![KCR thanks giving meeting BRS NRIS in australia - Sakshi](/styles/webp/s3/article_images/2023/08/21/kcrs-thanks-giving-meeting.jpg.webp?itok=AyDrjSwo)
మెల్‌బోర్న్: ఎన్ఆర్ఐ బీఆర్ఎస్ ఆస్ట్రేలియా ఆధ్వర్యంలో మెల్‌బోర్న్‌లో కేసీఆర్ కృతజ్ఞత సభ ఘనంగా నిర్వహించారు. దేశంలో రైతును రాజు చెయ్యాలనే సంకల్పంతో తెలంగాణ ముఖ్యమంత్రి రైతుబంధు, రైతు రుణమాఫీ, రైతు భీమా లాంటి పథకాలను ప్రవేశపెట్టడమే కాకుండా అహర్నిశలు వారి అభివృద్ధికి కృషి చేస్తున్నందుకు, అలాగే ఇటీవల కాలంలో ఆర్టీసీ ఉద్యోగుల్ని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించిన సందర్భంగా ఈ కృతజ్ఞత సభ నిర్వహించడం జరిగిందని ఎన్ఆర్ఐ బీఆర్ఎస్ ఆస్ట్రేలియా ఇంచార్జ్ అనిల్ బైరెడ్డి తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఎన్ఆర్ఐ బీఆర్ఎస్ ఆస్ట్రేలియా ఇంచార్జ్ అనిల్ బైరెడ్డి మాట్లాడుతూ.. బీఆర్ఎస్ పార్టీ రైతు పక్షపాత పార్టీ అని రైతుల సంక్షేమం కోసం నిరంతరం పాటు పడే పార్టీ అని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు, ఏర్పడిన తర్వాత ఎంతో అభివృద్ధి జరిగిందని.. అన్ని కులాలు అన్ని మతాల వారికి సంక్షేమ పథకాలు అందుబాటులో ఉండేలా తీర్చిదిద్దారని అన్నారు.
గత పది సంవత్సరాలలో తెలంగాణ ఎంతో అభివృద్ధి చెందిందని ఇక మున్ముందు కూడా ఈ అభివృద్ధి ఇలాగే కొనసాగాలంటే వచ్చే ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ పార్టీకే పట్టం కట్టాలని, తెలంగాణ రాష్ట్రం ఇంకా అభివృద్ధి చెందాలంటే అది బీఆర్ఎస్ పార్టీతోనే సాధ్యమని ఎన్ఆర్ఐలు ప్రగాఢంగా భావించినట్లు తెలిపారు.
రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుపడుతుంది, తద్వారా దేశం కూడా బాగుపడుతుందని, ఎన్ఆర్ఐలలో ఉన్న చాలా మంది రైతు కుటుంబాలు నుంచి వచ్చిన వాళ్లే అని రైతుల ఇబ్బందులు తెలుసుకొని కేసీఆర్ చేస్తున్న అభివృద్ధిని కొనియాడారు. బీఆర్ఎస్ పార్టీ ఏ నినాదంతో అధికారంలోకి వచ్చిందో నీళ్లు నిధులు నియామకాలు అన్నీ కూడా సక్రమంగా జరుగుతున్నాయని తెలిపారు.
ఈ కార్యక్రమంలో పంజాబ్ అండ్ గుజరాత్ కమ్యూనిటీకి సంబంధించిన లీడర్లు మాట్లాడుతూ.. కేసీఆర్ భారత దేశంలో ఎక్కడాలేని విధంగా రైతులకోసం ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారని, ఇలాంటి నాయకుడు రాష్ట్రానికి పరిమితం కాకుండా రానున్న రోజుల్లో దేశానికి నాయకత్వం వహించాలని దేశ ప్రజలు కోరుకుంటున్నారని వెల్లడించారు.
మిగతా రాష్ట్రాలు కూడా తెలంగాణ రాష్ట్రం మాదిరిగానే అభివృద్ధి సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టాలని ఆశించారు. ఆస్ట్రేలియాలో బిఆర్ఎస్ పార్టీ కార్యాక్రమాలు నిర్వహించే అవకాశం కలిపించిన పార్టీ అధ్యక్షులకు, ఎమ్మెల్సీ కవితకు కృతఙ్ఞతలు తెలియజేసారు.
ఈ కార్యక్రమంలో ఎన్ఆర్ఐ బీఆర్ఎస్ నాయకులు రమేష్ ముత్యాల, మధు పార్స, రవీందర్ చుక్క, సత్యనారాయణ గుండా, మధు పైల, కార్తీక్ విద్యాసాగర్, రాయల సాయిరామ్, సందీప్ అనిల్, వంశీ సురభి, కుల్విందర్ బాజువ, హర్మేందర్ సింగ్, దిలీప్ రెడ్డి, అవినాష్ సంతోష్ రెడ్డి, గోపి, శ్రవణ్ బల్మూరి, అనిల్ రాఘవేంద్ర, ఆకాష్, సురేష్ రేపాల, అవినాష్, ఆకాష్,ఇతర తెలంగాణ సంఘ నాయకులు పుల్లారెడ్డి, రాజు వర్ధన్ రెడ్డి, దీపక్ కిరణ్, ప్రవీణ్ దేశం, కర్ర శ్రీనివాస్, నవీన్ బైరెడ్డి, ఓబుల్ రెడ్డి హరీష్ రెడ్డి, శేఖర్, శ్రీకాంత్, శ్రీధర్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment