ఆస్ట్రేలియాలో మహిళలపై లైంగిక దాడి.. భారతీయ ప్రముఖుడికి 40 ఏళ్ల జైలు శిక్ష | Indian origin Balesh Dhankhar Gets 40-year Jail In Australia | Sakshi
Sakshi News home page

ఆస్ట్రేలియాలో మహిళలపై లైంగిక దాడి.. భారతీయ ప్రముఖుడికి 40 ఏళ్ల జైలు శిక్ష

Published Sun, Mar 9 2025 8:43 AM | Last Updated on Sun, Mar 9 2025 10:47 AM

Indian origin Balesh Dhankhar Gets 40-year Jail In Australia

సిడ్నీ: ఆస్ట్రేలియాలో ఐదుగురు మహిళలపై లైంగిక దాడికి పాల్పడిన నేరానికి గాను భారతీయ ప్రముఖుడు ఒకరికి న్యాయస్థానం 40 ఏళ్ల జైలు శిక్ష విధించింది. 30 ఏళ్ల వరకు ఎలాంటి పెరోల్‌కు అవకాశం లేదని శుక్రవారం స్పష్టం చేసింది. దీంతో, ఘటన చర్చనీయాంశంగా మారింది.

వివరాల ప్రకారం.. బాలేశ్‌ ధన్‌ఖడ్‌(43) మోసపూరిత ఉద్యోగ ప్రకటనలతో ఐదుగురు కొరియా మహిళలను ఆకర్షించి ప్రణాళిక ప్రకారం వారిని సిడ్నీలోని తన నివాసానికి రప్పించాడు. అక్కడ వారికి డ్రగ్స్‌ కలిపిన డ్రింక్స్‌ ఇచ్చి మత్తులో ఉండగా లైంగిక దాడికి పాల్పడినట్లు రుజువైందని డౌనింగ్‌ సెంటర్‌ డిస్ట్రిక్ట్‌ కోర్టు పేర్కొంది. తీర్పు వెలువడిన సమయంలో ధన్‌ఖడ్‌ కోర్టులోనే ఉన్నాడు. భవిష్యత్‌ లైంగిక సంతృప్తి కోసం అతను తన నేరాలను రికార్డు చేసి, వీడియోల రూపంలో భద్రపర్చు కోవడాన్ని జడ్జి మైకేల్‌ కింగ్‌ ప్రస్తావించారు.

ఇక, బాధితులంతా 21–27 ఏళ్ల మధ్య వయ స్కులైన కొరియా మహిళలు. ఒక్కొక్కరికి వారి తెలివితేటలు, అందాన్ని బట్టి వేరుగా మార్కులు కూడా వేసేవాడని పోలీసులు తెలిపారు. బాధిత మహిళలతో జరిపిన చర్చలను సైతం రికార్డు చేశాడు. వారికి ఉద్యోగం అవసరం ఎంతుందనే దాన్ని బట్టి కుట్రను అమలు చేసేవాడు. చివరికి ఐదో బాధితురాలు 2018 అక్టోబర్‌లో ఫిర్యాదు చేయడంతో ఇతడి నేరాలకు పుల్‌స్టాప్‌ పడింది.

పోలీసులు సిడ్నీ సెంట్రల్‌ బిజినెస్‌ డిస్ట్రిక్ట్‌లోని ఇతడి కార్యాలయంపై దాడి చేసి డ్రగ్స్‌తోపాటు టేబుల్‌ క్లాక్‌ మాదిరిగా ఉన్న వీడియో రికార్డర్‌ను స్వాధీనం చేసు కున్నారు. అందులోనే అత్యాచారాల క్రమ మంతా నిక్షిప్తమై ఉండటం గమనార్హం. విచారణ జరిపిన కోర్టు ధన్‌ఖడ్‌ 39 నేరాలకు పాల్పడినట్లు గుర్తించింది. ఇందులో లైంగిక దాడికి సంబంధించిన నేరాలు 13 వరకు ఉన్నాయి. కోర్టు విధించిన జైలు శిక్షలో పెరోల్‌కు వీలులేని 30 ఏళ్ల కాలం 2053తో ముగియనుంది. మొత్తం 40 ఏళ్ల జైలు శిక్ష పూర్తయ్యే సరికి ధన్‌ఖడ్‌కు 83 ఏళ్లొస్తాయి.

విద్యార్థిగా వెళ్లి...
2006లో చదువుకునేందుకు ఆస్ట్రేలియా వెళ్లిన ధన్‌ఖడ్‌ భారతీయ ఆస్ట్రేలియన్లలో పేరున్న నాయకుడి స్థాయికి ఎదిగారు. భారతీయ జనతా పార్టీ అనే గ్రూపును నెలకొల్పారు. హిందూ కౌన్సిల్‌ ఆఫ్‌ ఆస్ట్రేలియా అధికార ప్రతినిధిగా 2018లో అరెస్టయ్యే వరకు వ్యవహరించారు. ఏబీసీ, బ్రిటిష్‌ అమెరికన్‌ టొబాకో, టొయోటా, సిడ్నీ ట్రెయిన్స్‌ కంపెనీలకు డేటా విజువలైజేషన్‌ కన్సల్టెంట్‌గా సేవలందించారు. పలు సామాజిక కార్యక్రమాల్లో పాలుపంచుకుంటూ ప్రముఖుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement