వైద్యుల కోసం నిరీక్షిస్తున్న ఆరోగ్య కార్యకర్తలు
నిజాంసాగర్ : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన కంటి వెలుగు కార్యక్రమం గ్రామాల్లో మొక్కుబడిగా సాగుతోంది. వైద్యులు సమయపాలన పాటించకపోవడం, మండల, గ్రామ స్థాయి పలు శాఖల అధికారులు శిబిరాలకు డుమ్మా కొడుతున్నారు. దాంతో క్షేత్రస్థాయిలో కంటి వెలుగు వైద్యుల ఇష్టా రాజ్యంగా మారింది. షెడ్యూల్ ప్రకారం మండలంలోని తెల్గాపూర్ గ్రామంలో మంగళవారం కంటి వెలుగు కార్యక్రమం నిర్వహించారు. ఆరోగ్య కార్యకర్తలు, ఆశవర్కర్లు, అంగన్‌వాడీ టీచర్లు సమయానికి శిబిరానికి చేరుకున్నారు.
అయితే మండల వైద్యులు, కంటి వైద్యులు శిబిరానికి సకాలంలో హాజరుకాకపోవడంతో వైద్య సిబ్బంది, రోగులు నిరీక్షించారు. గ్రామ పంచాయతి కార్యదర్శి, వీఆర్వోతో పాటు మండల అధికారి కంటి వెలుగు శిబిరానికి దూరంగా ఉన్నారు. గ్రామ, మండలస్థాయి అధికారులు శిబిరాలకు దూరంగా ఉండటంతో వైద్యాధికారులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు.
గ్రామీణ ప్రాంత పేదలకు ప్రపంచానికి చూపు నిచ్చేందుకు ప్రభుత్వం కంటి వెలుగుకు శ్రీకారం చుట్టినా నిర్వాహకుల పనితీరుపై స్థానికులు మండి పడుతున్నారు. అధికారులు ఇకనైనా స్పందించి గ్రామాల్లో కంటి వెలుగు కార్యక్రమాలను పకడ్బందీగా నిర్వహించేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
Comments
Please login to add a commentAdd a comment