
వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బర్త్ డే వేడుకలు ఆస్ట్రేలియాలో ఘనంగా జరిగాయి. సిడ్నీలో జరిగిన వేడుకల్లో వైసీపీ నాయకులు, జగనన్న అభిమానులు, పిల్లలు, పెద్దలు భారీ ఎత్తున్న పాల్గొన్నారు. వైసీపీ నాయకులు గాయం శ్రీనివాస్ రెడ్డి, శివారెడ్డి అంక్కిరెడ్డిపల్లి, శ్రీనివాస్ బేతంశెట్టి, అమరనాథ్ రెడ్డి , శిరీష్ రెడ్డి తదితరుల ఆధ్వర్యంలో కేక్ కట్ చేసారు. ఈ సందర్భంగా జగనన్న చేసిన గొప్ప కార్యక్రమాలను గుర్తు చేసుకున్నారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఇలాంటి పుట్టిన రోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని ప్రవాసులు ఆకాంక్షించారు.

మరిన్ని ఎన్‌ఆర్‌ఐ వార్తలకోసం ఇక్కడ క్లిక్ చేయండి!
Comments
Please login to add a commentAdd a comment