక్రవారం కొల్చారం మండలం తుమ్మలపల్లిలో చేపట్టిన కంటి వెలుగు కార్యక్రమాన్ని ఆయన తనిఖీ చేశారు. దేశంలో ఎక్కువగా ప్రజలు కంటి సమస్యలతో బాధపడటం మారిన ఆహార అలవాట్లు కొంత వరకు కారణమన్నారు. చిన్న వయస్సులోనే కంటి సమస్యలతో బాధపడుతున్న వారి సంఖ్య కూడా ఎక్కువ అవుతుందన్నారు. ప్రభుత్వం తీసుకున్న కంటి వెలుగు పథకం ద్వారా గ్రామీణస్థాయిలో వైద్య శిబిరాలలను ఏర్పాటు చేయడం, ఉచితంగా కళ్లద్దాలు అందించడం ప్రతి ఒక్కరు హర్షించదగ్గ విషయమన్నారు. ఈ సందర్భంగా కంటి అద్దాలు అవసరమైన వారికి కళ్లద్దాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో కొల్చారం వైద్యాధికారి రమేష్‌తోపాటు సిబ్బంది పాల్గొన్నారు. -
రీజినల్ నేత్ర వైద్యశాలపై శీతకన్ను
ఎంజీఎం: ప్రజల్లో దృష్టి సమస్యను పరిష్కరించేందుకు కంటి వెలుగు కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతుండగా వరంగల్ ప్రాంతీయ నేత్ర వైద్యశాలలో అందుకు తగ్గట్టుగా ఏర్పాట్లు లేవు. ఇప్పటికే ఇక్కడ సిబ్బంది కొరత ఉండగా బుధవారం ప్రారంభమయ్యే కంటివెలుగు కార్యక్రమంతో పెరగనున్న రద్దీకి తగ్గట్టుగా ఎలాంటి ఏర్పాట్లు చేయలేదు. ప్రస్తుతం ఆస్పత్రిలో కొనసాగుతున్న నాలుగు యూనిట్లలో నలుగురు ప్రొఫెసర్లు అవసరం ఉండగా, ఒక్క ప్రొఫెసర్ స్థాయి అధికారి కూడా లేరు. ఈ క్రమంలో అసోసియేట్ ప్రొఫెసర్‌కు ప్రభుత్వం సూపరింటెండెంట్ హోదా కల్పిస్తూ సోమవారం పూర్తి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ఉత్తర్వులు సైతం జారీ చేసింది. వైద్యుల కొరత.. వరంగల్, కరీంనగర్, ఖమ్మం జిల్లాల ప్రజల నేత్ర సమస్యల కోసం వరంగల్ ప్రాంతీయ వైద్యశాల ఉంది. వంద పడకల సామర్థ్యం గల ఈ ఆస్పత్రికి నిత్యం 300 నుంచి 400 మంది కంటి వ్యాధిగ్రస్తులు వస్తుంటారు. ఇందులో నిత్యం 40 మందికి ఆపరేషన్లు అవసరమవుతున్నాయి. ఆపరేషన్ చేసేందుకు ఒక రోజు, అబ్జర్వేషన్‌కు ఒక రోజు ఇక్కడే ఉంటున్నారు. దీంతో రోజూ 80కి పైగా పడకలు నిండుగా ఉంటున్నాయి. ఔట్ పేషెంట్ విభాగం కాకుండా ఆపరేషన్లు పర్యవేక్షించేందుకు నాలుగు యూనిట్లు ఇక్కడ పనిచేస్తున్నాయి. ఒక్కో యూనిట్లో ఒక ప్రొఫెసర్, ఇద్దరు అసోసియేట్ ప్రొఫెసర్లు, ఇద్దరు అసిస్టెంట్ ప్రొఫెసర్లు అవసరం. కానీ నలుగురు ప్రొఫెసర్లు, ఇద్దరు అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులు ప్రస్తుతం ఖాళీగా ఉన్నాయి. ఒక్క ఆనస్తీషియా యూనిట్ వైద్యులు విధులు నిర్వర్తించాల్సి ఉండగా, ఒకే ఒక్క డిప్యూటేషన్ అస్తీషియా వైద్యురాలితో సేవలను కొనసాగిస్తున్నారు. నిత్యం 360 మంది.. కంటి వెలుగు ప్రత్యేక బృందాలు కంటి సమస్యలు గుర్తించేందుకు ఆగస్టు 15 నుంచి ఫిబ్రవరి 28 వరకు రోజూ గ్రామాల్లో ప్రత్యేక క్యాంపులు ఏర్పాటు చేస్తున్నారు. రోజూ గ్రామీణ ప్రాంతాల్లో 250, పట్టణ ప్రాంతాల్లో 300 మందిని పరిశీలించాలని నిర్ణయించారు. ఈ లెక్కన రోజూ సగటున 50 మంది వరకు ఆపరేషన్ కోసం ఆస్పత్రులకు రెఫర్ చేయాల్సిన వస్తుంది. వరంగల్ నగరంలో రీజనల్ ఐ ఆస్పత్రిని మినహాయిస్తే మరో ఎనిమిది ఆస్పత్రులను కంటి వెలుగు కోసం ఎంపిక చేశారు. ఈ ఎనిమిది ఆస్పత్రుల సామర్థ్యం రీజనల్ ఐ ఆస్పత్రికి సమానంగా లేదు. ఇతర జిల్లాల నుంచి.. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేటు కంటి ఆస్పత్రుల్లో వైద్యులు లేరు. వరంగల్ రూరల్ జిల్లాకు చెందిన ప్రజలకు వరంగల్ నగరమే దిక్కు. ఇది కాకుండా జనగామ, మహబూబాబాద్ జిల్లాలకు చెందిన వారు వరంగల్‌లో ఆపరేషన్ చేయించుకోవడంపై ఆసక్తి చూపిస్తున్నారు. వీరందరికీ తగ్గట్లుగా పూర్తి స్థాయిలో రీజనల్ నేత్ర వైద్యశాలలో ఏర్పాట్లు చేయలేదని ప్రభుత్వ వైద్యులే అంటున్నారు. కంటి వెలుగు కోసం సమీక్షలు నిర్వహిస్తున్నా అధికార గణం మౌలిక సదుపాయాల మీద దృష్టిసారించడం లేదని విమర్శిస్తున్నారు. అద్దాలు, మందుల సరఫరాపై చూపిన శ్రద్ధ ఆపరేషన్ థియేటర్ల ఏర్పాటుపై పెట్టడం లేదని చెబుతున్నారు. ప్రస్తుతం కంటి ఆస్పత్రిలో ఉన్న వైద్య సిబ్బంది కొరత కారణంగా 40 ఆపరేషన్లకు పరిమితం అవుతున్నారు. రేపు పెరగబోయే రోగులకు తగ్గట్లుగా సిబ్బందిని అందుబాటులో ఉంచకపోతే ఇబ్బందులు ఎదురయ్యేందుకు ఆస్కారం ఉంది. పడకలు, ఆపరేషన్ థియేటర్ల సామర్థ్యం పెంచకుండా హడావుడిగా ఆపరేషన్లు నిర్వహించి, అబ్జర్వేషన్ లేకుండా రోగులకు బయటకు పంపితే ఇన్ఫెక్షన్లు సోకే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. మరోవైపు వైద్య ఆరోగ్యశాఖ అధికారులు ఇకపై నేత్ర వైద్యశాలకు వచ్చే రోగులందరూ కంటి వెలుగు ద్వారా వస్తారని అభ్రిపాయ పడుతున్నారు. పది రోజుల్లో భర్తీ చేస్తాం.. కంటి వెలుగు కార్యక్రమం ద్వారా శస్త్రచికిత్సలు అవసరం ఉన్న వారిని గుర్తించి రెఫరెల్ ఆస్పత్రులకు పంపిస్తాం. నేత్ర వైద్యశాలలో ఖాళీగా ఉన్న పోస్టులను కాంట్రాక్టు పద్ధతిన పదిరోజుల్లో నియామకాలు జరిగేలా చూస్తాం. అంతేకాకుండా ప్రభుత్వానికి కూడా ఖాళీలను భర్తీ చేయాలని నివేదించాం. శస్త్రచికిత్సల సంఖ్య ప్రకారం ఏర్పాట్లు చేస్తాం. – హరీష్‌రాజు, డీఎంహెచ్ఓ, వరంగల్ అర్బన్ జిల్లా -
15 నుంచి కంటి వెలుగు
ఆదిలాబాద్‌అర్బన్ : రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 15 నుంచి కంటి వెలుగు ప్రారంభం కానుందని, ఇందుకు తగిన ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ప్రిన్సిపల్ కార్యదర్శి శాంతికుమారి అధికారులను ఆదేశించారు. గురువారం సాయంత్రం ఆమె హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా శాంతికుమారి మాట్లాడుతూ కంటి వెలుగుకు కావాల్సిన మెటీరియల్ సరఫరా, క్యాంప్‌ల నిర్వహణ, టీంల ఏర్పాటు, అవసరమైన శిక్షణ వంటి అంశాలపై సమీక్షించారు. కమిషనర్ వాకాటి కరుణ మాట్లాడుతూ వైద్య సిబ్బంది, ఇతర శాఖల అధికారుల సమన్వయంతో కంటి వెలుగు కార్యక్రమాన్ని నిర్వహించాలని అన్నారు. కలెక్టర్ దివ్యదేవరాజన్ మాట్లాడుతూ జిల్లాలో కంటి వెలుగు కార్యక్రమం నిర్వహణకు కావాల్సిన ఏర్పాట్లు చేస్తున్నామని, పట్టణ, గ్రామీణ ప్రాంతాలకు ప్రత్యేక అధికారులను నియమించి, వారితో సమావేశం నిర్వహించి అవసరమైన సూచనలు చేయనున్నట్లు వివరించారు. జిల్లాకు పెషేంట్ కార్డులు 7 లక్షల వరకు అవసరం ఉంటుందని, వాటిని సరఫరా చేయాలని కోరారు. ఉట్నూర్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్, ఆదిలాబాద్‌లోని రిమ్స్‌కు కావాల్సిన ఎక్విప్మెంట్లు సరఫరా చేయాలని కోరారు. వీడియో కాన్ఫరెన్స్ అనంతరం వైద్యాధికారులు, ఎంపీడీవోలు, తహసీల్దార్లతో కలెక్టర్ సమీక్షించారు. శుక్రవారం ఉదయం 11 గంటలకు మున్సిపల్ కార్యాలయంలోని పట్టణ టీంలకు, మధ్యాహ్నం 3.30 గంటలకు జెడ్పీ సమావేశ మందిరంలో గ్రామీణ ప్రాంత టీంలకు సమావేశం ఏర్పాటు చేయాలని సూచించారు. జిల్లాలోని 509 రెవెన్యూ గ్రామాల్లో క్యాంప్‌లు నిర్వహించాలని, క్యాంప్‌కు హాజరయ్యే పెషంట్ తన ఆధార్ కార్డు తీసుకొని రావాలని అన్నారు. ఆయా ఎంపీడీవోలు మెడికల్ అధికారులకు సహకరించాలని చెప్పారు. ఐకేపీ సిబ్బంది గ్రామాల్లో ప్రజలకు అవగాహన కల్పించాలని, క్యాంప్‌లు నిర్వహించే తేదీ, రోజును గ్రామాల్లో విస్తృతంగా ప్రచారం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో జేసీ సంధ్యారాణి, ఆర్డీవో సూర్యనారాయణ, డీఆర్డీవో రాజేశ్వర్, డీఎంహెచ్‌వో రాజీవ్‌రాజ్, డాక్టర్లు చంపత్రావు, చందు, మెడికల్ అధికారులు, ఎంపీడీవోలు, తహసీల్దార్లు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. -
‘కంటి వెలుగు’కు ఏర్పాట్లు
జనగామ: సంపూర్ణ ఆరోగ్యవంతమైన తెలంగాణే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు వెళ్తోంది. అసంక్రమిత వ్యాధుల నిర్ధారణ పేరిట జిల్లా వ్యాప్తంగా గతంలో పెద్ద ఎత్తున వైద్య పరీక్షలను నిర్వహించారు. అంధులు లేని రాష్ట్రం చేయాలనే తలంపుతో సీఎం కేసీఆర్ మరో కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ‘కంటి వెలుగు’ పేరుతో ఆగస్టు 15 నుంచి ప్రతి ఒక్కరికి కంటి పరీక్షలు చేయనున్నారు. జిల్లాలో 40 శాతం మంది కంటి సమస్యలతో బాధపడుతున్నారని అధికారుల లెక్కలు చెబుతున్నాయి. జిల్లాలోని 13 మండలాల పరిధిలో 2011 జనాభా లెక్కల ప్రకారం 5,82,485 జనాభా ఉంది. ఇందులో రూరల్ పరిధిలో 5,33,746, అర్బన్‌లో 48,739 జనాభా ఉంది.జీ జనాభాలో 0-5 ఏళ్ల వయస్సు ఉన్న పిల్లలు 12 శాతం, మరో 8 శాతం మంది సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉంటారని భావిస్తున్నారు. మిగతా 80 శాతం మందికి కంటి పరీక్షలు చేయనున్నారు. ప్రతి రోజు 750 మందికి పరీక్షలు చేసే విధంగా అధికారులు పక్కా ప్రణాళికలను రూపొందించారు. ప్రస్తుత జనాభాలో జనాభాలో 30 నుంచి 50 శాతం మంది కంటి సమస్యలతో బాధపడే వారు ఉన్నట్లు ప్రాథమిక అంచనా వేసుకుంటున్నారు. ఈ లెక్కన జనగామ జిల్లాలో 2 లక్షల మందికి పైగా మంది నేత్ర సమస్యలతో బాధపడుతున్నట్లు లెక్కలు చెబుతున్నాయి. రెండు నెలల్లో పరీక్షలు పూర్తి.. కంటి వెలుగు కార్యక్రమంలో భాగంగా జిల్లాకు 4.09 లక్షల అద్దాలు చేరుకున్నాయి. రెండు నెలల వ్యవధిలో కంటి పరీక్షలను పూర్తి చేసేలా పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్లనున్నారు. వెద్యులు కంటి పరీక్షలు చేసిన అనంతరం ప్రాథమిక స్థాయి, దూర, దగ్గరి చూపు ఉన్నవారికి అక్కడికక్కడే కళ్ల అద్దాలను అందిస్తారు. వైద్య పరీక్షలను చేసిన వారి వివరాలను ఆన్లైన్లో వెంట వెంటనే నమోదు చేస్తారు. కళ్లలో నరం వల్ల అంధత్వం, మోతి బిందు, నల్ల పాపపై పొర, నీటి కాసులు తదితర సమస్యలు ఉన్న వారికి హైదరాబాద్‌లోని ఎల్వీ ప్రసాద్ కంటి ఆస్పత్రికి తరలించి మెరుగైన చికిత్సలు చేస్తారు. నోడల్ ఆఫీసర్‌గా విక్రమ్‌కుమార్.. కంటి వెలుగుల కోసం 13 ప్రత్యేక బృందాలనే ఏర్పాటు చేశారు. 13 ప్రాథమిక ఆరోగ్యం కేంద్రాలతోపాటు జిల్లా కేంద్రంలోని అర్బన్ పీహెచ్సీ ద్వారా కంటి పరీక్షలను చేస్తారు. క్యాంపు టీంలు(13), సబ్ సెంటర్లు (115), ఏఎన్ఎంలు(119), ఆశ కార్యకర్తలు (557), హెల్త్ సూపర్ వైజర్లు (63), పారామోడికల్ ఆఫ్తాల్మిక్(13), మెడికల్ ఆఫీసర్లు(13), ఆర్బీఎస్కే (16) బృందాల ద్వారా ఆయా గ్రామాల్లో కంటి పరీక్షలను నిర్వహిస్తారు. బృందంలో డాక్టర్, సూపర్ వైజర్, ఆఫ్తాల్మిక్, ఏఎన్ఎం, ఆశ, ఇద్దరు డాడా ఎంట్రీలు ఉంటారు. కాగా, ఈ కార్యక్రమానికి జిల్లా నోడల్ ఆఫీసర్‌గా స్టేట్ జాయింట్ డైరెక్టర్ విక్రమ్‌కుమార్‌ను నియమించారు. -
కంటి పరీక్ష చేయించుకున్న కేసీఆర్
-
కంటి పరీక్ష చేయించుకున్న కేసీఆర్
సాక్షి, న్యూఢిల్లీ: సతీసమేతంగా ఢిల్లీ చేరుకున్న రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు శనివారం కంటి పరీక్షలు చేయించుకున్నట్లు టీఆర్ఎస్ వర్గాలు తెలిపాయి. రెండు మూడు రోజులు ఢిల్లీలో సంబంధిత చికిత్స తీసుకోనున్నట్లు వెల్లడించాయి. వీలును బట్టి రెండు రోజుల తర్వాతే పలువురు కేంద్ర మంత్రులను కలిసే అవకాశముందని సమాచారం. -
కంటి చూపునిచ్చే ఆప్టోమెట్రిస్టు
అప్‌కమింగ్ కెరీర్: సర్వేంద్రియానాం నయనం ప్రధానం.. మనిషికి అన్ని ఇంద్రియాల్లోకెల్లా కళ్లే ముఖ్యం. కంటిచూపు లేకపోతే జీవితం అంధకారమయం. కటిక చీకటి తప్ప వెలుగులు వీక్షించలేం. కంటిచూపు విషయంలో తాజా గణాంకాలు ప్రమాద ఘంటికలను మోగిస్తున్నాయి. ప్రపంచంలోని ప్రతి ముగ్గురు అంధుల్లో ఒకరు భారతీయులేనని తాజా అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. దేశంలో లక్షలాది మంది కంటి సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారు. అంధులకు చూపు రప్పించి, సుందర లోకాన్ని చూపించి, వారి జీవితాల్లో వెలుగులు పూయించాలనే ఆశయం ఉన్నవారికి సరిగ్గా సరిపోయే కెరీర్.. ఆప్టోమెట్రిస్టు. ప్రతి రెండు లక్షల మందికి ఒక్కరే: మనదేశంలో ఆప్టోమెట్రిస్టులకు డిమాండ్ పెరుగుతోంది. అభివృద్ధి చెందిన యూరోపియన్ దేశాల్లో ప్రతి 10 వేల మందికి ఒక కంటి వైద్యుడు ఉండగా.. భారత్‌లో మాత్రం ప్రతి రెండు లక్షల మందికి ఒకరు మాత్రమే ఉండడం గమనార్హం. ప్రస్తుతం మనదేశంలో సంస్థాగతంగా నిపుణులైన ఆప్టోమెట్రిస్టులు దాదాపు 5 వేల మంది మాత్రమే ఉన్నారని అంచనా. ఇక్కడి అవసరాలు తీరాలంటే మరో రెండు లక్షల మంది సుశిక్షితులైన కంటి వైద్యులు అవసరమని నిపుణులు చెబుతున్నారు. అవకాశాలు పుష్కలం: ఆప్టోమెట్రిస్టులకు ప్రస్తుతం చాలా అవకాశాలు న్నాయి. ఆధునిక జీవితంలో చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు అందరూ కంటి సంబంధిత వ్యాధుల బారిన పడుతున్నారు. ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల్లో కంటి వైద్యులకు ఎన్నో ఉద్యోగ అవకాశాలు అందుబాటులో ఉన్నాయి. సొంతంగానూ ప్రాక్టీస్ చేసుకోవచ్చు. నగరాలు, పట్టణాల్లో కొత్త ఆసుపత్రులు ఏర్పాటవుతుండడంతో కంటి వైద్యులకు డిమాండ్ పెరుగుతోంది. అమెరికా, యూరప్, ఆస్ట్రేలియా, కెనడా, న్యూజిలాండ్, మిడిల్ ఈస్టు వంటి దేశాల్లో ఆప్టోమెట్రిస్టులకు భారీ డిమాండ్ ఉంది. కొన్ని దేశాల్లో కళ్లద్దాలు, లెన్స్‌లు వంటివి విక్రయించే దుకాణాల్లో ఆప్టోమెట్రిస్టు తప్పనిసరిగా ఉండాల్సిందే. ఈ కెరీర్లోకి ప్రవేశించాలనుకొనేవారు బీఎస్సీ తర్వాత దేశ విదేశాల్లో ఎం.ఆప్ట్, ఎంఫిల్, ఎంఎస్ లేదా పీహెచ్డీ వంటి కోర్సులు అభ్యసించవచ్చు. వేతనాలు క్వాలిఫైడ్ ఆప్టోమెట్రిస్టులకు భారత్‌లో ప్రస్తుతం ఏడాదికి రూ.2.5 లక్షల నుంచి రూ.6 లక్షల వరకు వేతనం అందుతోంది. అనుభవంతో మంచిపేరు సంపా దిస్తే ఇంకా అధిక వేతనం అందు కోవచ్చు. సొంతంగా ప్రాక్టీస్ ప్రారంభిస్తే పనితీరును బట్టి ఆదాయం ఆర్జించొచ్చు. కావాల్సిన లక్షణాలు * రోగులకు సేవ చేయాలనే ఉన్నతాశయం. * పగలు రాత్రి ఎంతసేపైనా పనిచేయగల సామర్థ్యం * బృంద స్ఫూర్తిని ప్రదర్శించే నైపుణ్యం * ఈ రంగంలో ఎప్పటికప్పుడు వస్తున్న నూతన మార్పులను ఒడిసిపట్టుకోగల తెలివితేటలు ఆప్టోమెట్రీ కోర్సులను ఆఫర్ చేస్తున్న సంస్థలు: * డా. రాజేంద్రప్రసాద్ సెంటర్ ఫర్ ఆఫ్తాల్మిక్ సెన్సైస్, ఎయిమ్స్- న్యూఢిల్లీ వెబ్సైట్: http://www.aiims.edu/rpcentre.htm * సరోజినీ దేవి కంటి వైద్యశాల-హైదరాబాద్ * భారతీ విద్యాపీఠ్ మెడికల్ కాలేజీ-పుణె వెబ్సైట్: http://www.bharatividyapeeth.edu/ ఆప్టోమెట్రీషియన్ కోర్సు.. అవకాశాలు గతంలో కంటి అద్దాలతో సరిచేయదగిన సమస్యలనూ ఆఫ్తాల్మాలజిస్టులే చూసేవారు. కంటిై వెద్యవిజ్ఞానంలో గణనీయమైన పురోగతి రావడం, క్యాటరాక్ట్, కార్నియల్, స్క్వింట్, రెటినల్ సర్జరీలకు సంబంధించిన సబ్స్పెషాలిటీల ఆవిర్భావంతో అద్దాలతో సరిచేయదగిన సమస్యలను ఆప్టోమెట్రీషి యన్ చూస్తారు. అంటే సర్జరీ రంగంలో వచ్చిన సబ్స్పెషాలిటీస్ వల్ల ప్రాథమికమైన క్లినికల్ సమస్య లను ఆప్టోమెట్రీషియన్లు చూస్తున్నారన్న మాట. రోగిని (పేషెంట్‌ను) క్లినికల్‌గా పరీక్షించే సమయం లో రోగి ప్రాథమిక పరీక్షలు (ప్రిలిమినరీ ఎగ్జామి నేషన్స్), రోగి కంటివ్యాధి చరిత్ర (ఐ హిస్టరీ), కంటికి సంబంధించి అతడికి ఉన్న అలర్జీలు వంటివి పరీక్షిస్తారు. ఈ రంగంలో ప్రవేశించడానికి రెండు రకాల కోర్సులు అందుబాటులో ఉన్నాయి. మొదటి ది ఆప్టోమెట్రీషియన్ కోర్సు డిప్లొమా. దీన్ని రెండేళ్ల కోసం చదవాలి. రెండోది బీఎస్సీ ఆప్టోమెట్రీ. ఇది మూడేళ్ల కోర్సు. బీఎస్సీ ఆప్టోమెట్రీ లేదా ఫెలోషిప్ వంటివి చేసిన వారు మాత్రమే కంటి వైద్య రంగంలో నిర్వహించే కొంత పెద్ద పెద్ద పరీక్షలైన స్లిట్‌ల్యాంప్ ఎగ్జామినేషన్స్ వంటివి చేస్తున్నారు. ఈ పరీక్ష ద్వారా కంటి ముందు భాగాన్నీ, కంటి వెనక భాగమైన డిస్క్నూ పరీక్ష చేస్తారు. ఇక కంటి అద్దాలను సూచించే (ప్రిస్క్రయిబ్ చేసే) అర్హత ఆప్టోమెట్రీషియ న్దే. ఆప్టోమెట్రీషియన్ కోర్సుల్లో ఫెలోషిప్ చేసిన వారికి ఆస్ట్రేలియా, కెనడా వంటి దేశాల్లో రీసెర్చ్‌లో సైతం భాగస్వామ్యం వహించేందుకు మంచి అవకా శాలే ఉన్నాయి. కాంటాక్ట్‌లెన్స్‌లు, గ్లకోమా, రెటినల్ ట్రయల్స్ వంటి పరిశోధనల్లో వీరికీ కొన్ని అత్యాధు నిక సంస్థలు స్థానం కల్పిస్తున్నాయి. సాధారణంగా పేరున్న సంస్థల్లోనైతే ఆప్టోమెట్రీషియన్ కోర్సులు చేసిన వారికి తొలివేతనం రూ. 15,000 నుంచి ప్రారంభమవుతుంది. అయితే కొన్ని ఇంట్రాక్యులార్ ఉపకరణాలు తయారీ కంపెనీలు ఆప్టోమెట్రీషియన్ కోర్సులు చేసిన వారిని తమ మార్కెటింగ్ సేవలకోసం ఉపయోగించుకుంటున్నాయి. అలాం టి వారికి హెచ్చు స్థాయి వేతనాలు లభిస్తున్నాయి. అయితే విదేశాల్లో పరిశోధన, ఆప్టిమెట్రీ రంగాల్లోనూ పనిచేయాలనుకున్నవారు అక్కడి లెసైన్సింగ్ పరీక్షలో ఉత్తీర్ణులు కావాల్సి ఉంటుంది. - డాక్టర్ ఎమ్.ఎస్. శ్రీధర్, ఎం.డీ., మ్యాక్సీవిజన్ ఐ హాస్పిటల్, ఎ.ఎస్.రావు నగర్, సికింద్రాబాద్