
కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ ప్రభుత్వం విప్లవాత్మక కార్యక్రమాలు, పథకాలు చేపట్టిందని బీఆర్‌ఎస్ ఆస్ట్రేలియా శాఖ హర్షం వ్యక్తం చేసింది. బీఆర్‌ఎస్ ప్రభుత్వం చేపట్టిన పటిష్టమైన చర్యలతో తెలంగాణ సంపూర్ణ ఆరోగ్య తెలంగాణ దిశగా అడుగులు వేస్తుందని తెలిపింది. మెల్‌బోర్న్‌లో విశ్వామిత్ర మంత్రి ప్రగడ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో తెలంగాణ ప్రగతికి కృషి చేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
ప్రజా సంక్షేమం దిశగా రైతు రుణమాఫీతో పాటు హైదరాబాద్ లో మెట్రోరైలు విస్తరణ, నోటరీ ఆస్తుల క్రమబద్ధీకరణ నిర్ణయం, తదితర అభివృద్ధి కార్యక్రమాలతో ప్రజలు సంతోషంగా ఉన్నారని, కేసీఆర్ ప్రభుత్వం వ్యవసాయ, రైతు పక్షపాతిగా నిలిచిందని, రుణమాఫీ సంపూర్ణం చేసిన సీఎం కేసీఆర్ రుణం తీర్చుకోలేనిదని సభ్యులు కొనియాడారు.
ఈ సమావేశంలో అధ్యక్షుడు కాసర్ల నాగేందర్ రెడ్డి, ఉప్పు సాయిరాం, విశ్వామిత్ర,వినయ్ గౌడ్, సురేష్, ఉదయ్, జమాల్ , సాయి యాదవ్, వేణు , సతీష్ , రాకేష్, సూర్య తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment