
కంటి పరీక్ష చేయించుకున్న కేసీఆర్
సాక్షి, న్యూఢిల్లీ: సతీసమేతంగా ఢిల్లీ చేరుకున్న రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు శనివారం కంటి పరీక్షలు చేయించుకున్నట్లు టీఆర్‌ఎస్ వర్గాలు తెలిపాయి. రెండు మూడు రోజులు ఢిల్లీలో సంబంధిత చికిత్స తీసుకోనున్నట్లు వెల్లడించాయి. వీలును బట్టి రెండు రోజుల తర్వాతే పలువురు కేంద్ర మంత్రులను కలిసే అవకాశముందని సమాచారం.